కి.శే. బ్రహ్మశ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రిగారు జీవిత చరిత్ర
శ్రీయుతులు,వాసా వేంకట రామయ్య,వేంకమాంబ
దంపతుల జ్యేష్ట పుత్రుడు,
జననము,-:-3.11.1882. శ్రీకాకుళం
జిల్లా(ప్రస్తుతం విజయనగరంజిల్లా పోతాయవలస
వీరి స్వస్ఠలము,
విద్యాభ్యాసము:-శాస్త్రి గారి బంధువైన
శ్రీ సామ వేదం షణ్ముఖ శాస్త్రి గారి తాతగారైన,అన్నప్ప
శాస్త్రి గారి వద్ద సాలురులో వేద
సమాజమ్ అనే సంస్కృత సాఠశాలలో కావ్యాలలో లఘు త్రయి యై బృహత్తములో
నైషధంవరకు,అలంకారంలో ప్రతాప రుద్రీయం పూర్తి జేసిరి,
ఉద్యోగము
=======
పర్లాకిమిడి రాజుగారి యాస్థా నములో,యితర ప్రాంతాలలోకూడ
సంస్కృత పండితులుగా ప ని
జేసిరి,,అప్పుడు మద్రాసు (ఉమ్మడి
యాంధ్ర)లో నున్నపుడు,కపాలీశ్వర విభూతి,తెలుగు తాత్పర్య
సహితము విరచించిరి,
శాస్త్రి గారి సంస్కృత రచనలు,
====================
1.శ్రీ కాశీనాధ నాగేశ్వరాయ జీవిత చరిత్ర
2.శ్రీ కోదండ రామ క్షేత్ర మాహా త్మ్యము,
3.శ్రీ కపాలీశ్వర విభూతి,
4.శ్రీనివాస విభూతి,
5.శ్రీ తారకేశ్వర మహాత్మ్యము,
8.శ్రీ లోకమాన్య చరితమ్,
7.గాయత్రీ స్తుతి రత్న మాల,
8.శ్రీరామ రాజ్యమ్!
ఆంగ్లేయ ప్ర భావం యెక్కునగా యున్న
యారోజులలోసంస్కృత భాషకు పండిత రాయ
జగన్నాధ శాస్త్రిగారి యనంతరము,సంస్కృత
కవితకు గ్రహణం పట్టిందని వాపోయి
అతని సాధ్యాయుడు శ్రీ అయ్యల సోమయాజుల గణ
పతి శాస్త్రిగారితో వేగ వతి తీరాన
చంద్ర గ్రహణము వీడు సమయాన సంస్కృత కావ్య
రచనకు శపధము నూనిరి,
సంఘసేవ
=======
నాడు శ్రీ గిడుగు రామ్మూర్తిగారితో కలిసి
వ్యావహారిక భాషా సమరములోబాసటగా నిల్చి
గ్రాంధిక వాదులతో పత్రికలలో వాధోప వాదాలు
జేసిరి. అప్పట్లో శ్రీకృష్ణ తత్వము, వాల్మీకి
రామాయణములపై ప్రవచనములు జేసిరి.
వీరి లోకమాన్య చరితమ్ అనే సంస్కృత రచన సుమారు 20 సంవత్రమౌల క్రితము
ఇంటర్మీడియట్ సంస్తృత పాఠ్యాంశముగాగైకొన బడినది,
వీరికి జ్యోతిష శాస్త్ర ప్రావీణ్యత గలదు. ఈయన
బాల్య వివాహములకు వ్యతిరేకముగా
రజస్వ
లానంతర వివాహాలను,హరవిలాశ శారద గారు బాల్య వివాహ మరికట్టు
బిల్లునకు పార్లమెంటులో శాస్ర్ర
ప్రామాణికములు సహేతుకముగాజూపి
సహక రించిరి. శాస్త్రిగారు తన వాదనను సమర్ధిస్తూ
యనేక ప్రసంగములు జేసిరి,
షంకలన
కర్త
వల్లరభలఝల అప్పల నరసీంహ
మూర్తి,
జుత్తాడ,
ఆర్యా
నమోవాకములు,
బ్రహ్మశ్రీ వాసా సూర్య నారాయణ
శాస్త్రి గారి రచనల నాధారముగా
సేకరించి పంపు చున్నాను,తమరు పరిశీలించి
తమ బ్లాగ్ నందుంచ ప్రార్ధన.
ఇట్లు!
తమ విశ్వస నీయుడు,
మూర్తి,జుత్తాడ,
జైహింద్.
No comments:
Post a Comment