జైశ్రీరామ్.
పండితమ్మన్యులు, నిగర్వి, సహృదయులు,
సజ్జన సంసేవనాసక్తులు,
బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి
పుట్టిన రోజు నేడే.
పుట్టిన రోజు నేడే.
సహృదయ శిరోమణియైన శ్రీ ఏల్చూరి మహోదయులకు
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుచున్నాను.
ఈశా సంతత సంతసంబు నిడు మా యేల్చూరికిన్ బ్రేమతో
నాశింతున్ మురళీధరుండిలను మాహాత్మ్యంబుతో వర్ధిలన్,
ధీ శక్తిన్ వెలుగొందగా, పహితాధీశుండుగా వెల్గగా,
శ్రీశా నీ పద పద్మ భక్తియుతుఁడై చెల్వొందగా నిత్యమున్.
వర యేల్చూరికులాబ్ధి చంద్ర! మురళీ! ప్రఖ్యాత సత్ పండితా!
ధర మీ పుట్టిన రోజు నేడు. శుభ సంస్తాప్యంబు చేయున్ గృపన్,
పరమానంద వసంత సంహతినిడున్ ప్రఖ్యాతిగా మీకికన్,
హరి సంతోష సుఖప్రదుండునగుచున్. హర్షంబు మిమ్మొందెడున్.
జైహింద్.
1 comment:
పండితమ్మన్యులు అనే పదం మరోసారి చూడండి.
Post a Comment