Thursday, April 27, 2017

ఆస్తి పన్ను చెల్లించ వలసి యున్నవారు ఈరోజు, రేపటిలో చెల్లించినచఁ గలిగితే 5% రాయితీ మిహాయింపఁ బడుతుంది.

 జైశ్రీరామ్
ఆర్యులారా! భాగ్యనగర (హైదరాబాదు) మహా పురపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించ వలసి యున్నవారు ఈరోజు, రేపటిలో చెల్లించినచఁ గలిగితే 5% రాయితీ మిహాయింపఁ బడుతుంది. అశ్రద్ధ వీడి ఈవేళ రేపట్లో పన్నులు చెల్లించడం ద్వారా ఆరాయితీని పొందుదాం మనం.
జైహింద్.

ఔదార్యంతో ఇహ పర సౌఖ్యాలు పొందవచ్చును.

  జైశ్రీరామ్.
ఆర్యులారా! ఉదార గుణ సంపన్నులారా! మానవత్వం పరిమళించే మహనీయులారా! భగవంతుఁడు మీ సత్ సంపదను ఉదార గుణ సంపదను నిరంతరమూ ద్విగుణీకృతము చేయుచుండును గాక.
దరిద్రాన్ దీయతే దానం తద్దానం ఉత్తమోత్తమమ్.
కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రష్ట్ సంరక్షణలో ఉన్న అనాథ స్త్రీ దేవతామూర్తుల పోషణకు 
మీకు చేతనైనంత చేయూతనందించండి. 
నిధులను నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెండి. 
సాంఘిక సంక్షేమ శాఖ నిధులను పంపునట్లుగా చేయగలిగినది చెయ్యండి. 
మీరు లేఖల రూపంలో ఈ పని చేయవచ్చు. 
వ్యక్తిగత సామర్ధ్యంతో చేయఁగలిగినది చేయవచ్చు. 
ఆర్థిక సహాయం నేరుగా అందించవచ్చు. 
ఈ నా విన్నపమునకు సహృదయంతో స్పందించి సహకరించ బోవుచున్నందులకు 
మీకు నా కైమోడ్పులు.
సహాయం చెయ్యాలనుకునే వారు ఆశ్రమ ఇంచార్జ్ సుశీలగారు
సెల్ నెంబర్ :9652866968 లేండ్ నెంబర్ 0883 2458802 ను సంప్రదించండి.
ఆ.వె. దేవుఁడిలను మిమ్ము దీవించు గావుత!
ధనము గుణము శుభము ఘనము నిడుత!
నాథు లగుచు మీరనాథ దరిద్ర నా 
రాయణులను గాచి ప్రబలు గాత!
జైహింద్.

Saturday, April 15, 2017

సంస్కృతభాష అభ్యసించాలనుందా?సంస్కృతంలో భాషించాలనుందా?

 జైశ్రీరామ్.
సంస్కృతభాష అభ్యసించాలనుందా?సంస్కృతంలో భాషించాలనుందా? 
ఐతే ఈ వీడియో శ్రద్ధగా విని అభ్యసించఁ గలరు.

ఈ భాగం మీరు పూర్తిగా నేర్చుకున్నవారు రేపటి పాఠంలో మరిన్ని అంశాలు నేర్చుకో వచ్చును.
జైహింద్.