Wednesday, December 18, 2024

కాశీ కృష్ణమాచార్యులువారందించిన బాల బోధిని. సంస్కృతభాషా శిక్షణ పాఠములు. 7 Sanskrit Learning With Telugu Easily Lesson 7 Part 1 | సరళ సంస్కృతము | ...

జైశ్రీరామ్.
జైహింద్.

కాశీ కృష్ణమాచార్యులువారందించిన బాల బోధిని. సంస్కృతభాషా శిక్షణ పాఠములు. 6 Sanskrit Learning With Telugu Easily Lesson 6 Part 1

జైశ్రీరామ్.
జైహింద్.

కాశీ కృష్ణమాచార్యులువారందించిన బాల బోధిని. సంస్కృతభాషా శిక్షణ పాఠములు. 5 Sanskrit Learning With Telugu Easily Lesson 5 Part 1

జైశ్రీరామ్.
జైహింద్.

కాశీ కృష్ణమాచార్యులువారందించిన బాల బోధిని. సంస్కృతభాషా శిక్షణ పాఠములు.Sanskrit Learning With Telugu Easily Lesson 4 Part 1 | సరళ సంస్కృతముSanskrit Learning With Telugu Easily Lesson 4 Part 1 | సరళ సంస్కృతము | బ...

జైశ్రీరామ్.
జైహింద్.

కాశీ కృష్ణమాచార్యులువారందించిన బాల బోధిని. సంస్కృతభాషా శిక్షణ పాఠములు.Sanskrit Learning With Telugu Easily Lesson 3 Part 1 | సరళ సంస్కృతము

జైశ్రీరామ్.
జైహింద్.

Saturday, December 14, 2024

నా తమ్ముఁడు డా.L.S.Y.V.శర్మకు గీతావధానంలో పృచ్ఛకునిగా నున్న సందర్భంగా జరిగిన సత్కారం.

 జైశ్రీరామ్.

శా.  నీ సన్మానము గాంచి పొంగితిని, జ్ఞానీ! యాజ్ఞవల్క్యా! శుభం

బౌ సర్వత్ర మనోజ్ఞ సత్కృతులచే పాండిత్య మాశాంతమున్

భాసించున్, గృషి సత్ఫలంబు సతమున్ వర్ధిల్లఁజేయున్ నినున్,

ధ్యాసన్ గీతఁ బఠింపఁజేసి ప్రజకున్ జ్ఞానంబునే గొల్పుమా.🙌🏼👍🏻

జైహింద్.

అభిజిత్ లగ్నం అంటే

జైశ్రీరామ్. 

అభిజిత్ లగ్నం అంటే           

అభిజిత్ అనేది కాంతిలేని నక్షత్రం. పురాణాల్లో దీని వెనుక ఓ ఆసక్తికర కథ కూడా ఉంది.

అందరూ టక్కున చెప్పే సమాధానం ఇరవై ఏడు అని. కానీ అభిజిత్ అనే ఓ నక్షత్రం ఉందనీ, దానికి కొంత ప్రత్యేకత ఉందని ఎంతమందికి తెలుసు? 

ఆ విశేషాలేమిటో మనం తెలుసుకుందాం…. 

అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు. అంటే కాంతిలేనిదన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు…. అనేక నక్షత్రాల సమూహం. 

వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్వని, భరణి అంటూ పేర్లు నిర్ణయించారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం, శ్రవణా నక్షత్రంలోని మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం వెనుక ఓ పురాణ కథ ఉంది అదేంటో మనం తెలుసుకుందాం….

మనకున్న 27 నక్షత్రాలనూ దక్షప్రజాపతి కుమార్తెలుగా చెబుతారు. దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. 

అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువ. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తండ్రి దగ్గరకు వెళ్లింది. 

శ్రవణా నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది. 

ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది. సర్వ దోషాలనూ పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది. 

ప్రతి రోజూ ఈ నక్షత్రానికి సంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ వివరాలు చూద్దాం….

ఈ పదం ఒకప్పుడు పల్లెటూళ్లకు కొత్త కాదు. కాలం మారింది కాబట్టి, ఇప్పుడది అంతగా వినపడటం లేదు. అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్లలో అలా పిలిచేవారు. గడ్డపలుగును భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ పలుగు ముహూర్తం అనేవారు. అంటే మిట్టమధ్యాహ్నం అన్నమాట. 

ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని, ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం. 

ప్రస్తుతం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమిపూజను ఈ అభిజిత్ లగ్నంలోనే చేశారంటే దీనికున్న ప్రాధాన్యం   ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. 

ఈ ముహూర్తం మధ్యాహ్నం 11-45 నుండి 12-30 వరకు ఉంటుంది. 

ఈ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. 

ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం ప్రారంభించారు. 

ఈ శుభ ముహూర్తంలోనే ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం… ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి. 

ఈ ముహూర్తంలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా, ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు.

ఇంకా ఈ ముహూర్తానికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. 

దక్షిణం యమస్థానం కాబట్టి బుధవారం మాత్రం ఆ దిక్కుకు వెళ్లరాదని నారద సంహిత పేర్కొంది. 

అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని పేర్కొంది. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. 

ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు. సూర్యుడు చీకటిని ఎలా పారదోలతాడో అలా సర్వదోషాలనూ ఈ ముహూర్తం హరించి వేస్తుందని వశిష్ఠ సంహిత పేర్కొంది. ముహూర్త వల్లరి అనే గ్రంథం మాత్రం అభిజిత్ ముహూర్తం కేవలం ప్రయాణాలకే తప్ప ఇతర కార్యాలకు పనికి రాదని అంటోంది. ఈ లగ్నంలో వివాహం చేస్తే నష్టమని బ్రహ్మ శపించినట్లు నారద సంహిత పేర్కొంది. ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అభిజిత్ లగ్నం సర్వశ్రేయోదాయకమని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

జైహింద్.

Thursday, December 12, 2024

మానవునకు తిలకధారణ ఆవశ్యకత.

జైశ్రీరామ్. 

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి.

హిందూ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. హిందూ ధర్మంలో మాత్రమే బొట్టుపెట్టుకొనే ఆచారముంది. ప్రపంచంలో ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు. ఇది దైవ చిహ్నముగా గుర్తించబడుతుంది. బొట్టు లేదా తిలకం అనేది హిందూ ధర్మంలో ఒక సంప్రదాయ సంస్కృతిగా ఆచరిస్తూ వస్తున్నారు. ఈ ఆచారము చాలా ప్రాచీనమైనది.

కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుం' అనే శ్లోకం వినని వాళ్లుండరు. సంస్కృతంలో 'తిలకమ్' అని, తెలుగులో 'బొట్టు' అని అర్థం. మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరిస్తారు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు, శ్రాద్ధకర్మలు నుదుటిన బొట్టులేకుండా చేయడం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాల్లో కూడా పేర్కొనబడింది.

పురాణాల్లో బొట్టు గురించి ఏముంది:

పద్మపురాణంలో, ఆగ్నేయపురాణంలో పరమేశ్వర సంహితలో స్త్రీలు, పురుషులు అనే భేదం లేకుండా నొసటిమీద కుంకుమ ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుందని, లక్ష్మీనివాసమైన నుదుటిపై బొట్టు ధరించే వేళ ఊర్ధ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్యవర్థకమ్ లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకమ్' అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టుపెట్టుకోవాలని పురాణాలు తెలుపుతున్నాయి. జ్ఞానదాతయైన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు.

క్షత్రియ వంశానికి చెందిన వారు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదటన ధరించే వారు. వర్తక వ్యాపారాల ద్వారా సంపదను పెంపొందించుకునే వైశ్యులు అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవారు. శూదులు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవారు. విష్ణుఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్ని, శైవ ఉపాసకులు భస్మ త్రిపునాన్ని, దేవి(అమ్మవారి) భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరిస్తారు.

పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సుకాని నిష్ఫలము అవుతాయి.

మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటకు బ్రహ్మదేవుడు అధిదేవత. నుదురు బ్రహ్మస్థానం. కనుక బ్రహ్మస్థానమైన నుదుట తిలకం (బొట్టు) పెట్టుకుంటారు. బొట్టులేని ముఖము ముగ్గులేని ఇల్లు ఒక లాంటివే అంటారు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు ఈ రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు.

బ్రహ్మదేవుడు నుదుట వ్రాసినగీత తప్పింప ఎవరికీ శక్యం కాదు. కాని ఎవ్వరు ముఖాన బొట్టు పెట్టుకుందురో వారు బ్రహ్మ రాసిన రాతను చెరిపి మంచిరాత వ్రాసుకుంటారనే నమ్మకం కొంత మంది లో ఉంది. మన నుదుటిలో జ్ఞాన నేత్రం ఉండేచోటు అంటే రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎఱ్ఱని కుంకుమ బొట్టు ప్రతినిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెబుతోంది. నుదుటి యందు సూర్య కిరణాలు సోకరాదు, ఇది ఆరోగ్య సూత్రం. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహ్యతచక్రంలో ఉంటాడు.

మానవ శరీరము మొత్తము ప్రత్యేకించి కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానమును విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని ప్రసరింపజేస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది. శరీరానికి చల్లదనానిచ్చి తేజస్సును పెంచుతుంది.

ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ ఎనర్జీ అంటారు అది మనపై పడుతుంది నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. కవి ఆరుద్ర నూరేళ్ళ పెట్టు నొసటి బొట్టు అది నోచే నోముల కలిమి పెట్టు" అన్నాడు. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి పురుషులు సైతం బొట్టు పెట్టుకోవడం అనవాయితీగా వస్తోంది.

ఏవేలు తో బొట్టు పెట్టుకోవాలి:

ఏవేలు తో బొట్టు పెట్టుకోవాలన్నప్పుడు ఒకొక్కరు ఒకోవిధంగా చెబుతారు. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని. అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని ప్రతీతి. ఒక చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు. బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది.

హిందువులు ఏదేశంలో ఉన్నను భరత సంస్కృతి అనేది శాస్త్రీయ పరంగా ఎంతగొప్పదోతెలుసుకుని, దానిని మరువకుండా ఉన్నప్పుడు ఆచార సాంప్రదాయలను ఆచరించినప్పుడు, మనదేశ హిందూ సంస్కృతిని గౌరవించినవారు అవుతారు మరియు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ బొట్టు (తిలకం) ధరించడం వలన మనిషి భక్తి, ముక్తి కలిగి నిజాయతీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు నుదుటి పైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది, గౌరవాన్ని కూడా పొందుతారు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి. మీ ఉన్నతిని కాపాడుకోండి.

జైహింద్.

Tuesday, December 3, 2024

అప్పయ్య దీక్షితులు చే రచించిన మహిమాన్విత దుర్గా దేవీ చంద్రకళా స్తుతి. భావసహితము.

జైశ్రీరామ్.

ఈ దేవీస్తుతిలో అనేక గ్రంథాలలోని దేవీ మహిమలను నిక్షిప్తం చేస్తూ శక్తిమంతమైన మంత్రభరిత స్తుతిగా శ్రీ అప్పయ్య దీక్షితులు వారు సభక్తికంగా దీనిని రచించారు. ప్రస్తుతం వ్యక్తిగతంగానే కాక, సనాతన ధర్మానికీ, ధర్మానుయాయులకీ దేశకాలపరిస్థితులు ప్రతికూలంగా ఉన్న తరుణంలో - ఈ స్తుతిని ప్రతి ఒక్కరూ పారాయణ చేయవలసిన అవసరం ఉంది. తద్వారా వ్యక్తికీ, ధర్మానికీ యోగక్షేమాలను ఆ జగజ్జనని ప్రసాదిస్తుంది.

వేధోహరీశ్వరస్తుత్యాం విహర్తీం వింధ్య భూధరే! 

హర ప్రాణేశ్వరీం వన్డే హన్తీం విబుధవిద్విషామ్!! || 1 ||

భావం: బ్రహ్మ విష్ణు రుద్రులచే స్తోత్రింపబినది వింధ్య పర్వతమున విహరించునది, శివుని ప్రాణేశ్వరి, దేవ ద్రోహులైన (సత్త్వ విరోధులైన) రాక్షసులను సంహరించు జగదంబకు వందనములందజేస్తున్నాను.

అభ్యర్థనేన సరసీరుహ సంభవస్య 

త్యక్త్వోదితా భగవదక్షిపిధాన లీలామ్! 

విశ్వేశ్వరీ విపదపాగమనే పురస్తా- 

న్మాతా మమాస్తు మధుకైటభయోర్నిహస్త్రీ!! || 2 ||

భావం: బ్రహ్మ ప్రార్థన మేరకు, యోగనిద్రితుడైన భగవానుని కనులు విప్పి, మధుకైటభులను సంహరిం (పజేసిన చిన విశ్వేశ్వరీ (మహాకాళీ) మాత విపత్తులలో నాముందు నిలచుగాక!

ప్రాజ్ నిర్జరేషు నిహతైర్నిజశక్తి లేశై- 

రేకీ భవద్భిరుదితాఖిలలోక గుష్యై! 

సంపన్న శస్త్ర నికరాచ తదాయుధస్టై- 

ర్మాతా మమాస్తు మహిషాంతకరీ పురస్తాత్!! || 3 ||

భావం: దేవతల తేజస్సులన్నిటి ఏకరూపమై, లోకరక్షణకై ఉదయించి, వివిధ సంపదలను శస్త్రాది ఆయుధాలను ధరించిన మహషాంతకరి (మహాలక్ష్మి) నా ముందుండుగాక!

ప్రాలేయశైలతనయా తనుకాంతి సంపత్ - 

కోశోదితా కువలయచ్చవి చారుదేహా! 

నారాయణీ నమదభీప్సిత కల్పవల్లీ 

సుప్రీతి మావహతు శుంభనిశుంభహన్తీ!! || 4 ||

భావం: హిమవత్పర్వత రాజపుత్రి గౌరిదేవి శరీరకాంతి సంపద అనెడి కోశమునుండి ఉదయించిన, నల్లకలువ వంటి దేహముగల తల్లి, నారాయణి, మహాసరస్వతి, నమస్కరించిన వారి అభీష్టాలను తీర్చే కల్పవల్లి, శుభనిశుంభ సంహారిణి చక్కని ప్రీతిని కలిగించుగాక!

విశ్వేశ్వరీతి మహిషాన్తకరీతి యస్త్యా 

నారాయణీత్యపిచ నామభిరంకితాని! 

సూక్తాని పంకజభువాచ సురర్షిభిశ్చ 

దృష్టాని పావకముఖైశ్చ శివాం భజేతామ్!! || 5 ||

భావం: బ్రహ్మచే 'విశ్వేశ్వరీసూక్తం'తో, దేవతలచే ఋషులే అగ్ని ముఖుగా, 'మహిషాన్తకరీ', 'నారాయణీ సూక్తముల'తో దర్శింపబడి కీర్తించబడిన (దేవీ మహాత్మ్యంలోని సూక్తాలివి) శివాదేవిని ఆశ్రయిస్తున్నాను.

ఉత్పత్తి దైత్య హనన స్తవనాత్మకాని 

సంరక్షకాణ్యఖిల భూతహితాయ యస్యాః! 

సూక్త్యాన్యశేష నిగమాంత విదః పఠన్తి 

తాం విశ్వమాతరమజస్ర మభిషవీమి!! || 6 ||

భావం: పరాశక్తి యొక్క ఆవిర్భావం, రాక్షససంహారం, స్తోత్రములు, జీవకోటి హితానికై చేసిన సంరక్షణ కృత్యములను, అగ్ని సూక్తములను వేదాంతవేత్తలు పఠిస్తున్నారు. అట్టి విశ్వమాతను ఎల్లప్పుడు స్తోత్రిస్తున్నాను.

యం విప్రచిత్త పునరుద్ధిత శుంభ ముఖ్యైః 

దుర్భిక్ష ఘోర సమయేన చ కారితాసు! 

ఆవిష్కృతాస్త్రిజగదార్తిషు రూపభేదా- 

సైరంబికా సమభిరక్షతు మాం విపద్భ్యః!! || 7 ||

భావం: విప్రచిత్తునకు తిరిగి జన్మించిన శుంభాది రాక్షసులను నందా, రక్తదంతాది నామరూపములు ధరించి సంహరించి, కరవువంటి ఘోర సమయాలను తొలగించిన అంబిక ఆయా వివిధ నామరూపాలతో నన్ను విపత్తులనుండి సంపూర్ణముగా రక్షించుగాక!

సూక్తం యదీయమరవింద భవాది దృష్ట - 

మావర్త్య దేవ్యనుపదం సురథః సమాధిః! 

ద్వావప్యవాపతురభీష్ట మనన్యలభ్యం 

తామాదిదేవతరుణీం ప్రణమామి మూర్ధ్నా!! || 8 ||

భావం: బ్రహ్మాదులచే దర్శింపబడిన దేవీసూక్తములను నిరతము పఠించిన సురథుడు, సమాధి అను భక్తులు ఇతరులకు లభ్యము కాని దివ్య పదములను పొందారు. అలా పొందింపజేసిన ఆదిదేవుని తరుణియైన దేవికి శిరస్సుతో ప్రణామములు చేస్తున్నాను.

మహిష్మతీ తనుభవంచ రురుంచ హంతుం 

ఆవిష్కృతైర్నిజరసాదవతరభేదైః! 

అష్టాదశాహత నవాహత కోటి సంఖ్యై - 

రంబా సదా సమభిరక్షతు మాం విపద్భ్యః!! || 9 ||

భావం: మహిష్మతి పుత్రులైన మహిషాసురుని, రురుని సంహరించడానికై వివిధ అవతారములతో పద్దెనిమిది కోట్ల శక్తులతో, తొమ్మిదికోట్ల శక్తులతో బయలువెడలిన అమ్మ నన్ను విపత్తుల నుండి సమగ్రంగా రక్షించుగాక!

ఏతచ్చరిత్ర మఖిలం లిఖితంహి యస్యాః 

సంపూజితం సదన ఏవ నివేశితంవా! 

దుర్గంచ తారయతి దుస్తర మస్యశేషం 

శ్రేయః ప్రయచ్ఛతి చ సర్వముమాం భజేతామ్!! || 10 ||

భావం: ఈ దేవీ చరిత్రనంతటినీ వ్రాసి, ఎవరి యింట ఉంచి పూజించుతారో వారు భయంకరమైన దుర్గతులన్నిటి నుండి దాటబడి, శ్రేయస్సులను పొందుతారు. అట్టి మహిమగల ఉమాదేవిని భజిస్తున్నాను.

యత్పూజన స్తుతి నమస్కృతిభిర్భవన్తి 

ప్రీతాః పితామహ రమేశ హరాస్త్రయోపి! 

తేషామపిస్కుణైర్దదతీ వపూంషి 

తామీశ్వరస్య తరుణీం శరణం ప్రపద్యే!! || 11 ||

భావం: ఏ తల్లిని పూజించడం చేత, స్తుతించడం చేత, నమస్కరించడం చేత బ్రహ్మవిష్ణురుద్రులు మువ్వురూ ప్రీతులౌతారో, ఆ మువ్వురికీ గుణములను తనువులను ఇచ్చినదెవరో ఆ ఈశ్వర తరుణిని శరణు వేడుతున్నాను.

కాంతారమధ్య దృఢలగ్న తయావసన్నా 

మగ్నాశ్చ వారిధిజలే రిపుభిశ్చ రుద్ధాః! 

యస్యాః ప్రపద్య చరణ్ విపదస్తరంతి 

సా మే సదాస్తు హృది సర్గజగత్సవిత్రీ!! || 12 ||

భావం: అరణ్యమధ్యంలో చిక్కుపడినవారు, సముద్రాది జలములలో మునిగిన వారు, శత్రువుల చేత బంధింపబడిన వారు ఎవరి చరణాలను శరణువేడి విపత్తుల నుండి దాటుతున్నారో ఆ సృష్టికారిణి ఎల్లవేళలా నా హృదయమందుండు గాక.

బంధేవధే మహతి మృత్యుభయే ప్రసక్తే 

చిత్తక్షయే చ వివిధేచ మహెూపతాపే! 

యత్పాదపూజ నమిహ ప్రతికారమాహుః 

సా మే సమస్త జననీ శరణం భవానీ!! || 13 ||

భావం: బంధమునందు, వధమునందు, మహామృత్యుభయములందు, మనస్తాపములందు, వివిధ వేదనలందు ఎవరి పాదపూజనము పరిష్కారముగా చెప్పబడుచున్నదో ఆ సమస్త జనని భవాని మాకు శరణు.

బాణాసురప్రహిత పన్నగబంధమోక్ష- 

స్తద్బాహుదర్ప దళనాదుషయాచ యోగః! 

ప్రాద్యుమ్నినా ద్రుతమలభ్యత యత్ప్రసాదాత్ 

సా మే శివాసకలమప్యశుభం క్షిణోతు!! || 14 ||

భావం: బాణాసురునిచే నాగపాశముల బంధితుడైన ప్రద్యుమ్న పుత్రుడైన అనిరుద్ధుని ఆ నాగపాశముల నుండి విడిపించి, అసురుని బాహు దర్పమును ఖండించడం, ఉషారాణితో కలయిక ఎవరు కృపతో వెంటనే లభింపజేశారో ఆ శివస్వరూపిణి నాకు అన్ని అశుభములను నశింపజేయుగాక!

పాపః పులస్త్య తనయో పునరుత్తితో మా - 

మద్యాపి హర్తు మయమాగత ఇత్యుదీతమ్! 

యత్సేవనేన భయమిందిరయావధూతం 

తామాదిదేవతరుణీం శరణం గతోస్మి!! || 15 ||

భావం: 'పులస్త్యుని సంతానమైన పాపాత్ముడైన రావణుడు మరల (శిశుపాలునిగా) జన్మించి, ఈ జన్మో నన్నపహరించడానికై వచ్చినాడ'ని లక్ష్మీరూపిణి రుక్మిణి ప్రార్థించగా విని భయమును పోగొట్టిన ఆదిదేవుని తరుణిని శరణువేడుతున్నాను.

యద్ ధ్యానజం సుఖమవాప్యమనన్త పుణ్యైః 

సాక్షాత్ తమచ్యుతపరిగ్రహ మాశ్వవాపుః! 

గోపాంగనాః కిల యదర్చన పుణ్యమాత్రాః 

సా మే సదాభగవతీ భవతు ప్రసన్నా !! || 16 ||

భావం: ఎవరిని అర్చించిన పుణ్యమాత్రమున - అనంత పుణ్యలభ్యమైన ధ్యాన సౌఖ్యమును అచ్యుతుని పొందుట ద్వారా గోపాంగనలు బడిసిరో ఆ భగవతి నాకు ప్రసన్నయగుగాక!

రాత్రిం ప్రపద్య ఇతి మంత్ర విదః ప్రపన్నా - 

నుద్బోధ్య మృత్యవధి మన్యఫలైః ప్రలోభ్య! 

బుద్ధ్వా చ తద్విముఖతాం ప్రతనం నయంతీ - 

మాకాశమాది జననీం జగతాం భజేతామ్!! || 17 ||

భావం: 'రాత్రిం ప్రపద్యే' అనే వైదిక రాత్రి సూక్త మంత్రములను శరణాగతితో జపించినవారిని, జాగృతపరచి, ఇతర ఫలములను ప్రలోభపరచి, జ్ఞానముసగి, ఆ లోకఫలితములందు విముఖతను కలిగింది, కైవల్యమునొసగు ఆకాశస్వరూపిణియైన జగతికి ఆదిజననిని భజిస్తున్నాను.

దేశకాలేషు దుష్టేషు - దేవీ చంద్రకళాస్తుతిః 

సంధ్యయోరనుసంధే యా - సర్వామద్వినివృత్తయే!! || 18 ||

భావం: దేశకాలములు దుష్టములై ప్రతికూలములైనప్పుడు అన్ని ఆపదలను తొలగించడానికై 'దేవీ చంద్రకళాస్తుతి' సంధ్యలలో నిత్యం పారాయణ చేయాలి.

ఇతి శ్రీ మద్భరద్వాజ కులజలధికౌస్తుభ శ్రీకంఠ మత- ప్రతిష్ఠాపనాచార్య చతురధిక శత ప్రబంధ నిర్వాహక మహావ్రతయాజి శ్రీమదప్పయ దీక్షితేంద్రస్య కృతిష్వన్యతమా దుర్గాదేవీ చంద్రకళాస్తుతిః సంపూర్ణా.

జైహింద్.

Monday, December 2, 2024

శ్రీమాన్ బీ. భాస్కరదేవ్ గారు కృష్ణపాత్రలో భగవద్గీత ఆంగ్లంలో. అద్భుతం. BHAGAVADGITA BHASKARA DEV BOKKA ADVOVATE & MAA MEMBER

జైశ్రీరామ్.
అన్యభాషలలో కూడా భాగవత ప్రాశస్త్యాన్ని పెంచుచున్న భాస్కరదేవ్ గారికి అభినందనపూర్వక ధన్యవాదములు.
జైహింద్.