Wednesday, July 19, 2023

తేనెటీగ నెక్లేస్ దీనిముందు ట్రెండీ నెక్లేస్ బలాదూర్ (DIY Honeybee Neckla...

చక్కని కథా రచయిత నా మిత్రుఁడు శ్రీ పీ.వీ.బీ శ్రీరామమూర్తి

 జైశ్రీరామ్.

చక్కని కథా రచయిత  మిత్రుఁడు శ్రీ పీ.వీ.బీ శ్రీరామమూర్తి యొక్క వైదేహీస్వయంవరం అనే కథ విప్రవాణి మాసపత్రిక నిర్వహించిన కథలపోటీలలో తృతీయబహుమతి గెలుచుకొందని తెలుపుటకు గర్వంగా ఉంది.

మీరూ చదవండి.

 
ఇంత చక్కని కథ వ్రాసి బహుమతి గెలిచిన న మిత్రునికి అభినందనలు తెలియఁజేద్దామా?
జైహింద్.

Monday, July 17, 2023

Vandemataram Full Song With Telugu Meaning || వందేమాతరం - తెలుగు లో ||

జైశ్రీరామ్.
వందేమాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం, సస్య శ్యామలాం మాతరమ్ ||వందే||
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం; పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం, సుమధుర భాషిణీం, సుఖదాం, వరదాం, మాతరమ్ || వందే ||

కోటికోటి కంఠ కలకల నినాదకరాలే; కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే; బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరామ్ || వందే ||

తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||

త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ, కమలా కమలదళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ’ నమామి త్వాం నమామి కమలామ్ అమలామ్ అతులాం
సుజలాం సుఫలాం మాతరమ్ || వందే ||
శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం, ధరణీం భరణీం మాతరమ్ || వందే ||

జైహింద్.

వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి. అమ్మవారి అలంకారం లో భాగంగా ముఖము ...

Friday, July 14, 2023

భిక్షాటన చేసి చదువుకున్న ASP ( AR ) శ్రీ హనుమంతుగారు,... అనంతపురం.

 

ఇది కథ కాదు . భిక్షాటన చేసి చదువుకున్న ASP ( AR ) అనంతపురం. అవును తల్లి,కొడుకు ఇద్దరూ ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేసిన రోజులవి .  నిన్న డిస్కవర్ అనంతపురం ,AGS foundation వారు నిర్వహించిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు పుస్తకాలు,డిజిటల్ slates పంపిణీ కార్యక్రమంలో మన అనంతపురం ASP హనుమంతు గారు సుమారు 400 మంది పిల్లతో పంచుకున్న జీవన పోరాటం అందరి కళ్ళలో ఒక్క సారిగా నీళ్ళు తిరిగాయి.  ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి తాను భిక్షాటన చేసే వాడిని అని వందల మంది ముందు చెప్పడానికి ఎంత గుండె ధైర్యం కావాలి ? ఆ దైర్యం వెనకాలా ఓ పది మంది పిల్లలు మారాలి ఆన్న ఆలోచన ఎంత గొప్పది  ఆయన ఏమన్నారో మీరే చూడండి . శోకం నిండిన జీవితాన్ని ఎలా స్లోకమయ జీవితంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది అనేదానికి హనుమంతు గారు ఓ నిలువెత్తు నిదర్శనం. ఆదర్శమూర్తులయిన వారికీ వారి మాతృదేవికీ నా ప్రణామములు.

అమ్మమ్మ కాలం నాటి అల్లం పులుసు తింటే అద్బుతం అనకతప్పదు(Old traditional ...