Thursday, October 31, 2024

లక్ష్మీ దేవిఅనుగ్రహం పొందాలంటే నేర్చుకోండి SRI SUKTAM || TELUGU CLASS ...

జైశ్రీరామ్.
స్త్రీలు అమ్మవారిని అర్చించేటప్పుడు శ్రీసూక్తంతో అర్చించవలయును. అందులకు స్త్రీలకు ఈ శ్రీసూక్తం నోటికి స్వరయుక్తంగా కంఠంథం కావాలి. అట్లు కంఠస్థం కావాలంటే మనం స్వరయుక్తంగా నేర్పే గురువుల స్వరంవిని అభ్యాసంచేయవచ్చును. మనం వింటూ అంటూ ఉంటే ఎందుకు కంఠస్థం కాదు? సాధన చేయాలనే ఆసక్తి గలవారికొఱకు ఇక్కడ అందుబాటులూ ఉంచాను. వింటూ సాధనచెయ్యండి. ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ సూక్తమ్.

ఓమ్ ॥ హిర॑ణ్యవర్ణాం॒ హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ ।


చం॒ద్రాం హి॒రణ్మ॑యీం-లఀ॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ॥


తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ᳚మ్ ।


యస్యాం॒ హిర॑ణ్యం-విఀం॒దేయం॒ గామశ్వం॒ పురు॑షాన॒హమ్ ॥


అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑ద-ప్ర॒బోధి॑నీమ్ ।


శ్రియం॑ దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑ దే॒వీర్జు॑షతామ్ ॥


కాం॒సో᳚స్మి॒ తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం జ్వలం॑తీం తృ॒ప్తాం త॒ర్పయం॑తీమ్ ।


ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ॥


చం॒ద్రాం ప్ర॑భా॒సాం-యఀ॒శసా॒ జ్వలం॑తీం॒ శ్రియం॑-లోఀ॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ ।


తాం ప॒ద్మినీ॑మీం॒ శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతాం॒ త్వాం-వృఀ ॑ణే ॥


ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ॑ బి॒ల్వః ।


తస్య॒ ఫలా॑ని॒ తప॒సాను॑దంతు మా॒యాంత॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ॥


ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ ।


ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తి॒మృ॑ద్ధిం ద॒దాతు॑ మే ॥


క్షు॒త్పి॒పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॒ల॒క్షీ-ర్నా॑శయా॒మ్యహమ్ ।


అభూ॑తి॒మస॑మృద్ధిం॒ చ స॒ర్వాం॒ నిర్ణు॑ద మే॒ గృహాత్ ॥


గం॒ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్​షాం॒ ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ᳚మ్ ।


ఈ॒శ్వరీగ్ం॑ సర్వ॑భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ॥


శ్రీ᳚ర్మే భ॒జతు । అల॒క్షీ᳚ర్మే న॒శ్యతు ।


మన॑సః॒ కామ॒మాకూ॑తిం-వాఀ॒చః స॒త్యమ॑శీమహి ।


ప॒శూ॒నాగ్ం రూ॒పమన్య॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతాం॒-యఀశః॑ ॥


క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ ।


శ్రియం॑-వాఀ॒సయ॑ మే కు॒లే॒ మా॒తరం॑ పద్మ॒మాలి॑నీమ్ ॥


ఆపః॑ సృ॒జంతు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే ।


ని చ॑ దే॒వీం మా॒తరం॒ శ్రియం॑-వాఀ॒సయ॑ మే కు॒లే ॥


ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం॒ పిం॒గ॒ళాం ప॑ద్మమా॒లినీమ్ ।


చం॒ద్రాం హి॒రణ్మ॑యీం-లఀ॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ॥


ఆ॒ర్ద్రాం-యఀః॒ కరి॑ణీం-యఀ॒ష్టిం॒ సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీమ్ ।


సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం-లఀ॒క్ష్మీం॒ జాత॑వేదో మ॒మావ॑హ ॥


తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్షీమన॑పగా॒మినీ᳚మ్ ।


యస్యాం॒ హిర॑ణ్యం॒ ప్రభూ॑తం॒ గావో॑ దా॒స్యోఽశ్వా᳚న్, విం॒దేయం॒ పురు॑షాన॒హమ్ ॥


యశ్శుచిః॑ ప్రయతో భూ॒త్వా॒ జు॒హుయా॑-దాజ్య॒-మన్వ॑హమ్ ।


శ్రియః॑ పం॒చద॑శర్చం చ శ్రీ॒కామ॑స్సత॒తం॒ జ॑పేత్ ॥


ఆనందః కర్ద॑మశ్చై॒వ చిక్లీ॒త ఇ॑తి వి॒శ్రుతాః ।


ఋష॑య॒స్తే త్ర॑యః పుత్రాః స్వ॒యం॒ శ్రీరే॑వ దే॒వతా ॥


పద్మాననే ప॑ద్మ ఊ॒రూ॒ ప॒ద్మాక్షీ ప॑ద్మసం॒భవే ।


త్వం మాం᳚ భ॒జస్వ॑ పద్మా॒క్షీ యే॒న సౌఖ్యం॑-లఀభా॒మ్యహమ్ ॥


అ॒శ్వదా॑యీ చ గోదా॒యీ॒ ధ॒నదా॑యీ మ॒హాధ॑నే ।


ధనం॑ మే॒ జుష॑తాం దే॒వీ స॒ర్వకా॑మార్థ॒ సిద్ధ॑యే ॥


పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగో రథమ్ ।


ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్ ॥


చంద్రాభాం-లఀక్ష్మీమీశానాం సూర్యాభాం᳚ శ్రియమీశ్వరీమ్ ।


చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ-ముపాస్మహే ॥


ధన-మగ్ని-ర్ధనం-వాఀయు-ర్ధనం సూర్యో॑ ధనం-వఀసుః ।


ధనమింద్రో బృహస్పతి-ర్వరు॑ణం ధనమ॑శ్నుతే ॥


వైనతేయ సోమం పిబ సోమం॑ పిబతు వృత్రహా ।


సోమం॒ ధనస్య సోమినో॒ మహ్యం॑ దదాతు సోమినీ॑ ॥


న క్రోధో న చ మాత్స॒ర్యం న లోభో॑ నాశుభా మతిః ।


భవంతి కృత పుణ్యానాం భ॒క్తానాం శ్రీ సూ᳚క్తం జపేత్సదా ॥


వర్​షం᳚తు॒ తే వి॑భావ॒రి॒ ది॒వో అభ్రస్య విద్యు॑తః ।


రోహం᳚తు సర్వ॑బీజాన్యవ బ్రహ్మ ద్వి॒షో᳚ జ॑హి ॥


పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ-దళాయతాక్షీ ।


విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ॥


యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ ।


గంభీరా వర్తనాభిః స్తనభరనమితా శుభ్ర వస్తోత్తరీయా ॥


లక్ష్మీ-ర్దివ్యై-ర్గజేంద్రై-ర్మణిగణ ఖచితై-స్స్నాపితా హేమకుంభైః ।


నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా ॥


లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ ।


దాసీభూత సమస్త దేవ వనితాం-లోఀకైక దీపాంకురామ్ ।


శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ ।


త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం-వంఀదే ముకుందప్రియామ్ ॥


సిద్ధలక్ష్మీ-ర్మోక్షలక్ష్మీ-ర్జయలక్ష్మీ-స్సరస్వతీ ।


శ్రీలక్ష్మీ-ర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ॥


వరాంకుశౌ పాశమభీతి ముద్రామ్ ।


కరైర్వహంతీం కమలాసనస్థామ్ ।


బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రామ్ ।


భజేఽహమంబాం జగదీశ్వరీం తామ్ ॥


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే ।


శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే ॥


ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్నీ చ॑ ధీమహి ।


తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా᳚త్ ॥


శ్రీ-ర్వర్చ॑స్వ॒-మాయు॑ష్య॒-మారో᳚గ్య॒-మావీ॑ధా॒త్-శోభ॑మానం మహీ॒యతే᳚ ।


ధా॒న్యం ధ॒నం ప॒శుం బ॒హుపు॑త్రలా॒భం శ॒తసం᳚​వఀత్స॒రం దీ॒ర్ఘమాయుః॑ ॥


ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥

పూజా విధానము.

జైహింద్.

Monday, October 21, 2024

శ్రీ వసుంధరా స్తోత్రము (దేవీభాగవతము) ఆర్షధర్మసంరక్షణార్థం మనం చేయవలసిన పారాయణ కొఱకు శ్రీ వసుంధర స్తోత్రము

జైశ్రీరామ్. 

శ్రీ వసుంధరా స్తోత్రము

(దేవీభాగవతము)

ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః

జయే జయే జలాధారే జలశీలే జలప్రదే |

యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే ।

మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే |

మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే |

సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే |

సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే |

పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని |

పుణ్యాశ్రయే పుణ్యవతాం, ఆలయే, పుణ్యదే భవే |

సర్వసస్యాలయే సర్వసస్యాధ్యే సర్వసస్యదే |

సర్వసస్య హరే కాలే సర్వసస్యాత్మికే భవే |

భూమే భూమిపసర్వస్వే భూమిపాలపరాయణే |

భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే |

ఈ స్తోత్రమును ఉదయము పూట లేచి శుచిగా పఠించే వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. భూదాన ఫలితము లభిస్తుంది. పరుల భూమిని ఆక్రమించుకున్న పాపం నుంచి విముక్తి లభిస్తుంది. (కాని అటువంటి పాపము మరల మరల చేయరాదు. ) భూమి మీద ఉంచకూడని వస్తువులు ఉంచిన పాపం తొలగిపోతుంది. అశ్వమేధ యాగముల వంటి యాగములు చేసిన ఫలితం లభిస్తుంది.

జైహింద్.

Thursday, October 10, 2024

వాగ్దేవతలు

జైశ్రీరామ్.

 వాగ్దేవతలు

ఓం శ్రీమాత్రే నమః

తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల,  దాని అంతర్నిర్మాణము :

"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండము అంటారు. 

ఈ చంద్రఖండము లోని అచ్చులైన 16 వర్ణము లకు అధిదేవత "వశిని"  అనగా 

వశపరచుకొనే శక్తి కలది అని అర్ధము.

"క" నుండి "భ"  వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండము" అంటారు.

ఈ సౌరఖండము లోని 

"క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి". 

అనగా కోర్కెలను తీర్చునది అని అర్ధము. 

"చ, ఛ, జ, ఝ, ఞ" 

వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".                    

అనగా  సంతోషాన్ని వ్యక్తం చేసేది.

"ట, ఠ, డ, ఢ, ణ"  వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".  

అనగా మలినములను తొలగించేది.

"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".  

కరుణను మేలుకొలిపేదే అరుణ.

ప, ఫ, బ, భ, మ" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "జయని."  

అనగా జయము కలుగ చేయునది.

అలాగే "మ" నుండి "క్ష"  వరకు గల 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండము"  అంటారు.     

అగ్ని ఖండము లోని "య, ర, ల, వ"  అనే అక్షరములకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." 

అనగా శాశించే శక్తి కలది.

ఆఖరున గల ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష"  లకు అధిదేవత "కౌలిని"

ఈ అధిదేవతల నందరినీ "వాగ్దేవతలు"  అంటారు. 

ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.

ఎందుకంటే శబ్దము బ్రహ్మము నుండి అద్భవించినది.

అనగా బ్రహ్మమే శబ్దము. శబ్దమే బ్రహ్మము.

బ్రహ్మమే నాదము.

మనము నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపైనీ,  

ప్రకృతి పైనీ ప్రభావము చూపుతాయి.

కనుక యాస లేని స్వచ్ఛమైన సంసృత పరమైన అక్షరము లను ఉచ్ఛరించాలి.

క్షరము లేనిది అక్షరము. శబ్దము నశిస్తుంది. అక్షరాలకు నాశనము లేదు.

అదే మంత్రములు, వేదములు  అయితే ప్రభావము ఇంకా లోతుగా ఉంటుంది.

భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి "అమ్మ" ను అర్చిస్తున్నాయి.

కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా 

ఈ సంగతి స్ఫురణలో ఉంచుకుంటే అనేక అద్భుతాలను పొందవచ్చు.

మనం చదివే స్తోత్రము ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు. 

మనం చదివే స్తోత్రమే ఆ దేవత.

మనం చేసే శబ్దమే దేవత!

మన అంతశ్చేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.

ఆ శబ్దం వలన పుట్టిన నాదమే దేవత.

జైహింద్.