Saturday, April 26, 2025

జ్ఞాపకాల దొంతర....... ఎవరో వ్యక్తంచేసినది సేకరించి ఇక్కడుంచాను.

జైశ్రీరామ్. 

జ్ఞాపకాల దొంతర

రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మనది . ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ. 

SSC పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం మనది . అద్దెకి బుక్స్ (నవలలు ) తెచ్చుకుని చదువుకున్న తరం మనది. సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టిన కాలం మనది.

గెజిటెడ్ ఆఫీసర్లు అయినా, కాలేజీ లెక్చరర్స్ అయినా సైకిళ్లు  తొక్కుకుని ఆఫీస్ లకు వెళ్లిన రోజులవి. అందుకే డ్రాయింగ్ రూమ్ జిమ్ములలో సైకిల్ తొక్కే అవసరం పడేది కాదు.

చేబదుళ్లకి కాదేదీ అనర్హం. పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో చెక్కర అయినా, స్పున్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ అయినా.

అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు. రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం క్యూ లో నిలబడి డ్యూయెట్లూ, పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి.

ఇంటి ముందుకు

కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించేవాడు,ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు. మేకప్పులు అంటే  తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు. గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు. మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు. బస్టాండ్ లో చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ. ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ.

వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు. "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు,  రబ్బర్ గాజులు, రిబ్బన్లహో". అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు. "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం". అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, ముందు చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న చూపించిన గిన్నె ఇచ్చి పోయేవాళ్లు. గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి. కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం. పరుపులేకుతాం. గిన్నెలకి సొట్టలు తీస్తాం. బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం. అరువు మీద  చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు. ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి.

మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు... సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..

రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది. భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!

అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే, దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం.. తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం.... ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు కున్నాం!

ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు....  ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న గుర్తులు.

ఇప్పటి కాలం పిల్లలకు 

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

వీధిలో పిల్లల అల్లరి లేదు

తాతలు ఇచ్చే చిల్లర లేదు

ఏడు పెంకులు ఏమైపోయే

ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని నేటి జీవితం

మానవాళికే మాయని మరక.

అందుకే మన తరం అదృష్టవంతులమ్*!         

1950 -70 లో పుట్టిన మనం ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మన తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న సామాజిక -ఆర్థిక పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది... అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది. పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.  పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము. 

దాదాపు అందరం భట్టిపంతుల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మన లో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు కూడా లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. పావలా/అర్ద రూపాయి ఇచ్చి నేల, బెంచి టిక్కెట్ కొనుక్కుని తెరకు దగ్గరగా  కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో. అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట, రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం.

ఈ నాటికీ దాదాపు మనం అందరం 

✌🏻55- 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే! అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకున్న వాళ్ళమే.   

అందుకే మనకన్నా అదృష్టవంతు లెవరుంటారు?

*అందుకే వీలయినప్పుడల్లా కలుసుకుని ముచ్చటించుకుందాం.

జైహింద్.

Tuesday, April 22, 2025

"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం" అన్నది విష్ణుమూర్తి మంత్రమా లేక వినాయకుడి గురించిన మంత్రమా?

జైశ్రీరామ్

 "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం" అన్నది విష్ణుమూర్తి మంత్రమా లేక వినాయకుడి గురించిన మంత్రమా? దీనిని చిన్న పిల్లలకు ఎందుకు నేర్పిస్తారు?

శుక్లాంబధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే॥

అన్న శ్లోకం కొన్ని వందల యేళ్లనుండీ భారతీయుల నోళ్లల్లో నానుతూ వస్తోంది. అయినా, ఏ మాత్రమూ తన తీపిని కోలుపోలేదు. దీని అర్థాన్ని నిర్ణయించే ముందు, ఈ శ్లోకం వాఙ్మయంలో ఎక్కడెక్కడ ఉందో పరిశీలిద్దాం.

పద్మపురాణం. వేదవ్యాసుడు రచించినటువంటి పద్మపురాణం లో నాలుగవదైప పాతాళఖండంలో పురాణమాహాత్మ్యకథనం అనే అధ్యాయంలో శివరాఘవసంవాదంలో శివుడు చెప్పినట్లుగా ఈ శ్లోకంఉంది. ఇందులో శివుడు పురాణశ్రవణమెలా చేయాలి అన్న దానిని వివరిస్తూ, పురాణాన్ని వ్యాఖ్యానించే వ్యక్తిని భక్తిగా ఇంటికి రావించాలనీ, అతడిని సత్కరించాలనీ ఇత్యాది విధివిధానాన్ని చెబుతూ, ముందుగా దేవతలను పూజించాలని చెబుతూ ఈ శ్లోకాన్ని చెప్పాడు. అయితే దీని తరువాత వచ్చిన శ్లోకపంక్తి - సభాసదశ్చ సంపూజ్య గణేశం ప్రార్థయేత్తతః అని. అంటే, తరువాత గణేశుడిని ప్రార్థించవలెను అని దానర్థం. తరువాత పార్థించడమేమిటి? పైన శ్లోకంలో ప్రార్థించాము కదా అని ఒక ప్రశ్న. పై శ్లోకాన్ని ఉపయోగించే శివుడు ప్రార్థించమంటున్నాడు అని ఒక అన్వయం చెప్పవచ్చు. కాదు, పై శ్లోకం విష్ణుపరమని ఆయన ఉద్దేశం, కనుక పైదీ క్రిందదీ వేరూ అని కూడా వాదన చేయవచ్చును. శ్లోకమున్నది కానీ అది విష్ణుపరమా, గణపతి పరమా అన్న అర్థం పద్మపురాణం లో లేదు అని ప్రస్తుతానికి రూఢి చేసుకుందాం.

స్కాందము. పురాణాలలో అతిపెద్దదైన స్కందపురాణంలో ఐదవదైన అవంతీఖండంలో విష్ణుభక్తి మాహాత్మ్యాన్ని వివరిస్తూ బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకం తరువాతి శ్లోకం ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి మరొకటి - లాభస్తేషాం జయస్తేషాం అన్నది. ఇది జనార్దనుడి మీద శ్లోకమని అందరికీ తెలిసినదే. తరువాత శ్లోకం - అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజ్యతే యః సురైరపి, సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః అని ఉన్నది. అంటే, దేవతలు సైతం, తమ కోరికలు తీరడానికి ఎవరిని పూజిస్తారో, అటువంటి సర్వవిఘ్నాలనూ హరించేటువంటి గణాధిపతికి నమస్కారము అని. ఇది వినాయకప్రార్థన అనుకుంటే, పైన ప్రారంభశ్లోకం వినాయకుడిదే అని ఎలా అంటారు? కనుక అది విష్ణుసంబంధమైనదే అనవచ్చు. లేదా, ఏం, రెండుసార్లు వినాయకుడి ప్రార్థన రాకూడదని నియమమున్నదా? రావచ్చు అని కూడా చెప్పవచ్చు. అదే స్కాందపురాణంలో మూడవదైన బ్రహ్మఖండం మొదటి అధ్యాయమైన సేతుమాహాత్మ్యవర్ణనము ఈ శ్లోకంతోనే మొదలవుతోంది.

విష్ణుసహస్రనామము. సుప్రసిద్ధమైన విష్ణుసహస్రనామంలో ప్రారంభంలో ఈ శ్లోకం వినవస్తుంది. ఇక్కడ కొంతమంది ఇది వినాయకుడి ప్రార్థనే అని అంటే, కొంతమంది ఇది వినాయకుడి ప్రార్థన కాదు, అలా అని విష్ణుమూర్తి ప్రార్థన కూడా కాదూ, వైకుంఠంలో వైష్ణవగణాలకు అధిపతి అయిన విష్వక్సేనుడని ఒకాయనున్నాడూ, ఆయనకూడా ఏనుగుతలను కలిగి, విఘ్నాలను పోగొడతాడూ అంటూ ఇది విష్వకేనస్తుతి అంటూ తృతీయమార్గంలో అన్వయాలు చేసారు. అయితే నేను పరిశీలించిన కొన్ని మహాభారతప్రతులలో, అనుశాసనికపర్వంలో ఎక్కడైతే విష్ణుసహస్రనామం చెప్పబడిందో ఆ చోట ఈ శ్లోకం లేదు. కనుక ఇది వైష్ణవపరమా, వినాయకపరమా అన్నది తెలియదు.

ఇతరగ్రంథాలు. మనకు తెలిసినటువంటి నోములూ, వ్రతాలూ, ఇతర పూజావిధివిధానాల వాఙ్మయం ఈ శ్లోకంతోనే మొదలవుతుంది. దానితో పాటుగా, ఫలదీపిక వంటి జ్యోతిష్యగ్రంథాలూ, అహిర్బుధ్న్యసంహిత, సాత్త్వతసంహిత ఇత్యాది సంహితాగ్రంథాలూ, వందలాదిగా దేవతా స్తోత్రాలూ ఈ శ్లోకాన్ని తమ మొట్టమొదటి శ్లోకాలలో ఒకటిగా పెట్టుకున్నాయి. అయితే, పెద్దల నోళ్లనుండి వినేటపుడు వినాయకుడి అర్థమే ధ్వనిస్తుంది కానీ, విష్ణుమూర్తి అర్థం ధ్వనించదు వీటిల్లో.

ఇప్పుడు అసలు ఈ శ్లోకానికున్నటువంటి అర్థాన్ని పరిశీలిద్దాం.

శుక్ల = తెల్లనైనటువంటి, అంబర = వస్త్రమును, ధరం = ధరించినవాడినీ; విష్ణుం = విష్ణువునూ; శశి = చంద్రుడితో సమానవైనటువంటి/చంద్రసంబంధమైనటువంటీ, వర్ణం = రంగు కలిగినవాడినీ; చతుర్భుజం = నాలుగు భుజాలతో విరాజిల్లేవాడినీ; ప్రసన్న = నిర్మలమైనటువంటి, వదనం = ముఖము కలిగినవాడినీ; సర్వ= సమస్తములైన, విఘ్న= ఒక పని చేసేటప్పుడు వచ్చే అడ్డంకుల యొక్క, ఉపశాంతయే = ఉపశాంతి (శాంతించుట) కొరకు; ధ్యాయేత్ = ధ్యానము చేయవలెను.

వినాయకుడి పరంగా అన్వయాలు -

ఈ శ్లోకం వినాయకుడిది అని చెప్పడానికి ప్రధానమైన ఆధారాలు రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆదౌ పూజ్యో గణాధిపః అన్న సూక్తిననుసరించి, ఈ శ్లోకం చాలా రచనలలో మొదటగా చేరి ఉండటం. రెండు, సర్వవిఘ్నోపశాంతయే అన్న వాక్యం. ప్రసిద్ధంగా గణపతి విఘ్నాలకు అధిపతి. విఘ్నాలను తొలగించడం కోసం మన పెద్దవాళ్లు గణపతిని చిలవలు పలవలుగా ప్రార్థించారు. ఈ ప్రార్థన విష్ణువును చేసినట్లుగా ఎక్కడా కనపడదు.

మరి, వినాయకుడికి అన్వయించడానికి ఈ శ్లోకంలో ఉన్న అడ్డాలు ఏమిటంటే -

విష్ణుం అన్న పదం - వినాయకుడిని మనకు తెలిసినదానికి విరుద్ధంగా లకుమికరా (లక్ష్మీప్రదుడా - లక్ష్మీగణపతి మనకు తెలుసును) అనీ, ఆంజనేయావతారం (హనుమంతుడి అవతారమనీ) అన్నట్లు మనకు తెలుసు. కానీ విష్ణువన్న పదం వినాయకుడికి వాడబడటం, అదీ ఇంత సూటిగా అని ఇంకెక్కడా మనము చూడము. అయితే, దీనికి పెద్దలు చెప్పిన వివరణలు - ఒకటి, వినాయకుడూ విష్ణువూ ఒక్కరే అన్న సమన్వయమైన అర్థాన్ని ఈ శ్లోకమిస్తోందని. రెండు, విష్ణువంటే ఇక్కడ విష్ణుమూర్తి అని కాదు, వ్యాపనశీలః విష్ణుః అనే వ్యుత్పత్తిననుసరించి వినాయకుడు సర్వాంతర్యామి అన్న అర్థం ఇందులో ఉందని. ఈ అన్వయం సమంజసమైనదే.

ఈ విష్ణుం అన్న పదం అడ్డం వచ్చిందని భావిస్తూ మరికొంత మంది ఈ శ్లోకానికి శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం అన్న పాఠాంతరాన్ని పెట్టి, ఏ గొడవా లేదని ఊరుకున్నారు.

శశివర్ణము - వినాయకుడు ఏ రంగులో ఉంటాడు అంటే, అథర్వణవేదంలోని గణపత్యుపనిషత్తు ఆయన్ను "రక్తం, లంబోదరం, శూర్పకర్ణకం, రక్తవాససం, రక్తగంధానులిప్తాంగం, రక్తపుష్పైస్సుపూజితం" అని వర్ణించింది. గణపతి ఎర్రగా ఉంటాడట, ఎరుపు బట్టలే వేసుకుంటాడట, ఎరుపుగంధం పూసుకుంటాడట, ఎర్రని పుష్పాలతో పూజించబడతాడట. మరి ఈ శ్లోకంలో ఆయన్ను తెలుపు బట్టలు ధరించినవాడనీ, తెల్లగా ఉంటాడనీ అన్నారే? అంటే, గణపతికి రూపాలనేకం ఉన్నాయి. తొమ్మిది రూపాలను కొంతమంది చెబితే, కొంతమంది ఇరవై రూపాలను చెప్పారు. కొన్నింటిలో గణపతికి మూడవకన్ను ఉంటే, కొన్నింటిలో చంద్రవంక ఉంటుంది. అంచేత గణపతి తెల్లగా ఉండడనీ, తెలుపు బట్టలు కట్టుకోడనీ చెప్పలేము. కనుక ఇది గణపతికి సాధ్యమయ్యేదే. అంతే కాక, మనకు సత్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణాలు తెలుసు. వాటిలో సత్త్వము జ్ఞానానికి సంకేతం. దానికి వాడే రంగు తెలుపు. అందుచేత, సత్త్వస్వరూపమైనటువంటి వినాయకుడు, జ్ఞానప్రదాత అయి, తెలుపు రంగులో ఉంటాడని విరవణ.

గణపతి అన్వయాన్ని సమర్థిస్తూ, ప్రసన్నవదనం అనే పదానికి ప్రసన్నో మత్తవారణః అని ఒక వ్యుత్పత్తిని నేను పెద్దవారి వద్ద విన్నాను. అంటే ప్రసన్న వదనుడంటే ఏనుగుముఖం కలవాడు అని. అయితే ఈ వ్యుత్పత్తి ప్రసిద్ధ సంస్కృతనిఘంటువులలో నాకు తారసపడలేదు.

గణపతి పరంగా ఈ శ్లోకార్థమిది - తెల్లని బట్టను ధరించినవాడినీ, సర్వవ్యాపకుడినీ, తెల్లని వర్ణంలో ఉండేవాడినీ, నాలుగు భుజాలు కలవాడినీ (అయిన వినాయకుడిని) సమస్తమైన విఘ్నాల ఉపశాంతి కోసం ధ్యానము చేయవలెను.

విష్ణుమూర్తి పరంగా అన్వయాలు -

ఈ శ్లోకం విష్ణుమూర్తిదే అని చెప్పడానికి ప్రధానబలం విష్ణుం అన్న పదమే. విష్ణువు త్రిమూర్తులలో ఒకడు కదా, ఆయన్ను విఘ్నోపశాంతికై ప్రార్థన చేయకూడదా అని కొంతమంది చేసే వాదం.

తెలుపు రంగు. బాగానే ఉంది, మరి విష్ణువు నలుపు రంగులో ఉంటాడని కదా ఆయన్ను నీలమేఘశ్యాముడన్నాం. పచ్చనిబట్ట కట్టుకుంటాడని కదా పీతాంబరుడన్నాం. మరి శుక్లాంబరమూ, శశివర్ణమూ ఆయనకెలా అన్వయిస్తారు? అంటే, దానికి వచ్చిన సమాధానం - కృతయుగంలో విష్ణువు తెల్లగానే ఉండేవాడూ అని. దీనికి ఒక ఉదాహరణ - సత్యనారాయణ వ్రతకల్పంలో కథాప్రారంభంలో నారదుడు వైకుంఠానికి వెడతాడు కదా. అక్కడ శేషతల్పంపై పరుండిన విష్ణువుని చూసి ఆయన తెల్లని రంగులో ఉన్నాడని స్తోత్రం చేస్తాడు. అలాగే, పీతాంబరుడని ఆయన్ను అన్నంతమాత్రాన తెలుపుబట్ట కట్టుకోడని ఏముందీ అని ఒకటి.

విష్ణుపరంగా ఈ శ్లోకానికి చేకూరిన బలం అప్పయదీక్షితులు. ఈయన మహాపండితుడు. శివుడంటే పంచప్రాణాలైనా, శివుడికీ కేశవుడికీ భేదం లేదన్న అద్వైతమార్గావలంబి. ఈయన వరదరాజస్తవమని కంచివరదరాజు మీద ఒక స్తోత్రం వ్రాసాడు. అందులో 27వ శ్లోకంలో ఇలా అన్నాడు -

యుక్త్యాగమేన చ భవాన్ శశివర్ణ ఏవ - నిష్కృష్ట సత్త్వ గుణమాత్ర వివర్త మూర్తిః।

ధత్తే కృపాంబుభరతస్త్విషమైంద్రనీలీం - శుభ్రోఽపి సాంబురమితః ఖలు దృశ్యతేఽబ్దః॥

అంటే, విష్ణుమూర్తి తత్త్వపరంగా, యుక్తిగా ఆలోచిస్తే తెలుపువాడేనట. దయ అనే రసాన్ని నిలువెల్లా నింపుకోవడం చేత, నీటిని నింపుకున్న మేఘం యొక్క రంగు - అంటే నీలవర్ణంలోకి మారిపోయాడట.

ఇంకొక విశేషమేమంటే, ఈ వరదరాజస్తవానికి అప్పయ్యదీక్షితులే వ్యాఖ్యనూ వ్రాసారు. అందులో అంటారు కదా - ఆగమేన, ఆప్తవచనేన చ శశివర్ణమ్. ప్రసిద్ధం హి శివరాఘవసంవాదస్థమ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ఇతి వచనమ్ అని. అంటే, విష్ణువు తెల్లని వాడే. దానికి ప్రమాణంగా పైన మనం చూసిన పద్మపురాణంలోని శివరాఘవసంవాదంలో ఉన్న శుక్లాంబరధరమన్న శ్లోకముంది కదా అని. కనుక, అప్పయదీక్షితుల ప్రకారం శుక్లాంబరధరం అన్న శ్లోకం విష్ణుముర్తిదే కానీ, విష్వక్సేనుడిదో వినాయకుడిదో కాదు.

మరి విష్ణువు పరంగా ఈ శ్లోకాన్ని చూస్తే - తెల్లని వస్త్రాన్ని కట్టుకున్నవాడినీ, తెలుపు రంగులో ప్రకాశించేవాడినీ, నాలుగు భుజాలు కలవాడినీ, ప్రసన్నమైన వదనం కలవాడినీ (అయినటువంటి విష్ణుమూర్తిని) సమస్తవిఘ్నోపశాంతికోసం ధ్యానం చేయవలెను. అని అర్థం చెప్పుకోవాలి...(విక్కీపీడియా ఆధారంగా)

జైహింద్.

Monday, March 24, 2025

ఫోన్ డైట్ చేయండి...... ఈనాడు హైదరాబాదు.

 


SBI అకౌంట్ నుండి జీతం పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ Pensioners N...

మా SRVD ఎలైట్ సమూహ సభ్యులు.

 

జైశ్రీరామ్.
ఉ.  వీరి యమోఘ ప్రేమ నను వీరికి మధ్యనును నిల్పె గొప్పగా,
నారసి నాకవిత్వముననంత మహత్ కవికల్పభూజ యన్
తీరయినట్టి సద్ బిరుదు తృప్తిగ నిచ్చిరి పొంగిపోవుచున్,
వీరలకేను వందనము ప్రీతిగ చేయుచు పొంగిపోవుదున్.
జైహింద్.

Sunday, March 23, 2025

Tuesday, February 18, 2025

ఆలయలలో…తీర్థం .... సేవించే విధానం తెలుసుకుందాం.

 ఆలయలలో…తీర్థం

ఆలయంలో తీర్థం ఎలా తీసుకోవాలి తీర్థం తీసుకున్నాక తలపై చేతితో ఎందుకు రాయొద్దు..?

తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి!

గుడి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు.

శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువుని సాలగ్రామ శిలలకు... రుద్ర నమక చమకాలతో, పురుష సూక్తం, పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పుజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నపనము చేసిన జలము కుడా కలిపి (తులసీదళ సహితమై, పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము తీర్ధము అనబడును)ఇస్తారు.

శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు.

ఈ తీర్ధమును అర్చన పూర్తి అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికి, సన్యసించిన వారికినీ, అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.

తీర్ధమును ఎలా తీసుకోవాలి 

అనే ప్రశ్నకు సమాదానం మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని, పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత, అనంతా, గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి.

తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు.

తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం.

తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానియకుండా తాగాలి.

తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి‌.

అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.

1). మొదటిసారి తీర్థం శారీరక,                                    

    మానసిక శుద్థి జరుగుతుంది.

2). రెండోసారి తీర్థం న్యాయ ధర్మ

    ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.

3). మూడోది పవిత్రమైనపరమేశ్వరుని 

    పరమ పదం అనుకుంటూ 

    తీసుకోవాలి.

**తీర్థాల రకాలు:-*

1). జలతీర్ధం

2). కషాయ తీర్ధం

3). పంచామృత తీర్ధం

4). పానకా తీర్ధం

*1. జల తీర్ధం:-* 

ఈ తీర్ధం సేవించడం ద్వారా అకాల మరణం, సర్వ రోగాలు నివారించబడుతాయి. అన్నికష్టాలు తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.

*2). కషాయ తీర్ధం:-*

ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీకామాఖ్య దేవాలయములో ఇస్తారు.

రాత్రి పూజ తరువాత తీర్థమును కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కనికనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.

*3). పంచామృత అభిషేక తీర్థం:* పంచామృత సేవనం ద్వారా...                    చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

*4). పానకా తీర్ధం:-*

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.

పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. ఎముకలకు సంబందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

*ఇతరమైన రకాలు:-* 

ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు.

వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.

సనాతన హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం - పాటిద్దాం. 

మంచి విషయాన్ని పది మందికి పంచుదాం. 

మన సంస్కృతీ సాంప్రదాయాలను మన పిల్లలకు, భావితరాల వారికి చేరవేద్దాం.


Monday, February 17, 2025

అబ్రహామ్ లింకన్ తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ టీచర్ కి రాసిన లేఖ.

అబ్రహామ్ లింకన్ తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ టీచర్ కి రాసిన లేఖ. ఒక అద్భుతమైన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేఖ. 

ఇది ప్రతి తల్లికి,తండ్రికి, టీచర్ కి, విద్యార్ధికి చేరాల్సిన లేఖ.

ప్రముఖ అనువాదకురాలు శ్రీమతి శాంతసుందరిగారు దీనిని తెలుగులోకి అనువదించి మనకి అందించారు.

*

" మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు.కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది.అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు.ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకి రావచ్చు.అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుచేత,దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా? ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి.అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి.కానీ ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ , జిత్తులమారి రాజకీయ నాయకుడు ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నాయకుడు కూడా ఉంటాడనీ చెప్పండి.అప్పనంగా దొరికిన ఒక డాలరు కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి.స్కూల్లో మోసం చేసి పాసవటం కన్నా ఫెయిలవటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి.ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం నేర్పండి.

అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి.అసూయకి వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి.కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి.క్రూరులని ఎగతాళి చెయ్యటం నేర్పండి.

పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి,కానీ అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షుల గూఢమైన రహస్యాల గురించి,ఎండలో ఝుమ్మనే తేనెటీగల గురించి, పచ్చని కొండలమీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పండి.అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ ,వాటిని తను మట్టుకు గౌరవించటం నేర్పండి.

అందరూ మందని అనుసరిస్తున్నా, తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి.అందరు చెప్పేదీ వినమనీ,సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి.

తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి కాని తన హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని నేర్పించండి.అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి.ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలనీ,అప్పుడే మానవాళి మీదా దేవుడిమీదా వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి.

ఇదీ క్రమం టీచర్, మీకు వీలైనంత వరకూ ప్రయత్నించండి.వాడు మంచి పిల్లవాడు. వాడు మా అబ్బాయి.

Monday, January 20, 2025

"ఆదిలోనే హంసపాదు" అన్నది సామెత....ఈ సామెత ఎలా పుట్టిందంటే....

జైశ్రీరామ్. 

"ఆదిలోనే హంసపాదు" అన్న సామెత ఎలా పుట్టిందంటే

మనం వ్రాసే వ్రాతలో  ఎప్పుడైనా ఒక వాక్యంలో ఒక పదాన్ని వ్రాయడం మరచిపోయి ఉంటే క్రింద

హంసపాదము వలె ఉండు  గుర్తు పెట్టి, ఆ పైన వ్రాయుట ఎఱుఁగుదుము. దీనినే హంసపాదు

అంటారు.  అలా పుస్తకం రాసేప్పుడు తొలి వాక్యంలోనే తప్పు జరిగితే అయ్యో "ఆదిలోనే హంసపాదు"

పెట్టి వ్రాయవలసి వచ్చిందే అని బాధపడతాము. ఆదిలోనే హంసపాదు అనే సామెత  ఈ విధంగా 

వచ్చింది. ఏపనిలో ఈ విధంగా జరిగినా ఈ సామెతనే వాడుట మనము వింటుంటాము.

జైహింద్.