Sunday, July 21, 2024

"భారత జాతీయ పతాక నేపథ్యం" ... రామకిష్టయ్య సంగనభట్ల, 9440698494.

 "భారత జాతీయ పతాక నేపథ్యం"

20వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్ర్యోద్యమం బాగా ఊపందు కున్నప్పుడు జాతీయోద్యమ స్పూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయ పతాకం అవసరమైంది. 1904లో వివేకానందుడి శిష్యు రాలైన ఐరిష్ వనిత సోదరి నివేదిత భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించింది. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా. జెండా మధ్య భాగంలో వజ్రాయుధం, తెల్ల తామర గుర్తు లున్నాయి. "(భారత) మాతకు వందనం" అనే అర్ధం వచ్చే టెం గాలీ మాటలు (వందేమాతరం)" ఆ జెండా మీదున్నాయి. ఎరుపు స్వాతంత్య్ర పోరాటానికి, పసుపు విజయానికి, తెల్లతామర స్వచ్ఛ తకు చిహ్నాలు. 1907 లో మేడం భికాజీ కామా ఎగరేసిన అండా మొట్ట మొదటి త్రివర్ణ పతాకం 1906లో జరిగిన బెంగాల్ విభజన ను వ్యతిరేకిస్తూ జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో 1906 ఆగష్టు? న కలకత్తాలోని పార్శీబగాన్ స్వేర్లో శవీంద్ర ప్రసాద్ బోస్ దే అవి ష్కరించ బడింది. ఈ పరాకాన్ని 'కలకత్తా పతాకం" అంటారు. ఈపతాకంలో సమాన వెడల్పుతో అడ్డంగా మూడు పట్టీలున్నాయి: పైన నారింజ రంగు, మధ్యలో పసుపుపచ్చ, క్రింద ఆకుపచ్చ. పైపట్టీ మీద సగం విచ్చుకున్న ఎనిమిది తామర పూలు, క్రింది పట్టీ మీద నెలవంక, మధ్యలో దేవనాగరి లిపిలో 'వందే మాత రం" అనే అక్షరాలు ఉన్నాయి. 1917 లో హెూంరూల్ ఉద్య మం లో వాడిన జండా, 1907 ఆగష్టు 22న మేడం బికాజీ కామా జర్మనీలోని స్టుట్గార్ట్లో మరో జండాను ఎగరేసింది. ఈ అందాలో పైన ఆకుపచ్చ, మధ్యన కాషాయం, అడుగున ఎరుపు రంగులు ఉన్నాయి. ఇందులో ఆకుపచ్చ ఇస్లాముకు, కాషాయం హిందూ, బౌద్ధాలకు సూచికలు. ఆకుపచ్చ పట్టీలో బ్రిటిషు భార తంలోని 8 ప్రావిన్సులకు గుర్తుగా 8 పద్మాలు ఉన్నాయి. మధ్య నున్న కాషా య పట్టీలో దేవనాగరి లిపిలో వందేమాతరం రాసి ఉంది. అదు గున ఉన్న పట్టీలో స్థంభానికి దగ్గరగా నెలవంక, రెం డో చివర సూర్యుడు ఉన్నాయి. ఈ జండాను భికాజీ కామా, వీర సావర్కార్, శ్యాంజీ కృష్ణ వర్మలు కలిసి తయారు చేసారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యాక, బెర్లిన్ కమిటీలోని భారతీయ విప్లవకా రులు దీన్ని స్వీకరించాక, ఈజండా బెర్లిన్ కమిటీ జందాగా పేరు పొందింది. మొదటి ప్రపంచయుద్ధకాలంలో మెసొపొటేమియాలో ఈ జండాను విస్తృతంగా ఉపయోగించారు. గదర్పార్టీ జందాను కూడా అమెరికాలో భారతీయ చిహ్నంగా కొన్నాళ్ళ ఉపయోగిందారు. 1917లో తిలక్, అనీబిసెంట్లు హెూంరూల్ ఉద్యమంలో ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చని అడ్డపట్టీలు గల ఇంకొక జెండాను వాడారు. జెండా పైభాగంలో ఎడమవైపు తాము కోరిన డొమినియన్ హెూదాకు సూచికగా యూనియన్ జాక్ గుర్తు, కుడి వైపు తార-నెలవంక గుర్తులను వాడారు. దానికి దిగు వన హిం దువులకు పవిత్రమైన సప్తర్షి మండలానికి గుర్తుగా ఏడు నక్షత్రాలు న్నాయి. యూనియన్ జాక్ ఉండడం వల్లనేమో ఇది జనామోదం పొందలేకపోయింది. 1916లో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య ఒక జాతీయ పతాకాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని గుర్తించిన ఉమర్ సుభాని, ఎస్.బి. బొమ్మన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మిషన్ను ఏర్పాటుచేశారు. వెంకయ్య తాను రూపొందించిన పతాకాన్ని గాంధీజీకి చూపిం దగా, ఆయన దాంట్లో భారతదేశానికీ, దేశం తానెదుర్కొంటున్న సమస్యలనుంచి విముక్తి పొందడానికి చిహ్నం గా నిలిచిన చర (రాట్నము)ను చేర్చమని సలహా ఇచ్చాడు. నిరాడంబరమైన రాట్నము గాంధీజీ నేతృత్వంలో భారతదేశ ఆర్థిక పునరుత్థానానికి ప్రతీకగా నిలిచింది. పింగళి వెంకయ్య గాంధీ సూచన ప్రకారం ఎరుపు-ఆకుపచ్చ రంగు పట్టీలమీద రాట్నము గుర్తును రూపొం దించి చూపాడు. ఐతే అది అన్నిమతాలకూ ప్రాతి నిధ్యం వహిం వేలా లేదని గాంధీ దాన్ని తిరస్కరించాడు. గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇంకొక త్రివర్ణపతాకం పైనుంచి క్రిందకు వరుసగా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపుపట్టీలతో, మూడు పట్టీలమీదుగా ఒకే పెద్ద రాట్నము గుర్తుతో రూపొందించ బడింది. ఆ మూడు పట్టీలు మైనారిటీ మతాలు, ముస్లిం, హిందూ మతాల కు సూచికలు. ఇది అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వాతం త్య్రపోరాటం సాగిస్తోన్న జర్లాండు పతాకాన్ని పోలి ఉంది. ఈపతాకాన్ని అహమ్మ దాబాదు కాంగ్రెసు సమావేశంలో ఆవిష్కరించారు. ఇది కాంగ్రెసు అధికార పతాకం కాకపోయినా జాతీయోద్యమంలో ఎక్కువగా వాడారు. ఐతే ఆ జెండాలో మతా లకు చిహ్నాలుండడం చాలామం దికి నచ్చలేదు. 1924లో కలకత్తాలో సమావేశమైన ఆలిండియా కాంగ్రెస్ హిందువులకు చిహ్నాలుగా కాషాయ రంగును, గడను చేర్చాలని కోరింది. అదే సంవత్సరం హిందూ యోగుల, ముస్లింఫకీర్లు-సర్వేషీల వైరాగ్యానికి చిహ్న మైన జేగురు రంగును చేర్చా అనే ప్రతిపాదన కూడా వచ్చింది. సికులు తమ మత చిహ్నంగా పసుపురంగును కూడా చేర్చాలని, లేనట్టైతే మతపరమైన సూచిక లను పూర్తిగా తొలగించాలని కోరారు. భారత దేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న భారత జాతీయకాంగ్రెసు 1921లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారికంగా ఒక పతాకాన్ని రూపొందించుకొంది. ఎరుపు హిందూ మతానికి, ఆకుపచ్చ ఇస్లాం మఠానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు. కాంగ్రెసు 1931 లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో, మధ్యలో రాట్నము బొమ్మగల పతా కాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలూ లేవు. 1931 లో సూచించ బడిన జెండా ఈపరిణామాల మధ్యకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1931 ఏప్రిల్ 2న ఈ వివాదాలను పరిష్కరించడానికి ఏడుగురు సభ్యులతో ఫ్లాగ్ కమిటీని నియమించింది. "జెండాలోని మూడు రంగులూ మతాలనుద్దేశిం చినవే కాబట్టి అభ్యంతరకర మైన వేనని" కమిటీ తీర్మానించింది. ఫలితంగా పూర్తిగా ఎర్రమట్టి రంగులో, పైభాగాన రాట్నము గుర్తుతో ఒక కొత్త జెండా తయా రైంది. దీన్ని ఫ్లాగ్ కమిటీ ఆమోదించినా ఇది కూడా మతపరమైన భావజాలాన్నే సూచిస్తోందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆమోదించ లేదు. 1931లో, పింగళి వెంకయ్య రూపకల్పన చేసి, 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న భారత జాతీయ కాంగ్రెస్ పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆజాద్ంద్్ఫజ్ వాడిన జెండా అదే సమ యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈపతాకాన్ని స్వల్ప మార్పులతో -దరఖా స్థానంలో "ఆజాద్ హింద్" అన్న అక్షరాలు, ముందుకు దూకుతున్న పులిబొమ్మతో వాడుకొంది. ఈమార్పులు గాంధీ అపా oసాయుత పద్ధతులకు, సుభాష్ చంద్రబోస్ వీరోచిత పద్దతుల కు గల తేడాను ప్రతిబిం బిస్తాయి. ఈ త్రివర్ణపతాకం భారత దేశపు గడ్డమీద మొదటి సారిగా బోస్ చేత మణిపూరులో ఆవిష్కరి ంచ బడింది. స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకాన్ని నిర్ణయిం చడాని రాజ్యాంగసభ, 1947 జూన్23న బాబూరాజేంద్ర ప్రసాద్ అధ్య క్షతన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, కె.ఎం. పణిక్కర్, సరోజినీ నాయుడు, బిఆర్ అంబేద్కర్లతో ఒకకమిటీని నియమించింది. - రామకిష్టయ్య సంగనభట్ల, 9440698494.

Thursday, July 18, 2024

అన్నింటా మనం ముందే. ఇదీ భారతీయుల ప్రతిభ.

 1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.        

2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.     

3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :

పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..    

4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..   

5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..

6. అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..    

7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు +  హిడింబి = ఘటోత్కచుడు..

8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation.       

9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..         

10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?

ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?         

ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది  ఫేక్ అని కొట్టి పడేస్తారు..కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?      

ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..     

కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని ఉనికి ఉండి తీరుతుంది..    

ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..

 భారతీయులారా  మిత్రులారా  మీకు ఇవి తెలుసా?  

భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది  మనమే (ఆర్యబట్ట)

👉భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)

👉ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)

👉 విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)

👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)

👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన  వరాహమిహిరుడు మనవాడే

👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన

వాల్మీకి మహర్షి మనవాడే

👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు

👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు

👉అణువులు గురించి వివరించిన కణాదుడు

👉DNA గురించి చెప్పిన బోధిధర్మ

👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి

👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు

👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని

ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏

Wednesday, July 3, 2024

సూక్తులు

 "ధర్మో రక్షతి రక్షిత:

ధర్మ ఏవో హతో హంతి  - "ధర్మో రక్షతి రక్షిత:" 

తస్మా ధర్మో న హంతవ్యో  - మానో ధర్మో హ్రతోవ్రధీత్ II

ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే, అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !


సత్యమేవ జయతే

సత్యమేవ జయతే నా2నృతం - సత్యేన పంథా వితతో దేవయాన 

యేనా క్రమం తృషయో హాయప్త కామా - యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.


అహింసా పరమో ధర్మః

అహింసా పరమో ధర్మ: తథా2 హింసా పరం

తప: అహింసా పరమం ఙ్ఞానం అహింసా పరమార్జనమ్

భావము.  

అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి జ్ఞానం. గొప్ప సాధన.


II ధనం మూల మిదం జగత్ ||

ధనమార్జాయ కాకుత్థ - ధనం మూల మిదం జగత్

అంతరం నాభి జానామి - నిర్ధనస్య మృతస్య చ ॥

భావము.  

ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా 

ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.


II జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||

అపి స్వర్ణ మయీ లంకా న మే రోచతి లక్ష్మణ ! 

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||

భావము.  

స్వర్ణ మయమైన లంకను చూసి శ్రీరాముడు తన సోదరునితో ఈ విధంగా సోదరా, 

లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. 

ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !


|| కృషితో నాస్తి దుర్భిక్షమ్ ||

కృషితో నాస్తి దుర్భిక్షమ్ జపతో నాస్తి పాతకమ్ |

మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం ||

చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం 

పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే 

దేనికీ భయపడే పని లేదు.


|| యథా రాజా తథా ప్రజా ||

రాజ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, - పాపే పాప పరా: సదా 

రాజాను మను వర్తంతే, - యథా రాజా తథా ప్రజా !

రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే 

రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి 

నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.