Thursday, October 10, 2024

వాగ్దేవతలు

జైశ్రీరామ్.

 వాగ్దేవతలు

ఓం శ్రీమాత్రే నమః

తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల,  దాని అంతర్నిర్మాణము :

"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండము అంటారు. 

ఈ చంద్రఖండము లోని అచ్చులైన 16 వర్ణము లకు అధిదేవత "వశిని"  అనగా 

వశపరచుకొనే శక్తి కలది అని అర్ధము.

"క" నుండి "భ"  వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండము" అంటారు.

ఈ సౌరఖండము లోని 

"క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి". 

అనగా కోర్కెలను తీర్చునది అని అర్ధము. 

"చ, ఛ, జ, ఝ, ఞ" 

వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".                    

అనగా  సంతోషాన్ని వ్యక్తం చేసేది.

"ట, ఠ, డ, ఢ, ణ"  వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".  

అనగా మలినములను తొలగించేది.

"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".  

కరుణను మేలుకొలిపేదే అరుణ.

ప, ఫ, బ, భ, మ" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "జయని."  

అనగా జయము కలుగ చేయునది.

అలాగే "మ" నుండి "క్ష"  వరకు గల 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండము"  అంటారు.     

అగ్ని ఖండము లోని "య, ర, ల, వ"  అనే అక్షరములకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." 

అనగా శాశించే శక్తి కలది.

ఆఖరున గల ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష"  లకు అధిదేవత "కౌలిని"

ఈ అధిదేవతల నందరినీ "వాగ్దేవతలు"  అంటారు. 

ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.

ఎందుకంటే శబ్దము బ్రహ్మము నుండి అద్భవించినది.

అనగా బ్రహ్మమే శబ్దము. శబ్దమే బ్రహ్మము.

బ్రహ్మమే నాదము.

మనము నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపైనీ,  

ప్రకృతి పైనీ ప్రభావము చూపుతాయి.

కనుక యాస లేని స్వచ్ఛమైన సంసృత పరమైన అక్షరము లను ఉచ్ఛరించాలి.

క్షరము లేనిది అక్షరము. శబ్దము నశిస్తుంది. అక్షరాలకు నాశనము లేదు.

అదే మంత్రములు, వేదములు  అయితే ప్రభావము ఇంకా లోతుగా ఉంటుంది.

భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి "అమ్మ" ను అర్చిస్తున్నాయి.

కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా 

ఈ సంగతి స్ఫురణలో ఉంచుకుంటే అనేక అద్భుతాలను పొందవచ్చు.

మనం చదివే స్తోత్రము ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు. 

మనం చదివే స్తోత్రమే ఆ దేవత.

మనం చేసే శబ్దమే దేవత!

మన అంతశ్చేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.

ఆ శబ్దం వలన పుట్టిన నాదమే దేవత.

జైహింద్.

Monday, September 30, 2024

గుండె....జాగ్రత్తలు

 *గుండెపోటు* ️


 3000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో చాలా పెద్ద మహర్షి ఉండేవాడు.
 * అతని పేరు * * మహర్షి వాగ్వత్ జీ !!*

 *అతను ఒక పుస్తకం రాశాడు*
 * ఎవరి పేరు * * అష్టాంగ * * హృదయం !!*
 *(అస్తాంగ్ హృదయం)*

 *మరియు ఈ పుస్తకంలో అతను* *రోగాలను నయం చేయడానికి* *7000* * సూత్రాలు వ్రాసాడు!*
 *అందులో ఇది ఒకటి మాత్రమే!!*

 *వాగ్వత్ జీ వ్రాశారు, ఎప్పుడైనా గుండె చంపబడుతుందని!* *అంటే గుండె గొట్టాలలో అడ్డుపడటం మొదలవుతుంది!*

 అంటే రక్తంలో ఎసిడిటీ పెరిగిపోయిందని!
 *మీరు అసిడిటీని అర్థం చేసుకుంటారు!*
 *దీనినే ఇంగ్లీషులో అసిడిటీ అంటారు!!*
 అసిడిటీ రెండు రకాలు!

 *ఒకటి కడుపులోని ఆమ్లత్వం!*

 *మరియు ఒకటి రక్తం యొక్క ఆమ్లత్వం !!*

 * మీ కడుపులో ఆమ్లత్వం పెరిగినప్పుడు!* * అప్పుడు మీరు ఇలా చెబుతారు *
 ✔️* కడుపులో మంటగా ఉంది !!*
 ✔️*పులుపు పుల్లటి త్రేనుపు వస్తోంది!*
 ✔️*నోటి నుండి నీరు వస్తోంది!*
 *మరి ఈ ఎసిడిటీ మరింత పెరిగితే!*
 *కాబట్టి హైపర్‌యాసిడిటీ ఉంటుంది!*
 మరియు కడుపు యొక్క ఆమ్లత్వం పెరిగినప్పుడు మరియు రక్తంలోకి వచ్చినప్పుడు, అప్పుడు రక్తంలో ఆమ్లత్వం ఉంటుంది.
 * మరియు రక్తంలో ఆమ్లత్వం పెరిగినప్పుడు, ఈ ఆమ్ల రక్తం గుండె గొట్టాల నుండి బయటకు రాలేకపోతుంది!* * మరియు ట్యూబ్‌లలో అడ్డుపడుతుంది!*
 *అప్పుడే గుండెపోటు వస్తుంది!!  అది లేకుండా గుండెపోటు వచ్చేది కాదు!!*
 * ఏ వైద్యుడూ చెప్పని ఆయుర్వేదంలోని అతి పెద్ద నిజం ఇదే!
 *ఎందుకంటే దీని చికిత్స చాలా సులభమైనది!!*

 *చికిత్స ఏమిటి ??

 *రక్తంలో అసిడిటీ పెరిగినప్పుడు వాగ్వట్ జీ రాసారు!* *అప్పుడు మీరు ఆల్కలీన్‌గా ఉండే వాటిని వాడండి!*
 *రెండు రకాల విషయాలు మీకు తెలుసా!*

 *ఆమ్ల మరియు ఆల్కలీన్!!*
 *ఆమ్ల మరియు ఆల్కలీన్*

 * ఇప్పుడు మీరు యాసిడ్ మరియు బేస్ కలిపితే ఏమవుతుంది!  ,

 * మీరు యాసిడ్ మరియు ఆల్కలీన్ కలిపితే ఏమి జరుగుతుంది ?????**

 ️*తటస్థము*
‼️
 *అది అందరికి తెలిసిందే!!*

 *కాబట్టి వాగ్వట్ జీ రాశారు!* *రక్తంలో ఆమ్లత్వం పెరిగితే, క్షార పదార్థాలు తినండి!*
 *అప్పుడు రక్తం యొక్క ఆమ్లత్వం తటస్థంగా ఉంటుంది !!!*

 *రక్తంలోని ఆమ్లత్వం తటస్థంగా మారింది!*
 *కాబట్టి జీవితంలో గుండెపోటు వచ్చే అవకాశం ఎప్పుడూ ఉండదు!!*

 *ఇదంతా కథ!!*

 ఇప్పుడు మీరు అడిగేవి ఏవి ఆల్కలీన్ మరియు మనం తినాలి ?????

 * మీ వంటగదిలో ఆల్కలీన్‌గా ఉండే ఇలాంటివి చాలా ఉన్నాయి!
*మరియు అది వచ్చినట్లయితే!*
 *మళ్లీ రాదు!!*

 *అత్యంత క్షార గుణాలున్నవి అన్నీ ఇంట్లో తేలిగ్గా దొరుకుతాయని మనందరికీ తెలుసు కనుక ఇది సొరకాయ!!*
 *దీనినే దూధి అని కూడా అంటారు!!*
 *ఇంగ్లీషులో బాటిల్ గార్డ్ అంటారు!!!*
 *మీరు కూరగాయగా తింటారు!* *ఇంతకంటే క్షారగుణం మరొకటి లేదు!*

 *కాబట్టి మీరు రోజూ సొరకాయ రసం తీసి తాగండి !!* *లేదా పచ్చి సొరకాయ తినండి !!*

 *రక్తంలోని అసిడిటీని తగ్గించే గొప్ప శక్తి సొరకాయకు ఉందని వాగ్వట్ జీ చెప్పారు.  * *అప్పుడు మీరు చెంబు రసాన్ని తీసుకుంటారు !!*

 *ఎంత తినాలి?????????**

 *రోజుకు 200 నుండి 300 mg త్రాగండి!!*

 *మీరు ఎప్పుడు తాగుతారు?*

 * *ఉదయం ఖాళీ కడుపుతో (మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత) త్రాగవచ్చు !!* * లేదా అల్పాహారం అరగంట తర్వాత తాగవచ్చు !!*
 * మీరు ఈ సొరకాయ రసాన్ని మరింత ఆల్కలీన్‌గా చేయవచ్చు!*
 *దీనిలో 7 నుంచి 10 తులసి ఆకులు వేయండి * *తులసి చాలా ఆల్కలీన్!!* *దీనితో 7 నుంచి 10 పుదీనా ఆకులను కలపవచ్చు!* *పుదీనా కూడా చాలా క్షారమే!* *దీనితో మీరు బ్లాక్ సాల్ట్ లేదా సైన్ధవఉప్పు వేయండి!*
 *ఇది చాలా ఆల్కలీన్ కూడా!!*

 *అయితే గుర్తుంచుకో*
 * * ఉప్పు నలుపు లేదా రాయిని ఉంచండి !* * ఆ ఇతర అయోడైజ్డ్ ఉప్పును ఎప్పుడూ వేయవద్దు !!* * ఈ అయోడైజ్డ్ ఉప్పు ఆమ్లమైనది !!!!!*

 *కాబట్టి మిత్రులారా, మీరు తప్పకుండా ఈ సొరకాయ రసాన్ని తీసుకోవాలి !!*

 * 2 నుండి 3 నెలల వ్యవధిలో మీ హార్ట్ బ్లాక్‌లన్నింటినీ నయం చేస్తుంది !!*

 *21వ రోజు మీరు చాలా ఎఫెక్ట్‌ను చూడటం ప్రారంభిస్తారు!!!*

 *మీకు ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు!!*

 *దీనిని మన భారతదేశంలోని ఆయుర్వేదంతో ఇంట్లోనే చికిత్స చేస్తారు !!*

 *మరియు మీ విలువైన శరీరం మరియు లక్షల రూపాయలు ఆపరేషన్ నుండి ఆదా చేయబడతాయి !!*

 *మీరు పోస్ట్ మొత్తం చదివారు, చాలా ధన్యవాదాలు!!*

 * మీకు నచ్చితే, మీరు ఈ సమాచారాన్ని ఇతర వ్యక్తులందరికీ పంపాలి.*


 *కనీసం ఐదు గ్రూపులు పంపాలి*
 *కొందరు పంపరు*
 *అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను*

Wednesday, September 18, 2024

తర్పణం ఎలా వదలాలి?

 తర్పణం ఎలా వదలాలి?

ముఖ్య గమనిక తండ్రి బతికి ఉంటే పితృ తర్పణాలు చేయరాదు!

కావలసిన సామగ్రి:

దర్భలు,నల్ల నువ్వులు, తడిపిన తెల్ల బియ్యం, చెంబులో మంచినీరు (ఆర్ఘ్య పాత్ర)

పంచ పాత్ర (ఆచమన పాత్ర ఉద్దరిణి అరివేణం)

తర్పణం విడవడానికి పళ్ళెం 

చిటికెడు గంధం 

కూర్చోడానికి ఆసనం 


యజ్ఞోపవీతం ధరించు విధానములు 

"సవ్యం ఎడమ భుజం మీదుగా కుడివైపున కి వచ్చేది .

"నివీతి దండలాగా మెడలో నుండి పొట్టమీద వేసుకునేది.

"ప్రాచీనావీతీ కుడిభుజం మీదుగా ఎడమవైపున కి వచ్చేది.


శివాయ గురవే నమః.

శుచిః తమలపాకు తో తలమీద నీళ్ళు చల్లుకోవాలి 


ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షమ్ సబాహ్యాభ్యాంతరః స్సుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష 


ప్రార్ధనా 'నమస్కారం చేస్తూ ఇవి చదవండి.

ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా .


ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 


ఆచమ్యా - ఆచమనం చేయండి.


ఓం కేశవాయ స్వాహా 

ఓం నారాయణాయ స్వాహా 

ఓం మాధవాయ స్వాహా 

అని మూడుసార్లు నీరు తీసుకోండి 

ఓం గోవిందాయ నమః అని చెప్పి చెయ్యి కడిగి 


ఓం గోవిందాయ నమః 

ఓం విష్ణవే నమః 

ఓం మధుసూధనాయ నమః 

ఓం త్రివిక్రమాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం శ్రీధరాయ నమః 

ఓం హ్రుషీకేశాయ నమః 

ఓం పద్మనాభాయ నమః 

ఓం దామోదరాయ నమః 

ఓం సంకర్షణాయ నమః 

ఓం వాసుదేవాయ నమః 

ఓం ప్రధ్యుమ్నాయ నమః 

ఓం అనిరుద్ధాయ నమః 

ఓం పురుషోత్తమాయ నమః 

ఓం అధోక్షజాయ నమః 

నారసింహ య నమః 

ఓం అచ్యుతాయ నమః 

ఓం జనార్దనాయ నమః 

ఓం ఉపేంద్రాయ నమః 

ఓం హరయే నమః 

ఓం శ్రీ క్రిష్ణాయ నమః .


పవిత్రం:

ఓం పవిత్రవంతః పరివాజ మాసతే పితైషాం ప్రత్నో అభి రక్షతి వ్రతమ్ !

మహాస్స ముద్రం వరుణస్థిరో దధే ధీరా ఇచ్ఛేకుర్ధ రుణేష్వారభమ్ !!

పవిత్రం తే వితతం బ్రాహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః!

అతప్తతనూర్న తదామో అశ్నుతే శ్రతాస ఇద్వహన్తస్తత్సమాశత!!


పవిత్రం ధ్రుత్వా - (పవిత్రం ధరించండి )


భూతోచ్ఛాటనం -

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః 

ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే 

అక్షింతలు మీ వెనక్కి వేయండి.


ప్రాణాయామం -

ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం జనః, ఓం తపః, ఓగ్ సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతీ రసోమ్రుతం బ్రహ్మ భూర్భువస్సవరోమ్ 


మూడు సార్లు అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి 


సంకల్పం -

అక్షింతలు చేతిలో పట్టుకోండి 

శ్రీ గోవింద గోవింద గోవిందా 

శ్రీ మహా విష్ణోరాజ్నాయ ప్రవర్తమానశ్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భారత వర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీసైలశ్య ----- ప్రదేశే ------- నధ్యో పుణ్యప్రదేశే  సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ---- నామ సంవత్సరే ----- ఆయనే ---- ఋతౌ ----- మాసే ---- పక్షే ---- తిధౌ ---- వాసరే శ్రీ విష్ణు నక్షత్రే శ్రీ విష్ణు యోగే శ్రీ విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం పుణ్యతిధౌ !


ప్రాచీనావీతీ.

అస్మత్ పిత్రూనుద్దిశ్య అస్మత్ పిత్రూణాం పుణ్యలోకా వాప్త్యర్ధం పిత్రు తర్పణం కరిష్యే.


సవ్యం -

(నీరు తీసుకుని అక్షింతలు అరివేణం లో విడవండి)


నమస్కారం చేయండి -


ఈశానః పిత్రు రూపేణా మహాదేవో మహేశ్వరః !

ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః!!


దేవతాభ్యః పిత్రుభ్యశ్చ మహా యోగిభ్య ఏవచ!

నమః స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమోనమః!!


మంత్రం మధ్య క్రియా మధ్యే విష్ణోః స్పురణ పూర్వకం !

యత్కించిత్ క్రియతే కర్మతత్కోటి గుణితం భవేత్!!

విష్ణు ర్విష్ణు ర్విష్ణుః.


దక్షిణం వైపు తిరిగి కూర్చోండి.

ఆర్ఘ్యపాత్ర-


ఆర్ఘ్యపాత్రయోః  అమీగంధాః 

(ఆర్ఘ్యపాత్రలో గంధం వేయండి)


పుష్పార్ధా ఇమే అక్షతాః 

(ఆర్ఘ్యపాత్రలో అక్షింతలు వేయండి)


అమీ కుశాః 

(ఆర్ఘ్యపాత్రలో ఒక దర్భ వేయండి)


సవ్యం -  నమస్క్రుత్య 


ఓం ఆయంతునః పితరస్సోమ్యా స్సోగ్నిష్వాత్తాః 

పధిబిర్దేవ యానైః!


అస్మిన్ యజ్ఞే స్వధయా మదం త్వధి బ్రవంతు తే అవంత్వ స్మాన్ !!


ఇదం పిత్రుభ్యో నమో అస్త్వద్య యే పూర్వాసో య ఉపరాస ఈయుః!


యే పార్ధివే రజస్యా నిషత్తా యే వా నూనం సువ్రుజనాసు విక్షు!!


పిత్రు దేవతాభ్యో నమః !

ఓం అగచ్ఛంతు మే పితర ఇమం గ్రుహ్ణాంతు జలాం జలిమ్!

(పళ్ళెంలో ఒక దర్భ పెట్టండి)


ప్రాచీనావీతీ -


సకలోపచారార్ధే తిలాన్ సమర్పయామి 

(నల్ల నువ్వులు పళ్ళెంలోని దర్భమీద వేయండి)


పిత్రాది తర్పణం -

కుడి బొటనవేలు కి నల్ల నువ్వులు అద్దుకుని పిత్రు తీర్థము గా మూడేసి సార్లు విడవండి.


*బ్రాహ్మణులు కి శర్మాణం, క్షత్రియులకు వర్మాణం, వైశ్యులకు గుప్తం *


గతించిన వారికే చేయండి సజీవులకు చేయవద్దు**


"ప్రాచీనావీతీ"


తండ్రిగారు - 

అస్మత్ పితరం -- గోత్రం -- మనిషి పేరు --- శర్మాణం 

వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


తండ్రి యొక్క తండ్రిగారు పితామహాం(తాత గారు)

అస్మత్  పితామహాం --- గోత్రం --- శర్మాణం రుద్ర రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


అస్మత్ ప్ర పితామహం  తండ్రి యొక్క తండ్రిగారి తండ్రి గారు (ముత్తాత గారు)--- గోత్రం --- శర్మాణం ఆదిత్య రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


తల్లిగారు -

అస్మత్ మాతరం --- గోత్రాం --- దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి 


తండ్రి యొక్క తల్లి గారు -

అస్మత్ ప్రపితామహీం ---- గోత్రాం దాం ఆదిత్య రూపాం నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


తండ్రి యొక్క మారు భార్య -( సవతి తల్లి)

* సవతి తల్లి ఉండి గతించినట్లైతే ఇది చేయండి**


అస్మత్ సాపత్నీ మాతరం --- గోత్రాం --- దాం వసు రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(తల్లి యొక్క తండ్రిగారు)

అస్మత్ మాతా మహం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి తర్పయామి 


తల్లి యొక్క తండ్రిగారి తండ్రి గారు 

అస్మత్ మాతుః ప్ర పితామహం --- గోత్రం --- శర్మాణం రుద్ర రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


తల్లి యొక్క తండ్రిగారి తండ్రి గారి తండ్రి గారు_

అస్మత్ మాతుః ప్ర ప్రపితామహం -- గోత్రం -- శర్మాణం స్వధా ఆదిత్య రూపం నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


తల్లి యొక్క తల్లి గారు -

అస్మత్ మాతా మహీం --- గోత్రం --- దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


తల్లి యొక్క తల్లి గారి అత్త గారు 

అస్మత్ మాతుః పితామహీం --- గోత్రాం -- దాం రుద్ర రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


అస్మత్ మాతుః ప్ర ప్రపితామహీం (తల్లి యొక్క అమ్ముమ్మ, మరియు తాతమ్మ )-- గోత్రాం --దాం-- ఆదిత్య రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


** ఈ క్రింది తర్పణాలు వివాహం జరిగిన వాళ్ళు మాత్రమే ఇవ్వ వలెను.

(స జీవులకు ఇవ్వరాదు)


(భార్య)

అస్మత్ ఆత్మ పత్నీం -- గోత్రం --దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(కుమారుడు)

అస్మత్ సుతం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(సోదరుడు)

అస్మత్ భ్రాతరం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(పెదతండ్రి ," జ్యేష్ట "పినతండ్రి "కనిష్ట ")

అస్మత్ జ్యేష్ట, కనిష్ట పిత్రువ్యం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(మేనమామ)

అస్మత్ మాతులం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(కూతురు)

అస్మత్ దుహితరం --- గోత్రాం ---దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(తో బుట్టువు)

అస్మత్ భగినీం -- గోత్రాం --దాం-- వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(కూతురు కొడుకు, మనుమడు)

అస్మత్ దౌహిత్రం -- గోత్రం --దాం శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(మేనల్లుడు)

అస్మత్ భగినేయకం -- గోత్రం --దాం శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి .

( మేనత్త)

అస్మత్ పిత్రుష్వసారం --- గోత్రాం --దాం-- వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.

(పెదతల్లి, జ్యేష్ట పినతల్లి కనిష్ట)

అస్మత్ జ్యేష్ట/కనిష్ట మాత్రుష్వసారం ---గోత్రాం--- దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.

(అల్లుడు)

అస్మత్ జా మాతరం --- గోత్రాం --- దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.

(తో బుట్టువు భర్త)

అస్మత్ భావుకం -- గోత్రం --దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.

(కోడలు)

అస్మత్ స్నుషాం --- గోత్రం --దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(భార్య యొక్క తండ్రిగారు)

అస్మత్ శ్వసురం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(భార్య యొక్క తల్లి గారు)

అస్మత్ శ్వస్రూం --- గోత్రాం -- దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(బావమరిది లు)

అస్మత్ శ్యాలకం --- గోత్రం --దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(ఆచార్యులు)

అస్మత్ స్వామినం/ ఆచార్యం -- గోత్రం -- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(బ్రహ్మోపదేశం చేసిన గురువు గారు)

అస్మత్ గురుం --- గోత్రం -- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


(తర్పణం కోరిన వారు)

అస్మత్ రిక్ధినం --- గోత్రం -- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.


పితృ దేవతాభ్యో నమః !

సుప్రీతో భవతు !


కుశోదకం 


"ప్రాచీనావీతీ "


ఏషాన్నమాతా న పితా న బన్ధుః నాన్య గోత్రిణః !

తే సర్వే త్రుప్తి మాయాన్తు మయోత్ర్స్ ష్ట్త్ కుశోదకైః 

త్రుప్యత త్రుప్యత త్రుప్యత త్రుప్యత త్రుప్యత !!


కొన్ని పువ్వులు పళ్ళెం లోని దర్భ చేతిలోకి తీసుకుని చెంబులో నీరు పిత్రు తీర్ధంగా పళ్ళెంలో విడవండి .

దర్భ కూడా విడిచిపెట్టి చేతికి నువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి.


నిష్పీడనోదకం 


"నివీతీ"

యేకేజాస్మత్ కులే జాతాః అపుత్రాః గోత్రిణోమ్రుతాః !

తేః గ్రుహ్ణాంతు మయాదత్తం వస్త్ర నిష్పీడనోదకమ్!!


(జంధ్యం దండలా వేసుకోండి బ్రహ్మ ముడుల మీద నీరుపోసి తడిపి పిండి కళ్ళకు అద్దుకోండి )


సమర్పణం -

సవ్యం -

కాయేన వాచా మనసైంద్రియైర్వా ఋద్ధ్యాత్మ నావా ప్రక్రుతే స్స్వభావాత్ !

కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి !!

నమొ బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ!

జగద్ధితాయ క్రిష్ణాయ గోవిందాయ నమో నమః !!


పవిత్రం విస్రుజ్య 

ఓం శాంతిః శాంతిః శాంతిః 

ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు !


ఇప్పుడు ఋచి ప్రజాపతి రచించిన పిత్రు స్తోత్రం పారాయణ చేయండి.


హర హర మహాదేవ శంభో శంకర 

శివ సంకల్పమస్తు శుభమస్తు.

15 - 9 - 2024న శతాధిక గ్రంథావిష్కరణ సభలో టీవీ ఏక్టర్ రాఘవ.

 


Sunday, September 8, 2024

సప్త చిరంజీవులు.

జైశ్రీరామ్. 

సప్త చిరంజీవులు.

శ్లో.  అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।

కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।

జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥

వివరణ.

శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు 

వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి 

లోకహితముకై వ్యాసుడు 

శ్రీరామభక్తితో హనుమంతుడు 

రామానుగ్రహమువలన విభీషణుడు 

విచిత్రజన్మము వలన కృపుడు 

ఉత్క్రుష్టతపోధనుడైన పరశురాముడు 

సప్తచిరంజీవులైరి । 

వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని 

ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై 

శతాయుష్మంతులౌతారని ఈ శ్లొకతాత్పర్యము.

జైహింద్.


Thursday, September 5, 2024

గణపతి పాట. రచన, సంగీతం,గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

జైశ్రీరామ్.
శ్రీమతి వల్లూరి సరవతి గారు చక్కని సంప్రదాయకుటుంబీకులు. భక్తి తత్పరతతో రచించిన వారి పద్యాలయినా పాటలయినా మనోహరంగా పాడే సుస్వభావం ఉన్న జనని. వారే స్వయముగా రచన చేసి వారే అద్భుతంగా పాటగా అందరికీ పంచే ఉదార స్వభావులు. గణపతిపై వీరు రచించి పాడిన పాట ఎంత బాగుందో చూడండి.
శ్రీమతి వల్లూరి సరస్వతిగారికి నా అభినందనలు.
జైహింద్.

Tuesday, September 3, 2024

“మాయదారి...” డా. పేరి రవికుమార్ గారి కొత్త కథ

జైశ్రీరామ్.

“మాయదారి...”

     బృందావనంలో గాలి మందగించింది. చడీ చప్పుడు లేకుండా ప్రవహిస్తోంది యమునా నది.

పగలు రాత్రి కూడా కళకళలాడుతూ త్రుళ్ళిపడే ఊరు మొత్తం నిశ్శబ్దంగా కనబడుతోంది

అందరూ ఎవరి పనులలో వారు ఉన్నారు. కాని, మొత్తంగా ఏదో గుబులు మేఘం కమ్ముకున్నట్లు అవుతోంది. 

అవును మరి, ఎందుకు కాదు? కారణమా తెలియదు. అప్పటికి ఒక వారం దినాలు అయి ఉంటుంది. ఏ అల్లరి చేయక కృష్ణుడు బుద్ధిగా ఉన్నాడాయె. ఎవరైనా అల్లరి చేస్తే కష్టంగా ఉంటుంది. కాని, కృష్ణుడు అల్లరి చేయకుంటే నష్టంగా అనిపిస్తోంది. 

యశోద మాత్రం సంతోషంగా ఉంది. కృష్ణుడు పొద్దుటనే, లేపకుండానే నిద్ర లేస్తాడు. అమ్మ పెట్టిన వెన్ననే తింటాడు. చద్ది మూట కట్టుకుని, ఆవులను తీసికొని వెళ్ళి, సాయంకాలం ఇంటికి చేరుకుంటాడు. ఇక ఎక్కడికి పోడు. పెందలకడనే అన్నం తిని పడుకుంటాడు. రాత్రి మధ్యలో ఎప్పుడు చూసినా తన పక్కలోనే ఉంటాడు. అలుక, అల్లరి లేవు. ఇంటి మీదకు తగవులు లేవు. యశోదకు సంతోషమే కదా. 


కాని ఇంకెవరికీ అలాగ లేదు. ఏ ఇంట్లో చూచినా వెన్న కుండలు అలానే ఉంటున్నాయి. పెరుగు కుండలు పగలట్లేదు. కృష్ణునితో తిరిగే పిల్లలు కూడా నెమ్మదిగా ఉంటున్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. అందరూ తేలికపడాలి. అయినా ఎందుకో బరువుగా అనిపిస్తోంది. ముందు రెండు దినాలు బాగుంది. తరువాత అసంతృప్తి మొదలైంది. ఇలా బాగా లేదని ఒకరు అన్నారు, ఆ మాట క్రమంగా వ్యాపించింది. ఇప్పుడు అందరికీ అలాగే అనిపిస్తోంది. 

ఆవులు సరిగా పాలు ఇవ్వటం లేదు. కుండల వంటి పొదుగులతో కుండల నిండుగా పాలు ఇచ్చేవి. ఇప్పుడు ఏమిటో తగుమాత్రంగా ఇస్తున్నాయి.

అత్తలకు తమ కోడళ్ళ గురించి చింతలేదు. రాత్రుళ్లు ఇంటి పట్టున ఉంటున్నారు అని. కోడళ్ళు మాత్రం దిగులుగా ఉన్నారు. వారి కారణం వారికి ఉంది.

రాత్రుళ్లు దొరలిపోతున్నాయి నిశ్శబ్దంగా. వేణుగానం వినబడుట లేదు. హృదయం వెలితిగా, బరువుగా అనిపిస్తోంది. 


కామన్నగారి బొవ్వప్పకు కూడా తెలియని చిరాకుగా ఉంది. ఆవిడ అసలు పేరు ఎవరికీ తెలియదు. ఏనాడో కాలం చేసిన ఆమె పెనిమిటికి తెలుసునేమో. అందరూ ఆమెను బొవ్వప్ప అనే అంటారు. ఆవిడ నోరు విప్పితే నాలుగు వీధులు వినబడాలి. అంత ధాటీగా లంకించుకుంటుంది. అదెందుకో కాని, ఆ ఇంట్లో కృష్ణుడు ఎక్కువగా అల్లరి చేస్తాడు. 

ప్రతిదినం పొద్దుట బొవ్వప్ప తన ఇంటి అరుగు మీద నిలబడటం, అరవటం. ఆమె ఎప్పుడూ యశోద ఇంటి మీదకు పోదు. తన గుమ్మంలో నిలబడి, గొంతు పెద్దగా చేయటమే. తన మాటలు వినబడతాయి అని లేదా విన్నవారు యశోదకు చెప్తారు అని నమ్మకం. ఆవిడ ఎప్పుడూ, మిగిలిన పిల్లకాయలను ఏమీ అనదు. 'వానితో తిరిగి చెడిపోతున్నారు పాపం' అంటుంది. కృష్ణుని మీదనే అన్ని తిట్లూ. 'మాయదారి సంత' అని ఒక మాట చివర్లో  తగిలిస్తుంది.


అవును మరి, కృష్ణుడు చేసే పనులు అలాగే ఉంటాయి.

ఒకనాడు చిట్టి బూరెలు చేసింది బొవ్వప్ప. కొడుకు, కోడలు, తను, ముగ్గురే ఇంట్లో. అయినా హెచ్చుగానే చేసి, చిన్న గంపలో పెట్టి అటకమీద దాచింది. ముందు జాగ్రత్త అనుకున్నది కాబోలు. మధ్యాహ్నం ఒక కునుకు తీసి లేచేసరికి, ఇంటి ముంగిట కృష్ణుడు. 

"బూరెలు తియ్యగా ఉన్నాయి" అంటున్నాడు.

ఉలిక్కిపడి, ఆశ్చర్యపడి, గభాల్న లేచి అటకమీద గంప తీసి చూచింది. మూడంటే మూడే ఉన్నాయి. 

"హారినీ, పగలు కూడా వస్తున్నావూ" అని గొంతు పెంచింది.

"తియ్యగా" అంటున్నాడు కృష్ణుడు.

'నువ్వే ఇచ్చి ఉంటావు' అన్నట్లు కోడలి వైపు చూచింది.

అత్తగారి భారీ విగ్రహం ముందు బక్క పలుచని కోడలు భయంగా నిలబడి, 'కాదు' అన్నట్లు తలాడించింది.

"తియ్యగా" అంటున్నాడు కృష్ణుడు.

మరింత ఆశ్చర్యం, "అదేమిటి, నేను కారం బూరెలు చేస్తే" అని బొవ్వప్ప గొంతు తడబడుతోంది.

"నాకోసం నైవేద్యంగా పెట్టే ఉంటావు అన్ని బూరెలు. ప్రసాదంగా నీకు మూడు మిగిల్చానులే బొవ్వప్పా ! " అన్నాడు కృష్ణుడు తీపి గొంతుకతో.

"ఏవిటీ నైవేద్యం, ప్రసాదం అంటూ. పైగా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు బొడ్డూడని గుంటడివి"  బొవ్వప్ప గొంతులో మాత్రం కారం వినబడుతోంది.

పకపకమని నవ్వాడు కృష్ణుడు,"నాకు బొడ్డూడితేనే అన్నీ పుట్టుకు వచ్చాయి తెలుసా" అన్నాడు.

ఆ నవ్వులో క్షణకాలం అంతా మరచింది బొవ్వప్ప.

తేరుకొని చూస్తే, కృష్ణుని వైపు పరవశంగా చూస్తోంది కోడలు.

అప్రయత్నంగా ఒక బూరె తీసి నోట్లో వేసుకుంటే, తియ్యగానే ఉంది.

'బెల్లప్పాకం పట్టుకొచ్చి కలిపేసి మరీ తినేసాడు గావాల్ను' అని గొణుక్కుంది.

"మళ్లీ చేసినప్పుడు వస్తాలే" అని పరుగెత్తాడు కృష్ణుడు.

బొవ్వప్ప ఏం చేస్తుంది? మిగిలిన రెండు కూడ నోట్లో వేసుకుంది. తియ్యగా రుచిగా ఉన్నాయి.

కోపం, ఆశ్చర్యం పెరిగిపోయాయి. అరుగు మీద నిలబడి రెండు ఘడియలు తిట్టిపోసింది. "మాయదారి సంత" అని ముగించింది.


యశోదమ్మ చెవికి సోకదూ. అప్పటికి ఇల్లు చేరాడు కృష్ణుడు.

"ఏరా కృష్ణా, నన్ను అడిగితే అవేవో నేను చేయనూ, చూడు ఎలా తిడుతోందో" అన్నది.

"బొవ్వప్ప నోరు చెడ్డది కాని చెయ్యి మంచిదే అమ్మా. బాగా రుచిగా చేస్తుంది. నా కోసమే అన్ని చేసింది" అని నవ్వాడు కృష్ణుడు.

ఆ నవ్వు చూస్తే అన్నీ మరచిపోతుంది యశోద.

బొవ్వప్ప మాత్రం ఏదీ మరచిపోదు. ఒకటి జరిగినప్పుడల్లా పాతవి అన్నీ తలచి ఏకరువు పెడుతుంది.

అలాగ బొవ్వప్పకు నోరు చేసుకునే అవకాశం ఇస్తాడు కృష్ణుడు.

ఇప్పుడు బొవ్వప్ప నోటికి పనిలేనట్లు అయింది. గంపలు, కుండలు అన్నీ పెట్టినవి పెట్టిన చోటనే ఉంటున్నాయి నిండుగా. 

మంచిదే కదా, కాని కానట్లు ఉంది. ఏమీ తోచట్లేదు బొవ్వప్పకు. ఏదైనా వండబోతే, 'చాలులే మన ముగ్గురికి అంతంత ఎందుకు' అని గదమాయిస్తోంది. ఊరకే అరుగు మీద కూర్చుంటుంది. ఇంటి లోపలికి బయటకు తిరుగుతుంది. 

అత్తగారి అవస్థను చూసినా ఏమీ అనదు కోడలు. ఆమె దిగులు ఆమెకు ఉంది.

బొవ్వప్ప మునుపటిలా నిద్రలో ఏ అలికిడి విన్నా, వెంటనే లేచి చూడట్లేదు. అసలు సరిగా నిద్ర పట్టడం లేదు. ఏమిటో ఊపిరి ఆడనట్లు ఉంది.


చంపావతికి ఊపిరి తీసుకోవటమే బరువుగా ఉంది. రాత్రి నిశ్శబ్దంగా కదలకుండా ఉంది. తన ఒంటరితనాన్ని  పరిహసిస్తున్నట్లు రాత్రి, వెన్నెలతో నవ్వుతోంది.

కృష్ణుడు ఎక్కడ అని ప్రతిరేయి వెదుకులాట. అదే మధురం అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు వెదకనక్కర లేదు. 

మల్లెపొదల చెంత నిలిచి ఏమని అడుగను? 

'మీ పొదల మాటున ఎందుకు లేడు చెప్పరే' అని అడుగనా.

భృంగములను ప్రశ్నింతునా.

కృష్ణుడు తన ఇంటి లోనే ఉన్నాడు. ఇక్కడ ఎక్కడా లేడు.

కృష్ణుని ఎల్లప్పుడూ చూడకుండా చేస్తున్నాయి ఈ కనురెప్పలు అని ఒకనాడు అనుకున్నాను. నేడు విచ్చిన కన్నులు. కనుపాపలలో లేడే ఆ పాపడు.

అక్కడే కూలబడింది చంప. కొంతసేపటికి పక్కన కదలిక తెలిసి చూస్తే, కుముద. ఇద్దరూ ఏమీ మాటాడుకోలేదు. మౌనంగానే వేదన పంచుకున్నారు. 

రాత్రి గడచిన కొద్దీ, అష్టమి నాటి వెన్నెల చల్లగా చిక్కగా కమ్ముకుంటోంది. ఆకాశంలో తారలు ఒకటొకటిగా బయటపడి మెరుస్తున్నాయి. 

పద్మ, కుసుమ, రమణి ఇలా ఒకరొకరుగా చేరుకున్నారు.

"ఈ వెన్నెల..." అన్నది ఒకామె గొంతు పెగల్చుకొని. 

"శుక్లపక్షమే కాని మనం ఇప్పుడు కృష్ణపక్షంలో లేము కదా" అన్నది ఒకామె.

సహింపలేని చల్లని వెన్నెలను పంచలేక రాత్రి గడచింది. నులివెచ్చని సూర్యుడు తొంగి చూచేవేళ అందరూ కాళ్ళీడ్చుకొని ఇళ్ళకు మళ్ళారు.

పగలు రాత్రి మరల అదేవిధంగా తిరిగాయి.

మధ్యాహ్న వేళ.

తాటితోపులో ఒక చెట్టు మొదట్లో పడుకొని ఉన్నాడు బలరాముడు.

మనిషి పొడుగు. పెద్ద పంచను గోచీలాగ చుట్టుకొని ఉన్నాడు. 

అసలే ఎర్రని వాడు. చెట్ల ఆకుల మధ్యనుండి పడే ఎండకు మరింతగా కంది ఉన్నాడు. 

పక్కనే ఒక ముంత. ఉండుండి కదులుతోంది, గాలికి కాబోలు.

ఎండ, మాటుపడి, నీడ తగిలేసరికి కనులు తెరచాడు. 

చుట్టూ నిలబడిన వారిని చూచి, లేచి కూర్చున్నాడు.

'ఏమిటి' అన్నట్లు చూపు.

"రామా" అంది వల్లి.

"ఏంటి నా దగ్గరకు వచ్చారు? " బలరాముని మాట స్థిరంగానే ఉంది. 

"ఏం లేదు, తమ్ముడు... కనబడట్లేదు..." అని గొంతు సవరించింది ఒకామె.

"నాతోనే వస్తున్నాడుగా. ఇవాళ ఇంట్లో ఉన్నాడు, అంతే " అని పెళుసుగా అన్నాడు అన్న.

"అది కాదూ..." తలవంచుకుని అంటోంది ఒకామె.

లేచి నిలుచున్నాడు బలరాముడు. చేతిలో ముంతను ఎత్తి మిగిలిన నాలుగు గుక్కలు నోట్లో వేసుకొని, పారేసాడు. 

"నాకేం తెలుసు? తమ్మునే అడగండి" అని వెళ్ళిపోతున్నాడు. 

"ఆగవయ్యా కోపం తెచ్చుకోకు" అన్నది చంప. ఆమె గదమాయింపుతో తగ్గాడు రాముడు.

చిన్నవాడే కాని మనిషి ఎత్తరి.

అతని ముఖంలోకి చూస్తూ అంది చంప

" నీ తమ్ముని గురించి అంతా తెలిసేది నీకే అని మాకు తెలుసు.

నువ్వే చెప్పాలి.. ఏమయ్యింది?"

ఒక నిమిషం ఆగాడు అన్న.

"చెప్పు రామూ" మరొకరి లాలన.

"ఏంలేదు, మొన్నెపుడో అమ్మ కన్నీరు పెట్టుకుంది తమ్ముని దగ్గర "

"అయ్యో ఎందుకని " నాలుగైదు గొంతుకలు.

"ఇంటి మీదకు తగవులు తేవద్దురా, భరించలేకున్నాను, అంది. సరేనమ్మా అన్నాడు తమ్ముడు. అదీ సంగతి " అని బయలుదేరుతున్నాడు రాముడు.

"ఆగాగు" అని అడ్డుకుంది చంప, " మరి మేమేం చేసాము? " 

'అవును సుమా ' అన్నట్లు అందరి చూపులు.

బలరామునికి నేల చూపులు.

"ఒరే మల్లా" అంది కుముద.

అప్పటివరకు ఆమె వెనక ఉన్న మల్లడు ముందుకు వచ్చాడు.

సన్నగా పొట్టిగా ఉన్నాడు. ఒక గోచి,  వాని కన్న పొడుగ్గా ఉన్నట్లు వేలాడుతోంది.

చిన్న ముంతను సందేహంగా అన్న చేతులో పెట్టి తుర్రుమని పరుగెత్తాడు.

నేలమీద కూర్చున్నాడు రాముడు. కొత్త ముంతను పక్కన పదిలంగా పెట్టుకున్నాడు. ఏ ఒక్కరిని కాక అందరినీ చూస్తున్నట్లు మెల్లగా అన్నాడు, "మీరు కూడా ఏమైనా అనుకున్నారేమో"

"ఏమీ అనలేదే" చప్పున ఒక గొంతుక.

"పైకి అనకున్నా, లోపల ఏమైనా అనుకున్నారేమో, ఆలోచించుకోండి" 

"అదికాదు..." ఎవరో అనబోయారు.

"చెప్పానుగా, ఇంక వెళ్ళండి" అని ఎర్రని కనులతో అందరినీ చూసాడు. 

ముంతను నోట్లో ఒంపుకొని రెండు గుటకలు వేసి, కళ్ళు మూసుకుని పడుకున్నాడు.

అతను చెప్పగలిగినది చెప్పాడని, ఇంక మాటాడడు అని అందరికీ అర్థం అయింది.

దగ్గరలో చెట్ల వద్దకు వెళ్ళి నీడలో కూర్చున్నారు. ఎవరికి వారికే ఆలోచనలు.

ఎండ ఉంది. కాని వేడి లేదు, తాపం లేదు. తాపం అంతా లోలోపలే ఉంది. చెట్టు నీడ ఇచ్చే చల్లదనం తెలియనట్లు, చాలనట్లు అనిపిస్తోంది. గాలి రివ్వున వీస్తోంది. అంతకన్న ఎక్కువగా ప్రశ్నలు, సమాధానాలుగా తలపుల కదలిక.


"ఒకసారి నేనే అనుకున్నాను... ఎందుకు అని..." గొంతు పెగల్చుకొని అన్నారెవరో.

"..‌. నేను కూడా... ఎందుకో..." మరొకరు.

"సంసారం ఒక పక్క.. అని సందేహం"

"మొగుడు, ఇల్లు..."

"రాత్రి నిద్ర ఉండట్లేదని..."

"... ఎందుకో తప్పు అనిపించి... "

ఇలా ఒకటొకటిగా మాటలు పైకి వచ్చాయి.

"కాని, ఆ వేణుగానం... "

"కృష్ణుడు... "

" లేకుంటే ఎలా? "

సంశయ స్వరాలు.

లేచి నిలబడింది చంప, " అందరమూ ఏదో ఒకటి అనుకున్నవారమే, అందుకే ఇలా..." అంది.

"మరి ఇప్పుడు ఏం చేద్దాం" ఆత్రంగా, ఆశగా అడిగింది కుసుమ.

"కృష్ణుని ఇంటికి వెళ్దామా? " చిన్నపాటి ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూండగా అంది పద్మ.

"వెళ్ళి... ఏమని చెప్పాలి? " ఎదురు ప్రశ్న.

నిశ్శబ్దం.

"కృష్ణుని ఇంటికే పోనక్కరలేదు" అని, ఏదో తెలిసినట్లు చెంగున లేచింది కుముద.

'అయితే ఏమిటి ' అని అడిగే లోపలే, " మనం ఇళ్ళకు పోదాం. కృష్ణుడే వస్తాడు" అంది ధీమాగా.

మెల్లగా అందరికీ అర్థం అయింది.

"అవును"అన్నారెవరో, "మనం లోపల అనుకున్నాం. ఇప్పుడు పైకే మాటాడుకున్నాం... చాలు" 

'సరియే' అన్నట్లు అందరూ లేచారు. కదిలారు వడివడిగా.

చెట్లను, లతానికుంజములను చూస్తూ, 'రాత్రి వస్తాం' అనుకుంటూ, వాటిని చేతులతో  నిమురుతూ నడిచారు.

ఎక్కడనుండో కోయిల కూత వినవచ్చింది.

కృష్ణుని ఇంటికి ఎవరూ వెళ్ళలేదు కాని, అక్కడ వేరొక గుంపు కనబడుతోంది.

కారణం బొవ్వప్ప.

మధ్యాహ్న వేళకు ఇంటి ముంగిటికి వచ్చి నిలబడింది. 

వీధి అంతా కనబడుతోంది. ఎవరి అలికిడి లేదు.

ఎందుకనో ఆమె అడుగులు ముందుకు పడ్డాయి.

తనకు  తెలియకుండానే నడుస్తోంది.

ఎప్పడో కాని బయటకు రాదు. ఇవాళ ఎండ ముదురుతున్న వేళ రావటం! 

చూస్తూనే ఆవిడ వెనుక ఒకామె.

'ఎక్కడికి' అని అడగలేదు.

మరో నాలుగు అడుగులు వేసేసరికి ఇంకొకరు. మొత్తానికి యశోద ఇంటికి చేరేసరికి ఒక గుంపులా తయారయింది.

ఇందరిని చూడగానే యశోద కంగారు పడింది. 'కృష్ణుడు ఇంటిపట్టునే ఉన్నాడే' అనుకుంటూ నిలుచుంది.

"కృష్ణుడు లేడా ఇంట్లో" అని ముందుగా బొవ్వప్ప పలకరింపు.

"ఉన్నాడూ " అని మెల్లగా" ఏమయింది " అంది యశోద.

"ఏంలేదు, నాలుగు నాళ్ళనుండి కనబడలేదు ఎక్కడానూ "

"అవును" అంది మరొకతె, "ఏమిటో కృష్ణుణ్ణి చూడకుంటే ఏదోలా ఉంటేనూ... " అని సాగదీసింది.

"బావుందమ్మా" చప్పున అందుకుంది యశోద, తనవంతు వచ్చింది కదా, గొంతు పెరిగింది, "మావాడు వస్తే ఇవి చేసాడూ అవి చేసాడూ అని తగవుకు రావటమా? మీ జోలికి రాకుంటే, ఇలా అడగటమా? విడ్డూరం " అన్నది.

ఆమె చెప్పింది నిజమే కదా, ఎవరూ ఏమీ అనలేకపోయారు వెంటనే.

నెమ్మదిగా మాట కలిపింది పక్కింటి రంగనాయకి, " అది కాదే యశూ, పిల్లాడికి ఏమైనా ఒంట్లో బాలేదేమో అని... "

"ఏం లేదు " మధ్యలోనే మాట ,తుంచివేసింది యశోద," చక్కగా ఇంటిపట్టునే ఉన్నాడు. మీరింక వెళ్ళచ్చు"

"ఓసారి పిలుద్దూ, చూచి పోతాము"

"ఎందుకూ, ఇంట్లో నేను చేసిన మా ఇంటి వెన్న వేసుకొని తింటున్నాడు. మీ చూపులు పడక్కర్లేదు"  అంది యశోద.

ఇన్నాళ్ల తగువులకీ చెల్లింపు చేసే అవకాశం వచ్చింది కదా. ఆమె మాట సూటిగా పుల్లవిరుపుగా ఉంది. దాంతో ఎండ మరింత వేడిగా తగులుతోంది. 

ఆమెకు దగ్గరగా వచ్చి, నచ్చచెప్తున్నట్లు 

"మాట వినవే" అంటోంది ఇంకొకతె, "మా పిల్లలు కూడా ఏమిటో మందకొడిగా అయ్యారు..." 

"అయితే కానీ నాకేంటి" అని యశోద ఇంకేదో చెప్పేలోగా మెల్లగా వచ్చాడు కృష్ణుడు. తల్లి వెనకే నిలబడ్డాడు.

కృష్ణుని చూడగానే, ఎండ చల్లగా అనిపించింది అందరికీ.

"ఏవిరా కిట్టయ్యా! మా ఇంటికి రావట్లేదు? " ఎవరో గబుక్కున అన్నారు.

అదే ప్రశ్న అక్కడ ఉన్న అందరి చూపులలో కనబడుతోంది.

"ఎందుకూ" అన్నాడు కృష్ణుడు.

ఏమని చెప్తారు. నిశ్శబ్దం.

నవ్వాడు కృష్ణుడు.

'వస్తానులెండి' అన్నాడా!?

ఆ నవ్వులో అలా వినిపించిందో, అనిపించిందో. 

"ఇంక వెళ్ళండి" అంది యశోద.

ఒకరొకరు వెనక్కు తిరిగారు. ముందుకు నడుస్తున్నారు కాని అందరికీ వెనకచూపులే. కృష్ణుడు అక్కడే నిలబడి ఉన్నాడు. తన మీదనే కృష్ణుని దృష్టి ఉన్నట్లు ఎవరికి వారికే అనిపిస్తోంది.


ఇంటికి వచ్చింది బొవ్వప్ప. కోడలు ఇంట్లోనే ఉంది.

 "ఎక్కడికి వెళ్ళారూ, గుమ్మం తలుపు గడియ కూడా పెట్టకుండా... " అంది కోడలు.

"దొంగ, తన ఇంటిలోనే ఉన్నాడు. ఇంక మన ఇంటికి ఎందుకు గడియలు, తాళాలు?" అంటూ లోపలికి నడిచింది బొవ్వప్ప.

ఆశ్చర్యంగా చూసింది కోడలు.

అదే విస్మయం అన్ని ఇళ్ళల్లో, ఊరిమీద మేఘంలా కమ్ముకుంది. ఉండీ ఉండీ నాలుగు చినుకులు పడ్డాయి.


పొద్దు వాటారింది. రాత్రి కొరకు అందరి ఎదురుచూపును అర్థం చేసుకున్న భానుడు, గబగబా పడమటి కొండలలోకి జారుకున్నాడు.

మినప్పిండి, బియ్యప్పిండి నానబెడుతోంది కోడలు.

"మరికాస్త వెయ్యి" అంటోంది బొవ్వప్ప వీధి అరుగు మీదనుండి, "మరీ మూడోనాలుగో కాదు, ఎక్కువ చెయ్యి"

మాటాడకుండా చెప్పినట్లు చేసింది కోడలు. కారం బూరెలు తయారయ్యాయి.

గంపలో అటకెక్కి కూర్చున్నాయి.

రాత్రి చల్లగా సాగి వచ్చింది. 

మింట చుక్కలు తమతమ స్థానాలలో ప్రకాశిస్తున్నాయి.

చంద్రోదయమే ఇంకా కాలేదు.

తొందరగా భోజనం చేసి, నిద్రకు చేరింది బొవ్వప్ప.

రాత్రి, చీకటి, వెన్నెల, నిద్ర... ఆన్నీ కలిపి ప్రసరిస్తున్నాయి.


రాత్రి ఏ జాములోనో, అలికిడికి మెలకువ వచ్చింది. అటకమీద గంప కదిలినట్లు, పక్కింట్లో పెరుగుకుండ పగిలినట్లు, పరుగులు పెట్టిన అడుగుల సవ్వడి... వినవచ్చాయి.

'మాయ' అనుకుంటూ ఒత్తిగిలి పడుకుంది బొవ్వప్ప.

కోడలి గురించి చూడలేదు.

మరి, అత్తకు కూడా ఇప్పుడు వినబడుతోంది... నిద్దట్లో...  వేణుగానం!

శుభం.

ఇంత చక్కగా రచించి అందించిన శ్రీమానా పేరి రవి మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.

జైహింద్.


Thursday, August 29, 2024

నుదుట కుంకుమబొట్టు మదినిల్పు తొలిమెట్టు. మెట్టుకొనుడు మంచి బొట్టు మీరు... సమర్పణ మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

జైశ్రీరామ్

 తిలక ధారణ 

బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు. అంటారు పెద్దలు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము,

ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు..

రెండూ కూడా స్మశానంతో సమానం..అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో, అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,..దరిద్రదేవత తాండవం చేస్తాయి...అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు కూడా ఉంటాడు.

కుంకుమ ఎఱుపు రంగు. రంగులలో ఎఱుపునకు అత్యంత ప్రాధాన్యత. ఎఱుపు కరుణకు (దయ) గుర్తు. శక్తిని సూచిస్తుంది. అరుణాం కరుణాం....... అమ్మవారి ధ్యాన శ్లోకం. అలాగే .అమ్మ వారికి కుంకుమ రాగ శోణే అనే ప్రార్ధన ఉంది కదా..

స్త్రీలు కుంకుమ ధరిచడం వేద కాలము నాటి ఆచారం. పురాణతనమైనది..

వివాహిత స్త్రీ పాపిట (రెండుగా విభజించిన తల కేశములు మొదలు ) నుదిటి మధ్య  కుంకుమ ధరించుట సంప్రదాయం గా వస్తున్న పరంపర.

స్త్రీకి నుదిటి కుంకుమ ఒక శోభను ,నిండుతనమును కలుగచేస్తుంది.

మహిళలకు పెళ్లయింది అని గుర్తుకోసం పాపిట బొట్టు పెట్టుకోవడం, పక్క పాపిడి కాకుండా మధ్య పాపిడి తీసుకోవడం, పరికిణీ కాకుండా చీర కట్టుకొని ముఖాన పెద్దగా ఎర్ర బొట్టు పెట్టుకోవడం, మెడలో నల్లపూసలు , మంగళ సూత్రాలు వేసుకోవడం, కాలికి మట్టెలు పెట్టుకోడం చేస్తారు. . కనీసం అవన్నీ చూసి అయినా, పరాయి మగవారు ఈవిడకి పెళ్లయింది ఈవిడ జోలికి పోవద్దు అనుకుంటారు . ఇవన్నీ చాలా పాత ఆచారాలు. స్త్రీలని అందరూ గౌరవంగా చూడాలనే ఉద్దేశ్యంతో పెట్టిన ఆచారాలు. పాతకాలం నించీ ఇప్పటికీ ఇవన్నీ ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ని గుర్తులు ఉన్నా ఎగబడే కీచకులు రావణాసురులు ఉన్నారు . మగవారికి పెళ్లయింది అని గుర్తుగా ఏమీ లేనప్పుడు మాకు మాత్రం ఎందుకు ఇవన్నీ? అని వీటిని వ్యతిరేకించే మహిళలు కూడా ఉన్నారు.  

పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సు అయినా గాని నిష్ఫలము అవుతాయి. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు.

ఇంచు మించుగా చాలామంది భౄమధ్యంలో లేక కాస్త పైన బొట్టు పెట్టుకుంటారు .స్త్రీలు మాత్రమే కాదు పురుషులూకూడా.

ఎందుకూ అంటే అక్కడ ఆఙ్ఞా చక్రం ఉంటుంది . అక్కడే ధ్యానం చేసేటప్పుడు దృష్టి పెట్టాలని చెబుతారు అలా చేస్తే మంచి ప్రశాంతత లభిస్తుంది .

ఏముంటుంది ఆఙ్ఞాచక్రం మీద ?

నమ్మకం ఏమిటంటే సహస్రారంలో మహా కామేశ్వరాంక స్థిత యైన జగజ్జనని ఉంటుంది .వారిపాదాలు ఆఙ్ఞా చక్రం లో ఉంటాయి

బొట్టు పెట్టుకుంటే ఆ శ్రీమాతకు కుంకుమార్చన చేసినట్లే కదా .

అసలు ఆభావన లో ధ్యానం చేస్తూ ఉంటే ఎంత ఆనందతన్మయత్వం కలుగుతుంది.ఆ ఆనందతన్మయత్వంలో కన్నీరు వస్తుంది.

 కళ్ళలో నీళ్ళు ఏంటి ఎందుకొచ్చాయీ .ఓహో గంగమ్మ పుట్టింటికొచ్చిందా ఆవిడ నా కళ్ళ లోంచి బయటకొచ్చిందా

ఇలా మధుర మధురభావాల పుట్టినిల్లు ఆ బొట్టు కదా

ఉదయిస్తున్న భాను బింబం చూస్తే జగన్మాత నుదిటి సింధూరం లా ఉండదూ .పరుచుకున్న ఎరుపు కాంతులు అందరినీ బొట్టు పెట్టుకోమని చెప్పడం లేదూ

స్పందించే మనసుంటె అన్నీ అనుభూతులౌతాయి

బొట్టు పెట్టుకున్న ముఖం ఎంత కళగా ఉంటుంది.

జైహింద్.

Monday, August 26, 2024

గురువాయురప్ప .. గురువాయూరు.

జైశ్రీరామ్. 

గురువాయూరు.

గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారుశ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.

పాతాళశిల!

ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌. మొదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ, తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.

నారాయణీయం!

గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి వ్రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.

భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశంగా మారింది.

అన్నప్రాశన

గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.

గజేంద్ర సేవ!

గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్‌, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్‌ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్‌. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్‌ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు

శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. శ్రీకృష్ణ దేవుడిని 'గురువాయూరప్పన్' అని భక్తిభావంతో పిలుస్తారు. దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి.  

జైహింద్.

Thursday, August 8, 2024

మనం తినే కొన్ని కూరగాయలకు సంస్కృత నామాలు .

ఓం శ్రీమాత్రే నమః. 

మనం తినే కొన్ని కూరగాయలకు సంస్కృత నామాలు .

అవాక్పుష్పీ.... బెండకాయ.

శీతలా.... సొరకాయ.

జంబీరమ్....నిమ్మకాయ.

క్షుద్రశింబి.... గోరుచిక్కుడ.

ఆలుకమ్....బంగాళదుంప.

పలాండు....నీరిల్లి.

ఉర్వారుక....దోసకాయ.

కర్కటీ ....నక్కదోస

కూష్మాండ....గుమ్మడికాయ.

కారవేల్ల....కాకరకాయ.

తృణబిందుక....చేమదుంపలు.

కోశాతకీ.... బీరకాయ.

మూలకమ్....ముల్లంగి.

బృహతీ.... ముళ్ళవంకాయ.

రంభాశలాటు....పచ్చి అరటికాయ.

మరిచకా....మిరపకాయలు.

సూరణ....కంద.

రాజకోశతకీ....బెంగళూరువంకాయ....కాప్సికం.

లశునః....వెల్లుల్లి.

వార్తాకః....వంకాయ.

బింబమ్....దొండకాయ.

సతీనకమ్....అలచందలు

జైహింద్.

Monday, August 5, 2024

మహాభారతములో ఈ తొమ్మిది పాత్రలలో గ్రహింపవలసిన జీవిత సత్యాలు..

జైశ్రీరామ్. 

తొమ్మిది పాత్రలలో మహాభారత సారాంశం.

1 మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే 

కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు.

వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు.

ఉదా. కౌరవులు.

2. నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన 

ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. 

వాటిని అధర్మం కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.

ఉదా. కర్ణుడు

3 యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన 

జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.

ఉదా. అశ్వత్థామ.


 4. పాత్ర తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం 

లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై 

బ్రతకవలసి వస్తుంది.

ఉదా. భీష్ముడు.

5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  

దురహంకారం తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.

ఉదా. దుర్యోధనుడు

6.స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా 

తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే 

వినాశం జరుగుతుంది.

ఉదా. ధృతరాష్ట్రుడు

7. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.

ఉదా. అర్జునుడు.

8. మోసం, కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 

ఉదా. శకుని

9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ 

నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.

ఉదా. యుధిష్ఠిరుడు.

జైహింద్.

శ్రీ ధూళిపాళ హరికృష్ణ భాగవతార్ Dhulipala HariKatha special guest sri chaganti koteswara Rao garu

Sunday, July 21, 2024

"భారత జాతీయ పతాక నేపథ్యం" ... రామకిష్టయ్య సంగనభట్ల, 9440698494.

 "భారత జాతీయ పతాక నేపథ్యం"

20వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్ర్యోద్యమం బాగా ఊపందు కున్నప్పుడు జాతీయోద్యమ స్పూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయ పతాకం అవసరమైంది. 1904లో వివేకానందుడి శిష్యు రాలైన ఐరిష్ వనిత సోదరి నివేదిత భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించింది. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా. జెండా మధ్య భాగంలో వజ్రాయుధం, తెల్ల తామర గుర్తు లున్నాయి. "(భారత) మాతకు వందనం" అనే అర్ధం వచ్చే టెం గాలీ మాటలు (వందేమాతరం)" ఆ జెండా మీదున్నాయి. ఎరుపు స్వాతంత్య్ర పోరాటానికి, పసుపు విజయానికి, తెల్లతామర స్వచ్ఛ తకు చిహ్నాలు. 1907 లో మేడం భికాజీ కామా ఎగరేసిన అండా మొట్ట మొదటి త్రివర్ణ పతాకం 1906లో జరిగిన బెంగాల్ విభజన ను వ్యతిరేకిస్తూ జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో 1906 ఆగష్టు? న కలకత్తాలోని పార్శీబగాన్ స్వేర్లో శవీంద్ర ప్రసాద్ బోస్ దే అవి ష్కరించ బడింది. ఈ పరాకాన్ని 'కలకత్తా పతాకం" అంటారు. ఈపతాకంలో సమాన వెడల్పుతో అడ్డంగా మూడు పట్టీలున్నాయి: పైన నారింజ రంగు, మధ్యలో పసుపుపచ్చ, క్రింద ఆకుపచ్చ. పైపట్టీ మీద సగం విచ్చుకున్న ఎనిమిది తామర పూలు, క్రింది పట్టీ మీద నెలవంక, మధ్యలో దేవనాగరి లిపిలో 'వందే మాత రం" అనే అక్షరాలు ఉన్నాయి. 1917 లో హెూంరూల్ ఉద్య మం లో వాడిన జండా, 1907 ఆగష్టు 22న మేడం బికాజీ కామా జర్మనీలోని స్టుట్గార్ట్లో మరో జండాను ఎగరేసింది. ఈ అందాలో పైన ఆకుపచ్చ, మధ్యన కాషాయం, అడుగున ఎరుపు రంగులు ఉన్నాయి. ఇందులో ఆకుపచ్చ ఇస్లాముకు, కాషాయం హిందూ, బౌద్ధాలకు సూచికలు. ఆకుపచ్చ పట్టీలో బ్రిటిషు భార తంలోని 8 ప్రావిన్సులకు గుర్తుగా 8 పద్మాలు ఉన్నాయి. మధ్య నున్న కాషా య పట్టీలో దేవనాగరి లిపిలో వందేమాతరం రాసి ఉంది. అదు గున ఉన్న పట్టీలో స్థంభానికి దగ్గరగా నెలవంక, రెం డో చివర సూర్యుడు ఉన్నాయి. ఈ జండాను భికాజీ కామా, వీర సావర్కార్, శ్యాంజీ కృష్ణ వర్మలు కలిసి తయారు చేసారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యాక, బెర్లిన్ కమిటీలోని భారతీయ విప్లవకా రులు దీన్ని స్వీకరించాక, ఈజండా బెర్లిన్ కమిటీ జందాగా పేరు పొందింది. మొదటి ప్రపంచయుద్ధకాలంలో మెసొపొటేమియాలో ఈ జండాను విస్తృతంగా ఉపయోగించారు. గదర్పార్టీ జందాను కూడా అమెరికాలో భారతీయ చిహ్నంగా కొన్నాళ్ళ ఉపయోగిందారు. 1917లో తిలక్, అనీబిసెంట్లు హెూంరూల్ ఉద్యమంలో ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చని అడ్డపట్టీలు గల ఇంకొక జెండాను వాడారు. జెండా పైభాగంలో ఎడమవైపు తాము కోరిన డొమినియన్ హెూదాకు సూచికగా యూనియన్ జాక్ గుర్తు, కుడి వైపు తార-నెలవంక గుర్తులను వాడారు. దానికి దిగు వన హిం దువులకు పవిత్రమైన సప్తర్షి మండలానికి గుర్తుగా ఏడు నక్షత్రాలు న్నాయి. యూనియన్ జాక్ ఉండడం వల్లనేమో ఇది జనామోదం పొందలేకపోయింది. 1916లో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య ఒక జాతీయ పతాకాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని గుర్తించిన ఉమర్ సుభాని, ఎస్.బి. బొమ్మన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మిషన్ను ఏర్పాటుచేశారు. వెంకయ్య తాను రూపొందించిన పతాకాన్ని గాంధీజీకి చూపిం దగా, ఆయన దాంట్లో భారతదేశానికీ, దేశం తానెదుర్కొంటున్న సమస్యలనుంచి విముక్తి పొందడానికి చిహ్నం గా నిలిచిన చర (రాట్నము)ను చేర్చమని సలహా ఇచ్చాడు. నిరాడంబరమైన రాట్నము గాంధీజీ నేతృత్వంలో భారతదేశ ఆర్థిక పునరుత్థానానికి ప్రతీకగా నిలిచింది. పింగళి వెంకయ్య గాంధీ సూచన ప్రకారం ఎరుపు-ఆకుపచ్చ రంగు పట్టీలమీద రాట్నము గుర్తును రూపొం దించి చూపాడు. ఐతే అది అన్నిమతాలకూ ప్రాతి నిధ్యం వహిం వేలా లేదని గాంధీ దాన్ని తిరస్కరించాడు. గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇంకొక త్రివర్ణపతాకం పైనుంచి క్రిందకు వరుసగా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపుపట్టీలతో, మూడు పట్టీలమీదుగా ఒకే పెద్ద రాట్నము గుర్తుతో రూపొందించ బడింది. ఆ మూడు పట్టీలు మైనారిటీ మతాలు, ముస్లిం, హిందూ మతాల కు సూచికలు. ఇది అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వాతం త్య్రపోరాటం సాగిస్తోన్న జర్లాండు పతాకాన్ని పోలి ఉంది. ఈపతాకాన్ని అహమ్మ దాబాదు కాంగ్రెసు సమావేశంలో ఆవిష్కరించారు. ఇది కాంగ్రెసు అధికార పతాకం కాకపోయినా జాతీయోద్యమంలో ఎక్కువగా వాడారు. ఐతే ఆ జెండాలో మతా లకు చిహ్నాలుండడం చాలామం దికి నచ్చలేదు. 1924లో కలకత్తాలో సమావేశమైన ఆలిండియా కాంగ్రెస్ హిందువులకు చిహ్నాలుగా కాషాయ రంగును, గడను చేర్చాలని కోరింది. అదే సంవత్సరం హిందూ యోగుల, ముస్లింఫకీర్లు-సర్వేషీల వైరాగ్యానికి చిహ్న మైన జేగురు రంగును చేర్చా అనే ప్రతిపాదన కూడా వచ్చింది. సికులు తమ మత చిహ్నంగా పసుపురంగును కూడా చేర్చాలని, లేనట్టైతే మతపరమైన సూచిక లను పూర్తిగా తొలగించాలని కోరారు. భారత దేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న భారత జాతీయకాంగ్రెసు 1921లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారికంగా ఒక పతాకాన్ని రూపొందించుకొంది. ఎరుపు హిందూ మతానికి, ఆకుపచ్చ ఇస్లాం మఠానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు. కాంగ్రెసు 1931 లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో, మధ్యలో రాట్నము బొమ్మగల పతా కాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలూ లేవు. 1931 లో సూచించ బడిన జెండా ఈపరిణామాల మధ్యకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1931 ఏప్రిల్ 2న ఈ వివాదాలను పరిష్కరించడానికి ఏడుగురు సభ్యులతో ఫ్లాగ్ కమిటీని నియమించింది. "జెండాలోని మూడు రంగులూ మతాలనుద్దేశిం చినవే కాబట్టి అభ్యంతరకర మైన వేనని" కమిటీ తీర్మానించింది. ఫలితంగా పూర్తిగా ఎర్రమట్టి రంగులో, పైభాగాన రాట్నము గుర్తుతో ఒక కొత్త జెండా తయా రైంది. దీన్ని ఫ్లాగ్ కమిటీ ఆమోదించినా ఇది కూడా మతపరమైన భావజాలాన్నే సూచిస్తోందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆమోదించ లేదు. 1931లో, పింగళి వెంకయ్య రూపకల్పన చేసి, 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న భారత జాతీయ కాంగ్రెస్ పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆజాద్ంద్్ఫజ్ వాడిన జెండా అదే సమ యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈపతాకాన్ని స్వల్ప మార్పులతో -దరఖా స్థానంలో "ఆజాద్ హింద్" అన్న అక్షరాలు, ముందుకు దూకుతున్న పులిబొమ్మతో వాడుకొంది. ఈమార్పులు గాంధీ అపా oసాయుత పద్ధతులకు, సుభాష్ చంద్రబోస్ వీరోచిత పద్దతుల కు గల తేడాను ప్రతిబిం బిస్తాయి. ఈ త్రివర్ణపతాకం భారత దేశపు గడ్డమీద మొదటి సారిగా బోస్ చేత మణిపూరులో ఆవిష్కరి ంచ బడింది. స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకాన్ని నిర్ణయిం చడాని రాజ్యాంగసభ, 1947 జూన్23న బాబూరాజేంద్ర ప్రసాద్ అధ్య క్షతన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, కె.ఎం. పణిక్కర్, సరోజినీ నాయుడు, బిఆర్ అంబేద్కర్లతో ఒకకమిటీని నియమించింది. - రామకిష్టయ్య సంగనభట్ల, 9440698494.

Thursday, July 18, 2024

అన్నింటా మనం ముందే. ఇదీ భారతీయుల ప్రతిభ.

 1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.        

2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.     

3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :

పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..    

4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..   

5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..

6. అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..    

7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు +  హిడింబి = ఘటోత్కచుడు..

8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation.       

9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..         

10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?

ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?         

ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది  ఫేక్ అని కొట్టి పడేస్తారు..కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?      

ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..     

కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని ఉనికి ఉండి తీరుతుంది..    

ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..

 భారతీయులారా  మిత్రులారా  మీకు ఇవి తెలుసా?  

భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది  మనమే (ఆర్యబట్ట)

👉భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)

👉ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)

👉 విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)

👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)

👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన  వరాహమిహిరుడు మనవాడే

👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన

వాల్మీకి మహర్షి మనవాడే

👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు

👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు

👉అణువులు గురించి వివరించిన కణాదుడు

👉DNA గురించి చెప్పిన బోధిధర్మ

👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి

👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు

👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని

ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏

Wednesday, July 3, 2024

సూక్తులు

 "ధర్మో రక్షతి రక్షిత:

ధర్మ ఏవో హతో హంతి  - "ధర్మో రక్షతి రక్షిత:" 

తస్మా ధర్మో న హంతవ్యో  - మానో ధర్మో హ్రతోవ్రధీత్ II

ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే, అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !


సత్యమేవ జయతే

సత్యమేవ జయతే నా2నృతం - సత్యేన పంథా వితతో దేవయాన 

యేనా క్రమం తృషయో హాయప్త కామా - యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.


అహింసా పరమో ధర్మః

అహింసా పరమో ధర్మ: తథా2 హింసా పరం

తప: అహింసా పరమం ఙ్ఞానం అహింసా పరమార్జనమ్

భావము.  

అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి జ్ఞానం. గొప్ప సాధన.


II ధనం మూల మిదం జగత్ ||

ధనమార్జాయ కాకుత్థ - ధనం మూల మిదం జగత్

అంతరం నాభి జానామి - నిర్ధనస్య మృతస్య చ ॥

భావము.  

ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా 

ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.


II జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||

అపి స్వర్ణ మయీ లంకా న మే రోచతి లక్ష్మణ ! 

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||

భావము.  

స్వర్ణ మయమైన లంకను చూసి శ్రీరాముడు తన సోదరునితో ఈ విధంగా సోదరా, 

లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. 

ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !


|| కృషితో నాస్తి దుర్భిక్షమ్ ||

కృషితో నాస్తి దుర్భిక్షమ్ జపతో నాస్తి పాతకమ్ |

మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం ||

చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం 

పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే 

దేనికీ భయపడే పని లేదు.


|| యథా రాజా తథా ప్రజా ||

రాజ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, - పాపే పాప పరా: సదా 

రాజాను మను వర్తంతే, - యథా రాజా తథా ప్రజా !

రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే 

రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి 

నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

Saturday, June 22, 2024

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 20

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 19

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 18

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 17

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 16

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 15

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 14

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 13

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 12

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 11

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 10

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 9

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 8

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 7

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 6

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 5

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 4

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 3

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 2

జైశ్రీరామ్.
జైహింద్.

సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 1

జైశ్రీరామ్.
జైహింద్.

Wednesday, May 15, 2024

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

 పురుషుడు ఎలా ఉండాలో ధర్మ శాస్త్రం చెప్పింది..కానీ ఎందుచేతో ఈ శ్లోకం జనబాహుళ్యం లోకి రాలేదు.


కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు

తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
.

Thursday, May 9, 2024

అక్షయతృతీయ విశేషం.

జైశ్రీరామ్.

 🌷అక్షయతృతీయ🌷


అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రం లోనైనా ఉంటే చూపండి . 

వీలైతే బీద వాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. 

అక్షయతృతీయ విశేషం ఏంటి తెలుసుకుందాము.

1.పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, 

వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు

 “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా 

నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

జైహింద్.

అవధాన విద్యా వికాస పరిషత్ మూడవ శిక్షణ శిబిరం. 20 - 5 - 2024వ తేదీ నుండి నిర్వహణ బ్రహ్మశ్రీ మరుమామల దత్తాత్రేయ శర్మ.

 జైశ్రీరామ్.

జైహింద్.

Sunday, May 5, 2024

సప్తస్వరాలు ... వివరాలు.

     భారతీయ సంగీతంలో సప్తస్వరాలు : స, రి, గ, మ, ప, ద, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.

     'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవతం, 'ని ' నిషాధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉండాలన్న నియమం లేదు.

     సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ [మంగళంపల్లి బాలమురళీకృష్ణ] నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని పరిశీలకుల భావన. స్వరాలకు ఆధారం శృతులు., శృతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం) కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.

స = షడ్జమం (నెమలి క్రేంకారం)

రి = రిషభం (ఎద్దు రంకె)

గ = గాంధర్వం (మేక అరుపు)

మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)

ప = పంచమం (కోయిల కూత)

ద = దైవతం (గుర్రం సకిలింత)

ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.

ఉదా: స రి గా మ ప ద ని స.

అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.

ఉదా: స ని ద ప మ గా రి స.

Friday, April 26, 2024

షోడశ సుగుణస్వరూపుఁడు శ్రీరాముఁడు.

 1 – గుణవాన్ / సౌశీల్యం : షరతులు లేకుండా ఉండండి

రాముడు అందరినీ సమానంగా చూసేవాడు. అతను వేటగాళ్ల నాయకుడు గుహ మరియు వానరుల ( కోతుల) రాజు సుగ్రీవుని తన సోదరులుగా అంగీకరించాడు. హనుమంతుడు తన గొప్ప భక్తుడిగా అంగీకరించబడ్డాడు. విభీషణుడు రావణుడి సోదరుడు మరియు రాముడు అతనిని కూడా అంగీకరించాడు - అతని అనుచరులు నిరాకరించినప్పటికీ.


మీరు ఎవరితో పని చేస్తారో మీరు ఎంచుకోలేరు (అలాగే, చాలా ఎక్కువ సార్లు). కాబట్టి మీరు షరతులు లేకుండా అందరినీ అంగీకరించాలి. మీరు అలా చేసినప్పుడు మీరు వారితో మెరుగైన కనెక్షన్‌ని నిర్మించుకోగలుగుతారు, తద్వారా మెరుగైన పని వాతావరణానికి దారి తీస్తుంది. మీరు మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు - గొప్ప కెరీర్ పురోగతిని సాధించడంలో మీకు సహాయపడుతుంది.


2 – వీర్యవాన్ : దృఢంగా ఉండండి

వీర్యవాన్ అంటే బలంగా లేదా దూకుడుగా ఉండటం. అయితే, ఈ అర్థాన్ని అక్షరాలా తీసుకోవడం అనేది తరచుగా చేసే పొరపాటు. రాముడు భీకర యోధుడు మరియు అసాధారణమైన శక్తి మరియు బలాన్ని కలిగి ఉన్నాడు. అయితే, ఆయన వీటిని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. వాస్తవానికి, ఈ ఉగ్రత మొదటి గుణ - సౌశీల్యంతో మిళితం చేయబడింది , ఇది అతనిని దృఢంగా చేసింది.


పని ప్రదేశంలో మీరు రెండు విపరీతమైన వ్యక్తులను చూస్తారు - ఒకరు తీవ్రంగా దూకుడుగా ఉంటారు మరియు మరొకరు సానుభూతితో నిండి ఉంటారు (మరియు చాలా తరచుగా వారు సౌమ్య మరియు బలహీనులుగా భావించబడతారు). ఈ రెండింటి మధ్య సమతూకం అరుదైన విషయం. గొప్పగా విజయవంతం కావాలంటే, మీరు అదే సమయంలో ఉగ్రంగా మరియు సానుభూతితో ఉండే ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. వీర్యవాన్‌గా ఉండడానికి నిశ్చయత కీలకం - అత్యంత శక్తివంతమైనది.


మీరు కార్యాలయంలో మీ దృఢ నిశ్చయత యొక్క ప్రయాణాన్ని ఇక్కడ ప్రారంభించవచ్చు - పనిలో మరింత దృఢంగా ఉండటానికి 6 చిట్కాలు


3 – ధర్మజ్ఞ : నీతిగా ఉండు  

రాముడు ఎప్పుడూ ధర్మాన్ని (ధర్మ మార్గాన్ని) అనుసరించాడు. సరళంగా చెప్పాలంటే, అతను ఎల్లప్పుడూ తన విలువలకు కట్టుబడి ఉంటాడు. అతని రాజ్యాన్ని అజ్ఞాతవాసంలో ఉంచడం లేదా వాలి (సుగ్రీవుని సోదరుడు) మరియు తరువాత రావణుడి రూపంలో ఉన్న చెడును నాశనం చేయడం అంటే – అతని విలువలు ఎప్పుడూ రాజీపడలేదు.


మీరు మీ విలువలకు కట్టుబడి ఉండటానికి మరియు వాటికి వ్యతిరేకంగా వెళ్లడానికి మధ్య ఎంపిక చేసుకోవలసిన పరిస్థితులను మీరు తరచుగా ఎదుర్కొంటారు. తరువాతి వేగవంతమైన వృద్ధి కోసం మిమ్మల్ని ప్రలోభపెట్టవచ్చు. మునుపటిది నెమ్మదిగా పురోగతిగా అనిపించవచ్చు, అయితే మారువేషంలో గొప్ప పురోగతి.


మీరు కార్యాలయంలో వ్యక్తిగత విలువలను కొనసాగించడానికి కష్టపడుతుంటే, ఇది మీకు సహాయం చేస్తుంది – వ్యక్తిగత విలువలు మరియు పని: మరింత సంతృప్తికరమైన పని జీవితానికి 3 దశలు


4 – కృతజ్ఞ : కృతజ్ఞతతో ఉండండి  

రావణుడిని ఓడించిన తరువాత, రాముడు  వానరుల  (కోతులు) సహాయం చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాకుండా, తన అవతారం చివరిలో, శ్రీరాముడు నిస్వార్థ సేవ కోసం హనుమంతుడికి రుణపడి ఉంటాడని కూడా చెప్పబడింది.


మీ సహోద్యోగులతో అనుబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వారు మీకు అందించిన సహాయానికి లేదా బృందానికి వారు చేసిన సహకారానికి మీరు వారిని నిజంగా అభినందించడం అత్యవసరం. మీరు కూడా కృతజ్ఞతతో ఉన్న వ్యక్తులు, ఎల్లప్పుడూ మీ కోసం మరిన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు మీకు సహాయం చేయడానికి తమ మార్గాన్ని అందుకుంటారు. మరియు మీరు లక్ష్యంగా పెట్టుకున్న గొప్ప కెరీర్ పురోగతికి ఇది చాలా ముఖ్యమైనది.  


ఇక్కడ నేను చూసిన అద్భుతమైన పఠనం ఉంది - కార్యాలయంలో సంవత్సరం పొడవునా కృతజ్ఞతా వైఖరి యొక్క ప్రయోజనం


5 – సత్యవాక్యః – నిజమే

రాముడు ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు, సత్యమే తప్ప మరేమీ మాట్లాడడు.


ఒక పరిశోధనలో 60 శాతం మంది వ్యక్తులు పది నిమిషాల సంభాషణలో కనీసం ఒక్కసారైనా అబద్ధం చెబుతారని కనుగొన్నారు. ఇది మీరు చేయగలిగే ఖరీదైన తప్పు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చివరికి మీరు అబద్ధం చెబుతున్నారని తెలుసుకుంటారు మరియు మిమ్మల్ని విశ్వసించడం మానేస్తారు. మీ విశ్వసనీయత ప్రమాదంలో ఉంది. మరీ ముఖ్యంగా ఇది మీకు మేలు కంటే ఎక్కువ హాని చేస్తోంది. ఇది శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. నిజాయితీగా ఉండటం వల్ల ఈ తప్పులను దూరం చేయడమే కాదు, ఇది చాలా సులభం కూడా. ప్రయత్నించి చూడు!


ఇక్కడ ప్రారంభించండి - పనిలో నిజంగా నిజాయితీగా ఉండటానికి 5 పద్ధతులు


6 – దృడవ్రతః : దృఢంగా ఉండండి  

రాముడు వనవాసం చేయడానికి సంతోషంగా అంగీకరించాడు. అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్య బాధ్యతలు స్వీకరించమని కోరడానికి భరత్ వచ్చినప్పుడు, అతను సూటిగా నిరాకరించాడు.


మీ పనిలో సంస్కృతి ఏమైనప్పటికీ, ఇది సాధారణ నియమాన్ని అనుసరిస్తుంది - ఇది నిర్వచించబడిన ఫ్రేమ్‌వర్క్‌లో మీకు మద్దతు ఇస్తుంది మరియు దాని వెలుపల మిమ్మల్ని సవాలు చేస్తుంది. ఇప్పుడు మీకు అద్భుతమైన ఆలోచన ఉండవచ్చు (ఇది నిర్వచించబడిన ఫ్రేమ్‌వర్క్‌లో లేదు) మరియు అది వినడానికి స్థిరత్వం అవసరం. యాజమాన్యాన్ని తీసుకోండి, విషయాలను విమర్శనాత్మకంగా విశ్లేషించండి మరియు మీరు ఏ దశలను తీసుకోవాలో ఖరారు చేయండి. ఒకసారి నిర్ణయించుకుంటే, దానికి కట్టుబడి ఉండండి. హృదయపూర్వకంగా కట్టుబడి ఉండండి. మీ దారిలో ఏమీ రానివ్వండి. మీరు సవాళ్లను ఎదుర్కొంటారు - మీరు మాత్రమే, మీ సంస్థ నిర్వచించిన ఫ్రేమ్‌వర్క్‌ను మార్చలేరు, కానీ మీరు గర్వపడే వ్యక్తిగా ఉండటానికి కృషి చేయండి.  


7 – చరిత్రేణాచ కోయుక్తః : ఆకర్షణీయంగా ఉండండి    

రాముడు నిష్కళంకమైన పాత్ర మరియు ఎటువంటి మచ్చ లేనివాడు.


అంతర్గత ప్రయోజనం, విశ్వాసం, కమ్యూనికేషన్ మరియు వ్యక్తులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం కార్యాలయంలో మీ పాత్రను నిర్మించడానికి అవసరమైనవి. ఈ గుణాలు నేటి కార్యాలయంలో ఖచ్చితంగా ఉండాలి. ఆకర్షణీయంగా ఉండటం కార్యాలయంలో గొప్పగా విజయవంతం కావడానికి కీలకం.


కార్యాలయంలో మరింత ఆకర్షణీయంగా ఉండటానికి, మీరు ఇక్కడ ప్రారంభించవచ్చు – తేజస్సు ఉనికికి సంబంధించిన 3 అంశాలు


8 – సర్వభూతేషు హితః : విముక్తి పొందండి

శ్రీరాముడిని కలిసిన ఆత్మలు ధన్యులు. రాజు అయినప్పటికీ జటాయువు చివరి కర్మలు చేశాడు. అతను ఒక రాయిని ఆడపిల్లగా మార్చాడు, తద్వారా అహల్యను శాపం నుండి విడిపించాడు. అతని కరుణ కథలు పుష్కలంగా ఉన్నాయి.


వ్యక్తుల స్థాయిని పెంచడంలో సహాయపడండి. మీరు మీ గురించి మరియు పనిలో మీ మెరుగుదల గురించి మాత్రమే ఆందోళన చెందుతుంటే, మీరు చిన్న గేమ్ ఆడుతున్నారు. కానీ మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు - మీకు వ్యక్తిగత లాభం లేనప్పటికీ, మీరు వేగంగా ముందుకు సాగాలి.


ఇక్కడ నేను చూసిన ఒక అద్భుతమైన కథనం ఉంది - ఎందుకు ఇవ్వడం మీరు పనిలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది


9 - విద్వాన్ : ఆలోచనా నాయకుడిగా ఉండండి

శ్రీరాముడు అన్ని విషయాలపై పట్టు సాధించాడు. అతనికి అస్త్ర – ఆయుధాలు, (క్షత్రియుడు) మరియు శాస్త్ర – వేదాల జ్ఞానం ఉంది . ఈ విధంగా అతను విద్వాన్ అని సరిగ్గా వర్ణించబడ్డాడు .


నేటి ఆధునిక కాలంలో ఆలోచనా నాయకుడు విద్వాన్ . ఈ రోజుల్లో 'థాట్ లీడర్' అనే పదం ఎక్కువగా ఉపయోగించబడింది మరియు ఇది మరొక బాధించే కార్పొరేట్ బజ్‌వర్డ్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ఎక్కువ. ఆలోచనా నాయకుడు అంటే అతని నైపుణ్యం మరియు దృక్పథం విలువైనది - వ్యక్తులు వారి పురోగతులను సాధించడంలో సహాయపడేంత ఎక్కువ. ఆలోచనాపరులు గతాన్ని చూసి, వర్తమానాన్ని పరిశీలించి, తమ నైపుణ్యంతో భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తారు.


ఆలోచనా నాయకత్వ ప్రయాణాన్ని మీరు ఎలా ప్రారంభించవచ్చో ఇక్కడ ఉంది - మీ పరిశ్రమలో ఆలోచనా నాయకుడిగా మారడానికి 7 దశలు


10 – సమర్థా : సామర్థ్యం కలిగి ఉండండి

రాముడు ఈ లోకంలో ఏదైనా చేయగల సమర్థుడిగా భావించబడ్డాడు. చిన్నతనంలో, అతను తాడక అనే రాక్షసుడిని మరియు ఆమె కుమారులను ఒంటరిగా ఓడించాడు. మిథిలా (ప్రస్తుత నేపాల్) వద్ద, అతను శివ ధనుష్ - శివుని ధనుస్సును ఎత్తాడని చెబుతారు , ఇది ఎవరూ చేయలేని విధంగా సీతాదేవిని వివాహం చేసుకుంది.


మీరు అప్-స్కిల్లింగ్ మరియు సర్టిఫికేట్ పొందడంపై చాలా ప్రాధాన్యతనిస్తారు. టన్నుల కొద్దీ కోర్సులు ఉన్నాయి మరియు సాధారణంగా వారు చేసేదంతా గందరగోళాన్ని పెంచుతుంది. చాలా మంది ప్రజలు నా దగ్గరకు వస్తారు, వారు వేగంగా ముందుకు వెళ్లడానికి వారు ఏ కోర్సులు అభ్యసించాలి అని అడుగుతారు. నేను చిరునవ్వుతో చెపుతున్నాను, మీరు చేయగలిగినదంతా తీసుకోండి - ఏమైనప్పటికీ అవి మీకు ముందుకు రావడానికి సహాయం చేయవు! ధృవపత్రాలు లేదా సంపాదించిన జ్ఞానం మీకు ముందుకు రావడానికి ఎప్పుడూ సహాయపడవు. కస్టమర్ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించడం. కాబట్టి కేవలం నేర్చుకోకండి - సామర్థ్యం కలిగి ఉండండి.


11 – ప్రియదర్శనః : ప్రజంటబుల్ గా ఉండండి

శ్రీరాముడు ఆజాను బాహుమ్ మరియు అరవింద లోచన అని వర్ణించబడ్డాడు , అంటే పొడుగ్గా, చక్కగా నిర్మించబడ్డాడు మరియు అందమైనవాడు. ఆయనను చూస్తే మైమరచిపోతారు. అతని అందం అలాంటిది.


పుస్తకం ఎల్లప్పుడూ కవర్ ద్వారా నిర్ణయించబడుతుంది. ఆకర్షణీయమైనది అమ్మబడుతుంది. అలాగే వ్యక్తులు ప్రెజెంట్‌బుల్‌గా ఉన్న వారితో కనెక్ట్ అవ్వడానికి మరియు పని చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి మీపై పని చేయండి - కేవలం భౌతిక రూపాన్ని మాత్రమే కాకుండా మీ అంతర్గత శ్రేయస్సుపై కూడా పని చేయండి.


12 – ఆత్మవాంకహ : ఆధ్యాత్మికంగా ఉండండి

రాముడు ఆధ్యాత్మిక గురువు. అతను ఆత్మ యొక్క ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు - అంతర్గత ఆత్మ.


ఇటీవలి అధ్యయనాలు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి పనిలో మెరుగ్గా నిమగ్నమై ఉంటారని మరియు తద్వారా మరింత సమర్థవంతంగా ఉంటారని తేలింది. ఆధ్యాత్మికత అనేది కార్యాలయంలో ఎదుగుదలకు అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలతో కలిసి ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆధ్యాత్మిక వృద్ధిలో పెట్టుబడి పెట్టడం అత్యవసరం.


13 – జితక్రోదహ : ప్రశాంతంగా ఉండండి

రావణుడు స్వతహాగా పండిత బ్రాహ్మణుడు. అతడు పరమ శివ భక్తుడు. శివుడు తన ఆత్మలింగంతో రావణుడిని ప్రసాదించినంత వరకు అతను తన భక్తితో శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు కూడా పూజింపబడేది శ్రీరాముడే మరియు భీకరమైన పరిస్థితులలో కూడా రాముడు ప్రశాంతంగా ఉండగలగడం మాత్రమే తేడా. రాముడు కోపంతో సహా తన భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడని చెప్పబడింది.


మీ కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. కోపం మీ ఆలోచనా సామర్థ్యాన్ని తీసివేస్తుంది మరియు భావోద్వేగాల ఊపులో మీరు మీరే కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తారు. ఎమోషనల్ కోషియంట్ (EQ) అత్యంత అవసరమైన నైపుణ్యంగా రేట్ చేయబడింది మరియు ఇంటెలిజెన్స్ కోషియంట్ (IQ)ని అధిగమించింది.


ఇక్కడ ప్రారంభించడానికి సులభమైన మార్గం ఉంది - మీ భావోద్వేగ మేధస్సును అభివృద్ధి చేయడానికి 5 మార్గాలు


14 – ద్యుతిమాన్ : ప్రకాశవంతంగా ఉండండి   

హనుమంతుడు రాముడి ముఖంపై కన్ను వేసిన క్షణం, అతను కదిలినట్లు భావించాడు. అతని ఎముకలు కరిగిపోతున్నాయి, అతని శరీరమంతా గూస్ గడ్డలు అనిపించాయి మరియు అతని కళ్ళ నుండి ఆనందం మరియు ప్రేమ యొక్క కన్నీళ్లు స్వయంచాలకంగా ప్రవహించడం ప్రారంభించాయి. ఇది తేజస్ లేదా తేజస్సు.


ప్రభావం కొత్త కరెన్సీ. మీరు ఎవరితో సంబంధం లేకుండా లేదా మీరు ఎక్కడ పని చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సమర్థవంతంగా పని చేయడం మరియు మీ కెరీర్ వృద్ధికి ఇది చాలా ముఖ్యమైనది.


పనిలో మరింత ప్రభావవంతంగా ఉండటానికి ఇక్కడ ప్రారంభించండి - పనిలో మరింత ప్రభావవంతంగా మారడానికి 8 గేమ్-మారుతున్న వ్యూహాలు


15 – అనసూయకహా : మెచ్చుకోదగినదిగా ఉండండి

రాముడు స్వీయ మరియు భావోద్వేగాలపై చాలా బలమైన నియంత్రణ కలిగి ఉన్నాడు. కాబట్టి, అతను ఎవరిపైనా అసూయపడలేదు లేదా ఎవరినీ చూసి అసూయపడలేదు. అతను దురాశకు దూరంగా ఉన్నాడు.


మరింత ప్రభావవంతంగా ఉండటానికి, మీరు మెచ్చుకోవాలి. మరియు లేదు, నేను ఇక్కడ చరిష్మా గురించి మాట్లాడటం లేదు. నేను ఈర్ష్య, అసూయ లేదా అత్యాశతో ఉండకూడదని సూచిస్తున్నాను. తక్కువ పని చేసే వ్యక్తికి ఎక్కువ జీతం లభిస్తుంది - ఇది సాధారణ తొట్టి మరియు అసూయ, అసూయ లేదా దురాశకు అత్యంత సాధారణ కారణం. ఈ లక్షణాలు మీకు ఎక్కువ జీతం ఇవ్వవు. కానీ వ్యక్తి మీ కంటే మెరుగైనది ఏమిటో అర్థం చేసుకోవడం మరియు దానిని అమలు చేయడం. మరియు అవును - ఇది సాంకేతిక నైపుణ్యాలు కాదు.


16 – బిభ్యతి దేవా : భయపడండి  

యుద్ధ సమయంలో, రావణుడు దాడి చేసినప్పుడు, శ్రీరాముడు ఓపికగా ఉన్నాడు - కోపానికి దూరంగా ఉన్నాడు. అయితే, రావణుడు హనుమంతునిపై దాడి చేసిన క్షణంలో, రాముడు చాలా కోపంగా ఉన్నాడు మరియు యుద్ధంలో రావణుడితో యుద్ధం చేయడం ప్రారంభించాడు మరియు చివరికి అతన్ని ఓడించాడు. రాముడు తనను దుర్భాషలాడినప్పుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు, కానీ తన భక్తుడు ఉన్నప్పుడు అతను చేసాడు మరియు అతను ప్రపంచంలోని అన్ని జీవులచే భయపడ్డాడు.    


ఎవరైనా మీకు హాని చేసినప్పుడు మీరు కోపంగా ఉండకూడదు, కానీ అదే సమయంలో ఇతరులకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు సహించకూడదు. కార్యాలయంలో, నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు సాధారణంగా ప్రయోజనం పొందుతారు. ప్రయోజనాన్ని పొందుతున్న వారితో చేరడం అత్యంత సాధారణ ప్రతిస్పందన. బదులుగా, మీరు బాధితులైన వారి పక్షాన ఉండాలి.


అన్నింటినీ సంగ్రహించడం -

సరళమైనది, కాదా? కానీ చెప్పడం కంటే సులభం.


అవును, 16 శ్రేష్ఠమైన లక్షణాలు విపరీతంగా అనిపించవచ్చు. మీరు వాటిని ఒకేసారి అభివృద్ధి చేయలేరని మీరు అర్థం చేసుకోవాలి. సమయం పడుతుంది. మీరు కెరీర్ పురుషోత్తం కావడానికి ప్రతిరోజూ చిన్న చిన్న అడుగులు వేయడం ప్రారంభించాలి .