Wednesday, December 28, 2022

2023 సంవత్సరమునకు లైఫ్ సర్టిఫికెట్స్ ను తేది 01-01-2023 నుండి 28-02-2023 వరకు

 విశ్రాంతి ఉద్యోగులకు తెలియజేయునది ఏమనగా 2023 సంవత్సరమునకు లైఫ్ సర్టిఫికెట్స్ ను తేది 01-01-2023 నుండి 28-02-2023 వరకు ప్రభుత్వం వారు Cir. Memo No. D4/1381/2019 dt. 12-11-2021 న ఉత్తర్వులు ఇచ్చి యున్నారు కావున విశ్రాంతి ఉద్యోగులందరూ మీ దగ్గరలో వున్నా నెట్ సెంటర్ లో జీవన్ ప్రమాణ app లో నమోదు ద్వారా మరియు cfms.ap. gov. in website లో CFMS ID తో లాగిన్ అయి ESS టైల్ లో లైఫ్ సర్టిసికేట్ లో నమోదు చేసి లైఫ్ సర్టిఫికెట్ ను మీరు signature చేసి డాకుమెంట్స్ ను అప్లోడ్ చేయవచ్చు 

దూర ప్రాంతంలో వున్నా వారు మరియు ఆరోగ్యం బాగోలేని వారు 9951602077 మరియు 9989355353  వాట్సాప్ వీడియో కాల్ చేసి, లైఫ్ సర్టిఫికెట్ పై గజిట్టెడ్ ఆఫీసర్ తో సంతకం చేపించి, మీ బందువులతో మా మీ కార్యాలయం నకు పంపవలెను, మరియు లోకల్ లో వున్నా వారు కూడా ఆరోగ్యం బాగోలేని వారు మరియు 80 సంవత్సరాలు పై బడిన వారు కూడా పై సెల్ నెంబర్ కి కాల్ చేస్తే నేను మీ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికెట్ తీసుకోని మీకు పెన్షన్ ను మరలా మీ ఖాతాలో జమ చేయుడం జరుగుతుంది జీవన్ ప్రమాణ లో నమోదు చేసినవారు లైఫ్ సర్టిసికేట్ మరలా ఆఫీస్ కు ఇవ్వనవసరం లేదు మరియు 01.01.2023 ముందు 28.02.2023 తరవాత మీరు నమోదు చేసిన LC treasury కీ రావు, మీ పెన్షన్స్ stop అగును కావునా పెన్షనర్స్ అందరూ 01.01.2023 నుండి 28.02.2023 గడువులో చేసిన వారివి మాత్రమే CFMS వారు treasury కీ అప్లోడ్ చేయుదురు అని తెలియజేయడం అయినది. 


దొడ్డి రమణ

ఉప ఖజానా అధికారి

అనకాపల్లి పడమర

Sunday, September 25, 2022

Thursday, June 23, 2022

అష్టాదశ వాక్య భగవద్గీతా సారము.

జైశ్రీరామ్.

అష్టాదశ వాక్య భగవద్గీతా సారము.

అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .

అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం.

అధ్యాయం 3 - నిస్వార్థత మాత్రమే ప్రగతికి మరియు శ్రేయస్సుకు మార్గం.

అధ్యాయం 4 - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు .

అధ్యాయం 5 - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు 

అనంతం యొక్క  ఆనందాన్ని ఆనందించండి .

అధ్యాయం 6 - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి.

అధ్యాయం 7 - మీరు నేర్చుకున్న వాటిని జీవించండి .

అధ్యాయం 8 - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోవద్దు .

9వ అధ్యాయం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి .

అధ్యాయం 10 - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి .

అధ్యాయం 11 - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి 

కలిగి ఉండండి.

అధ్యాయం 12 - మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి.

అధ్యాయం 13 - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం .

అధ్యాయం 14 - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి.

అధ్యాయం 15 - దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి .

అధ్యాయం 16 - మంచిగా ఉండటమే ప్రతిఫలం.

అధ్యాయం 17 - ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం 

శక్తికి సంకేతం .

అధ్యాయం 18 - విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.

(ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మపరిశీలన)

|| ॐ తత్సత్ ||

జైహింద్.

Thursday, June 16, 2022

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం*

 స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం*


రామునికి       —       సీత
కృష్ణునికి        —       రాధ 
ఈశునకు      —    ఈశ్వరి
మంత్రపఠనంలో —   గాయత్రి 
గ్రంధ పఠనంలో    —      గీత
దేవుని యెదుట
     వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన
     వీరికి తోడుగా  శ్రద్ధ

 మన దినచర్యలో భాగంగా
ఉదయానికే—ఉష, అరుణ
సాయింత్రం     —   సంధ్య
చీకటైతే           —   జ్యోతి, దీప
రాత్రి మత్తులో  —   నిషా
      పడుకున్నాక    —   స్వప్న

చూచేటప్పుడు— నయన
వినేటప్పుడు  —   శ్రావణి
మాట్లాడునప్పుడు—వాణి
ఓరిమిలో        -వసుధ వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు—  హంస
నవ్వుచున్నప్పుడు  —  హాసిని, ప్రసన్న
 అద్దంలో చూస్తే—  సుందరి
 చేసేపనికి  -స్పూర్తి
 పని చేయడానికి    —  స్పందన
మంచి పనికి —  పవిత్ర
ఇష్టంగాచేసే పనికి  —  ప్రీతి
నీరు త్రాగునపుడు —  గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు —  హిమజ
      సినిమా చూస్తున్నప్పుడు —  చిత్ర
అబద్ధ మాడునపుడు —  కల్పన
నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల
 ఆలోచనలప్పుడు  —  ఊహా, భావన చదువుచున్నప్పుడు  —  సరస్వతి
వ్యాపారంలో      —   ప్రతిభ , ప్రగతి
సంతోషంలో—   సంతోషి
కోపంలో       —   భైరవి
ఆటలాడునప్పుడు—  ఆనంది 
గెలుపు కోసం— జయ, విజయ
గెలిచిన తర్వాత  —   కీర్తి
      సరిగమలు నేర్చునపుడు  —  సంగీత
      పాటలు పాడునపుడు  —  శృతి, కోకిల
      తాళం వేయునపుడు  —   లయ
      
      సాహిత్య గోష్టిలో    —   కవిత 
నగరాన్ని కాపాడుతూ  —   ప్రకృతి

  జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో  —   విద్య
సంపాదనప్పుడు —   లక్ష్మి
చేసేవృత్తిలో        —   ప్రేరణ పని చేసి వచ్చాక —  శాంతి
      చిన్నతనంలో — లాలన మధ్యవయస్సులో -మాధురి
      ముసలితనంలో- కరుణ, మమత
      జీవితాంతం మనతో  —  “జీవిత”.🙏 
 బాగుంది కదా మన తెలుగుభాష.....యొక్క గొప్పతనం...

Swara Veenapani' Guinness World Record Attempt-Speech by Honorable speak...

Friday, June 10, 2022

Question ..... Find the day of the week on 15 August, 1947//... answar...

 జైశ్రీరామ్.

Question

Find the day of the week on 15 August, 1947

Solution

verified

Verified by Toppr

Correct option is B)

15th August 1947 has 1946 years and period from 1st January 1947 to 15th August 1947.

Now, first 1600 years have 0 days.

Next 300 years have 1 odd day.

46 years = 11 leap years + 35 non leap years = 11×2+35=57days = 1 odd day

Number of days from 1st Jan 1947 to 15th August 1947 = 227 days = 3 odd days

Hence, total number of odd days = 0+1+1+3=5

Hence, if 0 odd day it is Sunday, 1 odd day it is a Monday and so on.

Hence 5 odd days is a Friday.

జైహింద్.

కూల్ డ్రింక్స్ వద్దు 👎 కొబ్బరిబోండం ముద్దు👍a short by Rangam RTV

Friday, May 20, 2022

Wednesday, May 18, 2022

సుందరకాండ ప్రవచనము....శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ.

జైశ్రీరామ్.

శ్రీమన్మంగళ నారుమంచి కులజుల్, శ్రీమాతృ సద్భక్తులున్,

క్షేమంబున్ నిరతంబు కోరు ప్రజకున్, కీర్తిప్రదుల్ కృష్ణు లీ

ప్రేమోద్భాసిత మిత్రమండలి కృపన్ ప్రీతిన్ చిరంజీవినే

ధీమంతుల్ విని మెచ్చ చెప్పుదురిటన్ దేదీప్యమానంబుగా


జైహింద్.

శ్రీ గణపతి తాళం / Ganapathi Thaalam with Lyrics

शुक्ल यजुर्वेद पारायण

Ganapthy Thaalam.Voice SNB Kannan Gurukkal. Thavil VS. Santhoshkumar

Monday, May 9, 2022

అమ్మమ్మ - నాన్నమ్మల కొరివీకారం అని పిలవబడే మిరపపండ్ల నిలవ పచ్చడి......మరి నేను చేస్తే.... (Red...

జైశ్రీరామ్.
దయచేసి లైక్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
జైహింద్.

Tuesday, April 12, 2022

5 నిముషాలలో తయారయ్యే ఆంధ్రుల ప్రత్యేకమయిన గోంగూర నిలువ పచ్చడి.

జైశ్రీరామ్.
మా మనుమరాలు వాళ్ళ అమ్మమ్మతో కలిసి చేసిన గోంగూర నిలవ పచ్చడి ఎలా చెయ్యాలో
చూడండి. లైక్ చెయ్యండి, షేర్
 చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి.
జైహింద్.

Tuesday, March 22, 2022

హ్యాట్సాఫ్ సంస్కృత భాష పండిత సత్య ప్రకాష్ ...

జైశ్రీరామ్.

 తెరమీద అత్యంత క్రూరమైన విలన్ పాత్రధారి.నిజజీవితంలో అద్భుతమైన సంస్కృత భాష పండితుడు. జ్ఞాని. సమాజ హితం కోరే మానవతావాది. హ్యాట్సాఫ్ సత్య ప్రకాష్ సార్.

శివ ఉవాచ :-
దేవి త్వం భక్తసులభే సర్వకార్యవిధాయినీ !
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః !!

దేవ్యువాచ:-
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ !
మయా తవైవ స్నేహేనాప్యమ్బాస్తుతిః ప్రకాశ్యతే !!
ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్ర మంత్రస్య నారాయణ ఋషిః
అనుష్టుప్ ఛందః

శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసర్వస్వత్యో దేవతాః !
శ్రీ దుర్గాప్రీత్యర్థం సప్తశ్లోకీదుర్గా పాఠే వినియోగః !!
ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హి సా !
బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి !!

దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః !
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి !
దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా !
సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా !!

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే !
శరణ్యేత్ర్యంబకే గౌరి నారాయణి నమోపాస్తుతే !!
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే !
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోపాస్తుతే!!

సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తిసమన్వితే !
భయోభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోపాస్తుతే !!
రోగానశేషానపహంసి తుష్టా !
రుష్టా తు కామాన్ సకలా నభీష్టాన్ !!

త్వామాశ్రితానాం న విపన్నరాణాం !
త్వమాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి !!
సర్వాబాధా ప్రశమనం త్రైలోక్య స్యాఖిలేశ్వరి !
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివానాశనమ్ !!

ఇతి శ్రీ సప్తశ్లోకీ దుర్గా సంపూర్ణమ్.

జైహింద్.


Saturday, March 5, 2022

భారతయుద్ధంలో పాల్గొన్నవారికి భోజనాలు.

 జైశ్రీరామ్.

మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.

దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడుసైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. 

అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.

మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.

అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.

అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు  చెపుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం

అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.

50 లక్షల మందికి భోజనాలు వండాలంటే  భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం

భీముడు కు ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.

నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న  సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది.అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు.

ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు.

ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు,అది కూడా ఒక్క మెతుకు కూడా

మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది?

ఈ రోజు  ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..

ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.

అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు.

అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు.

ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతారు. అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు...

శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని.శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని...శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటేశ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.

ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.

జైహింద్.

Wednesday, January 19, 2022

శివగంగ పర్వతము విశేషాలు. విశేషాంశాలు.

 

జైశ్రీరామ్.
శివగంగ పర్వతము విశేషాలు. విశేషాంశాలు.
జైహింద్.