యువ తరంగం
యువతకు స్ఫూర్తి ని ఇద్దాము !
Thursday, May 8, 2025
మీ నాలుక రంగుని బట్టి, మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇట్టే పసిగట్టవచ్చు.
మీ నాలుక రంగుని బట్టి, మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇట్టే పసిగట్టవచ్చు. నాలుక శరీరంలోని అతి ముఖ్యమైన అవ యవాల్లో ఒకటి. సాధారణంగా ఆరోగ్యవంతమైన నాలుక గులాబీ రంగులో, బ్యాలెన్స్డ్ తేమతో, సన్నటి తెల్లటి పొరతో ఉంటుంది. మీ శరీరంలో ఎటువంటి అనారోగ్యాలు లేవని చెప్పడానికి ఈ లక్షణాలు నిదర్శనం. కానీ ఇందుకు భిన్నంగా రంగు లేదా ఆకృతిలో మార్పులు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇది అనారోగ్య సంకేతం. నాలుక రంగు సాధారణం కంటే భిన్నంగా మారడం, పాలిపోయి ఉండటం మీ శరీరంలో రక్తహీనతను లేదా విటమిన్ బీ12 లోపాన్ని సూచిస్తుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ సరఫరా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో అనారోగ్యాలకు దారితీస్తుంది.
నాలుక గరుకుగా, చీలికలతో ఉన్నా అనారోగ్య సంకేతమే. డీహైడ్రేషన్, ఆటో ఇమ్యూన్ రుగ్మతలు, లేదా జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే నల్లగా మారి నాలుకపై చిన్నపాటి ముళ్లమాదిరి లక్షణాలు కనిపిస్తే బ్యాక్టీరియా పేరుకు పోవడమో లేదా యాంటీ బయాటిక్ ఉపయోగం వల్లనో జరిగిందని అర్ధం చేసుకోవచ్చు. నాలుక ఎక్కువ ఎర్రగా కనిపించినా అనుమానించాల్సిందే. ఎందుకంటే కాసాకి వ్యాధి లేదా విటమిన్ల లోపాల వల్ల ఇలా జరుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పడిపోతుంది. అంతేకాకుండా నాలుకపై తెల్లటి మచ్చలు మందమైన పొర ఓరల్ థ్రష్ లేదా లైకెన్ ప్లానస్ వంటి ఇన్ఫెక్షన్లకు సంకేతం.
నాలుకపై పుండ్లు - మీ శరీరంలో హార్మోన్లలో మార్పులు, అసమతుల్యత, అధిక మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నాలుకపై ఇలాంటి సంకేతాలు పొడచూపుతాయి. లేదా ఫుడ్ అలెర్జీల వల్ల కూడా తలెత్తే చాన్స్ ఉంటుంది. అయితే నాలుకపై పుండ్లు తరచుగా కనిపిస్తుంటే అది నోటి క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు. ఏది ఏమైనా మీ శరీరంలో తలెత్తే సమస్యలకు సంబంధించిన సంకేతాలు చాలా వరకు నాలుకపై ప్రభావం చూపు తుంటాయి. అందుకే నాలుక విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కేర్ తీసుకోవాలి. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, హైడ్రేటెడ్గా ఉండటం, సమతుల్య ఆహారం తీసుకోవడం నాలుక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవసరం అయితే మీ వైద్యుడిని సంప్రదించండి.
ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు, మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్, విశాఖపట్నం.
9849162699
అమ్మమ్మతో నేను ... చానల్ లో Simple Sizzlerఇంత చిన్నఏడేళ్ళ పిల్ల శ్రీసంహిత రెస్పాన్సెంతబాగుందో చూడండి. జైహింద్.
Tuesday, May 6, 2025
Sree Bhagavatula Somannaa ZPHighSchool, Golden jubilee celebrations of 1974-75 SSC Batch, Dimili village.
ప్రాతస్స్మరామి హృది సంస్థితమాత్మ తత్త్వమ్.
జై శ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
ప్రాతస్స్మరామి హృది సంస్థితమాత్మ తత్త్వమ్.
పరమాత్మా! బ్రహ్మ ముహూర్తంలో నన్ను అజ్ఞాన యుతమైన నిద్ర నుండి లేపుము. అట్టి పవిత్ర సమయమున అంతరంగంలో నిన్నే స్మరించు నిర్మల బుద్ధిని నాకు కలుగజేయుము.
పరమేశ్వరా! పర్వతాల వలె సుఖదుఃఖాలు భయపెట్టినను, చివరి శ్వాస వరకు త్రికరణశుద్ధిగా నీ ప్రార్ధనలోనే నిలువగల శక్తి సామర్ధ్యాలను నాకు ఒసగుము.
సర్వేశ్వరా! ప్రతినిత్యమూ భక్త సాంగత్యంలో పాల్గొను భాగ్యాన్ని ఇవ్వు. నాకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించు.
సర్వజ్ఞా! ఇంద్రియ భోగాలపైన, బలీయమైన వాంఛలపైన, పరిపూర్ణ విరక్తిని నాకు కలిగించు. నీవు నా హృదయంలో నిరంతరం ప్రకాశిస్తూ... గమనిస్తూ... కొలువై ఉన్నావనే జ్ఞానాన్ని ప్రసాదించు. నీతో మమేకము అగునట్టి పూర్ణ భావాన్ని కలిగించు.
ఈశ్వరా! తెలిసి గానీ, తెలియక గానీ నా వలన ఏ ప్రాణికి హాని జరుగని విధంగా నడుచుకొనునట్లు నన్ను అనుగ్రహించు. ఆత్మ స్తుతి, పరనిందలు అనెడి పాప కూపంలో పడకుండా నన్ను కాపాడు.
ప్రేమైక మూర్తీ! ప్రేమ, కరుణ, త్యాగం నా హృదయంలో నిరంతరం నిండి ఉండే లాగున నన్ను అనుగ్రహించు.
హే దీనబంధూ! దేహాభిమానాన్ని, స్వార్ధాన్ని నా నుండి తొలగించు. విషయ సుఖాలు నన్ను బంధించుచున్నవనే జాగృతి నిరంతరం నాలో ఉండేటట్లు కరుణించి నాకు త్రికరణ శుద్ధిని ఇమ్ము.
కరుణాసాగరా! కీర్తి ప్రతిష్టల మీద, ధన ధాన్య సంపాదన మీద, లౌకిక భోగాలపైన నా చిత్తంలో... కాంక్ష కలుగని రీతిగా దయ చూడు.
సర్వాంతర్యామీ! ఈ కనబడే ప్రపంచంలో నామరూపాలు అన్నిటియందు నీవే సత్యంగా... ఒక్కటిగా ఉన్నట్లు నాకు గోచరించే లాగున స్ఫురింప జేయుము.
ఓ సదానందా! సర్వ ప్రాణుల యందు దయ, సాటి మానవుల యందు అకారణమైన సహజ ప్రేమ నాలో పొంగేలా నన్ను అనుగ్రహించు. రాగద్వేష, అసూయలు నాలో పొడసూపనీయకు తండ్రీ...
అచ్యుతా! దూషణ, భూషణ తిరస్కారాల వలన నా మనసు చలించకుండునట్లు నన్ను అనుగ్రహించు. భక్త బృందంతో ఎల్లకాలము కూడి యుండునట్లు చేయుము.
భగవంతుని ఇష్ట దైవ రూపంలో గానీ, గురు రూపంలో గానీ ఆరాధించుచున్న నన్ను ఆయా రూపాలతోనే అనుగ్రహించు. అన్ని రూపాలు నీవే కనుక నాలో అభేద భావం కలుగజేయుము తండ్రీ!
పాహిమాం.... రక్షమాం..... పాహిమాం ప్రభో!
అమ్మ దయతో
చింతా రామకృష్ణారావు.
జైహింద్.