చ:-యువకులనేకమంది తమ యుత్సుకతన్ పరులన్ హసింపనో,
యువతుల నేడిపించుటనొ, హూంకృతితో బెదిరించుచుండనో.
భవితను భారతావనికి పన్నుగ నశము మొంద జేయ నెంచనో.
చవటల పోలి చేయును. మజాలకు లోనయి మాయుటేలనో.
చ:- నిజము గణింపుడయ్య! మిము నీరజ సంభవు నాలి మీకడన్
ఋజువుగ నుండి కాచునుగ! దృష్టి మరల్చక నేర్చు నప్పుడున్
సుజనులసంగతుల్ తమకు శోభనొసంగెడు. దుష్ట్ సంగతుల్
భుజగముభంగి మిమ్ములను పూర్తిగ మృత్యు ముఖానకంపునే!
Friday, October 24, 2008
Wednesday, October 22, 2008
యువత వర్ధిల్లాలి
ఆంధ్ర యువజనులారా! భారతాంబ ముద్దు బిడ్డలారా! విజ్ఞాన సంపన్నులారా! మీరు కిం కర్తవ్యతా మూఢులు కారని నాకు తెలుసు. ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని మానవ వనరులు ఎక్కువగానున్న దేశంగా భావిస్తుంటాయి. ఏ దేశ భవిత అయినా ఆ దేశయువతమీదే ఆధార పడి వుందన్నమాట నగ్న సత్యం.యువత నిర్లిప్తంగా వుంటే ఆ దేశం అభివృద్ధి కుంటుబడుతుంది. గడచే ప్రతీ క్షణం విజ్ఞాన సముపార్జనకో వివేక విస్తరణకో ధర్మ మార్గాన ధన సంపాదనకో, సామాజిక పురోభివృద్ధి కొరకై చేపట్టిన సేవలకో మనం వినియోగించుకోవాలి. మనం నిర్లిప్తంగా వుంటే, నిర్లక్ష్యంగా వుంటే దాని పర్యవసానం చాలా ఘోరంగా వుంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.నిర్లిప్తంగా వుండకండి. నిర్లక్ష్యాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. ఆదర్శ జీవనానికై అర్రులు చాచండి.మీ జీవన గమ్యాన్ని సరిగా నిర్దేశించుకోవడంలొ పెద్దల సహాయాన్ని అర్ధించండి.మహాత్ములు నడచిన బాటను గమనించండి. విశాల దృక్పథాలు ఏర్పరచుకోండి. మీ సమస్యలను మీలోనే అణచుకొంటూ బాధకు లోను కాకండి. మిత్రుల, పెద్దల, మేధావుల దృష్టిలో పెట్టి పరిష్కార మార్గాన్ని తెలుసుకొండి. హాయిగా బ్రతకండి మీ తోటి వారికి మీ ఆనందాన్ని పంచండి.భావి భారతికి మంచి పునాదులు వేయండి. జైహింద్.
Sunday, October 5, 2008
అంతర్జాల భువన విజయము
ప్రియ సాహితీ బంధువులారా! అంతర్ జాల భువన విజయము నిర్వహణలో కృతకృత్యులయినందుకు మీ అందరికీ నా అభినందనలు.నిర్వహణ దీక్షా దక్షులయిన రాయల వారికి కూడా కృతకృత్యులయినందుకు నా హృదయ పూర్వక అభినందనలు. మీరంతా నాపద్యాలకు చక్కని వ్యాఖ్యానం చేసి ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు.
సీ:-కృష్ణ రాయలు పద్య తృష్ణ తోడ కవుల - నష్టా దశా2ధిక మలర నుంచి,
భువన మంతయు సభా భవన మట్టుల జేసి - పెద్దనాదులు తమ ప్రతిభ జూప
పద్యము లెన్నియో హృద్యమౌ రీతిలో - పలుకు నట్టుల జేసి, వెలయ జేసి
భువన విజయమును కవన విజయమన - కవులకు సన్నుతి కలుగ జేసి.
గీ:-ఆంధ్ర సాహితీ వేత్తలు హర్ష మునను - పొంగ, భువన మంతర్జాల భువనవిజయ
కవుల కల్పనా పటిమను కాంక్ష తోడ - చూడ, జేసిరి . తానె మన తోడ నుండి.
చ:- కవులను కోరుచుంటి. తమ కమ్మని సత్ కవితా ప్రవాహమున్
భువిని ప్రశస్థమౌనటుల ముచ్చటతో ప్రవహింప జేయుచున్
భువనమె కృష్ణ రాయకవి పుణ్య ప్రదంబగు కొల్వుగా, సభా
భవనమునమునందు సత్ కవిగ పన్నుగ మీరు రహింప. నెల్లెడన్.
సజ్జన విధేయుడు
చింతా రామ కృష్ణా రావు.
{ ఆంధ్రామృతం బ్లాగ్}

Subscribe to:
Posts (Atom)