జైశ్రీరామ్.
కార్తిక స్నానము మరియు నిత్య స్నానము నకు
01. కాలనిర్ణయము:
ఉషఃకాలమున / ప్రాతఃకాలమున నిద్ర లేవవలయును. ఉషఃకాలము అనగా -
సూర్యోదయమునకు ముందు 5 ఘడియలు. (ఘడియ అనగా 24 నిమిషములు)
అనగా 4 గం.లకు తెల్లవారుజామున. - ప్రాతఃకాలము అనగా సూర్యోదయమునకు
3 ఘడియలు. అనగా సుమారు గం. 4.45 ని.లకు. ఎట్టి పరిస్థితులలోను
సూర్యోదయము అయిన తరువాత నిద్రించరాదు.
02. స్నానము.
స్నానము చేయునపుడు (దిగంబరముగా స్నానం చేయరాదు) -
శ్లో. హరిన్నారాయణో గంగా, గంగా నారాయణో హరిః।
హరిర్విశ్వరో గంగా, గంగా విశ్వరో హరి ॥
శ్లో. గంగే చ యమునేచైవ గోదావరీ సరస్వతీ |
నర్మదే సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధిం కురు ॥
శ్లో. కావేరీ తుంగభద్రాచ, కృష్ణవేణీ చ గౌతమీ।
భాగీరథీ ఇతి విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితా ॥
శ్లో. అపవిత్రః పవిత్రోవా, సర్వావస్థాంగతో పివా।
యస్స్మరే త్పుండరీకాక్షం, సబాహ్యాంభ్యంతరశ్శుచిః ॥
పుండరీకాక్ష! పుండరీకాక్ష!! పుండరీకాక్ష!!! (అని శిరస్సుపై నీరు చల్లుకొనవలెను).
03. విభూతిధారణ:
విభూతి భస్మమును ఎడమ అరచేతిలోనికి వేసుకొని, నీటిచుక్కలతో తడిపి
శ్లో. “ఊర్ధ్వ పుడ్రం మృదా కుర్యాద్ భస్మనా తు త్రిపుండ్రకమ్
ఉభయం చందనే నైవ అభ్యంగోత్సవ రాత్రిషు”
అని పఠించుచు, నుదుట అడ్డముగను, దండ చేతులయందు, ముంజేతుల
యందు, భుజములయందు, ఎదురురొమ్ము, పొట్టయందు, నడుమ వెనుక
భాగము ఇరువైపుల ధరించవలెను.
సాయంకాలము తడుపక పొడి విభూతిని ధరించవలెను.
04. కుంకుమధారణ:
శ్లో. సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థసాధకే |
శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥
అని పఠించుచు నుదుట నుంచుకొనవలెను.
05. మడివస్త్రము:
ఉదికి ఆరవేసిన మడి వస్త్రమునుగాని, ధావళీగాని, పట్టుబట్టగాని ధరించవలెను.
(వీనితో భోజనము చేయరాదు). (ధావళీ, పట్టు వస్త్రములను ముమ్మారు విదలించి
ధరించవలెను) - సాయంకాలము ఉదికిన వస్త్రము చాలును.
జైహింద్.
No comments:
Post a Comment