Friday, September 29, 2023
Thursday, September 28, 2023
Tuesday, September 26, 2023
Monday, September 25, 2023
Friday, September 22, 2023
కేపీహెచ్పీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో మా మనుమరాలు చిరంజీవి చింతా శ్రీ విజయలహరి కూచిపూడినాట్యం. ఏ. 22 . 9 . 2023
Thursday, September 21, 2023
Monday, September 18, 2023
Sunday, September 17, 2023
కాశీలో ఉన్న ద్వాదశ ఆదిత్య్తులలో వృద్ధాదిత్యుఁడు.
జైశ్రీరామ్.
వృద్ధాదిత్యుఁడు
ఉ. శ్రీగుణ హారితుండనెడి వృద్ధుఁడు కాశిక సూర్యదేవునిన్
వేగమె యౌవనంబు కడుప్రీతినొసంగ తపంబు చేయ, స
ద్యోగివి నిత్యయౌవనముతోవిలసిల్లు మనంగ, నాతఁడున్
రాగిలికొల్చె, వృద్దరవినాన్ రవి వెల్గెను నాటునుండియున్.
కాశీలోని 12మంది ఆదిత్యులలో
వృద్ధాదిత్యుడు ఒకరు.
హారితుడు పేరుగల ఒక వృద్ధుడు
కాశీకి వచ్చి, తపస్సు ఇంకా ఎక్కువగా
చెయ్యాలనీ, దానితో దివ్యమహిమలూ,
శక్తులు సాధించాలనీ, దానికి శారీరకంగా
జవసత్త్వాలు కావాలనే కోరికతో
ఆదిత్యుని సమధికశ్రద్ధాసక్తులతో ఆరాధించాడు.
అతని తపోదీక్షకు మెచ్చి, సూర్యుడు
ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
వృద్దుఁడైన హారితుడు భాస్కరునికి మ్రొక్కి,
ప్రభూ నాయందు ప్రసన్నుడవైతే తిరిగి
నాకు యౌవనం అనుగ్రహించు.
ఈ ముసలితనం తపశ్చర్యను
సహించలేకుండా ఉంది. ఇంకా
తపస్సు చెయ్యాలని నాకోరిక
తపస్సే పురుషార్థ చతుష్టయం-
ధ్రువుడూ మొదలైనవారు
తపస్సుచేసే కదా ఉత్తమపదాలను పొందారు.
అన్నిటిపైనా విరక్తి కలిగించే ఈ వార్థక్యం
ఎంత అసహ్యం కట్టుకున్న భార్యా,
కన్నపిల్లలూ కూడా ముదిసిన ఇంటి
యజమానుణ్ణి ఏవగించుకుంటారు.
ముసలితనంతో జీవించడం మంచిదికాదు.
జితేంద్రియులు చిరకాలం తపస్సు చెయ్యాలని
కోరుకుంటారు. చిరకాలం తపస్సు చెయ్యాలంటే
శరీరపటుత్వం ఆవశ్యకంకదా? కాబట్టి ఈ వృద్ధప్యం
పోగొట్టి, సర్వసమర్థమైన యౌవనం ప్రసాదించు - అని కోరగా,
భాస్కరుడు అతని మనసెరిగి వెంటనే యౌవనం
కలిగేట్టు వరమిచ్చాడు. తరువాత హరీశుడు
భాస్కరుణ్ణి ఇష్టదైవంగా భావించి
చిరకాలం తపశ్చర్యతో గడిపి కృతార్థుడైనాడు.
వారణాసిలోని వృద్ధహారీశునిచే ఆరాధించబడిన
ఆదిత్యుడు, వృద్ధాదిత్యుడనే పేరుతో ప్రసిద్ధి
పొందాడు వృద్ధాదిత్యుని సేవించిన వారు
నిత్యమూ యౌవనశక్తితో శుభఫలాలు పొందుతారు.
జైహింద్.
Saturday, September 16, 2023
Friday, September 15, 2023
కార్తవీర్యార్జునుడు (సేకరణ.. విక్కీపీడియా నుండి)
జైశ్రీరామ్.
కార్తవీర్యార్జునుడు హైహయ వంశజుడైన కృతవీర్యుని పుత్రుడు.
ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి,
దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు.
దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల
వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.
ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను.
గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో
మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని
సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని
శపించిరి.
ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు.
ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం
పెట్టెను. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి
కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన
గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని
ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు
బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి
విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి
అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయమును\
తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మన్ర్ను.
ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు
జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక
తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు
మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి
మెండానికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై
21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే
5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు
తర్పణం అర్పిస్తాడు. అదే నేటి శమంతపంచకం. దశరథునివంటి కొద్దిమంది
రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు
భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
కార్తవీర్యార్జునుడు రావణునితో యుద్ధం చేసి బంధించెను.