విశ్రాంతి ఉద్యోగులకు తెలియజేయునది ఏమనగా 2023 సంవత్సరమునకు లైఫ్ సర్టిఫికెట్స్ ను తేది 01-01-2023 నుండి 28-02-2023 వరకు ప్రభుత్వం వారు Cir. Memo No. D4/1381/2019 dt. 12-11-2021 న ఉత్తర్వులు ఇచ్చి యున్నారు కావున విశ్రాంతి ఉద్యోగులందరూ మీ దగ్గరలో వున్నా నెట్ సెంటర్ లో జీవన్ ప్రమాణ app లో నమోదు ద్వారా మరియు cfms.ap. gov. in website లో CFMS ID తో లాగిన్ అయి ESS టైల్ లో లైఫ్ సర్టిసికేట్ లో నమోదు చేసి లైఫ్ సర్టిఫికెట్ ను మీరు signature చేసి డాకుమెంట్స్ ను అప్లోడ్ చేయవచ్చు
దూర ప్రాంతంలో వున్నా వారు మరియు ఆరోగ్యం బాగోలేని వారు 9951602077 మరియు 9989355353 వాట్సాప్ వీడియో కాల్ చేసి, లైఫ్ సర్టిఫికెట్ పై గజిట్టెడ్ ఆఫీసర్ తో సంతకం చేపించి, మీ బందువులతో మా మీ కార్యాలయం నకు పంపవలెను, మరియు లోకల్ లో వున్నా వారు కూడా ఆరోగ్యం బాగోలేని వారు మరియు 80 సంవత్సరాలు పై బడిన వారు కూడా పై సెల్ నెంబర్ కి కాల్ చేస్తే నేను మీ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికెట్ తీసుకోని మీకు పెన్షన్ ను మరలా మీ ఖాతాలో జమ చేయుడం జరుగుతుంది జీవన్ ప్రమాణ లో నమోదు చేసినవారు లైఫ్ సర్టిసికేట్ మరలా ఆఫీస్ కు ఇవ్వనవసరం లేదు మరియు 01.01.2023 ముందు 28.02.2023 తరవాత మీరు నమోదు చేసిన LC treasury కీ రావు, మీ పెన్షన్స్ stop అగును కావునా పెన్షనర్స్ అందరూ 01.01.2023 నుండి 28.02.2023 గడువులో చేసిన వారివి మాత్రమే CFMS వారు treasury కీ అప్లోడ్ చేయుదురు అని తెలియజేయడం అయినది.
దొడ్డి రమణ
ఉప ఖజానా అధికారి
అనకాపల్లి పడమర