జైశ్రీరామ్.
శ్రీయుతులు చింతా రామ కృష్టా రావు, వరేణ్యుల వారి "కవిరాడ్వరేణ్య "-
బిరుదమును పురస్కరించుకొని సమర్పించు చిరు గర్భ కవిత,
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
జుత్తాడ,
శమన,తరాల,తారక,కౌముది,ఘన యశ,విభాసిత,,యశసా,కనుమ,భాసిలు,
చెనువునా,జీవ యశ, కైవశ, ,శోభగ,శ్రీమత గర్భ వరదమ వృత్తము,
వరదమ వృత్తము,
కవిరాడ్వరేణ్య!ఘన యశా!కైవశ వాగ్వర!కౌము దీవై!కరమున్భాసింపన్!
కవితావతంశ!కను మిదే!గావుత దైవము!కామిదాల న్వెలిగించు న్వాణే!
భవదీయ ప్రజ్ఞ!వనజమై!పావన మేర్చును!పామ రాళిన్శుభ!సౌభాగ్యాలన్!
శివమేర్చు గాక!చెనువునై!జీవ ప్రమోదత!శ్రీ మతంబై!భావి సౌఖ్యం బొప్పన్!
(చెనువునై=మనోహరమునై,)
వరదమ వృత్తము,స,జ,న,త,జ,జ,త,య,గగ,గణములుండును,
ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,యతులు,11.17.
వృ,సం:-33.32.584.
1.గర్శభగత శమనా వృత్తము,
కవి రాడ్వరేణ్య!
కవితావతంశ!
భవదీయ ప్రజ్ఞ!
శివ మేర్చు గాక!
.
శమనా వృత్తము,న,గల,గణము లుండును,
సుప్రతిష్ట ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,వృ,సం:-23.
2.గర్భ గత తరాల వృత్తము,
ఘన యశా!
కను మిదే!
వనజమై!
చెనువు నై!
తరాల వృత్తము,న,గ,గణములుండును,
ప్రతిష్ట ఛందము నందలిది,ప్రాస నియమము గలదు,వృ,సం:-8.
3.గర్భగత తారక వృత్తము,
కైవశ వాగ్వర!
గావుత దైవము!
పావన మేర్చును!
జీవ ప్రమోదత!
తారక వృత్తము,భ,భ, గణము లుండును,
గాయిత్రి ఛందము నందలిది,ప్రాస నియమము గలదు,వృ,సం:-32.
4.గర్భగత కౌముది వృత్తము,
కౌముదీవై!!కర మున్భాసింపన్!
కామిదాల న్వెలిగించు న్వాణే!
పామ రాళిం శుభ!సౌభాగ్యాలన్!
శ్రీ మతంబై!భవి సౌఖ్యం బొప్పన్!
కౌముది వృత్తము,ర,భ,మ,గ,గణము లుండును,
పంక్తి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,యతి,5.వ,యక్షరము,
వృ,సం:-51.
5.గర్భ గత ఘన యశ వృత్తము
కవిరాడ్వరేణ్య!ఘన యశా!కౌము దీవై! కరమున్భాసింపన్!
కవితా వతంశ!కను మిదే!కామిదాల న్వెలి గించున్!వాణే!
భవదీయ ప్రజ్ఞ!వనజమై!పామరాళిన్!శుభ!సౌభాగ్యాలన్!
శివ మేర్చు గాక!చెనువునై!శ్రీ మతంబై!భవి !సౌఖ్యం బొప్పన్!
ఘన యశ వృత్తము,స,జ,న,త,త,య,గగ,గణము లుండును,
కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,యతి,11.వ,యక్షరము,
వృ,సం:-51,692.
6.గర్భగత విభాసిత,వృత్తము,
కవిరాడ్వరేణ్య!కౌము దీవై!కరమున్!భాసింపన్!
కవితావతంశ!కామిదాలన్!వెలిగించున్!వాణే!
భవదీయ ప్రజ్ఞ!పామరాళిన్!శుభ సౌభాగ్యాలన్!
శివ మేర్చు గాక!శ్రీ మతంబై!భవి!సౌఖ్యం బొప్పన్!
,విభాసిత వృత్తము,స,జ,ర,భ,మ,గ,గణము లుండును,
అష్టి ఛందము,నందలిది,ప్రాస నియమము కలదు,యతి,7.వ,యక్షరము,
వృ,సం:-3.244.
7గర్భగత,.యశశా వృత్తము,
ఘన యశా!కౌము దీవై!కరమున్!భాసింపన్!
కను మిదే!కామిదాలన్!వెలి గించు న్వాణే!!
వనజమై!పామరాళిన్!శుభ! సౌభాగ్యాలన్!
చెనువునై!శ్రీ మతంబై!భావి సౌఖ్యం బొప్పన్!
యశశా వృత్తము,న,త,త,య,గగ,గణములుండును,
శక్వరీ ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,యతి,5..వ,యక్షరము,
వృ,సం:-908.
8.గర్భగత,కనుమయ వృత్తము,
ఘన యశా!కైవశ వాగ్వర!కౌముదీవై!కరమున్!భాసింపన్.
కను మిదే!గావుత దైవము!కామిదాల న్వెలిగించు న్వాణే!
వనజమై! పావన మేర్చగ!పామరాళిన్ శుభ సౌభాగ్యాలన్!
చెనవునై! జీవము దీర్చును! శ్రీ మతంబై!భవి సౌఖ్యం బొప్పన్!
కనుమయ వృత్తము,న,త,జ,జ,త,య,గగ,గణము లుండును,
కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,యతి,11.
వ యక్షరము,వృ,సం:-52.072.
9. గర్భగత భాసిలు వృత్తము,
కౌముదీవై!కరము న్భాసింపన్!కవిరాడ్వరేణ్య!ఘన యశా!
కామి దాల న్వెలి గించు న్వా ణే! కవితావతంశ!కనుమిదే!
పామ రాళి న్శుభ సౌభాగ్యాలన్ భవదీయప్రజ్ఞ!వనజమై!
శ్రీ మతంబై!భవి సౌఖ్యం బొప్పన్!శివ మేర్చు గాక!చెనువునై!
భాసిలు వృత్తము,ర,భ,మ,భ,ర,న,వ,గణము లుండును,
కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,
వృ,సం;-10.00.835.యతి,11.వ,యక్షరము,
10.గర్భగత చెనువునా వృత్తము,
ఘన యశా!కైవశ వాగ్వర!కవిరాడ్వరేణ్య!కౌము దీవై!కరమున్ భాసింపన్!
కను మిదే!గావుత దైవము!కవితావతంశ!కామిదాల న్వెలిగించున్వాణే!
వనజమై!పావనమేర్చుగ!భవదీయ ప్రజ్ఞ!పామరాళి న్శుభ సౌ భాగ్యాలన్!
చెనువునై!జీవము దీర్చును!శివ మేర్చు గాక!శ్రీ మతంబై!భవిసౌఖ్యం బొప్పన్!
చెనువునా వృత్తము,న,త,జ,న,ర,జ,త,య,గగ,గణము లుండును,
ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,
వృ,సం:-33.21.700.యతులు,11.17.
11గర్భగత,జీవ యశ వృత్తము,
. కై వశ వాగ్వర!ఘన యశా!కవిరాడ్వరేణ్య!కౌముదీవై!కరము న్భాసింపన్!
గావుత దైవము కనుమిదె!కవితా వతంశ!కామిదాల న్వెలి గించు న్వాణే!
పావన మేర్చుగ!వనజమై!భవదీయ ప్రజ్ఞ!పామ రాళి న్శుభ సౌభాగ్యాలన్!
జీవము దీర్చును!చెనువునై!శివ మేర్చు గాక!శ్రీ మతంబై!భవి సౌఖ్యం బొప్పన్!
జీవ యశ వృత్తము,న,భ,న,భ,ర,జ,త,య,గగ,గణము లుండును,
ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,
వృ,సం:-17.48.472.యతులు,11.17.
12. గర్భగత,కైవశ వృత్తము,
కైవశ వాగ్వర!కవి రాడ్వరేణ్య!కౌముదీవై!కరము న్భాసింపన్!
కావుత దైవము!కవితావతంశ!కామిదాల న్వెలి గించు న్వాణే!
పావన మేర్చుగ!భవదీయ ప్రజ్ఞ!పామరాళి న్శుభ సౌభాగ్యాలన్!
జీవము దీర్చును!శివ మేర్చు గాక!శ్రీ మతంబై!భవి సౌఖ్యం బొప్పన్!
కైవశ వృత్తము,భ,భ,స,జ,ర,భ,మ,గ,గణము లుండును,
ఆకృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,
వృ,సం:-2.07.607. యతి,13.
13. గర్భగత,శుభ గతి వృత్తము,
ఘన యశా!కవి రాడ్వరేణ్య!కైవశ వాగ్వర!కౌము దీవై!కరమున్భాసింపన్!
కను మిదే!కవితా వతంశ!కావుత దైవము!కామిదాల న్వెలి గించు న్వాణే!
వనజమై!భవదీయ ప్రజ్ఞ!పావన మేర్చుగ!పామరాళి న్శుభ సౌభాగ్యాలన్!
చెనువునై!శివ మేర్చు గాక!జీవము దీర్చును!శ్రీ మతంబై!భవి సౌఖ్యం బొప్పన్!
శుభగతి వృత్తము,న,భ,ర,జ,జ,జ,త,య,గగ,గణము లుండును,
ఉత్కృతి ఛందము నందలిది,ప్రస నియమము కలదు,
వృ,సం:-33.32.812, యతులు,11.17.
14.శ్రీ మతా వృత్తము,
కౌముదీవై!కరము న్భాసింపన్!కవి రాడ్వరేణ్య!కైవశ వాగ్వర!ఘనయశా!
కామిదాల న్వెలి గించు న్వాణే!కవితావతంశ!కావుత దైవము!కను మిదే!
పామరాళి న్శుభ సౌభాగ్యాలన్!భవదీయ ప్రజ్ఞ!పావన మేర్చగ!వనజమై!
శ్రీ మతంబై!భవి సౌఖ్యం బొప్పన్!శివ మేర్చు గాక!జీవము దీర్చును!చెనువునై!
శ్రీ మతా వృత్తము,ర,భ,మ,భ,ర,జ,జ,న,వ,గణము లుండును,
ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,
వృ,సం:-81.72.043.యతులు,11.17.
ఇట్లు,
తమ విశ్వస నీయుడు,
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
జుత్తాడ,
ఈ మధ్య శ్రీనారాయణీ అవధాన వేదిక కవివరేణ్య బిరుదుతో సత్కరించిన సందర్భముగా బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తి గురుదేవులు నాపై అవ్యాజానురాగముతో అసాధారణమైన గర్భకృతి వెలయించి, సమర్పించిన సందర్భముగా వారికి నా ఆనందమును వ్యక్తపరచుచు, ధన్యవాదపూర్వక నమస్కృతులను తెలియజేసుకొనుచున్నాను.
జైహింద్.
No comments:
Post a Comment