మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు మతోన్మాదుల దాడులు తట్టుకునినిలిచిన భారతీయ శిల్ప వాస్తుశాస్త్రంతో నిర్మాణం చేసిన అత్యంత అద్భుత కళా సంపద ఉన్న ఆలయాలు నగరాల్లో కొన్ని:~*
*కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -కుశార్, పాకిస్తాన్*
*లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -లాహోర్, పాకిస్తాన్*
*తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షకుడు నిర్మించిన నగరం)తక్షశిల,పాకిస్తాన్*
*పుష్కలావతి /పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండోకొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం)పెషావర్, పాకిస్తాన్ (భాగవతం,మహాభారతం)*
*మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్*
*నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్*
*జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్*
*మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్*
*శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,*
*దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా*
*పరశురామక్షేత్రం* *(పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) -* *కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర, సముద్రతీర ప్రాంతం*
*మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా*
*నిషాద రాజ్యం(నలమహారాజు రాజ్యం) గ్వాలియర్,మధ్యప్రదేశ్*
*వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్*
*నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు*
*బోధించిన ప్రాంతం) -* *సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్*
*వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్*
*రతిష్టానపురం (పురూరవుని రాజధాని) ఝాన్సీ,అలహాబాద్*
*సాళ్వ రాజ్యం(సావిత్రీ, సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)- కురుక్షేత్ర దగ్గర*
*హస్తినాపురం (కౌరవుల రాజధాని)హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్*
*మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్*
*వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర*
*కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్*
*మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్*
*ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్*
*గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా*
*కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)*
*పాండవుల లక్కగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్*
*కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్*
*శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.*
*హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) జలాన్,ఉత్తర్ ప్రదేశ్*
*విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర*
*కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర*
*చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్*
*కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం)దాతియ,మధ్యప్రదేశ్*
*ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర*
*కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్*
*పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) -* *ఎటాహ్,సహజహంపూర్*
*,ఫారుఖాబాద్,ఉత్తర్ ప్రదేశ్*
*కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యయంత్ర బేధన స్థలం) -*
*కంపిల్, ఉత్తర్*
*జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ* *ఆఖరా / రణ్ భూమి,బీహార్*
*కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన*
*ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా*
*మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్*
*విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్*
*శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం*
*ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం*
*నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –*ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్*
*జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్*
*కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)నేపాల్ లోని తిలార్కోట్*
*బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్*
*బుద్ధుడు నిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.*
No comments:
Post a Comment