Wednesday, December 20, 2023

తెలుగు సంవత్సరాల పేరుల క్రమసంఖ్య వాడుతూ పండితుల సంభాషణ చమత్కారంగా ఉంటుంది.

జైశ్రీరామ్.

  తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత ….. అని ఇలా 60 ఉంటాయి. పూర్వం పండితులు తమ చుట్టూ ఉన్న వారికి అర్ధం కాకుండా ఉండాలనో, అర్ధాలు తెలిస్తే చిన్నబుచ్చుకుంటారనో తెలియదు కానీ తమ సంభాషణల్లో కొన్ని పదాలకు బదులు ఆ అర్ధాలు వచ్చే సంవత్సరాల పేర్లు వాడేవారు. వాటిలో కొన్ని తిట్లూ, కొన్ని ప్రశంసలూ, అడపా దడపా విమర్శలూ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాం సరదాకి.

‘ ఒరే! వాడొట్టి ఇరవై ఐదూ, ఇరవై ఆరు రా’ అన్నాడంటే ‘వాడు గాడిద కొడుకు’ అని తిడుతున్నాడని అర్ధం. 25 వ సంవత్సరం పేరు ‘ఖర’ (అంటే గాడిద). 26 వ సంవత్సరం పేరు నందన (అంటే కొడుకు).

‘నీ కొడుక్కేంట్రా ఇరవై తొమ్మిది. గొప్పింటి సంబంధాలు వస్తాయి’ అంటే మన్మధుడని. 29 వ సంవత్సరం పేరు ‘మన్మధ’ 

‘వాడికోసారి నలభై జరిగినా తెలిసి రాలేదు’ అంటే ‘పరాభవం జరిగినా’ అని. 40 వ సంవత్సరం ‘పరాభవ’

‘వాడి కూతురికి సంబంధాలు రావడం కొంచెం కష్టంరా ముప్పయి, ముప్పై మూడు కదా! ‘ అన్నాడంటే ‘రూపవతి కాదని’ అర్ధం. 30 వ సంవత్సరం ‘దుర్ముఖి’ 33 వ సంవత్సరం ‘వికారి’

‘ నీ ‘నలభై ఎనిమిది’ కి కారణమేంటో తెలుసుకోవచ్చా?’ 48 వ సంవత్సరం పేరు ‘ఆనంద’

‘వాడితో వాదనెందుకురా వాడో యాభై అయిదు . అంటే బుద్ధిలేనివాడని అర్ధం. 55 వ సంవత్సరం ‘దుర్మతి’

 ‘అబ్బ వాళ్ళ పిల్లలతో వేగలేమండీ! అందరూ నలభై ఒకటి లే' అంటే కోతులూ కప్పలూ అని అర్ధం.41 వ సంవత్సరం ‘ప్లవంగ’

‘వాడసలే ముప్పై ఎనిమిది జాగ్రత్తగా మాట్లాడు. అంటే కొంచెం కోపిష్టి అని. 38 వ సంవత్సరం పేరు  ‘క్రోధి’ 

జైహింద్.

శ్రీ సరస్వతి ఆలయం | అనంత సాగర్ | సిద్ధి పేట జిల్లా | తీర్థయాత్ర | 16 ఆగష...

జైశ్రీరామ్.
జైహింద్.

యశోధర...YasOdhara - by BEthavOlu Ramabrahmam @ NJ circa 2000.

జైశ్రీరామ్.
జైహింద్.

Thursday, December 7, 2023

తే.19 . 11 . 2023న.ఉదయం తొమ్మిది గంటలనుండి అమ్మమ్మతో నేను లో నా అర్థాంగి శ్రీమతి చింతా విజయలక్ష్మి మనుమరాలు శ్రీవైష్ణవితో కలిసి చేసిన చివరి వీడియో(Last video with ammamma)

జైశ్రీరామ్.
అమ్మమ్మతో నేను లో నా అర్థాంగి శ్రీమతి చింతా విజయలక్ష్మి మనుమరాలు శ్రీవైష్ణవితీ చేసిన చివరి వీడియో. 
తే.19 . 11 . 2023న.ఉదయం తొమ్మిది గంటలనుండి ఈ వీడియో చేసి, వీడియో రికార్డింగ్ పూర్తి అవగానే గదిలోనికి వచ్చి మంచముపై పడుకొని త్రేంచుచుండగా (గేస్ త్రేనుపులు ఆమెకు సహజమే) ఏమైందండత్తగారూ అని మాకోడలు అడుగగా ఏమో ఏమౌతోందో తెలియటం లేదు అని అన్నారు. ఆ మాటలు వినిన నేను తటాలున దగ్గరకు వెళ్ళి రా మనం హాస్పటల్కు వెళ్దామన్నాను. పడుకుంటే తగ్గిపోతుంది. నన్ను పడుకోనివ్వండి అన్నారు. అలా కాదు లే అని లేవదీస్తే, నాకు వాంతయేలాగుంది అన్నారు. సరే చేసేసుకో అన్నాను. మంచముపైనే చేసేసారు. మళ్ళీ పడుకుంటానని పడుకున్నారు. అలా కాదు మనం వెంటనే హాస్పటల్కి వెళ్ళాలని లేవదీసాను. మోషనయేలాగుంది అన్నారు. కోడలు తీసుకువెళ్ళింది. మోషనయినతరువాత ఆమెయే కడుక్కొని బైటకు కోడలి సహాయంతో రాగా నేనూ నా కోడలు ఆమెను హాలులో కుర్చీలో కూర్చోపెట్టాము. అంతే ఒళ్ళంతా చల్లబడిపోతోంది. మా పెద్దమ్మాయి బీపీ పరీక్ష చేయగా సున్నా చూపించింది. ఆక్సిజన్ మీటంతో చూడగా అదికూడా సరళరేఖే వస్తోంది కాని అంకెలు రాలేదు. వెంటనే పసుపు మర్దనా చేస్తూ నేను బిగ్గరగా అరిచి నావైపు చూడమన్నాను. ఊఁ అని తలపైకి తేల్చి కన్నులతో ఆకాశంవైపు చూసింది. ఇంతలో మా అబ్బాయి వీల్ చైర్ తేగా దానిలో కూర్చోపెట్టి కారుదాకా తీసుకొనిపోయి, కారు ఎక్కమన్నాను. ఆమె కారు ఎక్కి పడుకున్నారు. ఐదు నిమిషాలలో దగ్గరలో ఉన్న హాస్పటల్కు తీసుకువెళ్ళగా వారు పరీక్షించి ప్రథమ చికిత్స అందిస్తూనే ఇది సివియర్ హార్ట్ ష్ట్రోక్ వెంటనే మరో హాస్పత్రికి తీసుకు పొమ్మన్నారు. క్షణం ఆలస్యం చెయ్యక అంబులెంసులో ఏ.ఐ.జీ. హాస్పటల్కు తీసుకు వెళ్ళగా వారు వెంటనే జాయిన్ చేసుకొని పరీక్షలు చెయ్యడం ష్టంట్ వెయ్యడం మత్తుమందివ్వడం చేసి (సరిగా ఉదయం పది గంటలనుండి) ఐసీయూలో పెట్టారు. 
తే. 20 . 11 . 2023. రాత్రి 9.49.నిమిషములకు మరణించినట్లు తెలియజేసారు. నాబ్రతుకును చూకటిలోనికి నెట్టి తాను కార్తీకసోమవారముపూటా ఆ లలితాపరాభట్టారికలో లీనమైపోయారు.


చం.  చక్కని సూచనాళిని ప్రశాంతిగ చేసితి వింతదాక, నీ
కెక్కడి నుండి చేరె సతి! యీ విధి నిన్ గొనిపోవు మృత్యు వీ
యొక్కక్షణంబు మాత్రమునె? యుల్కును పల్కును లేక మమ్ము నీ
విక్కటులందు ముంచి, పరమేశ్వరిలోనికి చేరిపోతివా?

శివశివా    శివశివా   శివశివా.