Wednesday, August 23, 2023

ఇవి మనకి తెలుసా?

  ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*

 
1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 *సప్త సంతానములు అంటే ఏమిటి ?*
 
1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 
6. స్వసంతానం ( పుత్రుడు ).
 
*తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?*

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 *పదిరకాల పాలు ఏవి ?*

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.
 10. లేడి పాలు.

 *యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  
 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 *అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?*

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 
11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 
13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 
15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 
 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 *పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?*

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

 *నవ గ్రహలకి సంబంధించిన సమిధలు:
 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .
 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .
 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .
 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 
 9. కేతువు - గరిక .

 *పుజాంగాలు  ఎన్ని రకాలు ?*

 పుజాంగాలు  5 రకాలు.
 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.
 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట
 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.
 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.
 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .

 *వివిధ జన్మలు ఏవి ?*

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.
 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.
 7. వృక్షములు .

 *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?*
 
 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 
 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.
 7. నారాయణాద్రి.

  *శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?*

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.
 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 *ధర్మం అంటే ?*
 
  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"

 
 *దేవతా లక్షణాలు ఏవి ?*

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 *నవ వ్యాకరణాలు అనగా ఏవి ?*

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 
 8. శాఖటా టా యానం . 9.శాకల్యం

 *పంచ కోశాలు అంటే ఏమిటి ?*

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
 5. ఆనందమయ కోశం .

 *రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?*

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.
 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.
 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు

 మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు మతోన్మాదుల దాడులు తట్టుకునినిలిచిన భారతీయ శిల్ప వాస్తుశాస్త్రంతో నిర్మాణం చేసిన అత్యంత అద్భుత కళా సంపద ఉన్న ఆలయాలు నగరాల్లో కొన్ని:~*

*కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -కుశార్, పాకిస్తాన్*
*లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -లాహోర్, పాకిస్తాన్*
*తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షకుడు నిర్మించిన నగరం)తక్షశిల,పాకిస్తాన్*
*పుష్కలావతి /పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండోకొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం)పెషావర్, పాకిస్తాన్ (భాగవతం,మహాభారతం)*
💕 *మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్*
💕 *నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్*
💕 *జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్*
💕 *మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్*
💕 *శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,*
💕 *దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా*
💕 *పరశురామక్షేత్రం* *(పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) -* *కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర, సముద్రతీర ప్రాంతం*
💕 *మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా*
💕 *నిషాద రాజ్యం(నలమహారాజు రాజ్యం) గ్వాలియర్,మధ్యప్రదేశ్*
💕 *వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్*
💕 *నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు*
*బోధించిన ప్రాంతం) -* *సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్*
💕 *వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్*
💕 *రతిష్టానపురం (పురూరవుని రాజధాని) ఝాన్సీ,అలహాబాద్*
💕 *సాళ్వ రాజ్యం(సావిత్రీ, సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)- కురుక్షేత్ర దగ్గర*
💕 *హస్తినాపురం (కౌరవుల రాజధాని)హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్*
💕 *మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్*
💕 *వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర*
💕 *కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్*
💕 *మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్*
💕 *ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్*
💕 *గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా*
💕 *కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)*
💕 *పాండవుల లక్కగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్*
💕 *కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్*
💕 *శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.*
💕 *హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) జలాన్,ఉత్తర్ ప్రదేశ్*
💕 *విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర*
💕 *కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర*
💕 *చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్*
💕 *కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం)దాతియ,మధ్యప్రదేశ్*
💕 *ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర*
💕 *కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్*
💕 *పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) -* *ఎటాహ్,సహజహంపూర్*
*,ఫారుఖాబాద్,ఉత్తర్ ప్రదేశ్*
💕 *కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యయంత్ర బేధన స్థలం) -*
*కంపిల్, ఉత్తర్*
💕 *జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ* *ఆఖరా / రణ్ భూమి,బీహార్*
💕 *కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన*
*ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా*
💕 *మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్*
💕 *విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్*
💕 *శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం*
💕 *ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం*
💕 *నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –*ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్*
💕 *జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్*
💕 *కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)నేపాల్ లోని తిలార్కోట్*
💕 *బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్*
💕 *బుద్ధుడు నిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.*

Tuesday, August 22, 2023

శ్రావణమాస వరమహాలక్ష్మి అమ్మవారిని గ్రాండ్ గా అలంకరించుకుందాం Varalakshm...