Thursday, November 15, 2012

హాన్స్ జెన్నీ కనిపెట్టిన యంత్రము టోనోస్కోప్ చిత్రించిన ఓంకారము యొక్క చిత్రము


జైశ్రీరామ్.

సోదరీ సోదరులారా!

మనం పలికే ఏ శబ్దమైనా ఒక ఆకారాన్ని సంతరించుకుంటుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్ఫారు.("రామ" అనే నామాన్ని నిరంతరం జపిస్తే కళ్ళెదుట రాముని రూపం సాక్షాత్కరిస్తుందని ఎన్నో కధల్లో చదివాము కదా!)

ఈ విషయాన్ని చాలాకాలం పాటు "సైన్సు" చదువుకున్న మేధావులు ఒప్పుకోలేదు.చివరకి శాస్రజ్ఞుల పరిశోధనలలో ఈ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు.   
Father of cymatics science "హాన్స్ జెన్నీ (Hans Jenny)" అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త  "టోనొ స్కోప్" అనే ఓ అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టారు.
ఏదైనా శబ్ద తరంగానికి విజువల్ రిప్రెసెంటేషన్ ని గీయడమే ఆ పరికరం చేసే పని! వివిధ ధ్వనులని చేసి, "టోనొ స్కోప్" సహాయంతో వాటి రూపాలని స్టడీ చేయడం మొదలు పెట్టాడు.ఆ ప్రయోగాల్లో భాగంగా, 'ఓంకారాన్ని ' సుస్ఫష్టంగా చదివించి, ఆ శబ్ద తరంగాల ద్వారా వచ్చే బొమ్మని గీశాడట. 
ఆశ్చర్యం! ఓంకారం చదివినప్పుడు వచ్చిన ఆకారం ఇదే!
ఇదేమిటో తెల్సుగా? శ్రీచక్రం.
శ్రీచక్రమంటే అమ్మవారి శరీరమని మన వేదాలు చెప్తాయి (శ్రీచక్రం శివయోర్వపుః)
అలాగే మన వేదాలూ, ఋషులూ అమ్మవారిని "ఓంకార పంజర శుకీ" అనీ, "ఓంకార రూపిణీ మాతా" అనీ కీర్తించడం మనం విన్నాముకదా!
ఇదే ఓంకారానికీ, 
శ్రీచక్ర సంచారిణియైన అమ్మవారికీ  మధ్యనున్న సంబంధం!ఈ విషయం మన పురాణాలు ఎప్పుడో చెప్పినా, సైన్సుకి మాత్రం తెల్సుకోవడానికి ఇంతకాలం పట్టిందంతే!
జైహింద్.

Thursday, November 8, 2012

జగత్ గురువుల విజయ యాత్ర - ఆహ్వనపత్రిక


జైశ్రీరామ్.
ఆర్యులారా! ఔత్సాహికులకు పరమ ప్రయోజనాన్ని చేకూరుస్తుందని మురళేధర శర్మగారు పంపిన ఆహ్వాన పత్రికను దీనికి జత చేసాను. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు.
ఇక చూడండి.
నమస్కారం,
ఇక్కడ జగత్ గురువుల విజయ యాత్ర - ఆహ్వనపత్రిక ను జత పరుస్తున్నాను. అందరికి ఇదే మా ఆహ్వనం గా భావించి శ్రీచరణులు శ్రీశ్రీశ్రీ భరతీతీర్ధలవారిని దర్శించి తరించ వలసినది.
ఇట్లు,
మురళీధర శర్మ
8886390909
జైహింద్.

Man of the Millennium.....


జైశ్రీరామ్.
Man of the Millennium

Description: http://www.tamilvanan.com/content/wp-content/uploads/2009/01/palam-kalyanasundaram.jpg
Mr.Kalayanasundaram
Mr.Kalayanasundaram worked as a Librarian for 30 years. Every month in his 30 year experience(service), he donated his entire salary to help the needy. He worked as a server in a hotel to meet his needs. He donated even his pension amount of about ten lakh rupees to the needy. 
  
He is the first person in the world to spend the entire earnings for a social cause. In recognition to his service, the American government honoured him with the ‘Man of the Millennium’ award. He received a sum of Rs 30 crores as part of this award which he distributed entirely for the needy as usual. 
  
Moved by his passion to help others, Super Star Rajinikanth adopted him as his father. He still stays as a bachelor and dedicated his entire life for serving the society. You can read more about him

All our Politicians, Film stars, Business magnets, cricketers  Press and we all Indians should be PROUD of Kalayanasundaram. American Government has honored him but we Indians even don't know that such a personality exist amongst us. 


  
Atleast have the courtesy to pass this on and on till the whole world comes to know about this Great Good Samaritan. 
  
Hat's off Kalayanasundaram.. We Indians are extremely proud of you and proudly say "THIS HAPPENS ONLY IN INDIA" 
By
టి. కృష్ణ మోహన్ 
జైహింద్.

Tuesday, November 6, 2012

తిరుమలేశుని తన హరికథా గానంతో ఓలలాడించిన హరికథా భాగవతార్ బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ ఈ నెల 2౦ వ తేదీన మన హైదరాబాదు వస్తున్నారు.

జైశ్రీరామ్.
భగవద్భక్తులారా! మొన్న గడిచిన తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో మూడు రోజుల పాటు తన హరి కథా గానంతో  జనాన్ని భక్తి పారవ్శ్యంలో ముంచెత్తి, ఆ వేంకటేశ్వర స్వామి వారికి సహితం ఆనంద పారవశ్యం కలిగించిన బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ మూర్తి భాగవతార్ (బొబ్బిలి)  మన భాగ్యనగరం తే.20 ని వస్తున్నారు. 23వ తేదీన వారి హరికథ ఉన్నది. 
20, 21, 22 తేదీలలో వారు మన భాగ్యనగరంలోనే ఉంటున్నందున ఎవరయినా వీరి హరికథా కార్యక్రమం పెట్టదలచుకొంటే ఇది ఒక మంచి అవకాశం.
23 వతేదీన పుట్టపర్తి సాయిబాబా వారి జయంతి సందర్భంగా 19 వతేదీ నుండి23వ తేదీ వరకు భక్తి కార్యక్రమాలు సాయి భక్తులు నిర్వహించుట పరిపాటి. అందుచే్ ఈ అవకాశం కోసం ఎదురు చూచేవారుంటారని భావించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.
వారిని సంప్రదించ దలచుకొన్నవారి కొఱకు వారి సెల్ నెంబరు తెలియ జేస్తున్నాను.
వారి సెల్ నెంబరు 90149 92816.
జైహింద్.

Thursday, October 4, 2012

ప్రభుత్వ మహారాజా సంస్కృత కలాశాల, విజయనగరం, పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము.

జైశ్రీరామ్.
సత్ సంప్రదాయ సాహితీ ప్రియ బంధువులారా!
నేను సన్మిత్రులతో కలిసి, సద్గురుదేవుల సుశిక్షణతో ప్రభుత్వ మహారాజా సంస్కృత కలాశాలలో 1968 - 69  నుండి 1971-72 వరకు భాషా ప్రవీణ అభ్యసించి యుంటిని. ఆ విద్యాభ్యసన సత్ ఫలముగా ఉపాధ్యాయ ఆచార్య పదవులు చేఁబట్టి సుమారు35 సంవత్సరములు బోధనా వృత్తిలో మమైకమై జీవనము విద్యార్థులమధ్య సాగించితిని.2008 జూన్ మాసాంతమున పదవీ విరమణ చేసి యున్న నాకు హృదయంలో చదువుకొనిన నాటి గుర్తులు లీలగా ఊగులాడుతున్నాయి.
ఐతే విజయ నగర వాసులైయున్న మా సతీర్థులు, మిత్రులు కొందరు పూర్వ విద్యార్థుల సమ్మేళనము గురు పూజ అనే మహాద్భుతమైన కార్యక్రమమును తే.07 - 10 - 2012 న  చేయ తలపెట్టి నాకు ఆహ్వానము పంపినారు. ఈ కార్యక్రమము చేయుచున్నారన్నంతనే నామనసు ఎంతగానో పొంగిపోయింది. మాకు జ్ఞాన భిక్షను పెట్టిన అలనాటి గురుదేవులను సేవించుకొనే సద్భాగ్యం నాకూ కలిగినందుకు,  హృదయంలో హృదయంగా మెలిగిన అలనాటి మిత్రులందరినీ ఒకేచోట ఒక్క సారి కలుసుకొనే భాగ్యం కలిగినందులకూ నాకెంతో ఆనందంగా ఉంది.ఈ మహదానందాన్ని నాలో దాచుకోలేక మీకూ పంచుతున్నందుకు నన్ను అన్యధా భావించకండి.
ఏ జన్మాంతర సద్గుణాళి ఫలమో యీ జన్మలో కల్గెనే!
తేజోరాశిగ నిల్చిలట్టి గురులన్ దీపించు జ్ఞాన ద్యుతుల్
రాజా సంస్కృత బోధనాలయమునన్ బ్రఖ్యాతిగా లభ్యమై
మా జన్మల్ తరియింపఁ జేసెను కదా! మా భాగ్యమే భాగ్యమౌన్.
మేమీ ప్రాంగణమందు సంచరిలుచున్ మేలైన సద్భావికిన్
నీమంబొప్పగ విద్య నేర్చితిమి సన్మిత్రాళితో గూడి. మా
క్షేమంబెప్పుడు చూచినారు గురువుల్, శ్రీశేషశాయాదులున్.
మేమాస్దద్గురు పాదదర్శనమునన్ మేల్గాంచగా కోరుచున్----
సోమేశ్వరాది మిత్రులు  -  ప్రేమామృత మొలుక మరల విద్యాజననిన్
మేమెల్లఁ గలియఁ బిలిచిరి  -  క్షేమంబులు తెలియ, గురుల సేవింప నటన్.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కలాశాల ప్రాంగణము.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కలాశాల ముఖ ద్వారము.
విద్యార్థులకు అన్నార్తిని పోకార్చే శ్రీసింహాచలవరాహ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానముసత్రవు.
కలాశాలలో తీర్చి దిద్దఁబడిన కొందరు సాహితీ మూర్తులు
అలనాడచ్చట విద్య నేర్చితిమి.  స్నేహార్ద్రంపు చిత్తంబులన్
నిలిచెన్ బ్రేమ సుమాధురుల్. గతములన్ నేడిట్లు మేల్కొల్పుచున్
కలగా నిల్చిన నాటి గుర్తు లెదుటన్ కన్పించు నన్నంతనే
తులలేనట్టి ముదంబు తోడ నెదయే తూలెన్ మనోజ్ఞంబుగా.
ఎంతట తెల్లవారునని, ఎప్పుడు మిత్రులఁ జేరుదంచు క
వ్వింతలతోడ నామనసు వేగిరపెట్టుచు నుండె నద్దిరా!
ఇంతటి లౌల్యమా మదికి? ఏమని చెప్పుదు నాటి మిత్ర, స
ద్భ్రాంతిగ నిల్చినట్టి గురుపాద సుదర్శన భాగ్యమెన్నుచున్.
సరే ఇంత వయసొచ్చినా నా ఆరాటంమాత్రం అంతా యింతా కాకపోవటం నాకు వింతగా ఉన్నా ఇది మాత్రం యదార్థం. సరే ఎల్లుండి జరుగబోయే మాపూర్వ విద్యార్థుల సత్సమ్మేళనము గురుదర్శనానుభూతి మున్నగు విషయములను నేను ఈ కార్యక్రమానంతరం పంచగలను. విజయనగరం వెళ్ళి వస్తానండి మరి. నమస్తే.
జైహింద్.