అమ్మా! నాకు ఏపేరు పెడతారమ్మా?
శ్లో|| జాతానంతరమేవనామకరణం త్వే కాదశాహేస్ఫుటం |
పుత్రస్యైవసమాక్షరంతు యువతేః కార్యంతతోవ్యత్యయం !
సుద్ధిర్జాతకవచ్చనామ్నిసకలై స్తద్ధ్వాదశేషోడశే |
ద్వావింశేవ్యధవింశకేహ్ని విహితం జాతివ్యవస్థాం వినా || (పూర్వ కాలామృతం)
తాత్పర్యము:-
ప్రసవమైన వెంటనే జనన నక్షత్ర పాదమును బట్టి పేరుంచి, పదనోకండవ రోజున శిశువునకు సరియగు నక్షరముల సంఖ్యగల పేరు పెట్టవలయును. ఇది లగ్నాదుల శుద్ధి ననుసరించి చేయవలయును. జాతాశౌచము పూర్తియైన తరువాత పండ్రెండ్రవ రోజునగాని, పదహారవ రోజున గాని, యిరువది యగు రోజునకాని, యిరువది రెండవ రోజున గాని నామకరణం చేయవలెను. పురుషులకు సరి సంఖ్య, స్త్రీలకు బేసి సంఖ్య గ ల యక్షరములతో నున్న నామమును నా మకరణ మహోత్సవములో నుంచవలెను .
5 comments:
బ్రహ్మాండం గా వుంది. ఎనాళ్ళకో ఈ శ్లోకం మళ్ళా చదువుతున్నాను. మా తాత గారు ఎప్పుడూ చెబుతూండేవారు. ధన్యవాదాలు, రామకృష్ణ గారూ!
పాపా ! భలేగా ఉన్నావు.
ముద్దులొలుకు తున్నావు
మత్యాలు రాలుస్తున్నావు .
ముచ్చట గా ఉన్నావు.
చాలా బాగా వివరించారు.
జాతాశౌచము ఎవరెవరికి వర్తిస్తుంది
జాతాశౌచము ఎవరెవరికి వర్తిస్తుంది
Post a Comment