Wednesday, September 23, 2026

తెలిసి మసలు బాలా. ... రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

తెలిసి మసలు బాలా

                                         రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                       జుత్తాడ,


1.ఉ:-అక్షర జ్ఞానమే యిసుము యార్జన లేని!జనాళి సీమ యం

        దక్షర కుక్షియే?గనగ!దక్షుడుగా!జరియించి తీరు! తా

        శిక్షిల జేయు!సర్వులను!దర్ప మదాహృతి!పొంక బింకమున్!

       చక్షులు నెత్తి కెక్కు!నర సామ్యత గోర దలంచ డెన్నడున్?


2.ఉ:-తుచ్ఛుల సంఖ్య పెచ్చునకు!తోరపు శిక్ష విధింపు లేనిచో?

        త్రచ్చుదు రెల్ల జీవములు!తామె!ఘనంబను గర్వ కారణన్!

         మచ్చుకు నొక్క నేని?భువి!మట్టక యున్నచొ?ధర్మ దేవతే?

        చచ్చుబడు న్భరింపగ!శక్యమె?జాతికి చీడ!గాదొకో?


3.ఉ:-తుక్కు దొలంగ జేయగను!దుష్టుల శిక్ష విధించ!నేకమై!

        గ్రక్కున!చావ బాదవలె!గ్రన్నన శాంతి ఘటించి!లోకమే?

       చక్కని సత్ప్రభావమున!సర్వ సమున్నతి! లోక ఖ్యాతినిన్!

       మిక్కిలి కీర్తి! గాంచు గదె?మేటిని ధీటుగ!లోక మొప్పదే?


4.ఉ:-కక్షకు దక్ష బూను టది!కాటికి కాలును జాచుటే?యగున్!

        పక్షము వర్గ పోరులకు!పట్టు ఘటింపగ!జూచు నైజమే?

        శిక్ష విధించి తీరదొకొ?చిందరయౌ!భువి!స్వార్ధ రోగతన్!

       చక్షులు చిమ్మ చీకటగు!శీఘ్ర విపత్తులు!హేతు భూతమై!


5.ఉ:-చక్కటి జీవ యాత్ర గన!సర్వ సమత్వము!చేత లొప్పుచో?

        అక్కజ మైన కీర్తి భువి!అక్షర సత్యము!నిల్చి తీరదే?

        డొక్కను!శుద్ధి జూప వలె?డొల్ల ప్రలాపన!దేశ ద్రోహమౌ!

       చిక్కకు!పాప సందిటను!ఛీదర మేర్చకు!భావి పౌరుడా!

జైహింద్.

No comments: