Sunday, October 29, 2023
Saturday, October 28, 2023
Friday, October 27, 2023
Thursday, October 26, 2023
Wednesday, October 25, 2023
Monday, October 23, 2023
శతమానమ్ :శుక్లయజుర్వేదాంతర్గతమైన వాజసనేయసంహిత(19–93)... వివరణ
శతమానమ్ :
శుక్లయజుర్వేదాంతర్గతమైన వాజసనేయసంహిత(19–93)లో “ఇంద్రస్య రూపం శతమానం—” అని వర్ణన ఉంది.
ఈ “శతమానం” అనే పదబంధానికి మహీధరభాష్యం యీ విధంగా వివరణనిచ్చింది:
“శతానాం ఏకేషాం ప్రాణినాం ‘మానం’,
పూజా యస్మిన్ తత్ –జగత్ పూజ్యం ఇతి అర్థః“|
అంటే వందలకొద్దీ ఉన్నవారిలో (దేవతలలో) ప్రత్యేక గౌరవనీయుడు లేక పూజ్యుడు ఇంద్రుడు అన్నమాట. అంటే సజాతీయులలో ప్రత్యేక పూజ్యత లేక గౌరవనీయత కలిగి ఉండడాన్ని వైదికపరిభాషలో “శతమానం” అంటారన్నమాట!
శతేంద్రియః : ఇంద్రస్య ఆత్మనః లింగం అనుమాపకం అని ఇంద్రియ శబ్ద వ్యుత్పత్తి. ఇంద్రియశబ్దం జీవుడికి చిహ్నం లేక గుర్తు. అయితే ఈ ప్రధానార్థం ఉన్నా యిక్కడ ఇంద్రియానికి అవయవము (organ), శరీరభాగము(part of body), బహిరంతర జ్ఞాన, కర్మ, సూక్ష్మ ఇంద్రియాలు(organs of senses, action & four-fold subtle instruments of innerbeing) అనే అర్థాలు గ్రహించాలి. అంటే బాహ్యాభ్యంతర అనేక
అవయవాలన్నమాట!
ఇప్పుడు ఒక syntactical pattern లో పెట్టి మంత్రభావాన్ని పరికిద్డాం:
శతేంద్రియః శతాయుః పురుషః
శతమానం భవతి| (ఏతత్ తస్య)
ఆయుషి ఏవ ఇంద్రియే ప్రతి తిష్ఠతి,
ప్రతి తిష్ఠతి|
భావం:
అనేక బాహ్యాభ్యంతర అవయవాలుకలిగి, శతసంవత్సర జీవితం కలిగిన పురుషుడు అనేకజనులలో ఒక ప్రత్యేక వ్యక్తిగా మన్నన పొందుతున్నాడు. అటువంటి యజమాని ఆత్మస్థైర్యాన్నిపొంది ఇహపరాలు రెండూ సాధిస్తున్నాడు. (ప్రతి తిష్ఠతి అని రెండు మారులు అనడానికి ఇది కారణం).
స్వస్తి|
V.V.Krishna Rao
Sunday, October 22, 2023
Saturday, October 21, 2023
Thursday, October 19, 2023
Tuesday, October 17, 2023
ప్రత్యంగిరా దేవి.
ఓం ప్రత్యంగిరాయై నమః. శ్రీ లక్ష్మీ సహస్ర నామములలో 62వ నామము.
ప్రత్యంగిరా దేవి.
లక్ష సింహ ముఖాలతో... భగభగమండే కేశాలతో...
త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి.
శ్రీరాముడు,
హనుమంతుడు,
శ్రీకృష్ణుడు,
ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి.
శత్రుసంహారం,
దారిద్య్రనివారణ,
మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు.
శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర.
ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు.
సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి.
రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలు,
తెల్లఆవాలు,
నల్లఉప్పు,
శొంఠి,
సమిదల వంటి రాజద్రవ్యాలతో అదీ అమావాస్యనాడు ప్రత్యేక అభిషేకాలూ హోమాలూ నిర్వహిస్తారు.
దుష్టశిక్షణార్థం.
సృష్టి ఆరంభంలో దేవతలకూ దానవులకూ యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుణ్ని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట.
ఆ సంగతి తెల్సుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట.
ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడ్డాడట.
దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి
ఆ తల్లిని ప్రార్థించారట.
అప్పుడు ఆదిపరాశక్తి లక్షసింహముఖాలతో అతిభయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడినీ అతని సైన్యాన్నీ సంహరించిందట.
లోకభీకరంగా వెలసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారనీ అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాదికాలు నిర్వహించే ఆచారం అంతగాలేదనీ ఐతిహ్యం.
అధర్వణవేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అధర్వణ భద్రకాళి అనీ శత్రువులకు వూపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంభిల అనీ...
ఇలా ప్రత్యంగిరా దేవికి చాలా పేర్లున్నాయి.
ఇంద్రజిత్తు ఆరాధన..
ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది.
శ్రీరాముడు,
హనుమంతుడు,
శ్రీకృష్ణుడు,
ధర్మరాజు,
నరకాసురుడు,
ఘంటాకర్ణుడు,
జరాసంధుడు
తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి.
రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని 'నికుంభిల' రూపాన పూజించి ఉపాసన చేసేవాడనీ ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలులు ఇచ్చి బయలుదేరేవాడనీ అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదనీ ప్రతీతి.
రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం వెుదలుపెట్టాడట.
అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతణ్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట.
దాంతో వానరులంతా వెళ్లి యాగమండపాన్నీ యజ్ఞాన్నీ ధ్వంసం చేశారట.
సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు.
ఆరోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట.
ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని 'చంద్రఘంట'(నవదుర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట.
ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి.
ప్రత్యక్షంగానే కాదు... పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచికాపాడుతుందని నమ్మిక.
నిత్యం లలితాసహస్రనామం చదివేవారిని..దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం..
ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .
ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు.
అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .
ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది .
ప్రత్యంగిరామాత పుట్టినవైనము..
కృతయుగములో హిరణ్యకశ్యుపుని సంహరించటానికి శ్రీహరి నరసింహా అవతారములో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించి అసురసంద్యవేళ గడప పై తన పదునైన గోళ్ళతో కడుపు చీల్చి సంహరించాడు.
రాక్షసాధమున్ని అయినా నరసింహ మూర్తి కోపం చల్లారలేదు.
నరసింహుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమౌతుందని భయపడ్డ దేవతలు నరసింహుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరున్ని ప్రార్ధించారు.
అంతట పరమేశ్వరుడు వీరభధ్రావతారములో నరసిం హుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసింహుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు.
కానీ నరసింహ మూర్తి మరింత కోపంతో అష్టముఖగండభేరుండమూర్తి అవతారంతో వీరభద్రుని పైకి వురుకుతాడు.
అంతట వీరభద్రుడు శరభా అవతారం దాలుస్తాడు. శరభుని రెండు రెక్కలలో ఒక రెక్కలొ శూలిని ,
మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి వుంటాయి.
అష్టముఖగండభేరుండమూర్తి తనవాడి అయిన ముక్కుతో శరభేశ్వరున్ని ముక్కలు చేయ్యటానికి యత్నిస్తాడు.
శరభేశ్వరుని శూలిని శక్తి దాగివున్న రెక్క అష్టముఖగండబేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది రెండో రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది.
మహాప్రత్యంగిరరూపవర్ణన:.
నేలనుండి నింగిని తాకేటట్లుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీదేహం.
ఆ స్త్రీ దేహము కారుచీకటితో కూడిన నల్లనివర్ణం..
మగసింహపు వెయ్య తలలతో..
ఒకకవైపు..ఎర్రన్ని నేత్రాలు..
మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పైరెండు చేతులతో ఉద్భవిస్తుంది.
ప్రత్యంగిరామాత మొదటి నాలుగు చేతులలో..
ఒకచేతిలో త్రిశూలము
మరోచేతిలో సర్పము అలంకారంగా చుట్టుకున్న డమురుకము,
మరో చేతిలో ఈటె వంటి కత్తి..
మరోచేతిలో అసురుని శిరస్సు
మిగితా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో
మెడలో కపాల మాలతో
అత్యంత పొడువైన కేశాలతో
కేశాల చివర శక్తి తోకూడిన తంతువులు
నాల్గు సింహల స్వర్ణ రధంపై[ఈ నాల్గు సిం హలను నాల్గు వేదాలు గా కొందరు మరికొందరు నాల్గు పురుషార్ధాలుగానూ ఇంకొందరు నాల్గు ధర్మాలగానూ విశ్లేషిస్తారు సాధకులు} ఉద్బవించింది.
ఈమె ఉద్బవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్ లోని ఒక రహస్య ప్రదేశములో వుంది.
ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయి
ఈ సరస్సు కు ఎల్లప్పుడు సింహాల గుంపు కాపలాగా వుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాదకులు నిక్కచ్చగా చెపుతున్నారు
మహామాత మహా ప్రత్యంగిర స్వరూపాన్ని చూసి..
నరసింహ మూర్తి అహంకారాన్ని వీడి..
తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి..
ఉగ్ర నరసింహ అవతారాన్ని చాలించి..
యోగ నరసింహ మూర్తిగా కొలువు తీరుతాడు.
అందుకే మహా ప్రత్యంగిరను కాళీ సహస్రనామస్తోత్రంలో నృసింహిక అంటూ వర్ణించారు.