సాహితీ ప్రియులారా!
ఈ క్రింది శ్లోకములో గల ప్రశ్నకు సమాధానం చెప్ప గలరా?స సర్వ బుధ గీర్మాన్యః పరారిర్భృత్య రాజ్యదః.
మాయీమేశం కం సు శబ్దం రక్షణం సువ్రతో జగౌ?
సమాధానం మీరు చెప్ప గలరని నాకు తెలుసు.
ఒక వేళ చెప్పలేమని అనిపిస్తే శ్లోకారంభం నుండి బేసి అక్షరాలన్నిటినీ కలిపి చూడండి. మీరు చెప్ప వలసిన సమాధానం లభిస్తుంది.
బాగుందా? మీ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కుతో పాటు, చక్కని సూచనలనివ్వ వలసిన బాధ్యత కూడా మీపై ఉందని మరువకండి. మీ దృష్టిలో గల ఇటువంటి చమత్కార భరిత పద్యాలను ఆంధ్రామృతం ద్వారా పాఠకులకందించడం కోసం వ్యాఖ్య ద్వారా పంపంపండి. ధన్యవాదములు.
జై శ్రీరాం.
జైహింద్.
జైహింద్.
4 comments:
సర్వధర్మా పరిత్యజ్యమామేకం శరణం వ్రజ
జ్యోతిగారూ! బాగానే చెప్పారు. ఐతే న్ అనే అక్షరాన్ని మాత్రం తప్పించేసారు.
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
మీ కృషికి ధన్యవాదాలు.
మంచి శ్లోకాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు.
నావద్ద మా గురువు గారు ‘శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు‘ సేకరించి ప్రచురించిన ‘ప్రహేళికలు - అంతర్లాపికలు, బహిర్లాపికలు‘ అనే గ్రంథం ఉంది. అందులో ఇలాంటి శ్లోకాలు కొన్ని వందలు ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పటికే నా బ్లాగులో పరిచయం చేసాను. ఈసారి హైదరాబాదు వచ్చినప్పుడు ఆ పుస్తకం జిరాక్స్ ప్రతిని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను.
నమస్కారములు. జవాబు చెప్పేసారుగా ? [ బేసి అక్షరాలు కలపమని ] ఇంకా మరిన్ని తెలుపగలరు చక్కని సాహిత్యాన్ని అందిస్తున్నందుకు చిక్కని అభినందనలు.
Post a Comment