Tuesday, August 8, 2023

దబ్బకాయ నిలవపచ్చడిఅస్సలు మిస్ అవ్వకండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వుంటుంది ...

రామామృతంబు గొని శ్రీమద్గజేంద్రుఁడిటుప్రేమన్ నటించె గనరా!....... రచన... చింతా రామకృష్ణారావు.

 

జైశ్రీరామ్.
అశ్వధాటివృత్తము.  
రామా! రమారమణ! రామా! రమా వినుత ! రామా! రమా కలిత! రా!
రామా!రమాహృదయ!రామా!రమాస్పదుఁడ!రామా!రమాప్రియుఁడ!రా!
రామా జగద్విజయ! రా! మా మొరల్ వినగ,  రామా! నినున్ గొలుతు రా
రామామృతంబు గొని శ్రీమద్గజేంద్రుఁడిటుప్రేమన్ నటించె గనరా!
జైహింద్.

Monday, August 7, 2023

అబ్బబ్బా... ఆడా.. మగా గొంతుకులతో ఎంతబాగాపాడాడీ అబ్బాయి?

 


అధిగమించకు నీ ధర్మాన్ని. ఆచరించు నీ ధర్మం. ధర్మో రక్షతి రక్షితః

 #ధర్మం” అంటే ఏమిటి?


ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం…

వివాహ ధర్మం!* 


తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం…

భార్య ధర్మం!* 


నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం…

మిత్ర ధర్మం!* 


సోమరితనం లేకుండటం…

పురుష ధర్మం!* 


విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం…

గురుధర్మం!* 


*భయభక్తులతో విద్యను నేర్చుకోవటం… *

శిష్యధర్మం!* 


న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం…

యజమాని ధర్మం!* 


భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం….                                       

ఇల్లాలి ధర్మం!* 


సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం…

సైనిక ధర్మం!* 


వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం…

బిడ్డల ధర్మం!* 


తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం ….              

తండ్రి ధర్మం!* 


తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరుప్రతిష్ఠలు తేవటం….                                           

బిడ్డలందరి ధర్మం!* 


తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం…

 ప్రతివాని ధర్మం!* 


తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం…

సంసార ధర్మం*


అసహాయులను కాపాడటం…

మానవతా ధర్మం!*


చెప్పిన మాటను నిలుపుకోవటం…

సత్య  ధర్మం* 


వార్ధక్యం వయసా నాస్తి మనసా నైవ తద్భవేత్‌.... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

ఏది ముసలితనం? ఎవరు వృద్ధులు? 🥰  

శ్లో.  వార్ధక్యం వయసా నాస్తి - మనసా నైవ తద్భవేత్‌ 

సంతతోద్యమ శీలస్య - నాస్తి వార్ధక్య పీడనమ్‌. 

తే.గీ.  వయసుతో రాదు వృద్ధాప్య బాధ, కనఁగ,

మనసుతోడను రాదది, మనము సతము

నిరుపమోద్యమ మార్గాన నెగడుచున్న,

నిత్యసంతోషి యువకుఁడే నిత్యమిలను.

భావము.  ముసలితనం వయసులో లేదు, వయస్సుతో రాదు. మనస్సులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం. 

ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం, దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే.  70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు. ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు. నిత్యవ్యాయామం,యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం,సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం,మంచిమాటలు ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు

జైహింద్.