Tuesday, August 29, 2023
Monday, August 28, 2023
Thursday, August 24, 2023
* అన్న నివేదనల పేర్లు*
* అన్న నివేదనల పేర్లు*
1)కుశలాన్నం =పులగం
2)చిత్రాన్నం=పులిహోర
3)క్షీరాన్నం=పరమాన్నం
4)పాయసం=పాయసం
5)శర్కరాన్నం= చక్కెరపొంగలి
6)మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాలపొంగలి
7)దధ్యోదనం= పెరుగు అన్నము
8)తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం
9)శాకమిశ్రితాన్నం=కిచిడీ
10)గుడాన్నం = బెల్లపు పరమాన్నం
11)సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం
(గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)
12)గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు
13)గుడమిశ్రిత తండులపిష్టం= చలిమిడి
14)మధురపానీయ=పానకం
15)పృథక్=అటుకులు
16)పృథకాపాయస=అటుకుల పాయసం
17)లాజ=పేలాలు
18)భక్ష్యం= పిండివంటలు
19)భోజ్యం= అన్నము మొదలగునవి
20)వ్యంజనం=పచ్చడి
21)అపూపం=అరిసెలు లేదా అప్పములు
22)మాషచక్రం= గారెలు
23)లడ్డుక,= లాడూలు
24)మోదకం= ఉండ్రాళ్ళు
సంస్కృత పదములలోఁ గొన్నిటికిఁ దెలుఁగు కవులు ప్రయోగించినట్టి శుద్ధాంధ్ర సమానార్థక పద పట్టిక.
సంస్కృత పదములలోఁ గొన్నిటికిఁ దెలుఁగు కవులు ప్రయోగించినట్టి శుద్ధాంధ్ర సమానార్థక పద పట్టిక. కొన్ని చోట్ల నక్షత్రపు గుఱుతులిడి సంస్కృతపదములిందుఁ బొందుగఁ బొందింపఁబడె. ఈ పదజాతమాంధ్ర పదపారిజాతమన జాతముగఁ గననగును. ( ఓగిరాల రంగనాథకవి, కాకినాడ దగ్గరలోని నీలపురి వాస్తవ్యుడు)
బహుమానము = మన్నన, మన్నిక, మన్నింపు,
తిరస్కారము = ఆలసు, ఎల్లిదము, చౌక,
క్షాంతి = ఓరుపు, సైరణ, సైవుడు, తాలిమి, శాల్మి, తాళిక,
ఈర్ష్య = ఓర్వమి, ఈర సము, ఈస, ఈసు, గూళు,
వైరము = వేరము, పగటు, ఒంటమి, పగ, ఓమ్మమి, కంటు,
ప్రతి వైరి= సూడు (పగవాడు)
• తీక్షకోపము - రవరవ
• ప్రణయకోపము = పొలయలుక
మాత్సర్యము - కరకరి, చలము, మచ్చరము,
• శోకము - ఆలము, ఆకురు, కస్తి
కోపము - కనలు, బైడాలము, కనుపు, కినుక, కినుకము, ఆలుక, చిందు,కాంతాళము, రో సము, చిందర, కనరు, కసరు,
కోపమౌనము=మోడి
• సుస్వభావము = ఈలువు
• భక్తి = బత్తి
ఉన్మాదము = వేళాకోళము, త్రిక్క రిమ్మ, రిబ్బ, వెఱ్ఱి, పిచ్చి, ఉమ్మాదము,
ప్రేమ =నెయ్యము, నెయ్యమి, నెమ్మి, నేస్తము, నెనరు, ఎలమి, మేలు, కూరిమి, చెలిమి, అరితి, మచ్చిక, చాళి, ప్రేముడి, మక్కువ,
ఎడతెగని ప్రేమ =మరులు
• యువయవతులచే భరింపఁబడిన ప్రేమ = వలపు
వాత్సల్యము = ఆర్మిలి, ఆయర్లు,
* విస్మృతి = మఱుపు, మఱుకువ,
కాంక్ష = ఇచ్చ, కాయువు, కోర్కె, ఏఁకట, కోరిక, ఆస,
ఆర్థాశ = ఆడియాస
• స్మృతి = తలంపు
• స్మృతివి శేషము=పోవె
మనోవ్యధ = ఆంగలార్పు, అంగద, నెంజిలి, మనికితము, తుందుడుకు,
ఉత్కంఠ = అగ్గలిక
• ఉత్సాహము= హాళి, జతనము,
• అధిక క్రీడ = చెరలాట
కపటము = గబ్బ, గౌరు, గబుసు, కైపు, కిటుకు, కౌడు, డబ్బు, కబడు, డంబు,
అపదేశము - నెపము, నెవము,
• నిష్క పటుఁడు=నిక్కవుఁడు
స్వప్నము = కల
• విలాసము= లలి (ఇది యవ్యయము)
• హిక్క = వెక్కు, వెనటు,
ప్రమాదము - ఏమరి పాటు, ఏమరిక, మోసము, పరాకు,
అవధానము = ఎచ్చరిక, ఎచ్చరింపు, ఏవ, పదిలము, హవణిక, పోణిమి,
కుతూహలము = వేడ్క, వేడుక,
విలాసము = బిత్తరము, కులుకు వెళము, వేళకు, గునుపు, గోనవు, మురిపెము, మురువు, సొగసు, నిక్కు, మిటారింపు, నీటు, మిటారము, తెక్కు, తెక్కరము, ఎమ్మె, టెక్కు, టీకు, 'హెరంగు, హెరుగు, చి స్నె, పొలుపు, పొలపము, ఒయ్యారము; ఒయారము, బులుపు, హెూయలు,
పరిహాసము = శ్రేణి, తచ్చన, కేరడము, గేలి, 'మేలము, మందె మేలము, ఆట, త్ర స్తరి, హాళి,
క్రీడ = త్రుళ్లాట, గొండ్లి,
• సహక్రీడ = సయ్యాటము, సయ్యాట,
సంభ్రమము = ఉత్తలము, తమకము, తహతహ, తమి, తత్తరము, చిడిముడి, తరితీపు, తరము, చిడిముడిపాటు,
రోమాంఛము = పులకలు, పులకరము, గద్గురు, గగురు, గరుదాల్పు,
రోదనము = ఏడుపు, ఏడ్పు, గోడు,
•జృంభణము = ఆవలింత, ఆవలింత,
నిద్రావి శేషము - నిదుర తూఁగు, తందర,
• నిశ్చయ స్వప్న ము=నిక్కల
నిద్రాసమయమున నుత్పన్నమగుధ్వని = గురక, గురు పెట్టు,
స్వప్న ప్రలపనము = కలవరింపు కలవరింత, కలవలము, కళవళము,
అవబోధము = 'మేలుకొనుట, మేల్కొనుట, మేలుకొంట, "మేలు కొంచుట, మెలకువ, (ఉపవడము)
భ్రుకుటి = బొమముడి
*స్వభావము=సాజము
• అధికకంపము=వడవడఁకు
కంపము = వలి, వలిపిడి, వడఁకు
*పర్వము - పబ్బము, పండుగ, పండువ,
క్షుద్రదేవతోత్సవవి శేషము = లేవ, తంతు, సాకు, సయంపు, జాతర, కొలుపు,
పొతాళలోకము = పాఁపజగము, నేలయడుగు,
• దేవతా వేశము= సివము
బిలము = విలము, సురంగము, సురంగ,
కందరము = తూము, తూఁటు, తూ పరము, దొండ, చిల్లి, తొల్లి, కన్నము, కనుము, (గ్రంత)
సంపూర్ణము.
ప్రాణికోటి ఉద్భవించింది మత్స్యముల రూపంలో !
ప్రాణికోటి ఉద్భవించింది మత్స్యముల రూపంలో ! సృష్ఠి అంతం చెందినా మత్స్యములు జీవించి ఉంటాయి ! తిరిగి సృష్ఠి ఉద్భావించాలంటే మత్స్యముల మూలంగానే జరుగుతుంది !
వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడ గలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు.
ఆయన దోసిలిలోకి ఒకచిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ‘ఓరాజర్షీ! నీవు దయాత్ముడివి... నన్ను మింగేసే పెద్దచేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడాని కి నేను నీ చేతిలోకి వచ్చాను’ అంది. దానితో ఆ రుషి తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తరవాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అదీ సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగానీ నదిగానీ సరిపోక సముద్రంలో వేయగా, సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆచేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. "శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించుశ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి? " అని రాజుప్రశ్నించాడు.
అప్పుడా మత్స్యం ఇలా జవాబిచ్చింది. "రాజా! నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తియై రాత్రి కావస్తున్నది. అప్పుడు సకల ప్రపంచమూ జలమయమౌతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్నూ, తపోమూర్తులైన మునులనూ, ఓషధులను, తిరిగి సృష్టికోసం అవుసరమైన మూలబీజాలనూ పదిలం చేసి నా శృంగము (ఒంటి కొమ్ము) తో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటింతును" అని చెప్పెను.
ప్రళయం సంభవించి, ధరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పు డు, లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడ ు ధగధగమని కాంతులీనే సువర్ణ వర్ణంగల పెద్దచేపగా అవతరించి, మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక- సప్త రుషులను అందులోనికి పంపి, వాసుకిని తాడుగా ఉపయోగించి, దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకునౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశదీకరిస్తున్న ాయి.
సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయంసంధ్యలో రవ్వంత కునుకుతీసెను. ఇదే అదనుగా చూసుకొని హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరుకెత్తాడు. శ్రీమన్నారాయణుడ ు మత్స్యరూపంలో ఆ రాక్షసుని వెదకి, చంపి, వేదములను తిరిగితెచ్చి బ్రహ్మకిచ్చాడు.
ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)--
ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్
ఆ శ్రీమన్నారాయణున ి సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)--
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్ శయ్యాపహా!
మత్స్యనారాయణుడు తన అవతారంలో సమాజ హితానికి, అభివృద్ధికి మూలకందాలైన వేదవిజ్ఞానం భరత జాతికందేలా అనుగ్రహించాడన్న ది పురాణగాథల సారాంశం. చైత్ర శుద్ధ తదియ మహావిష్ణువు మత్స్యావతారం ధరించిన రోజు. ఆనాడు మత్స్య జయంతి జరపడం ఆనవాయితీగా వస్తోంది. మత్స్యావతారంలో విష్ణువు పూజలందుకునే ఏకైకదేవాలయం మనరాష్ట్రంలోనే ఉంది. చిత్తూరు జిల్లా నాగలాపురంలో స్వామిని వేదనారాయణుడిగా కొలుస్తారు. వేదరక్షణను పారమర్ధక భావనతోనే కాక, మరోరకంగానూ విశ్లేషిస్తారు. ఉప్పునీటితో నిండి ఉండే సముద్రంలో లోతుకు వెళ్లినకొద్దీ ఆణిముత్యాలు, అరుదైన నిధులు లభ్యమవుతాయి. సముద్రానికి అట్టడుగున ఉన్న వేదాలను శ్రీహరి తీసుకువచ్చి బ్రహ్మకందించాడు . సముద్రాన్ని అజ్ఞానానికి అర్ధంగా తీసుకుంటే, వేదాలు విజ్ఞాన సర్వస్వం! ఇందులోని సందేశం ఏమిటంటే- అజ్ఞానపు తెరలు తొలగించుకుని, లోపలికి వెళ్లినకొద్దీ, మనకు అత్యంత ఆవశ్యకమైన, ఉపయుక్తమైన జ్ఞాననిధి సొంతమవుతుంది! ఈ విషయాన్ని ఆకళింపు చేసుకుని, మానవాళి అజ్ఞానపు తిమిరాన్ని తొలగించుకుని, విజ్ఞానపు దివ్వెలు వెలిగించుకోవాలన ి ‘మత్స్యావతారం’ ప్రబోధించినట్లు గా భావించాలి
Subscribe to:
Posts (Atom)