Friday, August 15, 2025

శ్రీకృష్ణభగవానుని పూజ

 శ్రీకృష్ణభగవానుని  పూజా ప్రారంభము


పునరాచమ్య (మఱలా ఆచమనము, ప్రాణాయామము చేయవలెను)



ఆచమనీయం

( స్త్రీలైతే స్వాహా అనరాదు నమః అనాలి)


ఓం కేశవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}

ఓం నారాయనాయస్వాహా  --- {అని తీర్ధం తీసుకోవాలి}

ఓం మాధవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}

ఓం గోవిందాయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}

{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}


ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః ,ఓం త్రివిక్రమాయ నమః

ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః

ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః ,ఓం సంకర్షణాయ నమః,  ఓం వాసుదేవాయ నమః,  ఓం ప్రద్యుమ్నాయ నమః 

ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః

ఓం అధోక్షజాయ నమః,  ఓం నారసింహాయ నమః

ఓం అచ్యుతాయ నమః,  ఓం జనార్ధనాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః,  ఓం హరయే నమః ,  ఓం శ్రీకృష్ణాయ నమః

 ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః  --- ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)




ప్రాణాయామం


శ్లో||  ఓం భూ: |  ఓం భువః | ఓం సువః | ఓం మహః | 

        ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |


       ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః  

       ప్రచోదయాత్ || 

       ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||


{ అను మంత్రమును చదువుతూ 3సార్లు ప్రాణాయామము చేయవలెను }



ధ్యానం:


  ఓం కృష్ణం కమల పత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం

  వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిమ్ ॥


  ఓం వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం

  దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ॥


  ధ్యాయామి బాలకృష్ణం మాత్రకే స్తన్యపాయినం

  శ్రీవత్సవక్షసం కాంతం నీలోత్పలదళవచ్ఛతిమ్ ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః 

ధ్యాయామి ధ్యానం సమర్పయామి



ఆవాహనం:


ఆవాహయామి దేవేశం  శ్రీపతిం శ్రీధరం హరిం

బాలరూపధరం విష్ణుం సచ్చిదానంద విగ్రహం ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః ఆవాహితోభవ, స్థాపితోభవ,

సుప్రసన్నోభవ, వరదోభవ, స్థిరాసనం కురుకురు, ప్రసీద ప్రసీద


(అక్షతలు దేవునిపై వేయవలెను)



ఆసనం:


దామోదర నమస్తేస్తు దేవకీ గర్భసంభవ

రత్నసింహాసనం చారు గృహ్యతాం గోకులప్రియ ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః  ఆసనార్థే రత్నఖచిత

సింహాసనం సమర్పయామి(అక్షతలు, పుష్పములు దేవునిపై వేయవల)



అర్ఘ్యము:


    గంధపుష్పాక్షతో పేతం ఫలేనచ సమన్వితం

    అర్ఘ్యం గృహాణ భగవాన్ వాసుదేవ ప్రియాత్మజ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః అర్ఘ్యం సమర్పయామి.

అని నీటిని వదలాలి.



పాద్యము:


పుష్పాక్షత సమాయుక్తం పురుషోత్తమ పూర్వం

పాద్యం గృహాణ దేవేశ పూర్ణరూప నమో√స్తుతే॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః పాదారవిందయోః 

పాద్యం సమర్పయామి.



ఆచమనీయం:


నానానదీ సమాన్వితం సువర్ణకలశస్థితం

గృహాణాచమనార్థాయ విమలం జల మచ్యుత ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః ఆచమనం సమర్పయామి.



మధుపర్కం:


మధు ధధ్వాజ్య సంయుక్తం మహనీయ గుణార్ణవ

మధుసూదన దేవేశ మధుపర్కం గృహాణ మే ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః   మధుపర్కం సమర్పయామి



పంచామృతస్నానం:



పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం

పంచామృత స్నాన మిదం గృహాణ కమలాలయే


క్షీరము:


ఆప్యాయస్వమేతుతే విశ్వతః సోమ వృష్ణియమ్।

భవావాజస్య సంగథే॥

                     ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః  క్షీరేణస్నపయామి


దధిః:


దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణో రశ్వస్య వాజినః।

సురభినో ముఖా కరత్ప్రణ ఆయుగ్ం షితారిషత్॥

                   ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః    దధ్నాస్నపయామి

ఆజ్యం:


శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితో త్పునాత్వచ్ఛిద్రేణ।

పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః  ॥

                 ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః   ఆజ్యేన స్నపయామి


మధుః:


మధు వాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః।

మాధ్వీర్నః సంత్వోషధీః మధునక్త ముతోషసి

మధుమత్పార్థివగ్ం  రజః మధు ద్యౌరస్తునః పితా॥

మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం  అస్తు సూర్యః

మాధ్వీర్గావో భవంతునః ॥


                ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః   మధునాస్నపయామి


శర్కర:


స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ

సుహవీతు నామ్నే ।  

స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే

మధుమాగ్ం అదాభ్యః ॥


            ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః  శర్కరయాస్నపయామి


ఫలోదకం:


యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః

బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగ్ం హ సః॥


             ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః   ఫలోదకేనస్నపయామి


పంచామృత స్నానానంతరం  

యజ్ఞోపవీతం పరమం పవిత్రం  ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్।

ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః   యజ్ఞోపవీతం సమర్పయామి



ఆభరణం:


హారనూపుర కేయూర కింకిణీదామ పూర్వకం

గృహాణాభరణం సర్వం శరణాగత వత్సల ॥


శుద్ధోదక స్నానం.


శుద్ధోదక స్నానం.:


గంగా గోదావరీ కృష్ణా యమునాభ్యస్సమానీతం

సలిలం విమలం దేవస్నానార్థం ప్రతిగృహ్యతామ్॥


ఓం ఆపోహిష్ఠా మయోభువః తాన ఊర్ఝే దధాతన

      మహేరణాయచక్షసే । యోవశ్శివ తమోరసః ।

      తస్యభాజయతే హనః ।  ఉశతీరవ మాతరః।

       తస్మాత్ అరంగమామవః । యస్యక్షయాయ జిన్వధ 

        ఆపోజనయధాచనః ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః 

శుద్ధోదక స్నానం సమర్పయామి


శుద్ధోదకస్నానానంతరం శుద్ధ ఆచమనీయం

సమర్పయామి.



వస్త్రం:


పీతాంబర యుగం దేవ గృహాణ సుమనోహరం

దేహిమే సకలానర్థాన్ దేవకి ప్రియనందన॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః వస్త్రయుగ్మం సమర్పయామి



ఉపవీతం:


ఉపవీతం గృహాణేదం కాంచనం కమలాపతే

పవిత్రం పాహిమాం దేవ  నమః పరమపూరుష॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః   ఆభరణాని సమర్పయామి



గంధం:


గంధం కుంకుమ కస్తూరీ ఘనసార సమన్వితం

గృహాణ తే నమోదేవ కుబ్జానుగ్రహ కారిణే॥


గంధద్వారాం దు'రాధర్షాం నిత్యపు'ష్టాం కరీషిణీ''మ్ |

ఈశ్వరీగ్ం' సర్వ'భూతానాం తామిహోప'హ్వయే శ్రియమ్ ‖


కర్పూరాగరు కస్తూరీ రోచనాది భిరన్వితం ।

గంధం దాస్యామహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతా ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః   దివ్యశ్రీగంధం సమర్పయామి



అక్షతాన్:


అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ ముక్తాఫల సమప్రభాన్

వాసుదేవ గృహాణత్వం  నమస్తే భక్తవత్సల॥


అక్షతాన్ శాలీయాన్ తండులాన్ రమ్యాన్ మయాదత్తాన్ శుభావహాన్

అచ్యుతానంత గోవింద హ్యక్షతాన్ స్వీకురు ప్రభూ ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః అక్షతాన్ సమర్పయామి



పుష్పాణి:


కరవీరైర్జాతి కుసుమై శ్చంపకై ర్వకుళై శ్శుభైః

శతపత్రైశ్చ కల్హారై రర్చయేత్ పురుషోత్తమం ॥


అథాంగపూజ:


ఓం అనఘాయనమః                    పాదౌ పూజయామి   (పాదములు)

ఓం గోపాలాయనమః                     గుల్ఫౌ పూజయామి (చీలమండలు)

ఓం జన్మరహితాయనమః               జానునీ పూజయామి(మోకాళ్ళు)

ఓం పూతనావైరిణేనమః                 ఊరూః పూజయామి(తొడలు )

ఓం శకటాసురభంజనాయైనమః     కటిం పూజయామి (నడుము )

ఓం నవనీతప్రియాయనమః            నాభిం పూజయామి (బొడ్డు )

ఓం ఉత్తాళతాలభేత్రేనమః               ఉదరం పూజయామి (పొట్ట)

ఓం వనమాలినేనమః                      వక్షంపూజయామి (వక్షస్థలం)

ఓం చతుర్భుజాయనమః                 హస్తాన్ పూజయామి(చేతులు)

ఓం కంసారయేనమః                       కంఠం పూజయామి (కంఠం)

ఓం మధురానాథాయనమః             ముఖంపూజయామి (ముఖం)

ఓం కుచేలసంపదప్రదాయనమః      కపోలే పూజయామి (బుగ్గలు)

ఓం కంజలోచనాయనమః               నేత్రేపూజయామి (నేత్రములు)

ఓం కరుణానిధయేనమః                 కర్ణౌపూజయామి (చెవులు)

ఓం లలితాకృతయేనమః                లలాటం పూజయామి (నుదురు)

ఓం శుకసంస్తుతాయనమః              శిరః పూజయామి (శిరస్సు)

ఓం అనఘాయనమః                      అలకాన్ పూజయామి,ముంగురులు

ఓం సర్వేశ్వరాయనమః                   సర్వాణ్యంగాని పూజయామి.


అష్టోత్తర శతనామ పూజ:


ఓం శ్రీ కృష్ణాయ నమః |                 ఓం కమలానాథాయ నమః |

ఓం వాసుదేవాయ నమః |             ఓం సనాతనాయ నమః |

ఓం వసుదేవాత్మజాయ నమః |      ఓం పుణ్యాయ నమః |

ఓం లీలామానుషవిగ్రహాయ నమః |ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః |

ఓం యశోదావత్సలాయ నమః |     ఓం హరయే నమః || ౧౦ ||


ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాద్యాయుధాయ నమః |

ఓం దేవకీనందనాయ నమః |           ఓం శ్రీశాయ నమః |

ఓం నందగోపప్రియాత్మజాయ నమః |ఓం యమునావేగసంహారిణే నమః 

ఓం బలభద్రప్రియానుజాయ నమః |  ఓం పూతనాజీవితహరాయ నమః |

ఓం శకటాసురభంజనాయ నమః |    ఓం నందవ్రజజనానందినే నమః || 


ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |   ఓం నవనీతవిలిప్తాంగాయ నమః |

ఓం నవనీతనటాయ నమః |             ఓం అనఘాయ నమః |

ఓం నవనీతనవాహారిణే నమః |       ఓం ముచుకుందప్రసాదకాయనమః 

ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః |    ఓం త్రిభంగినే నమః |

ఓం మధురాకృతయే నమః |            ఓం శుకవాగమృతాబ్ధీందవే నమః |

ఓం గోవిందాయ నమః ||     ౩౦ 


ఓం యోగినాంపతయే నమః |          ఓం వత్సవాటచరాయ నమః |

ఓం అనంతాయ నమః |                   ఓం ధేనుకాసురభంజనాయ నమః |

ఓం తృణీకృతతృణావర్తాయ నమః |

ఓం యమలార్జునభంజనాయనమః  ఓం ఉత్తాలతాలభేత్రే నమః |

ఓం గోపగోపీశ్వరాయ నమః |            ఓం యోగినే నమః |

ఓం కోటిసూర్యసమప్రభాయ నమః || ౪౦ ||


ఓం ఇలాపతయే నమః |                     ఓం పరంజ్యోతిషే నమః |


ఓం యాదవేంద్రాయ నమః |               ఓం యదూద్వహాయ నమః |

ఓం వనమాలినే నమః |                      ఓం పీతవాసినే నమః |

ఓం పారిజాతాపహారకాయ నమః |      ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః |

ఓం గోపాలాయ నమః |                       ఓం సర్వపాలకాయ నమః || ౫౦ 


ఓం అజాయ నమః |                           ఓం నిరంజనాయ నమః |

ఓం కామజనకాయ నమః |                  ఓం కంజలోచనాయ నమః |

ఓం మధుఘ్నే నమః |                           ఓం మధురానాథాయ నమః |

ఓం ద్వారకానాయకాయ నమః |           ఓం బలినే నమః |

ఓం బృందావనాంతసంచారిణే నమః |

                      ఓం తులసీదామభూషణాయ నమః || ౬౦ ||


ఓం స్యమంతకమణిహర్త్రే నమః |     ఓం నరనారాయణాత్మకాయనమః 

ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః |  ఓం మాయినే నమః |

ఓం పరమపూరుషాయ నమః |

ఓం ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమః |

ఓం సంసారవైరిణే నమః |                  ఓం కంసారయే నమః |

ఓం మురారయే నమః |                     ఓం నరకాంతకాయ నమః || ౭౦ ||


ఓం అనాదిబ్రహ్మచారిణే నమః |         ఓం కృష్ణావ్యసనకర్షకాయ నమః |

ఓం శిశుపాలశిరచ్ఛేత్రే నమః |           ఓం దుర్యోధనకులాంతకాయనమః 

ఓం విదురాక్రూరవరదాయ నమః |    ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః |

ఓం సత్యవాచే నమః |                      ఓం సత్యసంకల్పాయ నమః |

ఓం సత్యభామారతాయ నమః |       ఓం జయినే నమః || ౮౦ ||


ఓం సుభద్రాపూర్వజాయ నమః |      ఓం జిష్ణవే నమః |

ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః | ఓం జగద్గురువే నమః |

ఓం జగన్నాథాయ నమః |                 ఓం వేణునాదవిశారదాయ నమః |

ఓం వృషభాసురవిధ్వంసినే నమః |    ఓం బాణాసురకరాంతకాయనమః 

ఓం యుధిష్టిరప్రతిష్ఠాత్రే నమః |        ఓం బర్హిబర్హావతంసకాయ నమః || 


ఓం పార్థసారథయే నమః |               ఓం అవ్యక్తాయ నమః |

ఓం గీతామృతమహోదధ్యే నమః |


ఓం కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజాయ నమః |

ఓం దామోదరాయ నమః |              ఓం యజ్ఞభోక్త్రే నమః |

ఓం దానవేంద్రవినాశకాయ నమః |   ఓం నారాయణాయ నమః |

ఓం పరబ్రహ్మణే నమః |        ఓం పన్నగాశనవాహనాయ నమః || ౧౦౦ ||


ఓం జలక్రీడాసమాసక్తగోపీజన వస్త్రాపహారకాయ నమః |

ఓం పుణ్యశ్లోకాయ నమః |               ఓం తీర్థపాదాయ నమః |

ఓం వేదవేద్యాయ నమః |                 ఓం దయానిధయే నమః |

ఓం సర్వతీర్థాత్మకాయ నమః |          ఓం సర్వగ్రహరూపిణే నమః |

ఓం పరాత్పరాయ నమః || ౧౦౮ ||

ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః 



శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః


ఓం ప్రకృత్యై నమః |                        ఓం వికృత్యై నమః |

ఓం విద్యాయై నమః |                      ఓం సర్వభూతహితప్రదాయై నమః |

ఓం శ్రద్ధాయై నమః |                        ఓం విభూత్యై నమః |

ఓం సురభ్యై నమః |                        ఓం పరమాత్మికాయై నమః |

ఓం వాచే నమః |                             ఓం పద్మాలయాయై నమః | ౧౦ ||


ఓం పద్మాయై నమః |                       ఓం శుచయే నమః |

ఓం స్వాహాయై నమః |                     ఓం స్వధాయై నమః |

ఓం సుధాయై నమః |                       ఓం ధన్యాయై నమః |

ఓం హిరణ్మయ్యై నమః |                   ఓం లక్ష్మ్యై నమః |

ఓం నిత్యపుష్టాయై నమః |               ఓం విభావర్యై నమః | ౨౦ ||


ఓం అదిత్యై నమః |                         ఓం దిత్యై నమః |

ఓం దీప్తాయై నమః |                        ఓం వసుధాయై నమః |

ఓం వసుధారిణ్యై నమః |                 ఓం కమలాయై నమః |

ఓం కాంతాయై నమః |                     ఓం కామాక్ష్యై నమః |

ఓం క్రోధసంభవాయై నమః |             ఓం అనుగ్రహప్రదాయై నమః | ౩౦ ||


ఓం బుద్ధయే నమః |                        ఓం అనఘాయై నమః |

ఓం హరివల్లభాయై నమః |               ఓం అశోకాయై నమః |

ఓం అమృతాయై నమః |                  ఓం దీప్తాయై నమః |

ఓం లోకశోకవినాశిన్యై నమః |           ఓం ధర్మనిలయాయై నమః |

ఓం కరుణాయై నమః |                     ఓం లోకమాత్రే నమః | ౪౦ ||


ఓం పద్మప్రియాయై నమః |                ఓం పద్మహస్తాయై నమః |

ఓం పద్మాక్ష్యై నమః |                         ఓం పద్మసుందర్యై నమః |

ఓం పద్మోద్భవాయై నమః |               ఓం పద్మముఖ్యై నమః |

ఓం పద్మనాభప్రియాయై నమః |        ఓం రమాయై నమః |

ఓం పద్మమాలాధరాయై నమః |        ఓం దేవ్యై నమః | ౫౦ ||


ఓం పద్మిన్యై నమః |                         ఓం పద్మగంధిన్యై నమః |

ఓం పుణ్యగంధాయై నమః |             ఓం సుప్రసన్నాయై నమః |

ఓం ప్రసాదాభిముఖ్యై నమః |           ఓం ప్రభాయై నమః |

ఓం చంద్రవదనాయై నమః |             ఓం చంద్రాయై నమః |

ఓం చంద్రసహోదర్యై నమః |             ఓం చతుర్భుజాయై నమః | ౬౦ ||


ఓం చంద్రరూపాయై నమః |              ఓం ఇందిరాయై నమః |

ఓం ఇందుశీతలాయై నమః |            ఓం ఆహ్లాదజనన్యై నమః |

ఓం పుష్ట్యై నమః |                           ఓం శివాయై నమః |

ఓం శివకర్యై నమః |                         ఓం సత్యై నమః |

ఓం విమలాయై నమః |                    ఓం విశ్వజనన్యై నమః | ౭౦ ||


ఓం తుష్ట్యై నమః |                          ఓం దారిద్ర్యనాశిన్యై నమః |

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |             ఓం శాంతాయై నమః |

ఓం శుక్లమాల్యాంబరాయై నమః |    ఓం శ్రియై నమః |

ఓం భాస్కర్యై నమః |                      ఓం బిల్వనిలయాయై నమః |

ఓం వరారోహాయై నమః |                ఓం యశస్విన్యై నమః | ౮౦ ||


ఓం వసుంధరాయై నమః |              ఓం ఉదారాంగాయై నమః |

   

ఓం హరిణ్యై నమః |                       ఓం హేమమాలిన్యై నమః |

ఓం ధనధాన్యకర్యై నమః |              ఓం సిద్ధయే నమః |

ఓం స్త్రైణసౌమ్యాయై నమః |          ఓం శుభప్రదాయే నమః |

ఓం నృపవేశ్మగతానందాయైనమః | ఓం వరలక్ష్మ్యై నమః | ౯౦ ||


ఓం వసుప్రదాయై నమః |                ఓం శుభాయై నమః |

ఓం హిరణ్యప్రాకారాయై నమః |       ఓం సముద్రతనయాయై నమః |

ఓం జయాయై నమః |                     ఓం మంగళా దేవ్యై నమః |

ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః |     ఓం విష్ణుపత్న్యై నమః |

ఓం ప్రసన్నాక్ష్యై నమః |                    ఓం నారాయణసమాశ్రితాయై నమః

                                                                                               ౧౦౦ ||

ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః |         ఓం దేవ్యై నమః |

ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |       ఓం నవదుర్గాయై నమః |

ఓం మహాకాల్యై నమః |                   ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః |

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |ఓం భువనేశ్వర్యై నమః | ౧౦౮ ||



ధూపం:


శ్లో॥ వనస్పత్యుద్భవైః దివ్యైః నానా గంధైస్సు సంయుతమ్ ।

       ఆఘ్రేయస్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్॥

శ్లో॥ ధూపం గృహాణ వరద దశాంగేన సువాసితం

       గరుడద్వజ గోవింద గోవర్ధన ధరావ్యయ ॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః  ధూపం సమర్పయామి



దీపం:


శ్లో॥  సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా।

        గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ ॥


భక్త్యా దీపం ప్రయచ్చామి  దేవాయ పరమాత్మనే।

         త్రాహిమాం నరకాద్ ఘోరా ద్దివ్యజ్యోతిర్నమోస్తుతే॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః     దీపం దర్శయామి..



నైవేద్యం:


      శుద్ధమన్నం పాయసంచ కృపాణాకృపసంయుతం

      శీతాన్నం సదఘృతంచైవ గృహాణ గరుడద్వజ ॥


      భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవ చ।

      ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం  పరమేశ్వరి॥


యథాశక్తితో ఎనిమిది పిండివంటలు, పాలు, పెరుగు, వెన్న, మీగడ, పళ్ళు, కొబ్బరికాయలు నివేదింౘవలెను


ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్


(నీరు నివేదన చుట్టూ చల్లుతూ)  ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…నీరు నివేదన చుట్టూ చల్లుతూ)  ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…

  

ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః     అమృత నైవేద్యం సమర్పయామి    


 ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా

 

మధ్యే మధ్యే  ఉదక పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి

ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః      హస్తౌ ప్రక్షాళయామి

ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః      పాదౌ ప్రక్షాళయామి.

ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః    శుద్దఆచమనీయం సమర్పయామి


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః    మహా నైవేద్యం నివేదయామి.



తాంబూలం:


     పూగీ ఫలైః సకర్పూరం నాగవళ్ళీ దళైర్యుతమ్।

     ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతామ్॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః   తాంబూల , దక్షిణాం సమర్పయామి,

               తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.


నీరాజనం:


నీరాజనం గృహాణేదం  నారాయణ నిరామయ

నీరజాక్ష నమస్తుభ్యం వ్రతాఖిల ఫలప్రద॥


సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం  వైరాజ్యం

పారమేష్ఠికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం


నతత్రసూర్యోభాతిన చంద్రతారకం

నేమా విద్యతోభాంతి కుతోయమగ్నిః

తమేవ భాంత మనుభాతి సర్వం

తస్య భాసా సర్వమిదం విభాతి॥


ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తథా ।

నీరాజనం మయా దత్తం గృహాణ వరదోభవ॥


ఓం మంగళం శ్రీమహాలక్ష్మై శారదాయై సుమంగళం

మహిషాసుర మర్థిన్యై మహా గౌర్యైచ మంగళం

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః

మంగళ   కర్పూర నీరాజనం  దర్శయామి.


నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి



మంత్రపుష్పం:


పుష్పాంజలిం గృహైణత్వం మయాభక్త్యా సమర్పితం

పురుషోత్తమ పూతాత్మన్  పుణ్యమూర్తే పరాత్పర ॥ల


ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే

నమోవయం వైశ్రవణాయ కుర్మహే

సమేకామాన్ కామకామాయ మహ్యమ్

కామేశ్వరో వైశ్రవణో దదాతు

కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయనమః


ఓం  తత్ బ్రహ్మ ।  ఓం తద్వాయుః ।  ఓం తదాత్మా।

ఓం  తథ్సత్యమ్।  ఓం తథ్సర్వం  ।  ఓం తత్పురోర్నమః


అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు

త్వం యఙ్ఞస్త్వం వషట్కారస్త్వం యింద్రస్త్వం

రుద్రస్త్వ  విష్ణుస్త్వం బ్రహ్మత్వం  ప్రజాపతిః

త్వంతదాప ఆపోజ్యోతీ రసోమృతంబ్రహ్మ భూర్భువస్సువరోమ్॥


ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమేస్తు సదాశివోమ్॥


గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీసా చతుష్పదీ।

అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్॥


ఓం శ్రీకృష్ణపరమాత్మా దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి

పుష్పములు అక్షతలు తీసుకుని స్వామి చెంత యుంౘవలెను.


శ్రీ కృష్ణ జన్మాష్టమి - విశిష్టత

జైశ్రీకృష్ణ 

శ్రీ కృష్ణ జన్మాష్టమి - విశిష్టత

ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభణ కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది. ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు .

సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు

 "పైకొని చూడరె వుట్ల పండుగ నేడు

ఆకడ గొల్లెతకు ననందము నేడు

అడర శ్రావణబహుళాష్టమి నేడితడు

నడురేయి జనియించినాడు చూడ గదరే.

మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి.

హిందూమతానికి ఆదర్శప్రాయ గ్రంధమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తుల సొంతమౌతుంది. అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదం.

శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించిన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సఖల సుఖాలు సొంతమౌతాయి. దీనితోపాటు కృష్ణ సహస్రనామ పూజను కూడా చేయిస్తే చాలా మంచిది.

దేవాలయ సందర్శన వేళ శ్రీకృష్ణుని లీలా వినోద మాలిక శ్రీభాగవతం గ్రంధాన్ని కొని దాన్ని పఠించగల్గితే స్వర్గ సౌఖ్యం సొంతమౌతుంది. కృష్ణాష్ఠమి సందర్భంగా సన్నిహితులకు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందించడం శుభకరం.

కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణుని దేవాలయ నిర్వాహకులు సైతం శ్రీకృష్ణుని లీలలను తెలిపే వివిధ నృత్య నాటకాలను, శ్రీకృష్ణుని చరితకు సంబంధించిన ఉపన్యాసాలను ఏర్పాటుచేస్తే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు... దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రమున ... కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. 

కృష్ణ జన్మాష్టమి పర్వదినం:

కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

జన్మ తిథి:

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది

కృష్ణాష్టమి పండుగ విధానం:

 చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ

బంగారు మొలతాడు పట్టుదట్టి

సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు

చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు.

శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.

పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.

యశోదకృష్ణ !భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత 

వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.

శ్రీకృష్ణాష్టమీవ్రతకల్పము విశిష్టత

నేడు శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం ఒకటే కాదు. మాయమ్మ యోగమాయ జన్మోత్సవం కూడా నేడే.*

శ్రీకృష్ణ

కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి  వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చు, ఇవికాక 'క' అంటే బ్రహ్మ. 'ఋ' అంటే అనంతుడు. 'ష' అంటే శివుడు. 'ణ' అంటే ధర్మము. 'అ' అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు.

కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నది, నేను చదివి తెలుసుకొన్నది, నాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణము, హరివంశమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది.

శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.

శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం

ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి  యుగేయుగే  [1.3.28 ]

ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే. 

కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే. 

ధర్మ  విరోధుల చేత లోకం వ్యాకులం చెందినపుడు. రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు.

కొన్ని అవతారాలలో  పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా  భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది.

శ్రీకృష్ణావతారం వల్ల లోకానికి మూడు ముఖ్యమైన ప్రయోజనాలు

 ఒకటి - వేదాంతం గ్రంధాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమే అని తన  అద్భుతమైన జీవితం ద్వారా నిరూపించడం.

 రెండు- అత్యద్భుతమైన మధురభక్తిమార్గాన్ని లోకానికి అందించడం. కృష్ణప్రేమభక్తి మాధుర్యంలో ఓలలాడి ఎందరు భక్తవరేణ్యులు దివ్యానందాన్ని చవిచూసారో లెక్కలేదు. వేదాంతంలో అత్యున్నతమైనదిగా తలచే మోక్షాన్ని కూడా తక్కువ స్తాయిదిగా తలచి త్రుణీకరించగల శక్తి మధురభక్తి సొంతం. దివ్యమైన మధురప్రేమానుభావం ముందు మోక్షం కూడా వెలవెలా బోతుంది అన్నది వాస్తవమే.

మూడు - సమస్త వేదాంతసిద్ధాంతాలనూ భగవద్గీతా రూపంలో సమన్వయపరచడం. ఇప్పటివరకూ వచ్చిన ఆచార్యులు పండితులు అందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసినవారే. ఎందుకంటే సమస్త వేదవేదాంతాల సారం గీతలో నిక్షిప్తమై ఉన్నది.

కాకపోతే ఇటువంటి మహత్తరమైన అవతారాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎప్పటిలాగే మన దురదృష్టం. కృష్ణుడు అబద్దాలు చెప్పాడనీ, మోసాలు చేసాడనీ, గోపికలతో సరసాలు సాగించాడనీ, రాసలీల అనేది కామకేళి అనీ పిచ్చిపిచ్చి మాటలు, కథలు జతల సప్రచారంలో ఉన్నాయి. రాముడు చేసినట్లు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యండి - వ్యతిరేకంగా మాత్రం చెయ్యకండి. అన్న శ్లేషాత్మకవ్యాఖ్యలూ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుని ఔన్నత్యం అర్ధంకాక అజ్ఞానులు అనుకునే పిచ్చిమాటలు. కృష్ణావతార మహత్యాన్ని అణుమాత్రం గ్రహించగలిగినా ఆ కధల వెనుక ఉన్న అద్భుతమైన ఔన్నత్యాన్ని మనం చూడగలుగుదుము.

జైశ్రీరామ్.

జైహింద్.