(ఆ)కలి కాలము
షోడశోత్తర సంగమేశ త్రిశతి
1.సి:-శ్రీరాము డేలినసీమ భారతియందు
నత్యంబు ధర్మంబు సాగె నపుడు,
కాల గమనమందు కరువాయె నయ్యది
స్వార్ధ పూరిత చింత సంతరించె!
కుల మత జాఢ్యాలు కుతలంబు నిండెను,
పధకాలు పదవులకు బాట లేసె!
అప్పులు ప్రజకిచ్చి యాస్తులు తామొంది
ఏలికాళికె తగె!నెంచ రేలొ?
తే,గీ:-శ్రమ పడని ధనము తగునె?జనముల కిల!
మందమౌ భవితం చేల?మనసు గనరు!
భావి తరములు శూన్యులై భంగ పడరె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
2.సీ:-బోయ కులము పుట్టి భువి కీర్తి నిలుపంగ
భువనైక మోహిత భూతి యశుడు
వాల్మీకములు పట్టి వాల్మీకి ముని యౌచు
రామాయణము వ్రాసి రహిని మించి
రామ రాజ్యము మించు రాజ్యంబు లేదంచు
భూమి కీర్తిని నింపె పుణ్య మూర్తి
ఆర్తుల నెడమేర్చి కీర్తి నింపు డటంచు
లోక యుతుడు నాయె శ్లోక యశుడు!
తే,గీ:-ధర్మ సంరక్ష ణార్ధమై తత్పర మతి
కర్మ కర్తృత్వ సత్యాన గడగి కడకు
ముక్తి మార్గాన గమియించి,మోక్షమొంది
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
3.సీ;-మల్లేశ నీనామ మంత్రంబు పఠియించి
జగమది సరితీరు సాగ నెంచి
వంచిత జన్ముల సంచిత పాపాలు
పోనాడి పుణ్యతం పుడమి నెంచి
సర్వ చరా చర సంపన్న లోకాన
సత్య ధర్మంబులు నిత్య మెంచి
మమ్ము తీర్చగ రావె!మల్లేశ సర్వేశ!
నీయాన మీరని నిరత భక్తి!
తే,గీ:- సర్వ వేళల నీముందు సాగిల పడి
సేవ జేసిడు సేవకు సేవ మెచ్చి
కరుణ దీవించి భారతి కీర్తి పెంచి
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
4.సీ:-ఆనాటి కాగతి!ఈనాటి కీగతి
యేనాటి కే గతో?యెరుగ గలమె?
జనియింతు మేనాడొ?చనిపో దు మేనాడొ?
యే నాటి కేమౌనొ?నెరుగ వశమె!
రేపు నీదియు కాదు!నాపలేవు భవిత!
జీవంబు చరమంచు చింత లేక!
మతిలేని గతి లేని మాయ లోకంబున
మమకార మేటికి?మంచి నెంచు!
తే,గీ:- పుట్టు కెరుగను లే వెట్టొ?నట్లె సుమ్మి!
చావు యెప్పుడొ?తెలియని జ్ఞాన హీన!
మూడు నాళ్ళ ముచ్చట కేల?మోహ పడెదు!
జనుల బ్రతుకులు తీర్చమా!సంగ మేశ!
5.సే:-నిన్నంటి కదలాడు నీడ వీడని యట్లు
ధర్మ మంటిన నిన్ను ధరణి మెచ్చు!
మాయ నిన్నంటుచో?మాయ మేర్చును వేగ!
నీతి నిన్నంటుచొ?నిల్చు ఖ్యాతి!
గాతి నింపది ముప్పు!గౌరవంబుకు చిచ్చు!
మాసిన కీర్త ది మరల రాదు!
చెడు వీడి నడయాడ శివకరం బౌనిల!
కాని పోని తలపు మాన వలెను!
తే,గీ;-భవిత బంగరు బాటౌను బాగు పడెదు!
మంచి నెంచని జీవంబు మాయ దేలు!
తేలు కుట్టిన దొంగగా తిరుగ దగదు!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
6.సీ:-సాటి జీవ కరుణ మేటి యజ్ఞ ఫలంబు
జీవ హింసను విడి సేయు సేవ!
అన్న మెన్నని నోరు!దన్ను లేని బ్రతుకు!
సుష్క ప్రయాసంబు!నిష్కృతంబు
కర్తృత్వ మెరుగని కాఠిన్య జీవంబు
జీవ నాధారంబు చెరచి వైచు!
చపల చిత్తంబది సరి గాదు జీవికి!
కుపిత భావంబది కొంప ముంచు!
తే,గీ:-కంచె మేసెడి జీవిగా గడగ తగదు!
నిజము లేనట్టి మాయలు నిలువ విలను!
భజన లేకున్న మోక్షంబు బడయ తగునె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
7.సి;-శతకోటి ధృగ్జాల సామ్యతా భావాన
శత మాయు జీవుల జయము నెంచి
విడదీయ లేనట్టి విజ్ఞాన ఖను లౌచు
విశ్వాస పాత్రమై విశ్వ మేల
శాశ్వత కీర్తులు జగమంత వ్యాపింప
జన్మ సార్ధక మేర్ప సాగ నెంచి
షోడశోత్తర త్రిశ దాడ్య!సీసతతిని
నీతి నీమా కృతి! ప్రీతి నింప!
తే,గీ:-ప్రగతి మార్పుకు మెట్టౌచు పరగు తపన
ద్వేష మేకోశమున లేని విశ్వ వినుత
ఖ్యాతి నాశించి మాత్రమే కదలె రచన!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
సీ:-క్షంతవ్యుడను నేను!సమధృష్ఠి చింతన
జరుగు జగతి తీరు!జయము దనర!
మంచి మనసు తోడ!మంచి మార్పును గోరి
జయ జయ ధ్వానాలు జగము నిండ
తల్లి భారతి భవి!ధన్యత నలరార
సమత మమత లిల సరగ నిల్పి!
పాలనా దక్షత!పరిపూర్ణ తత్వంబు
పరిఢ విల్లెడు నాశ!వ్రాయు చుంటి!
తే,గీ:-దోష భూషలు గావివి!తొంటి యట్ల!
చెడును పోజేసి!మంచిని శ్రీలు నమర!
సర్వ సామ్యంబు నెలకొల్ప సద్యశాన
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
9.సీ:-మాయ మోహిత జగమాయె!మంచి గనక!
కనిన మంచికి మాయ కమ్ము చుండె!
మనుజ చైదము కాదు!మాయ ప్రభావంబె!
మాయ సత్యము చెంత మసల లేదు!
మంచి భావము తోడ మంచినే!కాంక్షించి!
మంచివై జగతిని మసల వలయు!
జనులు మెత్తురు!పరమ సౌఖ్య మలరు!
కీర్తి గనెద విల!కీర్తి మంత!
తే,గీ;-మసలు తీరును గమనించి మనుజు లెల్ల
భవ్య ముర్తిగ సర్వదా!ప్రణుతు లిడగ!
భద్ర కర్ణుండు గణపయ్య!భవము బాపు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
10.సి:-అహముతో నిహమంత!మాశాంత మాసింప!
ఇహ పరంబులు చెడు!హింస మిగులు!
ధన ధృష్టి జన సేవ!దాక్షిణ్య మొందునే?
కలనైన సత్యంబు కనక యున్న!
విభజించి పాలించు విజ్ఞత!నిల్చునే?
భద్రత చెడదీసి భంగ పరచు!
కంచు లోహంబది!కనకంబు విలు వౌనె?
కనక సాదృశ కీర్తి గణ్య తలరు!
తే,గీ:-నీతి నేతకు జేజేలు!నిండు పుడమి!
చేత విష తుల్య భావంబు!చెరచి తీరు!
మంచి నెంచెడు మార్గంబు!మహికి మేలు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
11.సీ:-నిజములు పలుకంగ!నిష్టుర మై యొప్పు!
మనుజ సంతతి తీర్చ మంచి వలయు!
పని యందు దోషంబు!పరికించి వెలి జేయ!
మార్పు సాధన కది!మాన్య మౌను!
జన మంచి జగమంచి!జయదమం బేపార!
సశ్య శ్యామల మౌచు సాగు ప్రగతి!
తప్పు దొర్లిన యంత!తల్ల డిల్ల తగదు!
ఒప్పుగా మలచెడి నోర్మి వలయు!
తే,గీ:-తప్పు లందలి లోగుట్టువిప్పి జూచి
మనసు సరిబడ్డ భావనం గనుట నిజము!
నిజము నిజమైన గుండియల్!నీతి నిండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
12.సీ:-రస విష గంధక!రంగేళి జీవంబు!
రేపు మనది కాదు!చేపు నీతి!
నీతి నిలకడ యే!జాతిని కాపాడు!
జాతి లేకున్నను జగము లేదు!
జగము నిగమార్ధ సంస్తుత్య!పాత్రమై
మనుగడ చేకూర్చు మహిత శక్తి!
శక్తియే!ముక్తికి సాధనం బనుమాట!
సత్యంబు నిత్యంబు సమ్మతంబు!
తే,గీ:-ముందు చూపున మేలెంచి మోద మొందు!
పరుల హింసింప పాపంబు పట్టి కుడుపు!
పగకు తావీయ దలచిన పట్టు సడలు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
3.సి:-నేరంబునకు శిక్ష!నీరంబు నకు రక్ష!
మానంబు పరి రక్ష!మహిమ గాదె?
దానంబునకు నీవి!ధర్మంబునకు నీతి!
జ్ఞానంబునకు ప్రజ్ఞ!జాతి వెలుగు!
భుక్తంబునకు తృప్తి!పూజ్యంబు నెడ రక్తి!
రాజ్యంబునకు ముక్తి!రాగ మయము!
సేధ్యంబునకు వాన!శోధ్యంబు నకు మేథ!
బీజంబునకు శక్తి!ప్రియ తమంబు!
తే,గీ:-ఆంత రంగిక శక్తికి యంతులేదు
మేర లేదిల!యూహకు! మీర గలవె?
కాలచక్రపు భ్రమకంబు!కట్ట బదునె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
14.సీ:-చీకటి నడిరేయి!సిద్ధించె స్వేచ్ఛని
చింతింప పని లేదు!శివము సుండి!
నక్తం చరుల దోష నాట్యంబు పోయెలే!
గ్రహణ పీడయు వీడె!కనవదేల?
చిక్కిన స్వేచ్ఛకు చిన్మయత్వము గూర్ప!
సోదర సాదర శుద్ధ తేర్చి!
అప్పు చేయుట మాని!అమ్మ పరువు పెంచి!
ఘనత చాటగ వలె!కలుము లలమ!
తే,గీ:-లేదు సఖ్యత మనలోన!చేదు నిజము!
నిజము గ్రహియించి సర్వదా నీతి పెంచి
దేశ భక్తిని కలిగించి దీప్తి నింపు!!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
5.సీ:-ఇద్దరి భార్యల యిరకాట మొక వైపు!
కంఠ గరళ బాధ!కన్ను మంట!
తిరిపె మాధారమై!తిరుగాడు వసనాల!
మేన భూదిని దాల్చి!మేలు నిడుచు
సిరి లేని శివు డయ్యు!సిరులిచ్చు నొక వైపు!
పరిమార్చు పాపుల భవ హరుండు!
పంచాక్షరీ మంత్ర ప్రాభవం బలరార!
పిలువగా రక్షించు!ప్రియ తముండు!
తే,గీ;-శివుని నామంబె!శాంతంబు జీవ రక్ష!
ముక్తి సోఫాన పధకంబు!మోహనంబు!
కర్మ కర్తృత్వ కారక కరణు డతడు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
16.సీ:-తొలి నాటి పాలకుల్!దురిత దూరులు నౌచు
సత్యమే నిత్యమై సరగి రెంతొ!
మథుపాన రాజ్యంబు మాట లే!దానాడు!
జగతి పెంపును గోరి సాగి రపుడు!
కట్టడాలకు మొగ్గు!దిట్ట తనపు నిగ్గు
చరిత నిల్చిరి వారు శాశ్వతముగ!
కళలు పోషించిరి!కావ్యాలు గూర్చిరి!
భువన విజయులైరి భోజు లైరి!
తే,గీ:-మత్తు పానీయములు నేడు మహిమ యేలె!
చిత్త జాహితు దూరులై చెలగి రిపుడు!
పొట్ట నింపుకు జేకొట్టి పుట్టె డాశ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
17.సి:-క్షుద్ర నీతి పెరిగె!భద్ర నీతి తొలిగె!
విపరీత భాష్యంబు వినుతి కెక్కె!
తంత్రాల కాలమై!యంత్రాంగ మలరారె!
భరత జాతి పరువు!కురచ నాయె!
నడిపించు కలి తప్పు!నాయక దోషమా!
కాదు కాదు జనము!కనుడు నిజము!
సంచిత జ్ఞానులు సర్వత్వ తపనచే!
సాగ నీయడు కలి సార మింతె!
తే,గీ:-పూర్వ వైభవ మేనాడు?పుంజు కొనునొ?
కలిని గెలువంగ దైవమే!కదలి రాగ!
సర్వ సామ్యత తంత్రంబు సాగు నిలను!!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
18.సీ:-వర సమాజపు శ్రేయ వర్ధిష్ణు బోధలు
భావి తరపు జీవ భాగ్యము నగు!
దోషాలు వెలి జేసి దోబూచు లాడక!
తేట తెల్లము జేయ దివురు సుఖము!
మంచి మార్పును కోరి!మంచికే తపి యించు!
మాన్య కావ్య పఠన!మార్పు గూర్చు!
మానవత్వము నిల్చు!మాయమౌ మాయయు!
మాయ లేని బ్రతుకు!మనకు మేలు!
తే.గీ:-అబ్బురంబుగ మనుజాతి!హాయి వెలయ!
సేయ వలె!కవు లెల్లరు!శ్రేయ బోధ!
వేద భాష్యాలు విందురే?వీర లిపుడు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
19.సీ:-వాదించి శోధించి!వాదెంచు నెపమెంచి
మించిన భక్తితో!కుంచితముల!
సంచిత భావంబు సాకల్య మొందగా!
సంసార శ్రేయంబె!శర్వ మగును!
లోకాప వాదంబు!శోకాప హారమై!
శ్లోకాను కూల్యమై సురలు మెచ్చ!
మన తల్లి ఘనతది!మారు మ్రోగ జగతి!
మార్చ సాయ పడుము!మంచి మనసు!
తే,గీ:-క్రమత సచ్ఛీల నాదృశ కరుణ లలమ
తేరు నడిపెడు సారధ్య!తీరు నెరిగి!
బలము పాలన చేయగా వలెను సుమ్మ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
20.సీ:-శ్రీలు సత్యపు తత్వ సింధూర తిలకమై
భారతాంబ గరిమ పరిఢ విల్ల!
సాకార భావంబు సద్యశ సంఘంబు!
తీర్చి దిద్దగ గోరి!శివము నెంచి!
భవ బంధ మోచన ప్రాళు బ్ధ కర్మాల
నధిగమించు తెరవు నాత్మ దలచి!
చేసెడి యీకృషి!జీవనోద్ధారియై!
ధాత్రి సుఖత నెంచి!మైత్రి నెంచి!
తే,గీ:-సంకుచిత భావ జాలము సద్దు మణగ!
ప్రగతి సుగతిని గాంచంగ పట్టు విడని!
దీక్ష ద్వేష రహిత బుద్ధి!దీప్తి గనగ!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
21.సి:-సరియైన బీదకు సాయంబు మేల్మేలు!
కుల మన తప్పగు తెలిసి మసలు!
ధనముండి బీదగా తగు సాయ మందిన!
దేశ ద్రోహము గాక దివ్య మగునె?
మనవాడెపో యని ధనమును వెదజల్ల!
పని చేయ నేరడు బద్ధ కుడయి!
అందరు నావారు యను భావ మున్నచో?
కలత లుండవు గదా!కనరదేమొ?
తే,గీ:-డబ్బు పంచి"ఓట్లు"కొనుట నబ్బురంబ!
పరగు వ్యాపార ధోరణి పాలన యగు!
భావి పౌరుల బ్రతుకులు బండలగును!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
22.సీ:-ఇచ్ఛ వచ్చిన రీతి!పెచ్చిమీరి భరతి
నాదిలే!యనుకొన్న బాధ పడెదు!
పది మంది నిన్నెన్ని పాలింప పంపిన!
రాజ భోగము కాదు!రాజు కావు!
ప్రజల సేవను జేయ!పంపించిరే!గాని
వారి భవిత పాడు కోరి కాదు!
సహకార బుద్ధితో!సానుకూల్యత నేల
భరత జాతి పరువు! ప్రగతి గనును!
తే,గీ:-పెంపు సర్వత్ర నిండగ!పేరు తెచ్చు!
భార మంతయు మోపిరి!సార ధీర!
ప్రజలు బిడ్డలుగా నెంచి!పదవి జేయు!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
23.సీ:-ఒక తల్లి బిడ్డలే! యొక రీతి నుండరు!
భావ భేదము నుండు!పనుల యందు!
జన మనోభావాలు చర్విత చర్వాలు!
ఒక్క రీతి గడగ నొక్కొ!కనగ!
తత్వ జ్ఞాన మరసి తగురీతి మంచికై!
పాటు పడిన చాలు పరము డౌదు!
స్వార్ధంబు నెడ మేర్చి!సద్గుణ గణ్యత!
జీవ నాడిగ నెంచి సాగ సుఖము!
తే,గీ:-కలిని నడయాడు దోషాల కనుల గాంచి!
సరిని జేసెడి తపనయే!పరమ తపన!
సూచనంబును జేసెదు శుద్ధ మరయ!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
24.సీ:-స్వార్ధ తత్వము గల జగమేలు వారల!
మొండి మూర్ఖత్వత!దండి నెంచి!
జనులాడు మాటలు!వినుచు వేసరి నాడ!
నామాట గాదిది నరుల మాట!
పరుషంబుగా నెంచి పగబూన తగ దయ్య!
ఆంతరంగిక భావ మరయ వలెను!
తప్పు సరియు జేసి!ధర్మ పాలన జేయ!
విజ్ఞాన ఖనులౌచు వెలయ గలరు!
తే,గీ:-భిన్న సంస్కార భారతి!వెన్న ముద్ద!
బాల గోపాలు రౌచిల!బాగు పెంచి!
కర్మ భూమిది!ధర్మాన!గమియ జేసి!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
25.సీ:-భిన్న ధర్మంబుల మన్నించు నైజంబు!
కుల కర్మ లందున చులక నాయె!
సమ సమాజము కాదు!సమము కానేరదు!
కుల ధర్మములు మార్చ కుటిల మౌను!
సర్వుల మేలెంచి!సాయంబు జేసిన!
సర్వేశ్వరుడు మెచ్చి సద్గతి నిడు!
గతి మాలిన పనులు!కాటకంబులు గూర్చు!
చెడు నంట మానుచో!శివుడు మెచ్చు!
తే,గీ:-భావి సుఖములు మది నెంచు!భాగ్య జీవి!
తెలివి ప్రకటించి ప్రజ్ఞతో వెలుగు నింపు!
పాలనంబున నిను మించు వాడు లేడు!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
26.సీ:-అక్కజంబుగ కీర్తి యవని తానొందంగ!
సమభావ మేపార సరగ వలెను!
నిక్కువంబుగ నీతి నియమాలు పాఠించి!
సత్కర్మ సాచర్య! సమత నెంచి!
మానవ సేవయే!మాథవు సేవంచు!
మది నెంచి కీర్తించి మహితు డౌమ!
నాది నాదనరాదు!నీది యేదియు కాదు!
సత్య వ్రతుడవు కమ్ము సత్వరంబు!
తే.గీ:-కర్మ సత్కృత మేర్చుచో?జయము నీదె!
జయ పతాకము నెత్తు!సద్గుణ ఖని!
గుణిజ గుణకాలు లెక్కించు గురుడు శివుడె!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
27.సీ:-సిగ్గు నెగ్గును లేక!శివ మెంచ నేరక!
బూది జేయ జగతి పూజ్య మౌనె?
తగునంచు నన్నిట!తగ్గుట లేదంచు!
నిగ్గు టద్దము నంచు నిగుడ తగునె!
అద్దంపు బింబంబు!నటులిటు లెరుగని
జ్ఞాన తిద్ధరణినే జయద మవగ!
సాగ రోర్మిలములు సద్దు మడిగి నంత!
స్నానంబు నెంచెడి!చతురు లుండ!
తే,గీ:-అట్టి తత్వజ్ఞు లెందరో!యవని నేల!
తట్టు కొను చున్న దెట్టులో?తల్లి భరతి!
నీతి నింపెస లారెడు!జాతి మనది!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
28.సీ;-:-ఆటు పోటుల కోర్చు!అనుభవజ్ఞుల ప్రజ్ఞ!
రాజకీయాలకు రక్తి గూర్చు!
అవగాహనము లేని వ్యవహార శైలైన!
ప్రగతి కాటంకమై!పట్టు సడలు!
ఊపు తాపుల కోర్చి యున్నంత శక్తితో!
ప్రజల యేపును గూర్చి వరలు వారు!
పెద్దలు శుద్ధులు!బుద్ధిమంతులు వారు!
అట్టి వారల తెల్వి యవసరంబు!
తే,గీ;-ప్రజ్ఞ పరిపూర్ణ వృద్ధుని పాలనమిది!
ప్రగతి దీర్చెడి భద్రుడు!పట్టు విడక!
దీక్ష యందున మేటిగా!దీప్తి నొందె!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
29.సీ:-కార్య వాదీయన!ఖడ్గ వాదియు గాడు!
జగతి పెంపును గోరు చతురుడితడు!
అప్పును దీర్చుచు ధన మొప్ప నూహించి!
మెల్ల మెల్లగ నూహ మేలు గూర్ప!
పట్టు విడని దీక్ష! పరిపక్వ జ్ఞానంబు
ప్రజ్ఞా ప్రకాశంబు భరతి మెచ్చ!
తపన రేయి బవళ్ళు!ధర్మార్ధ కామాల!
మోక్ష మొందెడు తీరు!దీక్ష బూని!
తే,గీ:-ఒప్పు టడుగుల మననల నొప్పి ఛనుట!
భవిత బంగరు బాట!వరలు నిజము!
జనులు దీవింతు రీతని మనుగడకును!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
30.సీ:-పొంగిపో డీతండు!పొగడంగ నేనాడు!
కృంగి పోడు పదవి గీడ్పడంగ!
శ్రమిక జీవీ తడు! శ్రమయె శక్తి యనుచు!
శ్రద్ధ భక్తుల నంటి సాగు చుండు!
గొప్పకు జనబోడు!తప్పడు నీతిని!
జన ప్రగతిని గోరు!సదమ లుండు!
పాప భీతియు గల!భాగ్య జీవీ తండు!
సుఖ శాంతు లాశించు సూరి యితడు!
తే,గీ:-అక్కజంబైన భవితకే!యాశ జూపు!
చాక చక్యత చిక్కుల చక్క బరచు!
తెలుగు వెల్గును నింపెడి!ధీ యశుండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
31.సీ:-జగదభి రామంబు!జగతికే శ్రేయంబు!
శ్రేయంబు సర్వార్ధ జీవ ప్రగతి!
ప్రగతి సుగతి మూల ప్రత్యక్ష దైవంబు
దైవంబు నరజన్మ ధన్య తేర్చు!
ధన్యతేర్చు సురభి!ధర్మార్ధముల నింపు!
నింపు ధర్మం బదే!నిశ్చలంబు!
నిశ్చలం బది రక్ష! నేర్పు నిల్పును ఖ్యాతి!
ఖ్యాతి నాకాక్షించు గౌర వమదె!
తే,గీ:-చావు పుట్టుక లొందెడి జన్మ లందు
ఉత్తమం బైన జన్మొంది!బొత్తి గాను!
పనికి మాలిన వైషమ్య భావ మేల?
జనుల బ్రతుకులు దీర్చుమా!సంగ మేశ!
32సీ:-ఊహాతి రిక్తమై!దేహార్ధ ! మగజాయె!
నుదుటి కంటి మంట!మెదడు చెరచె!
గళము వేడిని గంగ!కాస్తంత చల్లార్చ!
గళనాగ పడగది కలత గూర్చ!
గంగ పరవళుల కానంద మొందుచు!
నాట్య మాడుట గాంచి!నగజ సుతుడు!
ప్రేమ తగ్గె ననెడి ప్రేరణ!నారదు
వలన కల్గె నంచు!తలచు నటుల!
తే.గీ:-కాటి వాసము శివుడెంచె కరము దీక్ష!
బూది దాల్చి విభూతి తా!బొడమె!జగతి!
దేహ భ్రాంతిని తొలగించి దీప్తి నింప!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
33.సీ:-సుష్కాయ తావాచి దుష్కృతా లోక్యమై!
సంసార దోషాల సాగ జేయు!
నిష్కృతి లేదెంచ!నిర్వీర్య ధౌర్భాగ్య!
దుర్మదాంకుర మైన!చర్మ జగతి!
చర్మ ధారుల నీతి చాంచల్యమును బొంద!
తిరుపతి క్షవరమౌ!దేశ ప్రగతి!
భోగ లాలసులకు భాగ్యంబు గావొచ్చు?
సర్వ జనుల కది! చరమ గీతి!
తే,గీ:-పరుల పెంపును కోరని బ్రతుకు బ్రతుకె?
స్వార్ధ మన్నది దహియించు!సత్వ బుద్ధి!
సత్వ మందున సత్యంబు సంతరించె!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
34.సీ:-నడయాడు దేవుళ్ళు!నరులుగా మదినెంచి!
పూజారి వీవైన పూజ్యుడౌదు!
అహమును విడనాడి!యిహము మిధ్య యనుచు!
కొనియాడ నల్వురు మనుట శుభము!
పుట్టున దొక రోజు!పోవున దొక రో!జు!
పోవు టాప గలవె!బుద్ధి నెంచ!
మంచి యొక్కటె నిల్చు!మాయ నిల్వ దెపుడు!
గణన వెంటను రాదు!కనవదేమి?
తే,గీ:-నిశ్పలంబైన కీర్తియే!నిల్చు గాని!
పల్చ నవబోకు జగమున పాడు తలపు!
మలిన రాహిత్య మన సెంతొ!మంచి నింపు!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
35.సీ;-బుద్బుద జీవంబు పోవు నేసమయమో?
కనలేని జన్మంబుకాదె మనది?
నిత్య మేదియొ?నెంచు!సత్యంబు పాటించు!
ధర్మంబు మది నిల్పి!దనరు మయ్య!
భూత దయయు కల్గి!జాతి ఖ్యాతిని పెంచు!
ఖ్యాతి నిండిన జాతి!కలుము లలరు!
ఆటు పోటుల కోర్చు యలల సంద్రము కమ్ము!
రత్న గర్భవు కమ్ము రాజి వౌచు!
తే,గీ;-సురలు నడచిన భూమిది!విరుల పంట!
పాడి పంటల నెలవైన భాగ్య సేమ!
జన్మ జన్మల పుణ్యంబు!జన్మ మిచట!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
36.సీ;-బాధించు మత్కుణ పరివార మడపంగ
శయ్యనే గాల్చుట సరియునౌనె?
మతి భ్రమణమె గాక!మరియేమి గాదయా!
నల్లి మందున చంప!చెల్లి పోవు!
బ్రతుక నేరగ లేక!పైకెగయ తలప
నిపుణపాలనవల్ల విపుల మవదు!
కాసులాశ తగదు!కఠినజీవన తప్ప!
పరుల సోమ్ము దినుట పాప మౌను!
తే,గీ:-బుద్ధి సక్రమ మార్గాన నుద్ధరింప!
సద్దు మణుగును కలతలు కలుగ విలను!
బొత్తి దౌర్భాగ్య చింతన!మొత్తు ప్రగతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
37.సీ:-అటు చూడ నిటు చూడ!నెటు చూడ నేముంది!
సోది వాదనె గాక!శోధ వాదన లేదు!
లంచంబు లేనిచో?మంచంబు వేయరు!
కలి తత్వ మిది యంచు!కాన రేల?
చెంచాల రాయుళ్ళు!సింహాసనము లెక్క!
కంసారి రావలె!గావ జగము!
చెవిటివాని యెదుట!శంఖ మూదిన తీరు!
మనగోడు నాలించు మాన్యు లేరి?
.తే,గీ:- అన్ని రంగాల కలుషంబు!నావ హించె!
మంచి పుష్టత కలిగించు!మహిమ లేదు!
దీన రక్షక!దివి జేశ! దిక్కు నీవె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
38.సీ:-కలకల ధ్వానాల కదలాడు పక్షులు
సఖ్యతా భావంబు జనుల కెద్ది?
మితి మీరు భావాలు గతిమీరు కధనాలు
ప్రజ్ఞ చూపగ నెంచి!వలతు రెపుడు!
పెంపెంప నోపని ప్రియ వాదనముల!
చెలగి పోదురు భువి!వెలు గటంచు!
పరతంత్ర భావనం!పాలింప జూతురు!
ఇహ సుఖంబును తప్ప యెంచ రేది?
తే.గీ:-దంచి కొట్టంగ జూతురు తంత్ర మిథ్య!
ధన ప్రభావపు తీరది!తనది కాదు!
మదన సంస్కార తేజమే!మహిని నిండె!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
39.సీ:-ప్రజల ధనపు జీవ భావనా సరళియు!
సేవ భావము నంటి వరలు చుండ!
పరభుక్త మయ్యును పాపంబు నయ్యును!
సేవ పేర ముసుగు!చింత గూర్చు!
తిన్నింటి వాసాలు!తీరెంచి లెక్కింప!
జీవముక్తి యగునె?జీవ తతికి!
నిత్యాన్న దాతల సత్య సంధుల నెల్ల!
మోస పుచ్చ దగదు దోష బుద్ధి!
తే,గీ:-సస్య శ్యామల జగతికి!సత్తు విచ్చి!
నీరు నారౌచు పెంపౌచు!నింపు గనుమ!
ప్రగతి సోఫాన పధకమై!సుగతి గనుమ!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
40.సీ;-విద్య లేని పశువు విశ్వాసమును జూపు!
పసరంబు మేయుచు పాలు నిడును!
విద్య యున్నను గాని!విశ్వాస శూన్యుడై!
లంచాలు తంత్రాలు!లక్ష్య మేల?
ముక్కోటె దేవతా!మూర్తిత్వ దక్ష యౌ!
గోమాత ధన్యత గొన రదేల?
కక్కుర్తి వేషాల కాలంబు గడుపుచో?
చిక్కు లందును ప్రగతి శీఘ్ర గతిని!
తే,గీ:-తేలు కుట్టిన దొంగలై దివుర తగదు!
భవిత మార్గంబు యోచించు!భద్ర మనసు!
కల్గి జగతికి మేల్జేయ కదలి రండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
41.సీ:-మనసు విప్పి పలుకు!మాటలు కొదువాయె!
వినియు ఛాందస మంచు విడువ దగదు!
కనులార పరికించి!కనుగొన్న!సత్యాలు
ప్రజ లార్తి నాదాలు!వాదు లరసి!
లోలోన కుమిలెడి!లోకుల వెత లార్ప!
సామ్య వాదముగోరి సాహ సించి!
ప్రజల వాదన దెల్పు!సృజల స్రవంతి
పారింతు ప్రజ మేలు!వర్ధిలంగ!
తే,గీ:-మంచి మనసున మాన్యులు!మనన లలర!
కంచి కేగెడు కధ కాదు!కనుడి నిజము!
భావి జీవాలు సుఖమయ!బాట నడుప!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
42.సీ:-దుర్మార్గ వర్తన దురిత చింతన గల్గి!
పరహాని మది నెంచి పరగు వారు!
కర్మ దుష్కృతమది!కాలుని దరి జేర్చు!
కలి ప్రభావమిదియ!కనుచు మనుడి!
ధర్మ మన్ని యుగాల!దనరారు నొకరీతి!
మార్ప శక్యము గాదు!మనుజ తతికి!
పాలక హస్తాల బంధింప బడె నీతి!
అవినీతి న్యాయాన్ని యణగ ద్రొక్కె!
తే,గీ:-నీతి దోవతి గాలిలో నెగిరి పోయె!
జాతి కల్మష చిత్తాన జంగు పట్టె!
మాయ మర్మాన బంధియై మడ్డు పట్టె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
43.సీ;-అవసాన కాలమం దాలు బిడ్డలు రారు
సాగెద వొంటరై!జగతి వీడి!
నిర్జీవ శవమునై!నెండు కట్టెల మధ్య!
దహియింప మంటల!తనువు మాయు!
బూదియౌ కాయంబు పొందె దేది? తుదకు !
మిథ్య జీవన మిది మేలు కొమ్ము!
జీవాత్మ పరమాత్ము!జేరెడు మార్గంబు!
బ్రతుకు రోజుల యందు వెతుక వలయు!
తే,గీ:-భూమి యందున జనియించు!పుణ్య మూర్తి!
పాప కూపాన పడబోకు పాడు తలపు!
మంచి మించెంచి సర్వదా!మసల వలెను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
44.సీ:-చావు కేకల మధ్య సంగీత నినదాలు!
చేతనా శూన్యుల చేతనములు!
గంగ భంగుల తీరు కదలాడు!జగ మిది!
మాయ సుడుల జిక్కి మాయు జూవె!
స్వ పరార్ధతను సాగు సంసార మిద్దిరా!
కర్మ కల్మష చిత్త మర్మ మమరె!
ధర్మ పశ్యత లేని!ధర్మ దేవత తీర్పు!
వినుకలి మాయచే!వెతలు నొందె!
తే,గీ:-మాయ సర్వత్ర వ్యాపించి మహిమ చెరచె!
సచ్చి దానంద మందించు సమయ మిదియె!
మార్పు రావలె!నన్నిట!మనుజు లందు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
45.సీ:-భూ బకాసురు లౌచు!భూములు తెగ మ్రింగి
ఖండాంతరంబుల కలిమి పెంచ!
నిస్వార్ధ సేవంచు విశ్వాసమును పెంచి!
నిశ్వన ద్వానాల నీతి నింపి!
విరి పించి కరిపించి వెస భోగముల దేలి!
ఘాతుక చర్యల ఘనత నింప!
మంచిని తెగటార్చి!మాయ మాటలు జెప్పి!
ధర్మ దేవత గొంతు!తగను నొక్కి!
తే,గీ:-ఇచ్ఛ వచ్చిన తీరున యేలు నట్టి!
దురిత నాయకు లెడ మేర్చి!దొర కొనెండు!
నీతి నేతల నంపిన నేలు కొరకు!
జనులుబ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
46.,సీ:-రాజరికము గాదు!ప్రజల రాజ్యం బిది !
ప్రజలె దేవుళ్ళను భావ మమర!
సేవకా భావాన శివ మెత్తుటను మాని!
నాయకు లలరార !నాగరికము!
పైశాచి కత్వంబు పాలక!దోషమౌ!
ప్రజ పెంపు నింపెంచి పరగ!శుభము!
కలి మాయ పడరాదు!ఘన కీర్తి గడియించు!
తపనయే!కావలె!ధాత్రి నేల!
తే,గీ:-సర్వ సంపత్క రంబగు!సత్య నిష్ట!
నిరుప మంబగు!స్వచ్ఛత!నిండు మనసు!
ప్రగతి మేలుకు నూహించు!ప్రజ్ఞ నలరు!
జనుల బ్రతుకుల తీర్చుమా!సంగ మేశ!
47.సీ:-రాజ్యమే భోజ్యమా!రసరమ్య ద్వీపమా!
ప్రజ మేలు కోరని!ప్రభుడు ప్రభుడె!
భోగాల రాగమా!రాగాల రమ్యమా!
జన రక్ష లేనట్టి !జగతి జగతె!
సత్యంబు లేనట్టి! నిత్యంబు నిత్యమా!
పరబాగు కోరని!బ్రతుకు!బ్రతుకె!
పరహింస తలపోయ!పాపము పాపమె!
భ్రమితార్ధ భావాలు!పాడు పాడు!
తే,గీ:-నీతి నెడ మేర్చి సాగెడు!జాతి జాతె?
మంచి నూహింప నేరని మనిషి మనిషె!
సమత భావన లేని !స్వామి స్వామె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
48.సీ:-మానవతా విల్వ మది నెంచ నోపక!
దూరుట దోషము దురిత మబ్బు!
వాగ్దోష భూషలు వ్యవహార శైలైన!
చావజంపుదు రిల సమయ మెంచి!
నీ గొప్ప నీదౌచు నిండు గూర్పగ వచ్చు!
పర గొప్ప దిగు వేర్చ పండ్లు రాలు!
ధన గర్వ ముందని దర్పంబు పాటింప!
దంచి కొట్టుదు రిల! మంచ మెక్క!
తే,గీ:-చీడ పురుగుగ జీవింప !సిగ్గు గాదె!
నోటి సుచి యది లేకున్న చీటి చిరుగు!
కోట పేటలు దుష్టత!కొంప ముంచు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
49.సీ:-మాటాడు మాటల మంచితన మలర!
సాటి వారల యందు చతురు డౌదు!
నడవడి సరియైన నల్వురు మెత్తురు!
ద్వేషాన చరియింప దరియ రెవరు!
పరిపరి మోసంబు ప్రజ మెచ్చ రెన్నడు!
ప్రాభవం బది తగ్గు!ప్రభలు మాయు!
మాయ మాటలు బల్క మహి యైన మెచ్చదు!
చులకనై!సంఘాన సోల గలవు!
తే,గీ:-జ్ఞాని వీవయ్య నజ్ఞాన జాత రేల?
మాట నిలకడ గలయట్టి మనిషి వగుమ!
నీచ భావన జనులందు!పీచ మడచు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
50.సీ:-గుడిని లింగంబును!కుడువ జూచుట తప్పు!
మోసాలు మితిమీర!మోద బడెదు!
ముష్కర తత్వంబు!సుష్క ప్రయాసంబు!
రాబందు మరణంబు రా గలంగు!
మొండి మూర్ఖత్వంబు!మోజును దిగ జార్చు!
జారిన మోజది!జయము నీదు!
ఏదేశ మేగిన!సాధించు నది సున్న!
భవిత మేలును గోర!బాగు కనెదు!
తే.గీ:-తత్వ జ్ఞానత గావలె!తరియుటకును!
జీవ శైలిని మార్చిన శ్రీ వరించు!
పరుల హింసించి పొందకు పాప మవని!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
51.సీ;-సహ జన్ములతొ పొత్తు!సహకార భావంబు
జన్మ నిచ్చిన తల్లి!జాలి కరుణ!
సాటి వారల ప్రేమ సౌజన్య శీలంబు!
జాతి జాగృతి నెంచ!జయము మనదె!
ధనమిచ్చి పొందెడు!ధర పాల నంబది!
నిలువదు చాన్నాళ్ళు!నిశ్చయ మిది!
చపల చిత్తము లవి!విఫలమౌ!పాలనన్!
ఏపుగోర!ప్రజల ప్రాపు గనెదు!
తే,గీ:-చలన భావాన్విత!జగతి!చంచ లంబు!
పరుల నాడిని గమనించి!వరల వలెను!
చెడుగు మనముల!బడరాదు!విడును ఖ్యాతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
52.సీ:-సృష్టి మూలము గన్న నిష్ణాతుడవు గావు!
జనన మరణము లెంచు జ్ఞాని గావు!
భవిత నూహించెడి!ప్రతి భేది?నీయందు!
కాల జ్ఞానివి గావు శూలి గావు!
ధర్మాన్ని కొనలేవు!కర్మను విడ లేవు!
మాయకే మాయవై మసల లేవు!
నిత్య సత్యుల చెంత నిమిష ముండగ లేవు!
చేయు దోషాలకు!శిక్ష బడును!
తే,గీ;-వేష భూషలు నిత్యమా!విశ్వ మందు!
సత్య.నిష్టను పాటించు జయము నీదె!
పంచ భూతాలు పాపాలు పార ద్రోలు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
3.సీ:-కల్ల లేల జగతి యెల్లలు మారును!
దౌర్జన్యముల భీతి ధరను యలము!
ప్రాణ ఘాతుకు లిల పరుగెత్తి వధియింప
జనరక్ష గనరాదు!మనుట కల్ల!
నీతి వీడి జగము నివ్వెర పడు నెంతొ?
కాల యములు స్వేచ్ఛ!కదలుదు రిల!
యంత్రాంగ మంతయు మంత్ర బద్ధ మగును!
రక్షణ కరువౌచు రాలు జనము!
తే.గీ:-మాట నిలకడ కనదెందు!మాయ గప్పి!
చేటు కాలాన చెడు చేష్ట!చెప్ప వశమె!
మనసు మంచిని శివుడీయ!మహి సుఖించు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
54.సీ:-కన్గవ మూసియు!కనలేదు నన్నంచు!
పాలు గ్రోలెడు పిల్లి!వాళక మయె!
చేయు తప్పుల నెల్ల!చేయు చుందురు లెక్క!
లెక్క పూర్తియు కాగ!చిక్కు లలము!
ఐదేండ్ల పాలనే!ఐశ్వర్యమును నింప!
బీద వా డెట్టుల?పెంపు నొందు!
అవినీతి నీతిగా!నవతరించు కలిని!
ఎండమావి జలము!యిలను నిజము!
తే,గీ;-నేతి బీరలొ!నేయట్టు!నీతి యెసగె!
పదవి కాంక్షయెమూలంబు!ప్రభుల కిలను!
మనదు సొమ్మును మనకిచ్చి మాయ మహిమ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
55.సీ:-పట్టు పుట్టంబుల ప్రాభవోపేతమై
నిధులు నిక్షేపాల నిండు తల్లి!
వేద భూమియు నౌచు విద్వద్వరేణ్యమై!
విశ్వ ఖ్యాతిని గన్న విమల మాత!
కర్మ భూమియు నౌచు!గౌరవప్రదమౌచు!
కాల జ్ఞానుల గన్న కన్న తల్లి!
మాతల మాతయై!మనపాలి దైవమై!
దనరు భరత మాత!మనది కాగ!
తే,గీ:-కన్న తల్లిని వేదించి!కలిమి దోచి!
వెతల కుమలంగ జేయుట!నుతము గాదు!
మాతృ ద్రోహుల నేమార్చి!మనగ శుభము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
56.సీ:-దురితాల నెలవైన!దొర లేలికను జిక్కి!
దిక్కు తోచని తల్లికి!దిగులు బాపి!
పోరి తరిమి పంపి!పూజ్యత నిల్పిన
మన జాతి ఖ్యాతిని మరువ తగదు!
తొలి స్వేచ్ఛ రోజుల!విలువైన పాలన!
ప్రగతి సుగతి గాంచె!ప్రాభవమున!
సోద రాదర భావ!సద్గుణ సంపత్తి!
మానవత్వమపుడు!మహి వెలింగె!
తే,గీ:-స్వార్ధ పాలకు లేలంగ జట్టు కట్టి!
పోటి పడు చుండి రీనాడు!పాడు గోరి!
తల్లి భవితంబు నూహించు!తరుణ మొచ్చె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
57.సీ:-విభజించి పాలించు!విశ్వాస మది యబ్బె!
పరుల సంస్కృతి!వంట బట్టె నేడు!
పట్టి దండించెడు ప్రాభవం బలరారె!
పీడించు ధోరణి వీడ దాయె!
విపరీత తెల్వి తా!నపహాస్య!స్వేచ్ఛాయె!
గెలుపు టాశయె!తప్ప!వలపు గాదు!
దోచి దాచెడు నీతి!శూచిగా నెలకొనె!
అవినీతి నీతిగా!శివత గాంచె!
తే,గీ;-పంచి పన్నుల సొమ్మును పాలకు లయి!
వంచనంబున!తమ సొత్తు!పంచునటుల!
నమ్మికను గల్గ జేయుచు!నటకు లైరి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
58.సీ:-పంచి పాలించెడు!పద్ధతి సరి గాదు!
వ్యాపార నిక్షి ప్త!భావ మగును!
సేవ జేసెడు వారు!జీవన సరళికి!
పెంపెంచు భావంబు!పెన గొనంగ!
నిస్వార్ధ బుద్ధితో!నిండు మనసు గల్గి!
నావారు జనులంచు!నడవ వలెమ!
మానవ సేవయే!మాధవు! సేవగా!
మది నెంచి పాలింప!మాన్య తలరు!
తే,గీ:-భావ సౌరభ్య. భావంబు!ప్రగతి మెట్టు!
పట్టి పీడింప సరివారి!పాప మగును!
వెంట రానట్టి సిరి నెట్టి!వినుతి గనుమ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
59.సీ:-మెదడుకు పని లేదు!సుదతి నూహింపంగ!
మొద్దు బారిన మోడు శుద్ధ మౌనె?
కద్దు లేదను చింత!కాస్తంత నూహింప!
బీదంచు పధకాలు మోదమిడగ!
బ్రతుకు తెరవు'ఓటు' ప్రజలపాలింపుకే!
మాయ లోన బడకు!మానవుండ!
నిస్వార్ధ సేవది !నెండమావియె సుమ్మ!
జాతి మాపెడు తీరన!జాలు నయ్య!
తే,గీ:-పైకి పాలు లోన విషము!పాటు సున్న!
నేటి లోకపు తీరది!వేటు గోరు!
ఆంత రంగిక మెరుగంగ!అమ్మ తరమె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
60.సీ:-మోసవూరితమైన!నీతితా!నిండగు!
నేలిక పేరాశ !నేర్పు గాదె?
పైకి మేలు నటన!భావంబు వేరొండు!
వాని మర్మ మెరుగ హరుని తరమె?
మోస భూషలిలను!దోషభూ యిష్టాలు!
మాయ మోహాన్విత! మంత్రి తాలు!
వెను ముందు నూహించి!కనుమయ్య నిజమును!
పప్పులో నడుగిడ!భవిత పాడు!
తే,గీ:-కాల నాగుల కాటేయ!కాచు కొనియె!
చూచి తప్పించు కొనుమయ్య!శుద్ధ బుద్ధి!
విషము గ్రక్కు నరుల విస్మరించు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
61.సీ:-మాయయే!యుక్తంబు!మాయయే!భుక్తంబు!
మాయయే!ధర్మంబు!మాయ జగము!
మాయయే!ధీరంబు!మాయయే!బీరంబు!
మాయయే!నిత్యంబు!మాయ యింతె!
మాయయే!క్రోధంబు!మాయయే!లోభంబు!
మాయయే!మోహంబు!మాయ జీవ!
మాయయే!మాత్సర్య మంత్రాన్వితంబునై! .
మాయ జేయు జగము!మాయ మయము!
తే,గీ:-మాయ కావల దైవంబు మసలు చుండు!
అట్టి మాయను ఛేదించి పట్టి నీతి!
నీతి ధర్మాల వెలయుమా!నిరత మీవు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
62.సీ:-కమికె డన్నము లేని!కడు బీద కేదయా?
ఆహార పధకంబు యవని యందు!
ఇల్లు లేదనువాడు!యిహమున వెరగొంద!
ధనమున్న బీదకు! దక్కు గాదె!
కుల మతము లిలను!కుంపట్ల కుమలంగ!
పధకాలు చేరునే!ప్రక్క కులము!
సౌజన్య శూన్యతం!స్వార్ధంబు మిన్నంటె!
ధన తృష్ణ! తీరదే?ధరణి యందు!
తే.గీ:-సుంత శాంతత జేకూర్చు సూరి వీవు!
పాప కర్ముల పరిమార్చి!భరత మాత!
ప్రాభవంబును పెంచంగ!వడిగ కదిలి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
63.సి:-దేశాభి వృద్ధికై!దివ మహంబులు నెంచు!
మంచి పాలకులకు!మచ్చ దెచ్చు!
దేశ ద్రోహులు గల! దేశ మియ్యది సుమ్మ!
అప్ర మత్తము నొందు!నహ రహములు!
మెత్తదనము జూప!మొత్తంగ జూతురు!
విజ్ఞత దురితుల వెడల గొట్టు!
ప్రగతి సుగతి గను!ప్రభవం బలరార!
చెడువీడి!మంచితా!చివరి కలము!
తే,గీ;-దోష భావాలు పోనాడి!దురిత తతిని!
రూపు మాపిన జగమెల్ల రూఢి నిల్చు!
మరల దాస్యంపు టూహలు!మట్టి గరుపు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
64.సీ:-రక రక వికటిత మూక లేలిక లందు!
జీవనా సౌచ్యము!చెడును కొంత!
తల్లి భారతి హృది!తత్తర బిత్తరై
చేతు లెత్తెను బాగు చేయ లేక!
చిత్తజాహితుడెపో!శిక్షించి ద్రోహుల!
జగతి రక్షను సేయ!ప్రగతి!మెరుగు!
స్వార్ధ చింతన తగ్గి!సత్యంబు నెలకొను!
సస్య శ్యామలమౌచు!జగము వెలుగు!
తే,గీ:-భూత తతిమెచ్చి!సర్వదా!భూతినింపి!
పరుల మేలెంచు!భావంబు!పరగ జేయు!
తత్వ జ్ఞానంబు గల్పించి!దయను బ్రోవ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
65.సీ:-ఎంత జీర్ణ క్రియయొ?యెకి మీడుల కిలను!
ధన జీర్ణ కోశంబు!గనదు నిండు!
పండంటి లోకాన్ని!యెండ మావని పింప!
ద్రవ నామ ద్రవ్యము!తాము నొంది!
భవి శూన్య మును జేసి!ప్ర జ్ఞగా ముద్రించి!
చెల్లి చెల్లని రీతి!చెలగాట!మేలనొ?
కరి మ్రింగిన వెలగ కాయ తీరాయెనె
విచ్ఛిత్తి ప్రజ సొత్తు!వెతుక బడక!
తే,గీ:-రాజ ;కీయపు పంచాంగ శ్రవణ మింతె!
గురు బలంబది చాలు!గుణము కాదు!
రామ,రావణు లేలిక!రసను వెలిగె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
66.,సీ;-పని జేయు నొక్కండు!పాడు గోఠు నొకడు!
పాడునే బాగంచు పలుకు నొకడు!
జనుల వెఱ్ఱిగ నెంచి చరియించు!నొక్కండు!
తప్పు నొడ్లకు నెట్టి!ధన్య డౌచు!
చర్వి తానృతముల!చతురత వెలి బుచ్చి!
ప్రజల మంచి గనెడు!ప్రభులు గలరు!
భగవంతు నైనను!భగ్నంబు గావించి!
విచ్ఛిత్తి భావాల!తుచ్ఛ మేర్చ!
తే,గీ:- పుచ్చు పగలగొట్టంగను!పొరలు మాయు!
తప్పు జేసిన పేదకే!దండ నంబు!
డబ్బు మైకము ధర్మాన్ని!పట్టి నులుము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
67.సీ:-గెలుపుకు దళితులు గావలె ఱేలకు!
అణగ ద్రొక్కు టదె!ఆత్మ హాని!
చీదరింతురు ప్రజ!చేరనీరు దరికి!
తరిమి కొట్టుదురని దలప రేల?
ప్రజల దయను గెల్చి!ప్రజలనే!హింసింప!
రక్కస తత్వమౌ!రాలు తుదకు!
రాలుగాయి తనము!రాణింప దేనాడు!
పోయకాల బుద్ధి!పొంక మణచు!
తే.గీ;-ఇంట గెల్వగ నేరని!కుంటి బుద్ధి!
రచ్చ గెల్చుట!సాధ్యమా!రామ రామ!
కామ దహనుని కని గూడ!కనని నటన!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
68.సీ;-కుల ప్రాతి పదికయే!కొలమాన మాయెగా!
సర్వ సామ్య తెట్లు?సాధ్య పడును!
అక్షర కుక్షులే!ఆశ్చర్యమున దేల!
కుల పెంపు టాశలే!కొంప ముంచె!
కుల భ్రమితపు స్వేచ్ఛ!గురు తరంబౌ నొకో?
ఇతర కులముల స్వేచ్ఛ!చితికి పోవ!
విభజించి పాలించు!విభవంబు సరిగాదు!
సమతని మాట్లాడ సబబు గాదు!
తే,గీ;-ఇట్టి వేర్పాటు గుణములు!నెట్ట కున్న!
పట్టు సడలిన!భరతమ్మ!బాయు ప్రగతి!
డెబ్బదేడేండ్ల స్వేచ్ఛ!యే యబ్బ సొత్తు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
69.సీ:-వినవేమి?కనవేమి?వినుతి తా గనవేమి?
కనవేమి?తిలకంబు గొన వదేమి?
నయనాల వినయాలు!నాట్య కలాపాలు!
చోరుల ఘోరాలు!చూడ వేమి?
మానినీ హరణాలు!మానభంగా లెన్నొ?
భంజింప రావేమి?భయమ!నీకు!
నేరాలు ఘోరాలు!నిర్ణిద్ర కరణాలు!
వారింప రావేమి?భరత మాత!
తే,గీ:-ఏది యేమైన నాకేమి?బాద యంచు!
మిన్న కుండుట తగదమ్మ!మేలు కొమ్మ!
పాప జన్ముల పగబట్టి పాతి పెట్టి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
70.సీ:-నాటి కాటను దొర!పటుతర నిర్మిత!
కట్టడంబులు!నేటికి!పట్టు నిలిచె!
నేటి వారల తెల్వి!నేల వీడినసాము!
పాటుకీడు ఘనత!పాతె!జగతి!
నిస్వార్ధ సేవయే!నిరుపమం బానాడు!
స్వార్ధమే!గరళమై! !జట్టు గట్టె!
తీరు తెన్ను గనని!తీరాయె నీనాడు!
తేరుకొనుగ వశమె!తిరుమ లేశ!
తే,గీ:-పనులమాయను పరికింప!వలను పడదు!
భిన్న తత్వాల మనుజుల వెన్ను దన్ను!తఫ
ప్రగతి విచ్ఛిన్న భావాలు ప్రబలు చుండ!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
71.సీ:-కలుషిత వచనాలు!!గాయమేర్చ!మనసు!
భావ తర్కణ జేసి!పరు లెరుంగ!
చర్చించి తర్కించి!చక్కనౌ నోషధిన్!
నయము జేసిన సరి న్యాయమగును!
లోలోన కుమిలిన నీలోని వెతలవి!
తెలియ జేయక యున్న! దిగులె!మిగులు!!
చెడు నూహ లయ్యవి!చేటు లోకము కౌను!
ప్రగతి దుర్గతినెంచ!బడయ దపుడు!
తే,గీ:-నిజము నిలకడ నమరుచో?నీతి నిండు!
నీతి లేనట్టి జాతిగా!నిలుప దగదు!
జ్ఞాన సంపత్కర ధీ నిథి!మానవుండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
72.సీ:-గడి మీరి చరియింప!గండాలు వెన్నంటు!
ముండ్ల తుప్పల బడుట మూర్ఖ మౌను!
బ్రతికుండ తిండికై పలుపాట్లు పెట్టెడి!
జన మబ్బె నే నెటు?జనెద నంచు!
విలపించె తల్లిరా!తలపోయ రేమిరా?
యప్పుల యార్భాటమొప్పు తప్పు!
రేపటి గతియేమొ?మాపటి కిది చాలు
యని తృప్తి జేవింప!ఘనత గాదె!
తే,గీ;-తల్లి విలపింప లోలోన!తగునె? మనకు!
అమ్మ లేనట్టి జన్మంబు!యవని సున్న!
శూన్య ధృగ్జాల జ్వాలల క్షోభ లేల?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
73.సీ:-అర్క సంపర్కమౌ!తర్కంపు చింతన!
మండించి మసి జేయు మానవాళి!
దశ్చింతనము తప్పు!దురహంబు పెన్ముప్పు!
ముప్పు తిప్ప లవేల?చెప్పు మనకు!
మానవత్వము మాని ధనుజత్వ మేలరా?
కులము ఘోషలు రేపి కులక నేల?
మమ్మీలు ప్రజలంచు డిమ్మీలుగా నెంచి!
తమ్మిల్ల మొత్తగ తగదు మనకు!
తే,గీ:-తెలిసి తప్పులు జేయుచు తెలివరులన!
తుప్పు రేపుదు రేనాడొ?గొప్ప వీడ!
గొబ్బు కంపైన యూహల!గోల్పడి రిట!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
74.సీ:-కుల గజ్జి మొల గజ్జి!చిరు గజ్జి కాదురా!
జర్జరా నిర్ఝరీ ఘర్జితంబు!
ఆర్జనే తర్జన భర్జ నేర్చు తుదికి!
గర్గు డైనను రాడు!స్వర్గ మిడడు!
నిర్గమ మార్గంబు!నిస్తులం బేర్చును!
నెగ్గు సిగ్గు లవియె!సిగ్గు పడును!
తగ్గు డెగ్గుట సిగ్గు!బుగ్గియే!తుదకబ్బు!
అబ్బురంబును కాదు! యవని బ్రతుకు!
తే,గీ:-ఇట్టి విశ్చిత్తి నిశ్చిత్తి!యిహపు సొబగు!
మూడు నాళ్ళకు సరిపడు ముచ్చటేను!
తగ్గి జీవింప జీవంబు!ధన్య మౌను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
75.సీ:-పుట్టు సారమె గాని పెట్టు సారము గాదు!
తట్టి కొట్టిన గాని! తగదు పట్టు!
ఉట్టి కెగుర లేని మట్టి బ్రతుకు కిల!
నడి మంత్ర సిరి గల్గ! మిడిసి పడును!
నేర దండన లేని నీతి నీతియు గాదు!
జాతి ఖ్యాతి గనని జన్మ జన్మే?
అందాలు చందాలు యపు రూప నందాలు
చివరికి నిల్చునే?జీవ తతికి!
తే,గీ:-జీవ కర్మను మానిన జీవి జీవె?
పొంక మూనగ తగునొకో?బుద్ధి మంత!
బద్ధి నిద్ధాత్రి శుద్ధమౌ!సిద్ధి కాదె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
(సశేషం.)
No comments:
Post a Comment