జైశ్రీరామ్.
శ్రీ మహా గణాధిపతయే నమః.
ధర్మిష్ఠాలో వెలసిన దేవతలు..
ఏకాంకిక నాటిక.
పాత్రలు.
1. యమధర్మరాజు.
2. చిత్రగుప్తుఁడు.
3. సూర్యభగవానుఁడు.
4. SRVD ఎలైట్ గ్రూప్ సభ్యులు నరహరి.
5. వాసుదేవరావు.
ఆరంభము.
యమధర్మరాజు - - ప్రార్థన.
శ్రీమన్మంగళ సూర్యదేవ శుభముల్ శ్రీమంత ధర్మిష్ఠలో
ప్రేమన్ వెల్లువగా రచించు కృపతో, ప్రీతిన్ నినున్ గొల్చెదన్,
ధీమంతుల్గలసన్నివేశమిది, నీ తేజంబె జ్ఞానంబుగా
క్షేమంబున్ గలిగించుపెద్దలకు మా సేవింపులివ్వేళలోన్
శ్రీమంతమైన సృష్టికి మూలమైన మానాన్నగారు శ్రీ సూర్యభగవానులు ధర్మనిష్ఠాపరులయిన ధర్మిష్ఠులు. వారికి ముందుగా నమస్కరించి ఆహ్వానముపలికెదను గాక..
ఓ తండ్రీ! సూర్యదేవా నాకు ప్రత్యక్షమయి నా ప్రణామములు స్వీకరింపుఁడు.
సూర్యభగవానుఁడు. - నాయనా యమధర్మరాజా! ఏమి నాయనా నాకొఱకు వేచి యున్నావు?
యమ - తండ్రిగారూ! మీకు పాదాభివందనములు. నా మనసు క్షణ క్షణము ఆవేదనకు గురియగుచున్నది. నేను నా బాధ మీతో కాక మరెవర్తో చెప్పుకోగలను?
సూర్యుఁడు - ఏమిటినాయనా అంతగా నిన్ను బాధపెట్టుచున్న విషయమేంటీ?
యమ - నా సందేహములను మీరు అర్థరహితమని త్రోసి పుచ్చనంటే విన్నవించుకుంటాను.
సూర్య - చెప్పు కుమారా!
యమ - నాకు మీరు ధర్మరాజుగా పేరుపెట్టి ధర్మ రక్షణార్థము నియమించి ఊరుకొనక యమలోకాధిపతిగా చేసినారు. నాన్కును ఈ పదవిలో మీరు నియమించిన క్షణమునుండీ ఏనాడునూ ఒక్క క్షణమైననూ తీరిక లేక అవిశ్రాంతము పని చేయుయ్చున్నాను. రెప్ప మూయుటకునూ తీరిక లేక అనిమిషుఁడుగా ఉండవలసి వచ్చుచున్నది.
సూర్యుఁడు - ఐననేమాయె? నీకు వచ్చిన సమస్య యేమి?
యమ - తండ్రిగారూ! ఉదయం బ్రహ్మస్వరూపులుగా మధ్యాహ్నము మహేశ్వరులుగా సాయంకాలము సదావిష్ణువుగా మూడు రూపాలూ మీరే అయి ఈ సృష్టి నడుపుతున్నారు.
సూర్యుఁ - ఔను నాయనా. ఐతే ఏమిటంటావ్గు?
యమ - బ్రహ్మగా ఉండి మీరు సృష్టి చేయుచు అందరి తలవ్రాతలూ వ్రాస్తున్నారు. ఆతలరాతలనుపట్టి కొందరు మంచివారిగా రాణించే అవకాశము పొందుచుండగా, మరికొందరిని దుర్మార్గులుగా బ్రతకమని వ్రాయుచున్నారు. ఆప్రాణిభూలోక జీవనము ముగించుకొని యమలోకమునికి వస్తారు.
సూర్యుఁడు - వస్తే ?
అదిగో చిత్రగుప్తుఁడు వస్తున్నాడు అతడు వివరిస్తాడు మీకు.
(చిత్రగుప్తుని ప్రవేశము)
చిత్ర - సూర్యభగవానులకు, యమధర్మరాజువారికి ప్రణామములు.
యము - చిత్రగుప్తా యమలోకమునకు జీవులు ప్రవేశించినప్పుడు మన వేదనను మా తండ్రిగారికి విన్నవించుము.
చిత్ర - ఆర్యా! అటులనే, ఆది దేవా! సూర్యభగవానుఁడా! జీవులు ఈ లోకమునకు ప్రవేశించుచుండగనే వారి కర్మఫలములను పాపపుణ్యములరూపములో పూర్తిగా వివరించి వారి వారి ఫలములకు తగినట్లుగా శిక్షలు అమలు చేయుటవంటివి మాకు నిత్యకృత్యమై ఈ యమలోకమను తలచుచున్నంతనే ఏవగింపు కలుగుచున్నది.
యము - ఔను తండ్రి గారూ! చిత్రగుప్తుఁడు చెప్పింది అక్షరాలా నిజం.ఈ పాపులు శిక్షలనుభవించుచున్నప్పుడు చూడలేకపోవుచున్నాము. ఐనా ధర్మము తప్పకూడదనే గిరి గీసి దానిలో ఉంచి యమధర్మరాజుగా చేశారు. ఈ విధమైన పాపకార్యములు చేయకుండ్।ఆ మానవులను ఉంచే మార్గమే లేదా? ఈ సృష్టి చేసినది తమరే కదా? వారి నుదుట పాపకర్మలు చేయమని మీరే వ్రాశారుకదా? మీ రాతప్రకారమే ఆ జీవుఁడు కర్మలు చేస్తుండడం చేత పాపకూపంలో పడుత్రున్నాడు. ఈ విధంగా కాకుండా వారిని మంచి మార్గంలో నడిపే మరో ఉపాయమే లేదా/
స్వూర్యుఁడు - మానవజాతికి కర్మలు చేయమని వ్రాయుటతో పాటు ఆ కర్మఫలములను తప్పించుకొనుటకు కూడా ఉపాయములు మేమే అనుగ్రహించితిమి కదా?
యమ - ఏమి అనుగ్రహించిరి తండ్రిగారూ?
సూర్యు - ఏ ప్రాణికీ లేని జ్ఞానమనేశక్తిని ప్రత్యేకించి మానవునిలో నెలకొల్పితినికదా? అట్టి జ్ఞానంతో వివేకము కలుగి ప్రవర్తిస్తే పాపపుణ్యాలు వారికెలా అంటుతాయి?
యమ - ఔననుకోండీ, కాని మీరు మాయ అనే పొరను వారిలో కల్పించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక అంధకారంలో కొట్టిమిట్టాడుతుయ్ండడం మీకు తెలియదా?
సూర్యుఁడు - అందుకేకదా వేదవిజ్ఞానాన్ని పుష్కలంగా అందించాను, వేద స్వరూపుఁడనైన నేను ప్రతీదినం వారి యోగ క్షేమాలు పాపపుణ్యాలు చూస్తూనే ఉంటాను కదా/
యము - నాన్నగారూ నన్ను మన్నింతురుగాక.
సూర్యు - సందేహమేల? ఏమిటోచెప్పు.
యము - మీరు ప్రసాదించిన శాస్త్రాలు, వ్రాసునిరూపంలో ప్రకటించిన అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలూ అన్నీ దేవతభాష అయిన సంస్కృతంలో ప్రసాదించారు. అల్పజ్ఞులైన మానవులకు ఆభాష అర్థము కాక అందలి విషయములను గ్రహింపలేకున్నారు. ఈ విషయము మీకు తెలియనిదా?
సూర్యు - అందుకేకదా యమా! అనేక భాషలలో కొందరు మహాత్ములను తాపసులుగా సృష్టించి వారిచే ప్రవచనముల రూపములో వేద సారమును బోధింపఁజేయుచున్నాను కదా/ అవి గ్రహించుకొని ఋజుమార్గములో ప్రవర్తింపవలసి యున్నదికదా?
యము - అయ్యో తండ్రిగారూ వారి స్థానములో మనముండిన మనకు అర్థమయి యుండెడిది. వారు అనేక యీతిబాధలు పడుతూ బ్రతుకులనే దుర్భరముగా గడుపుచు పొట్టకూటికి పుట్టెడు వృత్తులను చేపట్టి అహర్ణిశలూ జీవనపోరాటం సాగిస్తుండగా ఈ ప్రవచనాలు వినే అవకాశం కాని, అనుఇసరించే ఆలోచనకాని వారికి ఏవిధంగా లభిస్తుంది?
సూర్యు - ఐనచో ఇప్పుడు నీవేమందువు? చిత్రగుప్రా నీ ఆలోచనయేమి?
చిత్ర - స్వూర్యదేవా! ఈ పాపపుచిట్టాలు వ్రాయలేకపోవుచున్నాను. పాపకార్యములనుండి వారిని ముందుగానే దారి మళ్ళించగలిగితే అందరూ పుణ్యకార్యములే# చేయుచూ భూలోకమున సుఖించి అంతిమమున బ్రహ్మైక్యము సాధింపగలుగుదురని నా అభిప్రాయము.
యము - అవును పితృదేవా! మీరు అనుమతించినచో మేమే స్వయముగా భూలోకమున చిత్రగుప్తుఁడు ఆలోచించిన విధానమును అమలు చేయగలము.
సూర్యు - మీ ఆలోచనను నేనెందుకు కాదంటాను? మీ యిరువురితో పాఉ దేవతాగణమును కూడా మీకు సహకరించుటకు పంపుచున్నాను..
యము - మీ అనుగ్రహమును ప్ఒందిన మేము ఈ మంగళప్రదమైన కార్యము చేయుటకు ఎక్కడ ఏ రూపములలో ఉద్భవింతుమో మాపై దయతో వివరింపుడు.
సూర్యు - అఖండభూమండలంలో పరమ పవిత్రమైన భారతదేశమున సమైక్య ఆంధ్రరాష్ట్రమున భాగ్యనగరమున ధర్మప్రతిష్ఠాపనార్థము పుణ్యపురుషులకొరకు నిర్మింపఁబడిన ఆర్వీ ధర్మిష్ఠా అనే ప్రాంగణమున కొలువైయున్న శ్రీనరహరి సంసేవనా తత్పరులుగా ఉంటూ జ్ఞాన వయో వృద్ధుల రూపమునSRVD ఎలైట్ సభ్యులుగా పాత్రలు వహించి మానవులకు ప్రవర్తించనలసిన ధర్మ మార్గమును సులభశైలిలో వ్యాప్తి చేయుట కొఱకు అక్కడ ఆవిర్భవింతురు గాక.
యముఁడు + చిత్రగుప్తుఁడు. ధన్యులము కర్మసాక్షీ, మేము మీవలన ఈ బృహత్తర కార్యమును చేసి మానవులలో శాంతిని పెంపొందింప యత్నింతుము.
ధర్మిష్ఠా లోని నరహరి - మరియు వాసుదేవరావు ప్రవేశింతురు - ఓహో సూర్యభగవానుఁడు ఇట్టి మహత్తర కార్యనిర్వహణ కొఱకు మమ్ములనిక్కడ కు చేర్చినాడా? ఆ దినకరుని ఆజ్ఞను శిరసా వహింతుము గాక. చిత్రగుప్తా మనము నరహరి వాసుదేవరావు పేరులతో ఇక్కడ చేరియున్నాము. మనతో వచ్చిన మిగిలిన దేవతామూర్తులయిన సహృదయమిత్రులతో, యువకులతో లలితాంబాస్వరూపులైన స్త్రీజనాళితో మనకు ఆఆదిత్యుఁడు విధించిన సామాజిక రుగ్మతలను తొలగించుటకు సత్యజ్ఞానము అందరిలోనూ కలుగఁ జేయుటకు అనవరతము శ్రమిద్దామా?
చిత్ర (వాసుదేవరావు)., - అటులనే గురుదేవా. నాకొక ఆలోచన వచ్చినదియమధర్మరాజా!
యముడు - ఏమోయీ వాసుదేవరావ్ మరచితివా మనము ఉన్నది భూల్కములో. ఇక్కడ నన్ను నహరియందురుకదా, మరి మన పూర్వనామముతో పిలువరాదుకదా?
చిత్ర - ఔను ప్రభూ మరచితిని. ఈ భూలోకమున అడుగు పెట్టగనే మానవులలో సహజంగా ఉండే మరిచిపోవుట అనే జాడ్యము నాకునూ సంభవించినదిదేమిచిత్రము స్వామీ?
యము.- అదేకదయ్యా భూలోకములో ఉన్న మానవుల కర్మా... వారుచేయుచున్న పనులు కొన్ని గుర్తుంచుకో గలుగుతారు. కొన్ని మర్చిపోతారు. అల్లాంటప్పుడే వారు మాటా।డేమాటలు అబద్ధముగా మనం గుర్తించి పాపపు చిట్టాలో నీవు వ్రాస్తుంటావు. నిజానికి ఇది వారితప్పు కాదు. ఆ భగవంతుఁడే వారికి అలా ఏ।ర్పరచినాడు.
చిత్ర - అయ్యో పాపము నిష్కారణముగా వారు శిక్షింపబడుట బాధకలిగించుచున్నది ప్రభూ!.
యమ - చిత్రగుప్తా ఇటువంటి తెలియకచేసే పాపాలు వారికి వారి దైవాన్ని ప్రార్థింంచితే మాసిపోతాయని ఆ పరమాత్మయే వ్రాసిన్బాడుకదా?
చిత్ర - ఔను ప్రభూ. అదిగో మనకు దగ్గరగా ఎవరో వచ్చుచున్నారు.
యమ - ఏదో కూనిరాగము తీయుచూ వచ్చుచున్నట్లున్నాడు?
చిత్ర - ఔను ప్రభూఱానిమ్ము వీనిని మనము కొన్ని ప్రశ్నలడిగి మనము వచ్చిన పనిని నెరవేర్చుదాము.
(సుధీర్ - పాట పాడుకొంటూ వస్తాఁడు పాట్ - ఓలమ్మీ తిక్కరేగిందా - ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మీ తిక్క రేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా..తిక్కరేగీ తిమ్మిరెక్కీ పైరగాలీ పైట తీసి పందిరేసి చిందులేసిందా ఓలమ్మీ తిక్కరేగిందా.... అంటూ ప్రవేశిస్తాడు.)
చిత్ర -. ఓయ్ ఓయ్ సుధీర్! ఏమితోయ్ మంఇ ఉషారుగా ఉన్నావ్?
నువ్వు పాడే పాట ఏ సినిమాలోది...
సుధీర్ - ఓహో వాసుదేవరావుగారూ! మీరిక్కడే ఉన్నారా? మన ధర్మిష్ఠాలో వినాయకపాంచరాత్రం చేస్తున్నారు కదండీ ఆ సందర్భంగా మాలా॥॥।ంటి వారే కాదు మీలాంటివారూ ఎంజాయ్ చేస్తారుకదా.
చిత్ర - ఔను ఐతే?
సుధీర్ - ఐతే ఏ।ంటి? నేను ఈ పాటకు డేంసు వెయ్యాలని పాట పాడుకొంటూ వస్తున్నానండి.
యము - ఇంతకూ ఈ పాట ఎక్కడిది?
సుధీ - యమగోల సినీమాలోది?
(యముఁడు చిత్రగుప్తుడు తుళ్ళుపడతారు.)
చిత్ర - ఎయ్యెయ్యేమిటీ? మేమ్మేమ్మేము గొగ్గొగ్గోల చేశామా?అదెప్పుడయ్యా?
సుధీ - మీరేంటిసారూ? మీరు కాదు ఆ యమధర్మరాజును, చిత్రగుప్తుడూనూ యన్టీయార్ని చంపెస్తే ఆ యమలోకంలో వాళ్ళిద్దరినీ ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు చూసేరూ . అది తల్చుకున్నప్పుడల్లా మాభలే నవ్వొస్తాద సారూ.
(యముడు చిత్రగుప్తుడు వెఱ్ఱిమొహాలేస్తారు)
యము - ఓయీ సుధీర్ అలా అనకు తప్పు. పాపం యముఁడు చిత్రగుప్తుఁడు ఇద్దరూ చాలా మంచివారే.
(మరొకడు ప్రవేశిస్తాడు. పేరు సంబరాల రాంబాబు.)
సుధీర్ - ఒరే రాంబాబూ బలే సమయానికి వచ్చావురా. మనం యముణ్ణి, చిత్రగుప్తుణ్ణీ తప్పుగా మాటాడితే పాపమంట.
రాంబాబు - ఒసోస్ పాపమా నా బొందా. ఆచిత్రగుప్తుఁడేమో మనంచేసే ప్రతీపనినీ చూస్తూ పేపరు దిద్దే తెలుగు మాష్టారులాగ తప్పులు పడుతూనే ఉంటాడు, పాపాలచిట్టా తయారు చేస్తూనే ఉంటాడు. దీనమ్మా... సరదా మంచి బూతుపాట పాడుకుందామంటే యీయనగా రెక్కడ పాపాల లెక్కల్లో రాసెత్తాడోనని బయపడి చత్తున్నాం.
యమ - ఓరి మీయబూరేయ్ ఆపండ్రా. యినలేకచత్తున్నాం.
రాంబాబు - . ఏంది నరహరిగారూ? మేము పగలంతా స్కూలూ పాఠాలూనూ.. అదీ ఆడవాళ్ళు అస్స్లు లేని మగవాళ్ళ స్కూలు. మాకు కనీసం ఆనందపడటానికి అవకాశాలేవండీ? తెల్లవారనివ్వరు మా నాన్నగారూ అమ్మగారూ ఒరేయ్ రామూ లేరా. లేరా ఇంకా లేవల్।ఏదా అం।టూ ప్రాణం తీసెస్తుంటే ఏదో అమ్మాయితో మంచి కలకంటున్నట్టు వాళ్ళకి తెలిసిపోతుందో యేమి।టో సతాయించుతారు లెమ్మని. అంత్।ఏ తెలివొచెస్తుంది కల చెదిరిపొతుంది. ఏదో ఇలా పాడుకుందామంట్।ఏ మీలాం।టోళ్ళు ఒర్।ఏయ్ రా।ంబాబూ అలాంటి పా।టేంటిరా/ చక్కగా దేవుడుపాట పాడుకోవచ్చును కదా అంటూ క్లాసు పీకుతారు..
సుధీర్ - ఔనండి. మాకు ఈ జీవితాన్నిచ్చిన ఆదేవుడు ప్రీడం ఇవ్వడం మర్చిపోయాడ్॥ఏమ్నండి.
ఒరేయ్ రామూ అటు చూడు మన ఫిగర్ వస్తున్నట్టుంది. గట్టిగా నకు అటు చూడకు.
రాంబాబు - ఏమి?అదిగో రోడ్డు మీద దానిపక్కనే దాని బాబున్నాడుఅసలే పోలీసోడు. తాటతీసెస్తాడు.
యము - అబ్బాయిలూ మిమ్మల్ని చూస్తుంట్।ఏ జాలేస్త్।ఓదయ్యా?
రాంబాబు - ఏం సామీ అంత జాలేసెస్తోంది మీకు.
చిత్ర - ఇలా రండి మా మాట వింటామంటే చెప్తాను.
సుధీర్ - చెప్పండి - వినకపోయినా మమ్మల్ని వదలరుకదా చెప్పడి యింటాం.
మీరిద్దరూ హైస్కూలులోనే కదా చదువుతున్నారు?
రాంబాబు - ఔను. నేనూ వీడూ పదోతరగతే చదువుతున్నాం.
యమ - మీ వయసు నిండా పద్ధాలుగు లేవు. ఇంతచిన్నవయస్సు మీది
చిత్ర - ఈ వయస్సులో ఏ పనిమీద మనసుపెడితే ఆపని పూర్తిగా చేయగలుగుతారు.
చూడు రామూ నీకు ఏ సబ్జక్టులో మార్కులు ఎక్కువ వస్తాయి?
రాము - సారూ నేను ఫిజిక్స్ లోను యీడు మేథ్స్ లోను క్లాస్ ఫష్ట్.
యమ -- మరి మిగిలిన్బ సబ్జక్టులలో ఎందుకు వెనకబడ్డారు
రాంబాబు - దీనెమ్మా ఆమిగిలినసబ్జక్టులు ఎందుకో వంటపట్టవండీ. ఆ టీచర్ల్ చూడ్డానికి బాగోరు.. కాబట్ట్।ఏ మాకు యినబుద్ధి కాక మా పుస్తకంలో మాకు నచ్చిన బొమ్మలు పెట్టుకొని, లేదా పాటలు కాగితం పెట్టుకొని చూసుకొంటూ లోపటల్।ఓపట పాడుకొంటూ కాలక్షేపం చేస్తాము.
చిత్ర - మీకు నచ్చిన సబ్జక్టు టీచర్లు బాగుంణ్టారా/ అబ్బో చాలా బాగుంటారు మమ్మల్ని దగ్గరకి తీసుకొని ఒరేయ్ య్లా చదివితే మీకు మంచిమార్కులు వస్తాయి, మీరు రైటింగ్ఫు బాగుంటుంది కాబట్టి ఎక్కౌవమార్కులు వస్తాయి... అంటూ మమ్మల్ని ఎంక్రేజ్ చేస్తార్ సారూఽందుకే మాకు ఆసబ్జక్టులంటే యిష్టం. అందుకనే ఆ సబ్జల్క్।టుల్।ఏ ఎక్కువ చదువుతుంటాము.
యము - నాకొక్క మాట చెప్పండి... ఆ రెండు సబ్జక్టులూ పాసైతే సరిపోతుందా? మిగిలినవి పాసవక్కరలేదా?
సుధీర్ - అలా ఐతే ఎంతబాగుండేది అన్నీ పాసవాలసారూ.
రాంబాబు - ఏ ఒక్క సబ్జక్టు ఫేలయినా ఇంతే సంగతులు.
సుధీర్ - మా బాధంతా అందుకే కదండీ/ ఈ బాధలు కనీసం ఇల్లాంటప్పుడ్।ఐనా మర్చిపోయి ఎంజాయ్ చేద్దామనుకుంట్।ఏ మీరు మమ్మల్ని నిలబెట్టి సుత్తేసెత్తున్నారు.
సరే ప్రార్థన చేద్దాము.
(అందరూ నిలఁబడి ప్రార్థన చేస్తారు)
ధర్మోరక్షతి రక్షితః.. అధర్మా నాశోఽస్తు. సుధర్మా విజయోఽస్తు.
నమో లక్ష్మీ నారసింహా! జైశ్రీరామ్.
భారత మాతకు జయము జయము - - భారత మాతకు జయము జయము - భారత మాతకు జయము జయము.
శ్లోకం:
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్ దుఃఖ భాగ్భవేత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
జైహింద్.
No comments:
Post a Comment