ఓం. శ్రీ గురుభ్యోనమః.
ఓం శ్రీ మహా గణాధిపతయేనమః. ఓం శ్రీ మాత్రేనమః. ఓం శ్రీసరస్వత్యైనమః.
ప్రియ పాఠక మహాశయులారా!
స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పడ్యమీ శుక్ర వారం ఆంధ్ర వత్సరాది సందర్భంగా ఆంధ్రామృత పాఠకులైన మీ అందరికీ, యావదాంధ్రులకూ, యావద్భారతీయులకూ, యావజ్జనానీకానికీ శుభాకాంక్షలు తెలియ జేసుకొంటున్నాను.
శ్రీకల్యాణ మనోజ్ఞ భావ విలసత్ శ్రీ నందనాఖ్యాబ్ధిలో
శోకాతీత విశిష్ట సౌఖ్య ఫలముల్ శోభిల్లఁ జేయున్ మిమున్.
లోకేశుండు మదిన్ వసించు కుమతిన్, లోలత్వమున్ బాపుచున్.
శ్రీకారంబును జుట్టఁ జేయు తమచే శ్రేయంబులన్ జేయగా.
ఉగాది సందర్భముగా పంచాంగ పఠన శ్రవణ ఫలము లసాధారణమైనవి.
తిథేశ్చ శ్రియమాప్నోతి - వారా దాయుష్య వర్థనం,
నక్షత్రాత్ హరతే పాపం, - యోగాద్రోగ నివారణం,
కరణాత్ కార్య సిద్ధిశ్చ. - పంచాంగ ఫలముత్తమమ్.
కాలవిత్ కర్మకృత్ ధీమాన్ - దేవతానుగ్రహం లభేత్.
తిథియ శ్రీలను కలిగించుదివ్యముగను
వారమాయువు నొసగును, ప్రగణితముగ
పాపహరణము నక్షత్ర మోపి చేయు
యోగమది రోగములు బాపి యోగములిడు,
కరణ మది కార్య సిద్ధిని కలుగఁ జేయు.
ఇట్టి పంచాంగమును విను దిట్టలకును.
కాల మెఱిగి కర్మలుచేయు ఘనుల కెపుడు
దేవతానుగ్రహము కల్గు దివ్యముగను.
ఈ రోజు తిథ్యాది పంచాగములం గూర్చి తెలుసుకొందము.
శ్రీ నందన నామ సంవత్సరం.
తిథి: చైత్ర శుద్ధ పాడ్యమి రాత్రి గం.08.35 ని.ల వరకు,
వారము: శుక్ర వారము.
నక్షత్రం: ఉత్తరాభాద్ర నక్షత్రము. పగలు గం. 12.34ని.ల వరకు.
యోగము: బ్రహ్మ యోగము ఘ.౫౧.౨౦ వరకు.
కరణము: కింస్తు కరణము. ఘ.౦౭.౨౪. వరకు.
ఈ నందన సంవత్సర ఫలము.
నందనాబ్దే ఖిలా పృథ్వీబహు సస్యార్ఘవృష్టిభిః.
ఆనందాఖిలానాంచజంతూనాంచ మహాభుజామ్.
నందన సంవత్సరమున భూమి అన్ఏక పంటలతోను, వెలతోను, వర్షములతోను వర్ధిల్లును. అంతటా ఆనందము నిండి యుండును.
నవ నాయకులు - కలిగే ఫలితములు.
౧. రాజు. శుక్రుఁడుః
సమృద్ధ సస్యా వసుధాతివృష్టిః. - గావోహి సంపూర్ణ పయః ప్రదాస్స్యుః
స్త్రియః ప్రియాణాం జనయంతి తోషం - కామోపచారైః భృగుజేబ్ధనాధే.
భూమి సస్యములతో నిండి యుండును. వానలు అధికముగా కురియును. ఆవులు, పసువులు సమృద్ధిగా పాలనిచ్చును. స్త్రీలు కామోపచారములతో తమ ప్రియులను ఆనందపరచెదరు.
౨. మంత్రి. శుక్రుఁడు.
సువృష్టిః సర్వ సస్యాని, - సర్వే ధర్మ రతాః ప్రజాః.
క్షేమారోగ్యే సుభిక్షం స్యాత్ - మంత్రణ్యబ్దే భృగౌ యది.
సర్వ సస్యములకు అనుకూలముగా వర్షములు కురియును. ప్రజలు ధర్మమునందు ఆసక్తి కలిగి యుందురు.ప్రజలందరూ ఆరోగ్యముగా సుభిక్షముగా నుందురు.
రాజు మంత్రి ఒకరే. ఐనచో కలుగు ఫలము.
స్వయం రాజా స్వయం మంత్రీ - యస్మిన్నబ్దే యదా భవేత్
చోరాగ్ని శస్త్ర బాధాచ - పీడ్యంతే భూభుజాదయః.
రాజు మంత్రి ఒకే గ్రహమునకు సంభవించినచో రాజులు అగ్ని, చోర, శస్త్రములచే బాధింప బడుదురు.
౩. సేనాధిపతి. గురుఁడు
నృపాస్సదా సద్విధి సంప్రవృత్తాః - విప్రాస్సదా వేద విధి ప్రవృత్తాః.
జనాస్సదా సంభృత ధర్మ వృత్తాః - సైన్యాధిపత్యే సురమంత్రిణశ్చ.పాలకులు సత్కర్మలయందు శ్రద్ధ చూపెదరు. బ్రాహ్మణులు వేద ప్రోక్త యజ్ఞ యాగాదులనాచరించెదరు.ప్రజలు ధర్మమునందు ఆసక్తి చూపెదరు.
౪. సస్యాధిపతి. చంద్రుఁడు.
జల ధాన్యాని సర్వాణి స్థల ధాన్యాని యానిచ
వృక్ష జాతిస్సుఫలితా చంద్రే సస్యాధిపతే.
జల ధాన్యములు, స్థల ధాన్యములు, వృక్ష జాతులు చక్కగా ఫలించును.
౫. ధాన్యాధిపతి. శని.
కృష్ణ ధాన్యాని సర్వాణి సూక్ష్మ ధాన్యాని యానుచ
కృష్ణ భూమిస్సుఫలితా ధాన్యాధీశే శనైశ్చరే.
నల్లని ధాన్యములు, చిఱు ధాన్యములు, నల్ల రేగడి భూములు చక్కగా ఫలించును.
౬. అర్ఘాధిపతిః గురుఁడు.
సువృష్టి ర్ధాన్య ధనైర్విరాజితా - భూమిర్మహా యజ్ఞపరైర్మహీసురైః.
నిత్యోత్సవైర్మంగలతూర్యనిస్వనైః - అర్ఘాధిపే దేవగురౌచ శశ్వత్.
భూమి వర్షముల చేత ధన ధాన్య సంపదల చేత నిండి యుండును. బ్రాహ్మణులు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించుచుందురు. మంగళ వాయిద్యములచేత నిత్యము ఉత్సవముల్ జరుగు చుండును.
౭. మేఘాధిపతిః గురుఁడు.
సస్యార్ఘ వృష్టిభిస్తుష్టా - భవేద్ధాత్రీ నిరంతరం.
వీత రోగ భాయాస్సర్వే - మేఘాధీశే బృహస్పతౌ.
రోగములు లేనివారై ప్రజలు నిరంతర సస్యముల చేయ, వర్షముల చేత సంతోషముగా ఉందురు. ధరలు అందుబాటులో ఉండును.
౮. రసాధిపతి. బుధుఁడు.
శశి తనయే రస నాధే సుపిప్పలీశొంఠి హింగులశునాని
ఘృత తైలాద్యం నిఖిలం దుర్లభ మిక్షూద్భవంశకలమ్.
పిప్పళ్ళు, శొంఠి, ఇంగువ, ఉల్లిపాయలు, నెయ్యి, నూనెలు, బెల్లము మున్నగు రస వస్తువులు దుర్లభముగా నుండును.
౯. నీరసాధిపతిః చంద్రుఁడు.
ముక్తాఫలం రత్న బీజకాంస్యాది వస్త్రాభరణాని సర్వం
వృద్ధిం గత్యాశు భవన్తి లోకే చంద్రో యదా నీరస నాయకో భవేత్.
ముత్యములు, రత్నములు, సువర్ణము, కంచు, మున్నగు లోహములు వస్త్రములు, ఆభరణములు మున్నగునవి విరివిగా లభించును.
ఉప నాయకులు ౨౧ మంది.
౧.పురోహితుఁడు - చంద్రుఁడు.
౨. పరీక్షకుఁడు - రవి.
౩. గణకుఁడు - కుజుఁడు.
౪. గ్రామ పాలకుఁడు - శుక్రుఁడు.
౫. దైవజ్ఞుఁడు - గురుఁడు.
౬. రాష్ట్రాధిపతి - శుక్రుఁడు.
౭. సర్వ దేశోద్యోగపతి - శుక్రుఁడు.
౮. అశ్వాధిపతి - శుక్రుఁడు.
౯. గజాధిపతి - చంద్రుఁడు.
౧౦. పశువులకధిపతి - గురుఁడు.
౧౧. దేవాధిపతి - చంద్రుఁడు.
౧౨. నరాధిపతి - గురుఁడు.
౧౩. గ్రామాధిపతి - రవి.
౧౪. వస్త్రాధిపతి - బుధుఁడు.
౧౫. రత్నాధిపతి - శుక్రుఁడు.
౧౬. వృక్షాధిపతి - శని.
౧౭. జంగమాధిపతి - చంద్రుఁడు.
౧౮. సర్పాధిపతి - కుజుఁడు.
౧౯. మృగాధిపతి - గురుఁడు.
౨౦. శుభాధిపతి - శుక్రుఁడు.
౨౧. స్త్రీలకధిపతి - గురుఁడు.
క్రూరగ్రహ ఫలం క్రూరమ్ - శుభ గ్రహ ఫలం శుభం.
పురోహితాది సర్వేషాం - భవేదీశ సముద్భవమ్.
పురోహితాది ఉపనాయకులు క్రూరగ్రహములు క్రూర ఫలమును, శుభ గ్రహములు శుభ ఫలమును కలుగ జేయుదురు.
ఈ సంవత్సరము పశు పాలకుఁడు, గోష్ట ప్రాపకుఁడు, గోష్ట బహిష్కర్త శ్రీ కృష్ణుఁడు.
దాని ఫలితము.
పశువృద్ధిస్సుభిక్షంచ బహు సస్యార్ఘసంపదః.
సంపూర్ణ తృణ వృద్ధిశ్చ గోపాలే పశు నాయకే.
పశువులు ఆరోగ్యముగా నుండును.సుభిక్షముగా నుండి అభి వృద్ధినిపొందును. తృణ సమృద్ధి కలుగును. పసువులు సుఖముగా పాలను ఇచ్చును. ధరలు అనుకూలముగా ఉండును.
ఆఢక నిర్ణయము:
ఈ సంవత్సరము ౪ కుంచముల వాన. ౮భాగములు సముద్రమున, ౯ భాగములు పర్వతములందు, ౩ భాగములు భూమిపైన పడును.
కుంచము౨౩-౩-౨౦౧౨ నుండి౧౬-౫-౨౦౧౨ వరకు బాల గోప హస్తమందు, ఫలితము వర్ష లేమి.గోప హస్తమగుటచే సుభిక్షము.
అప్పటి నుండి ౪-౮-౨౦౧౨ వరకువృద్ధ బ్రాహ్మణుని చేతియందు, దుర్భిక్షము, సస్య నాశము.
నాటి నుండి ౮-౧౧-౨౦౧౨ వరకు బాల గోపకుని చేతి యందు, ఫలితము వర్ష లేమి.గోప హస్తమగుటచే సుభిక్షము.
నాటి నుండి వత్సరాంతము యౌవన గోపకుని చేతు యందు ఉండును.సుభిక్షము, ఆరోగ్యము, సంపదలు కలుగును.
పుష్కర్తములు.: ౮.౫.౨౦౦౧౧ నుందె ఇ ౧౯.౫.౨౦౧౧ వరకు.ఆ ప్రాంతము వారికి శుభ కార్యములు నిషిద్ధము.
మూఢము:
వైశాఖ శు.౮ఆది వారము౨౯-౪-౨౦౧౨ నుండి జ్యేష్ట శు.౮మంగళవారం ౨౯-౫-౨౦౧౨ వరకు గురు మూఢము.
జ్యేష్ట శు.౧౧శుక్రవారం ౧-౬-౨౦౧౨ నుండి జ్యేష్ట బ.౭ ఆదివారం ౧౦-౬-౨౦౧౨ వరకు శుక్ర మూఢము.
మాఘ శు.౬ శనివారం ౧౬-౨-౨౦౧౩ నుండి వత్సరాంతము శుక్ర మూఢ్యమి.
వివాహాది శుభ కార్యములు నిషిద్ధము.
మకర సంక్రాంతి: ౧౪.౧.౨౦౧౩ సోమ వారము, ధనిష్టా నక్శత్రమున మేష లగ్నమున పగలు గం.౧౨.౦౯ని.లకు రవి మకరమున ప్రవేశించును.
గ్రహణములు:
తే.20-5-2012.దీని సూర్య గ్రహణము.
౪-౬-౨౦౧౨ చంద్ర గ్రహణము.
౧౩-౧౧-౨౦౧౨ సూర్య గ్రహణము.
౨౮-౧౧-౨౦౧౨చంద్ర గ్రహణము.
పై నాలుగూ మన దేశమున కనిపించవు.
ఆదాయ వ్యయములు:
మేషమునకు ఆదాయము 2 వ్యయము 8.
వృషభమునకు ఆదాయము 11 వ్యయము 14.
మిధునమునకు ఆదాయము 14 వ్యయము 11.
కర్కాటకమునకు ఆదాయము 8 వ్యయము 11.
సింహమునకు ఆదాయము 11 వ్యయము 5.
కన్యకు ఆదాయము 14 వ్యయము 11.
తులకు ఆదాయము 11 వ్యయము 14.
వృశ్చికమునకు ఆదాయము 2 వ్యయము 8.
ధనుస్సునకు ఆదాయము 5 వ్యయము 14.
మకరమునకు ఆదాయము 5 వ్యయము 5.
కుంభమునకు ఆదాయము 5 వ్యయము 5.
మీనమునకు ఆదాయము 5 వ్యయము 14.
రాజ పూజ్య అవమానములు:
మేషం . రాజపూజ్యము 1 అవమానము 7.
వృషభం రాజపూజ్యము 4 అవమానము 7
మిధునం. రాజపూజ్యము 7 అవమానము 7.
కర్కాటకం రాజపూజ్యము 3 అవమానము 3.
సింహం రాజపూజ్యము 6 అవమానము 3.
కన్య రాజపూజ్యము 2 అవమానము 6
తుల రాజపూజ్యము 5 అవమానము 6.
వృశ్చికం రాజపూజ్యము 1 అవమానము 2.
ధనుస్సు రాజపూజ్యము 4 అవమానము 2.
మకరం రాజపూజ్యము 7 అవమానము 2.
కుంభం రాజపూజ్యము 3 అవమానము 5.
మీనం రాజపూజ్యము 6 అవమానము 5.
కందాయ ఫలములు:
అశ్విని 2 . 1 . 0.
భరణి 5 . 2 . 2.
కృత్తిక 0 . 0 . 4.
రోహిణి 5 . 2 . 2.
మృగశిర 0 . 0 . 4.
ఆరుద్ర 3 . 1 . 1.
పునర్వసు 6 . 2 . 3.
పుష్యమి 1 . 0 . 0.
ఆశ్లేష 4 . 2 . 1.
మఖ 7 . 2 . 4.
పుబ్బ 2 . 0 . 1.
ఉత్తర 5 . 1 . 3.
హస్త 0 . 2 . 0.
చిత్త 3 . 0 . 2.
స్వాతి 6 . 1 . 4.
విశాఖ 1 . 2 . 1.
అనూరాధ 4 . 0 . 3.
జ్యేష్త 7 . 1 . 0.
మూల 2 . 2 . 2.
పూర్వాషాఢ 5 . 0 . 4.
ఉత్తరాషాఢ 0 . 1 . 1.
శ్రావణం 3 . 2 . 3.
ధనిష్ట 6 . 0 . 0.
శతభి 1 . 1 . 2.
పూర్వాభాద్ర 4 . 2 . 4.
ఉత్తరాభాద్ర 7 . 0 . 1.
రేవతి. 2 . 1 . 3.
బేసి సంఖ్య ధన లాభము
సమ సంఖ్య సమ లాభము.
సున్న సూన్య ఫలము.
ఒకటి, రెండు సున్నలు భయము.
మూడవ సున్న హాని.
సంవత్సర ఫలము:
అశ్విని . పుష్యమి . స్వాతి . అభిజిత్తు వారలకు ధన లాభము.
భరణి . ఆశ్రేష . విశాఖ . శ్రవణం వారలకు మనస్తాపం.
కృత్తిక . మఘ . అనూ . ధనిష్ఠ వారలకు రాజపూజ్యము.
రోహిణి . పుబ్బ . జ్యేష్ఠ . శతభిషం వారలకు యుద్ధభయం.
మృగశిర . ఉత్తర . మూల . పూర్వాభాద్ర వారలకు అలంకార ప్రాప్తి.
ఆర్ద్ర . హస్త . పూర్వాషాఢ . ఉత్తరాభాద్ర వారలకు రోగ భయం.
పునర్వసు . చిత్ర . ఉత్తరాషాఢ . రేవతి వారలకు ఆయుర్వృద్ధి.
సర్వాణి సన్మంగళాని భవంతు.
స్వస్తి