Friday, July 14, 2023

భిక్షాటన చేసి చదువుకున్న ASP ( AR ) శ్రీ హనుమంతుగారు,... అనంతపురం.

 

ఇది కథ కాదు . భిక్షాటన చేసి చదువుకున్న ASP ( AR ) అనంతపురం. అవును తల్లి,కొడుకు ఇద్దరూ ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేసిన రోజులవి .  నిన్న డిస్కవర్ అనంతపురం ,AGS foundation వారు నిర్వహించిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు పుస్తకాలు,డిజిటల్ slates పంపిణీ కార్యక్రమంలో మన అనంతపురం ASP హనుమంతు గారు సుమారు 400 మంది పిల్లతో పంచుకున్న జీవన పోరాటం అందరి కళ్ళలో ఒక్క సారిగా నీళ్ళు తిరిగాయి.  ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి తాను భిక్షాటన చేసే వాడిని అని వందల మంది ముందు చెప్పడానికి ఎంత గుండె ధైర్యం కావాలి ? ఆ దైర్యం వెనకాలా ఓ పది మంది పిల్లలు మారాలి ఆన్న ఆలోచన ఎంత గొప్పది  ఆయన ఏమన్నారో మీరే చూడండి . శోకం నిండిన జీవితాన్ని ఎలా స్లోకమయ జీవితంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది అనేదానికి హనుమంతు గారు ఓ నిలువెత్తు నిదర్శనం. ఆదర్శమూర్తులయిన వారికీ వారి మాతృదేవికీ నా ప్రణామములు.

No comments: