జైశ్రీరామ్.
శ్రీ మహా గణాధిపతయే నమః.
ధర్మిష్ఠాలో వెలసిన దేవతలు..
ఏకాంకిక నాటిక.
పాత్రలు.
1. యమధర్మరాజు.
2. చిత్రగుప్తుఁడు.
3. సూర్యభగవానుఁడు.
4. SRVD ఎలైట్ గ్రూప్ సభ్యులు నరహరి.
5. వాసుదేవరావు.
ఆరంభము.
యమధర్మరాజు - - ప్రార్థన.
శ్రీమన్మంగళ సూర్యదేవ శుభముల్ శ్రీమంత ధర్మిష్ఠలో
ప్రేమన్ వెల్లువగా రచించు కృపతో, ప్రీతిన్ నినున్ గొల్చెదన్,
ధీమంతుల్గలసన్నివేశమిది, నీ తేజంబె జ్ఞానంబుగా
క్షేమంబున్ గలిగించుపెద్దలకు మా సేవింపులివ్వేళలోన్
శ్రీమంతమైన సృష్టికి మూలమైన మానాన్నగారు శ్రీ సూర్యభగవానులు ధర్మనిష్ఠాపరులయిన ధర్మిష్ఠులు. వారికి ముందుగా నమస్కరించి ఆహ్వానముపలికెదను గాక..
ఓ తండ్రీ! సూర్యదేవా నాకు ప్రత్యక్షమయి నా ప్రణామములు స్వీకరింపుఁడు.
సూర్యభగవానుఁడు. - నాయనా యమధర్మరాజా! ఏమి నాయనా నాకొఱకు వేచి యున్నావు?
యమ - తండ్రిగారూ! మీకు పాదాభివందనములు. నా మనసు క్షణ క్షణము ఆవేదనకు గురియగుచున్నది. నేను నా బాధ మీతో కాక మరెవర్తో చెప్పుకోగలను?
సూర్యుఁడు - ఏమిటినాయనా అంతగా నిన్ను బాధపెట్టుచున్న విషయమేంటీ?
యమ - నా సందేహములను మీరు అర్థరహితమని త్రోసి పుచ్చనంటే విన్నవించుకుంటాను.
సూర్య - చెప్పు కుమారా!
యమ - నాకు మీరు ధర్మరాజుగా పేరుపెట్టి ధర్మ రక్షణార్థము నియమించి ఊరుకొనక యమలోకాధిపతిగా చేసినారు. నాన్కును ఈ పదవిలో మీరు నియమించిన క్షణమునుండీ ఏనాడునూ ఒక్క క్షణమైననూ తీరిక లేక అవిశ్రాంతము పని చేయుయ్చున్నాను. రెప్ప మూయుటకునూ తీరిక లేక అనిమిషుఁడుగా ఉండవలసి వచ్చుచున్నది.
సూర్యుఁడు - ఐననేమాయె? నీకు వచ్చిన సమస్య యేమి?
యమ - తండ్రిగారూ! ఉదయం బ్రహ్మస్వరూపులుగా మధ్యాహ్నము మహేశ్వరులుగా సాయంకాలము సదావిష్ణువుగా మూడు రూపాలూ మీరే అయి ఈ సృష్టి నడుపుతున్నారు.
సూర్యుఁ - ఔను నాయనా. ఐతే ఏమిటంటావ్గు?
యమ - బ్రహ్మగా ఉండి మీరు సృష్టి చేయుచు అందరి తలవ్రాతలూ వ్రాస్తున్నారు. ఆతలరాతలనుపట్టి కొందరు మంచివారిగా రాణించే అవకాశము పొందుచుండగా, మరికొందరిని దుర్మార్గులుగా బ్రతకమని వ్రాయుచున్నారు. ఆప్రాణిభూలోక జీవనము ముగించుకొని యమలోకమునికి వస్తారు.
సూర్యుఁడు - వస్తే ?
అదిగో చిత్రగుప్తుఁడు వస్తున్నాడు అతడు వివరిస్తాడు మీకు.
(చిత్రగుప్తుని ప్రవేశము)
చిత్ర - సూర్యభగవానులకు, యమధర్మరాజువారికి ప్రణామములు.
యము - చిత్రగుప్తా యమలోకమునకు జీవులు ప్రవేశించినప్పుడు మన వేదనను మా తండ్రిగారికి విన్నవించుము.
చిత్ర - ఆర్యా! అటులనే, ఆది దేవా! సూర్యభగవానుఁడా! జీవులు ఈ లోకమునకు ప్రవేశించుచుండగనే వారి కర్మఫలములను పాపపుణ్యములరూపములో పూర్తిగా వివరించి వారి వారి ఫలములకు తగినట్లుగా శిక్షలు అమలు చేయుటవంటివి మాకు నిత్యకృత్యమై ఈ యమలోకమను తలచుచున్నంతనే ఏవగింపు కలుగుచున్నది.
యము - ఔను తండ్రి గారూ! చిత్రగుప్తుఁడు చెప్పింది అక్షరాలా నిజం.ఈ పాపులు శిక్షలనుభవించుచున్నప్పుడు చూడలేకపోవుచున్నాము. ఐనా ధర్మము తప్పకూడదనే గిరి గీసి దానిలో ఉంచి యమధర్మరాజుగా చేశారు. ఈ విధమైన పాపకార్యములు చేయకుండ్।ఆ మానవులను ఉంచే మార్గమే లేదా? ఈ సృష్టి చేసినది తమరే కదా? వారి నుదుట పాపకర్మలు చేయమని మీరే వ్రాశారుకదా? మీ రాతప్రకారమే ఆ జీవుఁడు కర్మలు చేస్తుండడం చేత పాపకూపంలో పడుత్రున్నాడు. ఈ విధంగా కాకుండా వారిని మంచి మార్గంలో నడిపే మరో ఉపాయమే లేదా/
స్వూర్యుఁడు - మానవజాతికి కర్మలు చేయమని వ్రాయుటతో పాటు ఆ కర్మఫలములను తప్పించుకొనుటకు కూడా ఉపాయములు మేమే అనుగ్రహించితిమి కదా?
యమ - ఏమి అనుగ్రహించిరి తండ్రిగారూ?
సూర్యు - ఏ ప్రాణికీ లేని జ్ఞానమనేశక్తిని ప్రత్యేకించి మానవునిలో నెలకొల్పితినికదా? అట్టి జ్ఞానంతో వివేకము కలుగి ప్రవర్తిస్తే పాపపుణ్యాలు వారికెలా అంటుతాయి?
యమ - ఔననుకోండీ, కాని మీరు మాయ అనే పొరను వారిలో కల్పించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక అంధకారంలో కొట్టిమిట్టాడుతుయ్ండడం మీకు తెలియదా?
సూర్యుఁడు - అందుకేకదా వేదవిజ్ఞానాన్ని పుష్కలంగా అందించాను, వేద స్వరూపుఁడనైన నేను ప్రతీదినం వారి యోగ క్షేమాలు పాపపుణ్యాలు చూస్తూనే ఉంటాను కదా/
యము - నాన్నగారూ నన్ను మన్నింతురుగాక.
సూర్యు - సందేహమేల? ఏమిటోచెప్పు.
యము - మీరు ప్రసాదించిన శాస్త్రాలు, వ్రాసునిరూపంలో ప్రకటించిన అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలూ అన్నీ దేవతభాష అయిన సంస్కృతంలో ప్రసాదించారు. అల్పజ్ఞులైన మానవులకు ఆభాష అర్థము కాక అందలి విషయములను గ్రహింపలేకున్నారు. ఈ విషయము మీకు తెలియనిదా?
సూర్యు - అందుకేకదా యమా! అనేక భాషలలో కొందరు మహాత్ములను తాపసులుగా సృష్టించి వారిచే ప్రవచనముల రూపములో వేద సారమును బోధింపఁజేయుచున్నాను కదా/ అవి గ్రహించుకొని ఋజుమార్గములో ప్రవర్తింపవలసి యున్నదికదా?
యము - అయ్యో తండ్రిగారూ వారి స్థానములో మనముండిన మనకు అర్థమయి యుండెడిది. వారు అనేక యీతిబాధలు పడుతూ బ్రతుకులనే దుర్భరముగా గడుపుచు పొట్టకూటికి పుట్టెడు వృత్తులను చేపట్టి అహర్ణిశలూ జీవనపోరాటం సాగిస్తుండగా ఈ ప్రవచనాలు వినే అవకాశం కాని, అనుఇసరించే ఆలోచనకాని వారికి ఏవిధంగా లభిస్తుంది?
సూర్యు - ఐనచో ఇప్పుడు నీవేమందువు? చిత్రగుప్రా నీ ఆలోచనయేమి?
చిత్ర - స్వూర్యదేవా! ఈ పాపపుచిట్టాలు వ్రాయలేకపోవుచున్నాను. పాపకార్యములనుండి వారిని ముందుగానే దారి మళ్ళించగలిగితే అందరూ పుణ్యకార్యములే# చేయుచూ భూలోకమున సుఖించి అంతిమమున బ్రహ్మైక్యము సాధింపగలుగుదురని నా అభిప్రాయము.
యము - అవును పితృదేవా! మీరు అనుమతించినచో మేమే స్వయముగా భూలోకమున చిత్రగుప్తుఁడు ఆలోచించిన విధానమును అమలు చేయగలము.
సూర్యు - మీ ఆలోచనను నేనెందుకు కాదంటాను? మీ యిరువురితో పాఉ దేవతాగణమును కూడా మీకు సహకరించుటకు పంపుచున్నాను..
యము - మీ అనుగ్రహమును ప్ఒందిన మేము ఈ మంగళప్రదమైన కార్యము చేయుటకు ఎక్కడ ఏ రూపములలో ఉద్భవింతుమో మాపై దయతో వివరింపుడు.
సూర్యు - అఖండభూమండలంలో పరమ పవిత్రమైన భారతదేశమున సమైక్య ఆంధ్రరాష్ట్రమున భాగ్యనగరమున ధర్మప్రతిష్ఠాపనార్థము పుణ్యపురుషులకొరకు నిర్మింపఁబడిన ఆర్వీ ధర్మిష్ఠా అనే ప్రాంగణమున కొలువైయున్న శ్రీనరహరి సంసేవనా తత్పరులుగా ఉంటూ జ్ఞాన వయో వృద్ధుల రూపమునSRVD ఎలైట్ సభ్యులుగా పాత్రలు వహించి మానవులకు ప్రవర్తించనలసిన ధర్మ మార్గమును సులభశైలిలో వ్యాప్తి చేయుట కొఱకు అక్కడ ఆవిర్భవింతురు గాక.
యముఁడు + చిత్రగుప్తుఁడు. ధన్యులము కర్మసాక్షీ, మేము మీవలన ఈ బృహత్తర కార్యమును చేసి మానవులలో శాంతిని పెంపొందింప యత్నింతుము.
ధర్మిష్ఠా లోని నరహరి - మరియు వాసుదేవరావు ప్రవేశింతురు - ఓహో సూర్యభగవానుఁడు ఇట్టి మహత్తర కార్యనిర్వహణ కొఱకు మమ్ములనిక్కడ కు చేర్చినాడా? ఆ దినకరుని ఆజ్ఞను శిరసా వహింతుము గాక. చిత్రగుప్తా మనము నరహరి వాసుదేవరావు పేరులతో ఇక్కడ చేరియున్నాము. మనతో వచ్చిన మిగిలిన దేవతామూర్తులయిన సహృదయమిత్రులతో, యువకులతో లలితాంబాస్వరూపులైన స్త్రీజనాళితో మనకు ఆఆదిత్యుఁడు విధించిన సామాజిక రుగ్మతలను తొలగించుటకు సత్యజ్ఞానము అందరిలోనూ కలుగఁ జేయుటకు అనవరతము శ్రమిద్దామా?
వాసుదేవరావు., - అటులనే గురుదేవా. సరే ప్రార్థన చేద్దాము
(అందరూ నిలఁబడి ప్రార్థన చేస్తారు)
ధర్మోరక్షతి రక్షితః.. అధర్మా నాశోఽస్తు. సుధర్మా విజయోఽస్తు.
నమో లక్ష్మీ నారసింహా! జైశ్రీరామ్.
భారత మాతకు జయము జయము - - భారత మాతకు జయము జయము - భారత మాతకు జయము జయము.
శ్లోకం:
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్ దుఃఖ భాగ్భవేత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
జైహింద్.
The Gods Who Resided in DharmishthaA One-Act PlayJai Sriram
Sri Maha Ganadhipataye NamahCharacters:Yama DharmarajaChitraguptaLord Surya BhagavanSRVD Elite Group Member - NarahariVasudeva RaoBEGINNINGYama Dharmaraja - Prayer:Srimanmangala Suryadeva, bestow auspiciousness in this prosperous Dharmishtha,
With an overflowing love, with grace, I worship you with affection,
This is a gathering of the wise, may your radiance itself be our wisdom,
May our service at this hour bring well-being to our elders.O Father, Sri Surya Bhagavan, who is the source of this magnificent creation and who is righteous and Dharmishtha himself. I bow to you first and invite you.O Father! Surya Deva, appear before me and accept my salutations.Lord Surya:
My dear Yama Dharmaraja! Why are you waiting for me, my son?Yama:
Father! Salutations at your feet. My mind is being subjected to agony every moment. With whom else can I share my pain if not with you?Surya:
What is it, my son, that is causing you so much pain?Yama:
If you promise not to dismiss my doubts as meaningless, I will submit them.Surya:
Speak, my son!Yama:
You named me Dharmaraja, appointed me for the protection of Dharma, and not stopping there, you made me the Lord of Yamaloka. From the moment you appointed me to this position, I have been working tirelessly without a single moment of leisure. I have to remain sleepless, without even blinking.Surya:
So what? What is the problem that has come to you?Yama:
Father! In the morning as Brahma, at noon as Maheshwara, and in the evening as Lord Vishnu himself, you in your three forms run this entire creation.Surya:
Yes, my son. So what do you want to say?Yama:
As Brahma, you create and write everyone's destiny. Based on that destiny, some get the opportunity to shine as good people, while you write that some others should live as wicked people. After finishing their earthly life, that soul comes to Yamaloka.Surya:
If they come?Yama:
Ah, there comes Chitragupta. He will explain to you.[ Entry of Chitragupta ]Chitragupta:
Salutations to Lord Surya and to Yama Dharmaraja.Yama:
Chitragupta, when beings enter Yamaloka, please convey our agony to my father.Chitragupta:
As you command, Arya! O Adideva! Lord Surya! As soon as beings enter this world, it has become our daily routine to completely explain their karmic fruits in the form of sins and virtues and to implement punishments according to their respective fruits. Just thinking of this Yamaloka itself creates disgust in us.Yama:
Yes, Father! What Chitragupta says is absolutely true. We are unable to bear seeing these sinners suffer punishments. Yet, you have drawn a line saying Dharma must not be violated and placed me within it as Yama Dharmaraja. Is there no way to keep those humans from doing such sinful acts? You are the one who created this creation, right? Did you not write on their foreheads to do sinful karmas? Due to your writing, that soul does karmas and falls into the pit of sin. Is there no other way to lead them on a good path instead of this?Surya:
Along with writing that mankind should do karmas, did we not also bestow upon them ways to escape the fruits of those karmas?Yama:
What did you bestow, Father?Surya:
Did I not specially establish in humans the power of knowledge, which no other living being has? If they act with discretion with such knowledge, how will sins and virtues cling to them?Yama:
Let us assume so, but did you not create a veil called Maya (illusion) in them, making them toss in darkness without knowing what is true and what is false? Don't you know that?Surya:
That is why I have abundantly provided Vedic knowledge. As the embodiment of the Vedas myself, I watch over their yoga-kshema and their sins and virtues every day.Yama:
Father, please forgive me.Surya:
Why doubt? Tell me what it is.Yama:
The scriptures you bestowed, the eighteen Puranas and Upa-Puranas that you revealed in written form, you bestowed them all in Sanskrit, the language of the Gods. Humans with limited knowledge are unable to understand that language and grasp its contents. Is this unknown to you?Surya:
That is why, Yama! Did I not create some great souls as ascetics in many languages and make them teach the essence of the Vedas in the form of discourses? They have to grasp them and act on the righteous path, right?Yama:
Oh, Father! If we were in their place, we would have understood. They suffer many hardships, living their lives miserably, taking up countless professions just to fill their stomachs, and fighting a battle for survival day and night. How will they get the opportunity to listen to these discourses, or even the thought to follow them?Surya:
Then what do you say now? Chitragupta, what is your thought?Chitragupta:
O Surya Deva! I am unable to write these sinful accounts anymore. It is my opinion that if we can divert them from sinful deeds beforehand, everyone will do only virtuous deeds, enjoy happiness in Bhooloka, and finally attain union with Brahma.Yama:
Yes, Father! If you permit, we ourselves can go to Bhooloka and implement the method thought of by Chitragupta.Surya:
Why would I refuse your thought? Along with you two, I am also sending the host of Gods to assist you.Yama:
Having obtained your grace, kindly tell us where and in what forms we shall incarnate to perform this auspicious task.Surya:
In the vast earth, in the most sacred country of India, in the united state of Andhra Pradesh, in Bhagyanagara (Hyderabad), in a precinct named RV Dharmishtha built for virtuous people for the establishment of Dharma, you shall incarnate. Staying there as devoted servants of Sri Narahari, in the form of wise and elderly persons, you shall take on roles as members of the SRVD Elite Group to propagate in a simple style the path of Dharma that humans should follow.Yama + Chitragupta:
We are blessed, O Karmasakshi! Through you, we will attempt to perform this great task and foster peace among humans.[ Entry of Narahari and Vasudeva Rao from Dharmishtha ]Narahari of Dharmishtha:
Oh! Has Lord Surya brought us here to carry out such a great task? We shall bow our heads and obey the command of that Sun God. Chitragupta, we have gathered here in the names of Narahari and Vasudeva Rao. Shall we, along with the other divine forms who have come with us - our kind-hearted friends, the youth, and the women who are embodiments of Lalitamba - work tirelessly to remove the social evils as ordained by that Aditya and to instill true knowledge in everyone?Vasudeva Rao:
Yes, Gurudeva. Let us pray.[ All stand and pray ]Dharmo Rakshati Rakshitah (Dharma protects those who protect it)
Adharma Nashostu, Sudharma Vijoyostu (Let Adharma be destroyed, let true Dharma be victorious)Namo Lakshmi Narasimha! Jai Sriram.Victory, Victory to Mother India - Victory, Victory to Mother India - Victory, Victory to Mother India.Shloka:
Sarve Bhavantu Sukhinah
Sarve Santu Niramayah |
Sarve Bhadrani Pashyantu
Ma Kashchid Duhkha Bhagbhavet ||
Om Shantih Shantih Shantih ||Meaning:
May all be happy.
May all be healthy (free from disease).
May all see auspiciousness.
May no one suffer sorrow.
Jai Hind.
హాస్యంతో -
ధర్మిష్ఠాలో వెలసిన దేవతలు 😊
పాత్రలు: యముడు - ఓవర్ టైం చేసే ఉద్యోగి,
చిత్రగుప్తుడు - అకౌంటెంట్,
సూర్యుడు - కంపెనీ MD
[ యముడు తన దండం పక్కన పెట్టి, నడుం పట్టుకుని వస్తాడు ]
యముడు:
ఓ నాన్న సూర్యదేవా! దండం పెట్టడానికి కూడా ఓపిక లేదయ్యా! ఉదయం నుండి సాయంత్రం వరకు చావు, పుట్టుకల లెక్కలు చూసి చూసి నా నడుం పట్టేసింది. ఏకంగా సెలవు అనేదే లేదు! నాకు ధర్మరాజు అని పేరు పెట్టి, యమలోకానికి మేనేజర్ ని చేసావు. ఇక్కడ స్టాఫ్ కొరత!
సూర్యుడు: (టీ తాగుతూ)
ఏమైందిరా? నేను కూడా మూడు షిఫ్టులు చేస్తున్నా కదా - ఉదయం బ్రహ్మగా, మధ్యాహ్నం శివుడిగా, సాయంత్రం విష్ణువుగా! నేను అలసిపోతున్నానా?
యముడు:
నీకు మూడు షిఫ్టులే నాన్నా, నాకు 24 గంటల డ్యూటీ! బ్రహ్మగారు పైన తలరాతలు గబగబా రాసి పారేస్తున్నారు, కింద జనాభా పెరిగిపోతోంది. నా యమలోకంలో ఇళ్ళు ఖాళీ లేవు, అన్నీ ఫుల్!
[ చిత్రగుప్తుడు పెద్ద ఫైళ్ళ మోపుతో, కళ్లజోడు సరిచేసుకుంటూ ]
చిత్రగుప్తుడు:
అయ్యా సూర్యదేవా! నా గోడు వినండి. పాపాల లెక్కలు రాసి రాసి నా పెన్నులు అయిపోయాయి. పాత కాలంలో తాటాకుల మీద రాసేవాడిని, ఇప్పుడు ల్యాప్ టాప్ ఇచ్చారు. అది కూడా "Memory Full" అని చూపిస్తోంది. మనుషులు చేసే పాపాలకు నా కంప్యూటర్ హ్యాంగ్ అవుతోంది!
యముడు:
చూశావా నాన్నా! వీడి పరిస్థితి! వీడు లెక్క రాసి, నేను శిక్ష వేసి ఇద్దరం అలసిపోయాం.
సూర్యుడు:
మరి నేను వేదాలు, జ్ఞానం ఇచ్చాను కదా!
యముడు:
ఇచ్చావు నాన్నా, కానీ అన్నీ సంస్కృతంలో ఇచ్చావు. వాళ్లకు అర్థం కాదు. పైగా నువ్వు 'మాయ' అనే ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశావు. అందరూ అందులోనే పడి దారి తప్పుతున్నారు!
చిత్రగుప్తుడు:
అవును స్వామీ! మీరు ప్రవచనాలు చెప్పే స్వామీజీలను పంపారు. కానీ మనుషులు ప్రవచనం వింటూనే మధ్యలో టీ తాగడానికి, ఫోన్ చూడడానికి వెళ్ళిపోతున్నారు. పూర్తిగా వినడం లేదు!
సూర్యుడు: (నవ్వుతూ)
సరే, మీ ఐడియా ఏంటి?
యముడు & చిత్రగుప్తుడు:
మమ్మల్ని భూలోకానికి ట్రాన్స్ఫర్ చేయండి! అక్కడే ఉండి పాపం జరగక ముందే కౌన్సిలింగ్ ఇస్తాం!
సూర్యుడు:
తథాస్తు! మిమ్మల్ని భాగ్యనగరంలో RV ధర్మిష్ఠా అనే చోట SRVD ఎలైట్ మెంబర్స్ గా పంపుతున్నా. అక్కడ మీకు లిఫ్ట్ ఆగిపోతే ఎలా ఉంటుందో, వాటర్ బిల్ ఎంత వస్తుందో తెలిస్తే మనుషుల బాధలు అర్థమవుతాయి!
[ నరహరి, వాసుదేవరావు చేతిలో మీటింగ్ బుక్ తో ]
నరహరి:
ఓహో! అందుకేనా మమ్మల్ని ఇక్కడికి పంపింది! మేము యముడు, చిత్రగుప్తులమా? అయితే ఇక ధర్మిష్ఠాలో ఎవరైనా రూల్స్ మీరితే...
వాసుదేవరావు:
సింపుల్! చెత్త బయట పడేసినా, లిఫ్ట్ లో గట్టిగా మాట్లాడినా, మీటింగ్ కి రాకపోయినా - వాళ్ళ పేరు మా పాపపు చిట్టాలో రాసేస్తాం!
నరహరి:
కాదు కాదు, ఇకపై మన ఆయుధం దండం కాదు, ప్రేమ, స్నేహం, సత్సంగం! మనతో ఉన్న లలితాంబా స్వరూపులైన తల్లులు, యువకులతో కలిసి ఈ కాలనీని వైకుంఠంగా మారుద్దాం!
వాసుదేవరావు:
అటులనే గురుదేవా! ముందు ఈ రోజు సాయంత్రం అందరికీ టీ, బిస్కెట్ పెట్టి మంచి మాటలు చెబుదాం!అందరూ: ధర్మో రక్షతి రక్షితః! నమో లక్ష్మీ నరసింహా!
జైశ్రీరామ్!
జైహింద్
తెర పడుతుంది.
With Humour - The Gods Who Resided in Dharmishtha 😊Characters: Yama - The Overtime Employee, Chitragupta - The Accountant, Surya - The Company MD[ Yama enters, keeping his mace aside and holding his waist ]Yama:
O Father Surya Deva! I don't even have the energy to salute! From morning to evening, seeing accounts of deaths and births, my back is aching. There is absolutely no leave! You named me Dharmaraja and made me the Manager of Yamaloka. There is a staff shortage here!Surya: (sipping tea)What happened, my boy? I am also doing three shifts - as Brahma in the morning, as Shiva in the afternoon, and as Vishnu in the evening! Am I getting tired?Yama:
You have only three shifts, Father, I have 24 hours duty! Lord Brahma is rapidly writing destinies up there, and population is increasing down here. There are no vacant houses left in my Yamaloka, everything is full![ Chitragupta enters with a huge bundle of files, adjusting his spectacles ]Chitragupta:
O Lord Surya Deva! Listen to my plight. Writing accounts of sins, my pens have run out. In olden days I used to write on palm leaves, now you have given me a laptop. That too is showing "Memory Full". My computer is hanging due to the sins committed by humans!Yama:
See, Father! His condition! He writes the accounts, I give the punishments, and both of us are exhausted.Surya:
But I gave them Vedas and Knowledge, right!Yama:
You gave, Father, but you gave everything in Sanskrit. They don't understand it. Moreover, you created a Facebook, WhatsApp group called 'Maya'. Everyone is stuck in it and going astray!Chitragupta:
Yes, My Lord! You sent Swamijis who give discourses. But humans, while listening to the discourse, go away in the middle to drink tea and check their phones. They don't listen completely!Surya: (laughing)Okay, what is your idea?Yama & Chitragupta:
Transfer us to Bhooloka! Staying there itself, we will give counselling before the sin happens!Surya:
Tathastu! I am sending you to Bhagyanagara, to a place called RV Dharmishtha as SRVD Elite Members. There you will understand human problems when you experience how it feels when the lift stops and how much the water bill is![ Narahari, Vasudeva Rao enter with a meeting book ]Narahari:
Oh! Is that why you brought us here! Are we Yama and Chitragupta? Then if anyone breaks the rules in Dharmishtha...Vasudeva Rao:
Simple! If someone throws garbage outside, talks loudly in the lift, or doesn't come to the meeting - we will write their name in our sinful accounts!Narahari:
No, no, from now on our weapon is not the mace, but Love, Friendship and Satsang! Along with the mothers who are embodiments of Lalitamba and the youth with us, let us turn this colony into Vaikuntha!Vasudeva Rao:
Yes, Gurudeva! First, let us offer tea and biscuits to everyone this evening and share good words!All: Dharmo Rakshati Rakshitah! Namo Lakshmi Narasimha!Jai Sriram!
Jai Hind!
Curtain Falls.