*గుండెపోటు* ️
Monday, September 30, 2024
గుండె....జాగ్రత్తలు
Sunday, September 29, 2024
Wednesday, September 18, 2024
తర్పణం ఎలా వదలాలి?
తర్పణం ఎలా వదలాలి?
ముఖ్య గమనిక తండ్రి బతికి ఉంటే పితృ తర్పణాలు చేయరాదు!
కావలసిన సామగ్రి:
దర్భలు,నల్ల నువ్వులు, తడిపిన తెల్ల బియ్యం, చెంబులో మంచినీరు (ఆర్ఘ్య పాత్ర)
పంచ పాత్ర (ఆచమన పాత్ర ఉద్దరిణి అరివేణం)
తర్పణం విడవడానికి పళ్ళెం
చిటికెడు గంధం
కూర్చోడానికి ఆసనం
యజ్ఞోపవీతం ధరించు విధానములు
"సవ్యం ఎడమ భుజం మీదుగా కుడివైపున కి వచ్చేది .
"నివీతి దండలాగా మెడలో నుండి పొట్టమీద వేసుకునేది.
"ప్రాచీనావీతీ కుడిభుజం మీదుగా ఎడమవైపున కి వచ్చేది.
శివాయ గురవే నమః.
శుచిః తమలపాకు తో తలమీద నీళ్ళు చల్లుకోవాలి
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షమ్ సబాహ్యాభ్యాంతరః స్సుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష
ప్రార్ధనా 'నమస్కారం చేస్తూ ఇవి చదవండి.
ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా .
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ఆచమ్యా - ఆచమనం చేయండి.
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
అని మూడుసార్లు నీరు తీసుకోండి
ఓం గోవిందాయ నమః అని చెప్పి చెయ్యి కడిగి
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హ్రుషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రధ్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
నారసింహ య నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ క్రిష్ణాయ నమః .
పవిత్రం:
ఓం పవిత్రవంతః పరివాజ మాసతే పితైషాం ప్రత్నో అభి రక్షతి వ్రతమ్ !
మహాస్స ముద్రం వరుణస్థిరో దధే ధీరా ఇచ్ఛేకుర్ధ రుణేష్వారభమ్ !!
పవిత్రం తే వితతం బ్రాహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః!
అతప్తతనూర్న తదామో అశ్నుతే శ్రతాస ఇద్వహన్తస్తత్సమాశత!!
పవిత్రం ధ్రుత్వా - (పవిత్రం ధరించండి )
భూతోచ్ఛాటనం -
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
అక్షింతలు మీ వెనక్కి వేయండి.
ప్రాణాయామం -
ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం జనః, ఓం తపః, ఓగ్ సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతీ రసోమ్రుతం బ్రహ్మ భూర్భువస్సవరోమ్
మూడు సార్లు అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి
సంకల్పం -
అక్షింతలు చేతిలో పట్టుకోండి
శ్రీ గోవింద గోవింద గోవిందా
శ్రీ మహా విష్ణోరాజ్నాయ ప్రవర్తమానశ్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భారత వర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీసైలశ్య ----- ప్రదేశే ------- నధ్యో పుణ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ---- నామ సంవత్సరే ----- ఆయనే ---- ఋతౌ ----- మాసే ---- పక్షే ---- తిధౌ ---- వాసరే శ్రీ విష్ణు నక్షత్రే శ్రీ విష్ణు యోగే శ్రీ విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం పుణ్యతిధౌ !
ప్రాచీనావీతీ.
అస్మత్ పిత్రూనుద్దిశ్య అస్మత్ పిత్రూణాం పుణ్యలోకా వాప్త్యర్ధం పిత్రు తర్పణం కరిష్యే.
సవ్యం -
(నీరు తీసుకుని అక్షింతలు అరివేణం లో విడవండి)
నమస్కారం చేయండి -
ఈశానః పిత్రు రూపేణా మహాదేవో మహేశ్వరః !
ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః!!
దేవతాభ్యః పిత్రుభ్యశ్చ మహా యోగిభ్య ఏవచ!
నమః స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమోనమః!!
మంత్రం మధ్య క్రియా మధ్యే విష్ణోః స్పురణ పూర్వకం !
యత్కించిత్ క్రియతే కర్మతత్కోటి గుణితం భవేత్!!
విష్ణు ర్విష్ణు ర్విష్ణుః.
దక్షిణం వైపు తిరిగి కూర్చోండి.
ఆర్ఘ్యపాత్ర-
ఆర్ఘ్యపాత్రయోః అమీగంధాః
(ఆర్ఘ్యపాత్రలో గంధం వేయండి)
పుష్పార్ధా ఇమే అక్షతాః
(ఆర్ఘ్యపాత్రలో అక్షింతలు వేయండి)
అమీ కుశాః
(ఆర్ఘ్యపాత్రలో ఒక దర్భ వేయండి)
సవ్యం - నమస్క్రుత్య
ఓం ఆయంతునః పితరస్సోమ్యా స్సోగ్నిష్వాత్తాః
పధిబిర్దేవ యానైః!
అస్మిన్ యజ్ఞే స్వధయా మదం త్వధి బ్రవంతు తే అవంత్వ స్మాన్ !!
ఇదం పిత్రుభ్యో నమో అస్త్వద్య యే పూర్వాసో య ఉపరాస ఈయుః!
యే పార్ధివే రజస్యా నిషత్తా యే వా నూనం సువ్రుజనాసు విక్షు!!
పిత్రు దేవతాభ్యో నమః !
ఓం అగచ్ఛంతు మే పితర ఇమం గ్రుహ్ణాంతు జలాం జలిమ్!
(పళ్ళెంలో ఒక దర్భ పెట్టండి)
ప్రాచీనావీతీ -
సకలోపచారార్ధే తిలాన్ సమర్పయామి
(నల్ల నువ్వులు పళ్ళెంలోని దర్భమీద వేయండి)
పిత్రాది తర్పణం -
కుడి బొటనవేలు కి నల్ల నువ్వులు అద్దుకుని పిత్రు తీర్థము గా మూడేసి సార్లు విడవండి.
*బ్రాహ్మణులు కి శర్మాణం, క్షత్రియులకు వర్మాణం, వైశ్యులకు గుప్తం *
గతించిన వారికే చేయండి సజీవులకు చేయవద్దు**
"ప్రాచీనావీతీ"
తండ్రిగారు -
అస్మత్ పితరం -- గోత్రం -- మనిషి పేరు --- శర్మాణం
వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
తండ్రి యొక్క తండ్రిగారు పితామహాం(తాత గారు)
అస్మత్ పితామహాం --- గోత్రం --- శర్మాణం రుద్ర రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
అస్మత్ ప్ర పితామహం తండ్రి యొక్క తండ్రిగారి తండ్రి గారు (ముత్తాత గారు)--- గోత్రం --- శర్మాణం ఆదిత్య రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
తల్లిగారు -
అస్మత్ మాతరం --- గోత్రాం --- దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి
తండ్రి యొక్క తల్లి గారు -
అస్మత్ ప్రపితామహీం ---- గోత్రాం దాం ఆదిత్య రూపాం నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
తండ్రి యొక్క మారు భార్య -( సవతి తల్లి)
* సవతి తల్లి ఉండి గతించినట్లైతే ఇది చేయండి**
అస్మత్ సాపత్నీ మాతరం --- గోత్రాం --- దాం వసు రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(తల్లి యొక్క తండ్రిగారు)
అస్మత్ మాతా మహం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి తర్పయామి
తల్లి యొక్క తండ్రిగారి తండ్రి గారు
అస్మత్ మాతుః ప్ర పితామహం --- గోత్రం --- శర్మాణం రుద్ర రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
తల్లి యొక్క తండ్రిగారి తండ్రి గారి తండ్రి గారు_
అస్మత్ మాతుః ప్ర ప్రపితామహం -- గోత్రం -- శర్మాణం స్వధా ఆదిత్య రూపం నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
తల్లి యొక్క తల్లి గారు -
అస్మత్ మాతా మహీం --- గోత్రం --- దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
తల్లి యొక్క తల్లి గారి అత్త గారు
అస్మత్ మాతుః పితామహీం --- గోత్రాం -- దాం రుద్ర రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
అస్మత్ మాతుః ప్ర ప్రపితామహీం (తల్లి యొక్క అమ్ముమ్మ, మరియు తాతమ్మ )-- గోత్రాం --దాం-- ఆదిత్య రూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
** ఈ క్రింది తర్పణాలు వివాహం జరిగిన వాళ్ళు మాత్రమే ఇవ్వ వలెను.
(స జీవులకు ఇవ్వరాదు)
(భార్య)
అస్మత్ ఆత్మ పత్నీం -- గోత్రం --దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(కుమారుడు)
అస్మత్ సుతం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(సోదరుడు)
అస్మత్ భ్రాతరం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(పెదతండ్రి ," జ్యేష్ట "పినతండ్రి "కనిష్ట ")
అస్మత్ జ్యేష్ట, కనిష్ట పిత్రువ్యం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(మేనమామ)
అస్మత్ మాతులం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(కూతురు)
అస్మత్ దుహితరం --- గోత్రాం ---దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(తో బుట్టువు)
అస్మత్ భగినీం -- గోత్రాం --దాం-- వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(కూతురు కొడుకు, మనుమడు)
అస్మత్ దౌహిత్రం -- గోత్రం --దాం శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(మేనల్లుడు)
అస్మత్ భగినేయకం -- గోత్రం --దాం శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి .
( మేనత్త)
అస్మత్ పిత్రుష్వసారం --- గోత్రాం --దాం-- వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(పెదతల్లి, జ్యేష్ట పినతల్లి కనిష్ట)
అస్మత్ జ్యేష్ట/కనిష్ట మాత్రుష్వసారం ---గోత్రాం--- దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(అల్లుడు)
అస్మత్ జా మాతరం --- గోత్రాం --- దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(తో బుట్టువు భర్త)
అస్మత్ భావుకం -- గోత్రం --దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(కోడలు)
అస్మత్ స్నుషాం --- గోత్రం --దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(భార్య యొక్క తండ్రిగారు)
అస్మత్ శ్వసురం --- గోత్రం --- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(భార్య యొక్క తల్లి గారు)
అస్మత్ శ్వస్రూం --- గోత్రాం -- దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(బావమరిది లు)
అస్మత్ శ్యాలకం --- గోత్రం --దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(ఆచార్యులు)
అస్మత్ స్వామినం/ ఆచార్యం -- గోత్రం -- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(బ్రహ్మోపదేశం చేసిన గురువు గారు)
అస్మత్ గురుం --- గోత్రం -- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
(తర్పణం కోరిన వారు)
అస్మత్ రిక్ధినం --- గోత్రం -- శర్మాణం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి.
పితృ దేవతాభ్యో నమః !
సుప్రీతో భవతు !
కుశోదకం
"ప్రాచీనావీతీ "
ఏషాన్నమాతా న పితా న బన్ధుః నాన్య గోత్రిణః !
తే సర్వే త్రుప్తి మాయాన్తు మయోత్ర్స్ ష్ట్త్ కుశోదకైః
త్రుప్యత త్రుప్యత త్రుప్యత త్రుప్యత త్రుప్యత !!
కొన్ని పువ్వులు పళ్ళెం లోని దర్భ చేతిలోకి తీసుకుని చెంబులో నీరు పిత్రు తీర్ధంగా పళ్ళెంలో విడవండి .
దర్భ కూడా విడిచిపెట్టి చేతికి నువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి.
నిష్పీడనోదకం
"నివీతీ"
యేకేజాస్మత్ కులే జాతాః అపుత్రాః గోత్రిణోమ్రుతాః !
తేః గ్రుహ్ణాంతు మయాదత్తం వస్త్ర నిష్పీడనోదకమ్!!
(జంధ్యం దండలా వేసుకోండి బ్రహ్మ ముడుల మీద నీరుపోసి తడిపి పిండి కళ్ళకు అద్దుకోండి )
సమర్పణం -
సవ్యం -
కాయేన వాచా మనసైంద్రియైర్వా ఋద్ధ్యాత్మ నావా ప్రక్రుతే స్స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి !!
నమొ బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ!
జగద్ధితాయ క్రిష్ణాయ గోవిందాయ నమో నమః !!
పవిత్రం విస్రుజ్య
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు !
ఇప్పుడు ఋచి ప్రజాపతి రచించిన పిత్రు స్తోత్రం పారాయణ చేయండి.
హర హర మహాదేవ శంభో శంకర
శివ సంకల్పమస్తు శుభమస్తు.
Sunday, September 8, 2024
సప్త చిరంజీవులు.
జైశ్రీరామ్.
సప్త చిరంజీవులు.
శ్లో. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥
వివరణ.
శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు
వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి
లోకహితముకై వ్యాసుడు
శ్రీరామభక్తితో హనుమంతుడు
రామానుగ్రహమువలన విభీషణుడు
విచిత్రజన్మము వలన కృపుడు
ఉత్క్రుష్టతపోధనుడైన పరశురాముడు
సప్తచిరంజీవులైరి ।
వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని
ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై
శతాయుష్మంతులౌతారని ఈ శ్లొకతాత్పర్యము.
జైహింద్.
Thursday, September 5, 2024
గణపతి పాట. రచన, సంగీతం,గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.
Tuesday, September 3, 2024
“మాయదారి...” డా. పేరి రవికుమార్ గారి కొత్త కథ
జైశ్రీరామ్.
“మాయదారి...”
బృందావనంలో గాలి మందగించింది. చడీ చప్పుడు లేకుండా ప్రవహిస్తోంది యమునా నది.
పగలు రాత్రి కూడా కళకళలాడుతూ త్రుళ్ళిపడే ఊరు మొత్తం నిశ్శబ్దంగా కనబడుతోంది
అందరూ ఎవరి పనులలో వారు ఉన్నారు. కాని, మొత్తంగా ఏదో గుబులు మేఘం కమ్ముకున్నట్లు అవుతోంది.
అవును మరి, ఎందుకు కాదు? కారణమా తెలియదు. అప్పటికి ఒక వారం దినాలు అయి ఉంటుంది. ఏ అల్లరి చేయక కృష్ణుడు బుద్ధిగా ఉన్నాడాయె. ఎవరైనా అల్లరి చేస్తే కష్టంగా ఉంటుంది. కాని, కృష్ణుడు అల్లరి చేయకుంటే నష్టంగా అనిపిస్తోంది.
యశోద మాత్రం సంతోషంగా ఉంది. కృష్ణుడు పొద్దుటనే, లేపకుండానే నిద్ర లేస్తాడు. అమ్మ పెట్టిన వెన్ననే తింటాడు. చద్ది మూట కట్టుకుని, ఆవులను తీసికొని వెళ్ళి, సాయంకాలం ఇంటికి చేరుకుంటాడు. ఇక ఎక్కడికి పోడు. పెందలకడనే అన్నం తిని పడుకుంటాడు. రాత్రి మధ్యలో ఎప్పుడు చూసినా తన పక్కలోనే ఉంటాడు. అలుక, అల్లరి లేవు. ఇంటి మీదకు తగవులు లేవు. యశోదకు సంతోషమే కదా.
కాని ఇంకెవరికీ అలాగ లేదు. ఏ ఇంట్లో చూచినా వెన్న కుండలు అలానే ఉంటున్నాయి. పెరుగు కుండలు పగలట్లేదు. కృష్ణునితో తిరిగే పిల్లలు కూడా నెమ్మదిగా ఉంటున్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. అందరూ తేలికపడాలి. అయినా ఎందుకో బరువుగా అనిపిస్తోంది. ముందు రెండు దినాలు బాగుంది. తరువాత అసంతృప్తి మొదలైంది. ఇలా బాగా లేదని ఒకరు అన్నారు, ఆ మాట క్రమంగా వ్యాపించింది. ఇప్పుడు అందరికీ అలాగే అనిపిస్తోంది.
ఆవులు సరిగా పాలు ఇవ్వటం లేదు. కుండల వంటి పొదుగులతో కుండల నిండుగా పాలు ఇచ్చేవి. ఇప్పుడు ఏమిటో తగుమాత్రంగా ఇస్తున్నాయి.
అత్తలకు తమ కోడళ్ళ గురించి చింతలేదు. రాత్రుళ్లు ఇంటి పట్టున ఉంటున్నారు అని. కోడళ్ళు మాత్రం దిగులుగా ఉన్నారు. వారి కారణం వారికి ఉంది.
రాత్రుళ్లు దొరలిపోతున్నాయి నిశ్శబ్దంగా. వేణుగానం వినబడుట లేదు. హృదయం వెలితిగా, బరువుగా అనిపిస్తోంది.
కామన్నగారి బొవ్వప్పకు కూడా తెలియని చిరాకుగా ఉంది. ఆవిడ అసలు పేరు ఎవరికీ తెలియదు. ఏనాడో కాలం చేసిన ఆమె పెనిమిటికి తెలుసునేమో. అందరూ ఆమెను బొవ్వప్ప అనే అంటారు. ఆవిడ నోరు విప్పితే నాలుగు వీధులు వినబడాలి. అంత ధాటీగా లంకించుకుంటుంది. అదెందుకో కాని, ఆ ఇంట్లో కృష్ణుడు ఎక్కువగా అల్లరి చేస్తాడు.
ప్రతిదినం పొద్దుట బొవ్వప్ప తన ఇంటి అరుగు మీద నిలబడటం, అరవటం. ఆమె ఎప్పుడూ యశోద ఇంటి మీదకు పోదు. తన గుమ్మంలో నిలబడి, గొంతు పెద్దగా చేయటమే. తన మాటలు వినబడతాయి అని లేదా విన్నవారు యశోదకు చెప్తారు అని నమ్మకం. ఆవిడ ఎప్పుడూ, మిగిలిన పిల్లకాయలను ఏమీ అనదు. 'వానితో తిరిగి చెడిపోతున్నారు పాపం' అంటుంది. కృష్ణుని మీదనే అన్ని తిట్లూ. 'మాయదారి సంత' అని ఒక మాట చివర్లో తగిలిస్తుంది.
అవును మరి, కృష్ణుడు చేసే పనులు అలాగే ఉంటాయి.
ఒకనాడు చిట్టి బూరెలు చేసింది బొవ్వప్ప. కొడుకు, కోడలు, తను, ముగ్గురే ఇంట్లో. అయినా హెచ్చుగానే చేసి, చిన్న గంపలో పెట్టి అటకమీద దాచింది. ముందు జాగ్రత్త అనుకున్నది కాబోలు. మధ్యాహ్నం ఒక కునుకు తీసి లేచేసరికి, ఇంటి ముంగిట కృష్ణుడు.
"బూరెలు తియ్యగా ఉన్నాయి" అంటున్నాడు.
ఉలిక్కిపడి, ఆశ్చర్యపడి, గభాల్న లేచి అటకమీద గంప తీసి చూచింది. మూడంటే మూడే ఉన్నాయి.
"హారినీ, పగలు కూడా వస్తున్నావూ" అని గొంతు పెంచింది.
"తియ్యగా" అంటున్నాడు కృష్ణుడు.
'నువ్వే ఇచ్చి ఉంటావు' అన్నట్లు కోడలి వైపు చూచింది.
అత్తగారి భారీ విగ్రహం ముందు బక్క పలుచని కోడలు భయంగా నిలబడి, 'కాదు' అన్నట్లు తలాడించింది.
"తియ్యగా" అంటున్నాడు కృష్ణుడు.
మరింత ఆశ్చర్యం, "అదేమిటి, నేను కారం బూరెలు చేస్తే" అని బొవ్వప్ప గొంతు తడబడుతోంది.
"నాకోసం నైవేద్యంగా పెట్టే ఉంటావు అన్ని బూరెలు. ప్రసాదంగా నీకు మూడు మిగిల్చానులే బొవ్వప్పా ! " అన్నాడు కృష్ణుడు తీపి గొంతుకతో.
"ఏవిటీ నైవేద్యం, ప్రసాదం అంటూ. పైగా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు బొడ్డూడని గుంటడివి" బొవ్వప్ప గొంతులో మాత్రం కారం వినబడుతోంది.
పకపకమని నవ్వాడు కృష్ణుడు,"నాకు బొడ్డూడితేనే అన్నీ పుట్టుకు వచ్చాయి తెలుసా" అన్నాడు.
ఆ నవ్వులో క్షణకాలం అంతా మరచింది బొవ్వప్ప.
తేరుకొని చూస్తే, కృష్ణుని వైపు పరవశంగా చూస్తోంది కోడలు.
అప్రయత్నంగా ఒక బూరె తీసి నోట్లో వేసుకుంటే, తియ్యగానే ఉంది.
'బెల్లప్పాకం పట్టుకొచ్చి కలిపేసి మరీ తినేసాడు గావాల్ను' అని గొణుక్కుంది.
"మళ్లీ చేసినప్పుడు వస్తాలే" అని పరుగెత్తాడు కృష్ణుడు.
బొవ్వప్ప ఏం చేస్తుంది? మిగిలిన రెండు కూడ నోట్లో వేసుకుంది. తియ్యగా రుచిగా ఉన్నాయి.
కోపం, ఆశ్చర్యం పెరిగిపోయాయి. అరుగు మీద నిలబడి రెండు ఘడియలు తిట్టిపోసింది. "మాయదారి సంత" అని ముగించింది.
యశోదమ్మ చెవికి సోకదూ. అప్పటికి ఇల్లు చేరాడు కృష్ణుడు.
"ఏరా కృష్ణా, నన్ను అడిగితే అవేవో నేను చేయనూ, చూడు ఎలా తిడుతోందో" అన్నది.
"బొవ్వప్ప నోరు చెడ్డది కాని చెయ్యి మంచిదే అమ్మా. బాగా రుచిగా చేస్తుంది. నా కోసమే అన్ని చేసింది" అని నవ్వాడు కృష్ణుడు.
ఆ నవ్వు చూస్తే అన్నీ మరచిపోతుంది యశోద.
బొవ్వప్ప మాత్రం ఏదీ మరచిపోదు. ఒకటి జరిగినప్పుడల్లా పాతవి అన్నీ తలచి ఏకరువు పెడుతుంది.
అలాగ బొవ్వప్పకు నోరు చేసుకునే అవకాశం ఇస్తాడు కృష్ణుడు.
ఇప్పుడు బొవ్వప్ప నోటికి పనిలేనట్లు అయింది. గంపలు, కుండలు అన్నీ పెట్టినవి పెట్టిన చోటనే ఉంటున్నాయి నిండుగా.
మంచిదే కదా, కాని కానట్లు ఉంది. ఏమీ తోచట్లేదు బొవ్వప్పకు. ఏదైనా వండబోతే, 'చాలులే మన ముగ్గురికి అంతంత ఎందుకు' అని గదమాయిస్తోంది. ఊరకే అరుగు మీద కూర్చుంటుంది. ఇంటి లోపలికి బయటకు తిరుగుతుంది.
అత్తగారి అవస్థను చూసినా ఏమీ అనదు కోడలు. ఆమె దిగులు ఆమెకు ఉంది.
బొవ్వప్ప మునుపటిలా నిద్రలో ఏ అలికిడి విన్నా, వెంటనే లేచి చూడట్లేదు. అసలు సరిగా నిద్ర పట్టడం లేదు. ఏమిటో ఊపిరి ఆడనట్లు ఉంది.
చంపావతికి ఊపిరి తీసుకోవటమే బరువుగా ఉంది. రాత్రి నిశ్శబ్దంగా కదలకుండా ఉంది. తన ఒంటరితనాన్ని పరిహసిస్తున్నట్లు రాత్రి, వెన్నెలతో నవ్వుతోంది.
కృష్ణుడు ఎక్కడ అని ప్రతిరేయి వెదుకులాట. అదే మధురం అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు వెదకనక్కర లేదు.
మల్లెపొదల చెంత నిలిచి ఏమని అడుగను?
'మీ పొదల మాటున ఎందుకు లేడు చెప్పరే' అని అడుగనా.
భృంగములను ప్రశ్నింతునా.
కృష్ణుడు తన ఇంటి లోనే ఉన్నాడు. ఇక్కడ ఎక్కడా లేడు.
కృష్ణుని ఎల్లప్పుడూ చూడకుండా చేస్తున్నాయి ఈ కనురెప్పలు అని ఒకనాడు అనుకున్నాను. నేడు విచ్చిన కన్నులు. కనుపాపలలో లేడే ఆ పాపడు.
అక్కడే కూలబడింది చంప. కొంతసేపటికి పక్కన కదలిక తెలిసి చూస్తే, కుముద. ఇద్దరూ ఏమీ మాటాడుకోలేదు. మౌనంగానే వేదన పంచుకున్నారు.
రాత్రి గడచిన కొద్దీ, అష్టమి నాటి వెన్నెల చల్లగా చిక్కగా కమ్ముకుంటోంది. ఆకాశంలో తారలు ఒకటొకటిగా బయటపడి మెరుస్తున్నాయి.
పద్మ, కుసుమ, రమణి ఇలా ఒకరొకరుగా చేరుకున్నారు.
"ఈ వెన్నెల..." అన్నది ఒకామె గొంతు పెగల్చుకొని.
"శుక్లపక్షమే కాని మనం ఇప్పుడు కృష్ణపక్షంలో లేము కదా" అన్నది ఒకామె.
సహింపలేని చల్లని వెన్నెలను పంచలేక రాత్రి గడచింది. నులివెచ్చని సూర్యుడు తొంగి చూచేవేళ అందరూ కాళ్ళీడ్చుకొని ఇళ్ళకు మళ్ళారు.
పగలు రాత్రి మరల అదేవిధంగా తిరిగాయి.
మధ్యాహ్న వేళ.
తాటితోపులో ఒక చెట్టు మొదట్లో పడుకొని ఉన్నాడు బలరాముడు.
మనిషి పొడుగు. పెద్ద పంచను గోచీలాగ చుట్టుకొని ఉన్నాడు.
అసలే ఎర్రని వాడు. చెట్ల ఆకుల మధ్యనుండి పడే ఎండకు మరింతగా కంది ఉన్నాడు.
పక్కనే ఒక ముంత. ఉండుండి కదులుతోంది, గాలికి కాబోలు.
ఎండ, మాటుపడి, నీడ తగిలేసరికి కనులు తెరచాడు.
చుట్టూ నిలబడిన వారిని చూచి, లేచి కూర్చున్నాడు.
'ఏమిటి' అన్నట్లు చూపు.
"రామా" అంది వల్లి.
"ఏంటి నా దగ్గరకు వచ్చారు? " బలరాముని మాట స్థిరంగానే ఉంది.
"ఏం లేదు, తమ్ముడు... కనబడట్లేదు..." అని గొంతు సవరించింది ఒకామె.
"నాతోనే వస్తున్నాడుగా. ఇవాళ ఇంట్లో ఉన్నాడు, అంతే " అని పెళుసుగా అన్నాడు అన్న.
"అది కాదూ..." తలవంచుకుని అంటోంది ఒకామె.
లేచి నిలుచున్నాడు బలరాముడు. చేతిలో ముంతను ఎత్తి మిగిలిన నాలుగు గుక్కలు నోట్లో వేసుకొని, పారేసాడు.
"నాకేం తెలుసు? తమ్మునే అడగండి" అని వెళ్ళిపోతున్నాడు.
"ఆగవయ్యా కోపం తెచ్చుకోకు" అన్నది చంప. ఆమె గదమాయింపుతో తగ్గాడు రాముడు.
చిన్నవాడే కాని మనిషి ఎత్తరి.
అతని ముఖంలోకి చూస్తూ అంది చంప
" నీ తమ్ముని గురించి అంతా తెలిసేది నీకే అని మాకు తెలుసు.
నువ్వే చెప్పాలి.. ఏమయ్యింది?"
ఒక నిమిషం ఆగాడు అన్న.
"చెప్పు రామూ" మరొకరి లాలన.
"ఏంలేదు, మొన్నెపుడో అమ్మ కన్నీరు పెట్టుకుంది తమ్ముని దగ్గర "
"అయ్యో ఎందుకని " నాలుగైదు గొంతుకలు.
"ఇంటి మీదకు తగవులు తేవద్దురా, భరించలేకున్నాను, అంది. సరేనమ్మా అన్నాడు తమ్ముడు. అదీ సంగతి " అని బయలుదేరుతున్నాడు రాముడు.
"ఆగాగు" అని అడ్డుకుంది చంప, " మరి మేమేం చేసాము? "
'అవును సుమా ' అన్నట్లు అందరి చూపులు.
బలరామునికి నేల చూపులు.
"ఒరే మల్లా" అంది కుముద.
అప్పటివరకు ఆమె వెనక ఉన్న మల్లడు ముందుకు వచ్చాడు.
సన్నగా పొట్టిగా ఉన్నాడు. ఒక గోచి, వాని కన్న పొడుగ్గా ఉన్నట్లు వేలాడుతోంది.
చిన్న ముంతను సందేహంగా అన్న చేతులో పెట్టి తుర్రుమని పరుగెత్తాడు.
నేలమీద కూర్చున్నాడు రాముడు. కొత్త ముంతను పక్కన పదిలంగా పెట్టుకున్నాడు. ఏ ఒక్కరిని కాక అందరినీ చూస్తున్నట్లు మెల్లగా అన్నాడు, "మీరు కూడా ఏమైనా అనుకున్నారేమో"
"ఏమీ అనలేదే" చప్పున ఒక గొంతుక.
"పైకి అనకున్నా, లోపల ఏమైనా అనుకున్నారేమో, ఆలోచించుకోండి"
"అదికాదు..." ఎవరో అనబోయారు.
"చెప్పానుగా, ఇంక వెళ్ళండి" అని ఎర్రని కనులతో అందరినీ చూసాడు.
ముంతను నోట్లో ఒంపుకొని రెండు గుటకలు వేసి, కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
అతను చెప్పగలిగినది చెప్పాడని, ఇంక మాటాడడు అని అందరికీ అర్థం అయింది.
దగ్గరలో చెట్ల వద్దకు వెళ్ళి నీడలో కూర్చున్నారు. ఎవరికి వారికే ఆలోచనలు.
ఎండ ఉంది. కాని వేడి లేదు, తాపం లేదు. తాపం అంతా లోలోపలే ఉంది. చెట్టు నీడ ఇచ్చే చల్లదనం తెలియనట్లు, చాలనట్లు అనిపిస్తోంది. గాలి రివ్వున వీస్తోంది. అంతకన్న ఎక్కువగా ప్రశ్నలు, సమాధానాలుగా తలపుల కదలిక.
"ఒకసారి నేనే అనుకున్నాను... ఎందుకు అని..." గొంతు పెగల్చుకొని అన్నారెవరో.
"... నేను కూడా... ఎందుకో..." మరొకరు.
"సంసారం ఒక పక్క.. అని సందేహం"
"మొగుడు, ఇల్లు..."
"రాత్రి నిద్ర ఉండట్లేదని..."
"... ఎందుకో తప్పు అనిపించి... "
ఇలా ఒకటొకటిగా మాటలు పైకి వచ్చాయి.
"కాని, ఆ వేణుగానం... "
"కృష్ణుడు... "
" లేకుంటే ఎలా? "
సంశయ స్వరాలు.
లేచి నిలబడింది చంప, " అందరమూ ఏదో ఒకటి అనుకున్నవారమే, అందుకే ఇలా..." అంది.
"మరి ఇప్పుడు ఏం చేద్దాం" ఆత్రంగా, ఆశగా అడిగింది కుసుమ.
"కృష్ణుని ఇంటికి వెళ్దామా? " చిన్నపాటి ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూండగా అంది పద్మ.
"వెళ్ళి... ఏమని చెప్పాలి? " ఎదురు ప్రశ్న.
నిశ్శబ్దం.
"కృష్ణుని ఇంటికే పోనక్కరలేదు" అని, ఏదో తెలిసినట్లు చెంగున లేచింది కుముద.
'అయితే ఏమిటి ' అని అడిగే లోపలే, " మనం ఇళ్ళకు పోదాం. కృష్ణుడే వస్తాడు" అంది ధీమాగా.
మెల్లగా అందరికీ అర్థం అయింది.
"అవును"అన్నారెవరో, "మనం లోపల అనుకున్నాం. ఇప్పుడు పైకే మాటాడుకున్నాం... చాలు"
'సరియే' అన్నట్లు అందరూ లేచారు. కదిలారు వడివడిగా.
చెట్లను, లతానికుంజములను చూస్తూ, 'రాత్రి వస్తాం' అనుకుంటూ, వాటిని చేతులతో నిమురుతూ నడిచారు.
ఎక్కడనుండో కోయిల కూత వినవచ్చింది.
కృష్ణుని ఇంటికి ఎవరూ వెళ్ళలేదు కాని, అక్కడ వేరొక గుంపు కనబడుతోంది.
కారణం బొవ్వప్ప.
మధ్యాహ్న వేళకు ఇంటి ముంగిటికి వచ్చి నిలబడింది.
వీధి అంతా కనబడుతోంది. ఎవరి అలికిడి లేదు.
ఎందుకనో ఆమె అడుగులు ముందుకు పడ్డాయి.
తనకు తెలియకుండానే నడుస్తోంది.
ఎప్పడో కాని బయటకు రాదు. ఇవాళ ఎండ ముదురుతున్న వేళ రావటం!
చూస్తూనే ఆవిడ వెనుక ఒకామె.
'ఎక్కడికి' అని అడగలేదు.
మరో నాలుగు అడుగులు వేసేసరికి ఇంకొకరు. మొత్తానికి యశోద ఇంటికి చేరేసరికి ఒక గుంపులా తయారయింది.
ఇందరిని చూడగానే యశోద కంగారు పడింది. 'కృష్ణుడు ఇంటిపట్టునే ఉన్నాడే' అనుకుంటూ నిలుచుంది.
"కృష్ణుడు లేడా ఇంట్లో" అని ముందుగా బొవ్వప్ప పలకరింపు.
"ఉన్నాడూ " అని మెల్లగా" ఏమయింది " అంది యశోద.
"ఏంలేదు, నాలుగు నాళ్ళనుండి కనబడలేదు ఎక్కడానూ "
"అవును" అంది మరొకతె, "ఏమిటో కృష్ణుణ్ణి చూడకుంటే ఏదోలా ఉంటేనూ... " అని సాగదీసింది.
"బావుందమ్మా" చప్పున అందుకుంది యశోద, తనవంతు వచ్చింది కదా, గొంతు పెరిగింది, "మావాడు వస్తే ఇవి చేసాడూ అవి చేసాడూ అని తగవుకు రావటమా? మీ జోలికి రాకుంటే, ఇలా అడగటమా? విడ్డూరం " అన్నది.
ఆమె చెప్పింది నిజమే కదా, ఎవరూ ఏమీ అనలేకపోయారు వెంటనే.
నెమ్మదిగా మాట కలిపింది పక్కింటి రంగనాయకి, " అది కాదే యశూ, పిల్లాడికి ఏమైనా ఒంట్లో బాలేదేమో అని... "
"ఏం లేదు " మధ్యలోనే మాట ,తుంచివేసింది యశోద," చక్కగా ఇంటిపట్టునే ఉన్నాడు. మీరింక వెళ్ళచ్చు"
"ఓసారి పిలుద్దూ, చూచి పోతాము"
"ఎందుకూ, ఇంట్లో నేను చేసిన మా ఇంటి వెన్న వేసుకొని తింటున్నాడు. మీ చూపులు పడక్కర్లేదు" అంది యశోద.
ఇన్నాళ్ల తగువులకీ చెల్లింపు చేసే అవకాశం వచ్చింది కదా. ఆమె మాట సూటిగా పుల్లవిరుపుగా ఉంది. దాంతో ఎండ మరింత వేడిగా తగులుతోంది.
ఆమెకు దగ్గరగా వచ్చి, నచ్చచెప్తున్నట్లు
"మాట వినవే" అంటోంది ఇంకొకతె, "మా పిల్లలు కూడా ఏమిటో మందకొడిగా అయ్యారు..."
"అయితే కానీ నాకేంటి" అని యశోద ఇంకేదో చెప్పేలోగా మెల్లగా వచ్చాడు కృష్ణుడు. తల్లి వెనకే నిలబడ్డాడు.
కృష్ణుని చూడగానే, ఎండ చల్లగా అనిపించింది అందరికీ.
"ఏవిరా కిట్టయ్యా! మా ఇంటికి రావట్లేదు? " ఎవరో గబుక్కున అన్నారు.
అదే ప్రశ్న అక్కడ ఉన్న అందరి చూపులలో కనబడుతోంది.
"ఎందుకూ" అన్నాడు కృష్ణుడు.
ఏమని చెప్తారు. నిశ్శబ్దం.
నవ్వాడు కృష్ణుడు.
'వస్తానులెండి' అన్నాడా!?
ఆ నవ్వులో అలా వినిపించిందో, అనిపించిందో.
"ఇంక వెళ్ళండి" అంది యశోద.
ఒకరొకరు వెనక్కు తిరిగారు. ముందుకు నడుస్తున్నారు కాని అందరికీ వెనకచూపులే. కృష్ణుడు అక్కడే నిలబడి ఉన్నాడు. తన మీదనే కృష్ణుని దృష్టి ఉన్నట్లు ఎవరికి వారికే అనిపిస్తోంది.
ఇంటికి వచ్చింది బొవ్వప్ప. కోడలు ఇంట్లోనే ఉంది.
"ఎక్కడికి వెళ్ళారూ, గుమ్మం తలుపు గడియ కూడా పెట్టకుండా... " అంది కోడలు.
"దొంగ, తన ఇంటిలోనే ఉన్నాడు. ఇంక మన ఇంటికి ఎందుకు గడియలు, తాళాలు?" అంటూ లోపలికి నడిచింది బొవ్వప్ప.
ఆశ్చర్యంగా చూసింది కోడలు.
అదే విస్మయం అన్ని ఇళ్ళల్లో, ఊరిమీద మేఘంలా కమ్ముకుంది. ఉండీ ఉండీ నాలుగు చినుకులు పడ్డాయి.
పొద్దు వాటారింది. రాత్రి కొరకు అందరి ఎదురుచూపును అర్థం చేసుకున్న భానుడు, గబగబా పడమటి కొండలలోకి జారుకున్నాడు.
మినప్పిండి, బియ్యప్పిండి నానబెడుతోంది కోడలు.
"మరికాస్త వెయ్యి" అంటోంది బొవ్వప్ప వీధి అరుగు మీదనుండి, "మరీ మూడోనాలుగో కాదు, ఎక్కువ చెయ్యి"
మాటాడకుండా చెప్పినట్లు చేసింది కోడలు. కారం బూరెలు తయారయ్యాయి.
గంపలో అటకెక్కి కూర్చున్నాయి.
రాత్రి చల్లగా సాగి వచ్చింది.
మింట చుక్కలు తమతమ స్థానాలలో ప్రకాశిస్తున్నాయి.
చంద్రోదయమే ఇంకా కాలేదు.
తొందరగా భోజనం చేసి, నిద్రకు చేరింది బొవ్వప్ప.
రాత్రి, చీకటి, వెన్నెల, నిద్ర... ఆన్నీ కలిపి ప్రసరిస్తున్నాయి.
రాత్రి ఏ జాములోనో, అలికిడికి మెలకువ వచ్చింది. అటకమీద గంప కదిలినట్లు, పక్కింట్లో పెరుగుకుండ పగిలినట్లు, పరుగులు పెట్టిన అడుగుల సవ్వడి... వినవచ్చాయి.
'మాయ' అనుకుంటూ ఒత్తిగిలి పడుకుంది బొవ్వప్ప.
కోడలి గురించి చూడలేదు.
మరి, అత్తకు కూడా ఇప్పుడు వినబడుతోంది... నిద్దట్లో... వేణుగానం!
శుభం.
ఇంత చక్కగా రచించి అందించిన శ్రీమానా పేరి రవి మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.
జైహింద్.