Wednesday, May 15, 2024

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

 పురుషుడు ఎలా ఉండాలో ధర్మ శాస్త్రం చెప్పింది..కానీ ఎందుచేతో ఈ శ్లోకం జనబాహుళ్యం లోకి రాలేదు.


కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు

తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
.

Thursday, May 9, 2024

అక్షయతృతీయ విశేషం.

జైశ్రీరామ్.

 🌷అక్షయతృతీయ🌷


అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రం లోనైనా ఉంటే చూపండి . 

వీలైతే బీద వాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. 

అక్షయతృతీయ విశేషం ఏంటి తెలుసుకుందాము.

1.పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, 

వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు

 “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా 

నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

జైహింద్.

అవధాన విద్యా వికాస పరిషత్ మూడవ శిక్షణ శిబిరం. 20 - 5 - 2024వ తేదీ నుండి నిర్వహణ బ్రహ్మశ్రీ మరుమామల దత్తాత్రేయ శర్మ.

 జైశ్రీరామ్.

జైహింద్.

Sunday, May 5, 2024

సప్తస్వరాలు ... వివరాలు.

     భారతీయ సంగీతంలో సప్తస్వరాలు : స, రి, గ, మ, ప, ద, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.

     'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవతం, 'ని ' నిషాధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉండాలన్న నియమం లేదు.

     సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ [మంగళంపల్లి బాలమురళీకృష్ణ] నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని పరిశీలకుల భావన. స్వరాలకు ఆధారం శృతులు., శృతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం) కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.

స = షడ్జమం (నెమలి క్రేంకారం)

రి = రిషభం (ఎద్దు రంకె)

గ = గాంధర్వం (మేక అరుపు)

మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)

ప = పంచమం (కోయిల కూత)

ద = దైవతం (గుర్రం సకిలింత)

ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.

ఉదా: స రి గా మ ప ద ని స.

అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.

ఉదా: స ని ద ప మ గా రి స.