Wednesday, December 31, 2025
Tuesday, December 16, 2025
(ఆ)కలి కాలము ... సంగమేశ్వర త్రిశతి. రచన :-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ,
(ఆ)కలి కాలము
షోడశోత్తర సంగమేశ త్రిశతి
1.సి:-శ్రీరాము డేలినసీమ భారతియందు
నత్యంబు ధర్మంబు సాగె నపుడు,
కాల గమనమందు కరువాయె నయ్యది
స్వార్ధ పూరిత చింత సంతరించె!
కుల మత జాఢ్యాలు కుతలంబు నిండెను,
పధకాలు పదవులకు బాట లేసె!
అప్పులు ప్రజకిచ్చి యాస్తులు తామొంది
ఏలికాళికె తగె!నెంచ రేలొ?
తే,గీ:-శ్రమ పడని ధనము తగునె?జనముల కిల!
మందమౌ భవితం చేల?మనసు గనరు!
భావి తరములు శూన్యులై భంగ పడరె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
2.సీ:-బోయ కులము పుట్టి భువి కీర్తి నిలుపంగ
భువనైక మోహిత భూతి యశుడు
వాల్మీకములు పట్టి వాల్మీకి ముని యౌచు
రామాయణము వ్రాసి రహిని మించి
రామ రాజ్యము మించు రాజ్యంబు లేదంచు
భూమి కీర్తిని నింపె పుణ్య మూర్తి
ఆర్తుల నెడమేర్చి కీర్తి నింపు డటంచు
లోక యుతుడు నాయె శ్లోక యశుడు!
తే,గీ:-ధర్మ సంరక్ష ణార్ధమై తత్పర మతి
కర్మ కర్తృత్వ సత్యాన గడగి కడకు
ముక్తి మార్గాన గమియించి,మోక్షమొంది
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
3.సీ;-మల్లేశ నీనామ మంత్రంబు పఠియించి
జగమది సరితీరు సాగ నెంచి
వంచిత జన్ముల సంచిత పాపాలు
పోనాడి పుణ్యతం పుడమి నెంచి
సర్వ చరా చర సంపన్న లోకాన
సత్య ధర్మంబులు నిత్య మెంచి
మమ్ము తీర్చగ రావె!మల్లేశ సర్వేశ!
నీయాన మీరని నిరత భక్తి!
తే,గీ:- సర్వ వేళల నీముందు సాగిల పడి
సేవ జేసిడు సేవకు సేవ మెచ్చి
కరుణ దీవించి భారతి కీర్తి పెంచి
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
4.సీ:-ఆనాటి కాగతి!ఈనాటి కీగతి
యేనాటి కే గతో?యెరుగ గలమె?
జనియింతు మేనాడొ?చనిపో దు మేనాడొ?
యే నాటి కేమౌనొ?నెరుగ వశమె!
రేపు నీదియు కాదు!నాపలేవు భవిత!
జీవంబు చరమంచు చింత లేక!
మతిలేని గతి లేని మాయ లోకంబున
మమకార మేటికి?మంచి నెంచు!
తే,గీ:- పుట్టు కెరుగను లే వెట్టొ?నట్లె సుమ్మి!
చావు యెప్పుడొ?తెలియని జ్ఞాన హీన!
మూడు నాళ్ళ ముచ్చట కేల?మోహ పడెదు!
జనుల బ్రతుకులు తీర్చమా!సంగ మేశ!
5.సే:-నిన్నంటి కదలాడు నీడ వీడని యట్లు
ధర్మ మంటిన నిన్ను ధరణి మెచ్చు!
మాయ నిన్నంటుచో?మాయ మేర్చును వేగ!
నీతి నిన్నంటుచొ?నిల్చు ఖ్యాతి!
గాతి నింపది ముప్పు!గౌరవంబుకు చిచ్చు!
మాసిన కీర్త ది మరల రాదు!
చెడు వీడి నడయాడ శివకరం బౌనిల!
కాని పోని తలపు మాన వలెను!
తే,గీ;-భవిత బంగరు బాటౌను బాగు పడెదు!
మంచి నెంచని జీవంబు మాయ దేలు!
తేలు కుట్టిన దొంగగా తిరుగ దగదు!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
6.సీ:-సాటి జీవ కరుణ మేటి యజ్ఞ ఫలంబు
జీవ హింసను విడి సేయు సేవ!
అన్న మెన్నని నోరు!దన్ను లేని బ్రతుకు!
సుష్క ప్రయాసంబు!నిష్కృతంబు
కర్తృత్వ మెరుగని కాఠిన్య జీవంబు
జీవ నాధారంబు చెరచి వైచు!
చపల చిత్తంబది సరి గాదు జీవికి!
కుపిత భావంబది కొంప ముంచు!
తే,గీ:-కంచె మేసెడి జీవిగా గడగ తగదు!
నిజము లేనట్టి మాయలు నిలువ విలను!
భజన లేకున్న మోక్షంబు బడయ తగునె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
7.సి;-శతకోటి ధృగ్జాల సామ్యతా భావాన
శత మాయు జీవుల జయము నెంచి
విడదీయ లేనట్టి విజ్ఞాన ఖను లౌచు
విశ్వాస పాత్రమై విశ్వ మేల
శాశ్వత కీర్తులు జగమంత వ్యాపింప
జన్మ సార్ధక మేర్ప సాగ నెంచి
షోడశోత్తర త్రిశ దాడ్య!సీసతతిని
నీతి నీమా కృతి! ప్రీతి నింప!
తే,గీ:-ప్రగతి మార్పుకు మెట్టౌచు పరగు తపన
ద్వేష మేకోశమున లేని విశ్వ వినుత
ఖ్యాతి నాశించి మాత్రమే కదలె రచన!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
సీ:-క్షంతవ్యుడను నేను!సమధృష్ఠి చింతన
జరుగు జగతి తీరు!జయము దనర!
మంచి మనసు తోడ!మంచి మార్పును గోరి
జయ జయ ధ్వానాలు జగము నిండ
తల్లి భారతి భవి!ధన్యత నలరార
సమత మమత లిల సరగ నిల్పి!
పాలనా దక్షత!పరిపూర్ణ తత్వంబు
పరిఢ విల్లెడు నాశ!వ్రాయు చుంటి!
తే,గీ:-దోష భూషలు గావివి!తొంటి యట్ల!
చెడును పోజేసి!మంచిని శ్రీలు నమర!
సర్వ సామ్యంబు నెలకొల్ప సద్యశాన
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
9.సీ:-మాయ మోహిత జగమాయె!మంచి గనక!
కనిన మంచికి మాయ కమ్ము చుండె!
మనుజ చైదము కాదు!మాయ ప్రభావంబె!
మాయ సత్యము చెంత మసల లేదు!
మంచి భావము తోడ మంచినే!కాంక్షించి!
మంచివై జగతిని మసల వలయు!
జనులు మెత్తురు!పరమ సౌఖ్య మలరు!
కీర్తి గనెద విల!కీర్తి మంత!
తే,గీ;-మసలు తీరును గమనించి మనుజు లెల్ల
భవ్య ముర్తిగ సర్వదా!ప్రణుతు లిడగ!
భద్ర కర్ణుండు గణపయ్య!భవము బాపు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
10.సి:-అహముతో నిహమంత!మాశాంత మాసింప!
ఇహ పరంబులు చెడు!హింస మిగులు!
ధన ధృష్టి జన సేవ!దాక్షిణ్య మొందునే?
కలనైన సత్యంబు కనక యున్న!
విభజించి పాలించు విజ్ఞత!నిల్చునే?
భద్రత చెడదీసి భంగ పరచు!
కంచు లోహంబది!కనకంబు విలు వౌనె?
కనక సాదృశ కీర్తి గణ్య తలరు!
తే,గీ:-నీతి నేతకు జేజేలు!నిండు పుడమి!
చేత విష తుల్య భావంబు!చెరచి తీరు!
మంచి నెంచెడు మార్గంబు!మహికి మేలు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
11.సీ:-నిజములు పలుకంగ!నిష్టుర మై యొప్పు!
మనుజ సంతతి తీర్చ మంచి వలయు!
పని యందు దోషంబు!పరికించి వెలి జేయ!
మార్పు సాధన కది!మాన్య మౌను!
జన మంచి జగమంచి!జయదమం బేపార!
సశ్య శ్యామల మౌచు సాగు ప్రగతి!
తప్పు దొర్లిన యంత!తల్ల డిల్ల తగదు!
ఒప్పుగా మలచెడి నోర్మి వలయు!
తే,గీ:-తప్పు లందలి లోగుట్టువిప్పి జూచి
మనసు సరిబడ్డ భావనం గనుట నిజము!
నిజము నిజమైన గుండియల్!నీతి నిండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
12.సీ:-రస విష గంధక!రంగేళి జీవంబు!
రేపు మనది కాదు!చేపు నీతి!
నీతి నిలకడ యే!జాతిని కాపాడు!
జాతి లేకున్నను జగము లేదు!
జగము నిగమార్ధ సంస్తుత్య!పాత్రమై
మనుగడ చేకూర్చు మహిత శక్తి!
శక్తియే!ముక్తికి సాధనం బనుమాట!
సత్యంబు నిత్యంబు సమ్మతంబు!
తే,గీ:-ముందు చూపున మేలెంచి మోద మొందు!
పరుల హింసింప పాపంబు పట్టి కుడుపు!
పగకు తావీయ దలచిన పట్టు సడలు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
3.సి:-నేరంబునకు శిక్ష!నీరంబు నకు రక్ష!
మానంబు పరి రక్ష!మహిమ గాదె?
దానంబునకు నీవి!ధర్మంబునకు నీతి!
జ్ఞానంబునకు ప్రజ్ఞ!జాతి వెలుగు!
భుక్తంబునకు తృప్తి!పూజ్యంబు నెడ రక్తి!
రాజ్యంబునకు ముక్తి!రాగ మయము!
సేధ్యంబునకు వాన!శోధ్యంబు నకు మేథ!
బీజంబునకు శక్తి!ప్రియ తమంబు!
తే,గీ:-ఆంత రంగిక శక్తికి యంతులేదు
మేర లేదిల!యూహకు! మీర గలవె?
కాలచక్రపు భ్రమకంబు!కట్ట బదునె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
14.సీ:-చీకటి నడిరేయి!సిద్ధించె స్వేచ్ఛని
చింతింప పని లేదు!శివము సుండి!
నక్తం చరుల దోష నాట్యంబు పోయెలే!
గ్రహణ పీడయు వీడె!కనవదేల?
చిక్కిన స్వేచ్ఛకు చిన్మయత్వము గూర్ప!
సోదర సాదర శుద్ధ తేర్చి!
అప్పు చేయుట మాని!అమ్మ పరువు పెంచి!
ఘనత చాటగ వలె!కలుము లలమ!
తే,గీ:-లేదు సఖ్యత మనలోన!చేదు నిజము!
నిజము గ్రహియించి సర్వదా నీతి పెంచి
దేశ భక్తిని కలిగించి దీప్తి నింపు!!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
5.సీ:-ఇద్దరి భార్యల యిరకాట మొక వైపు!
కంఠ గరళ బాధ!కన్ను మంట!
తిరిపె మాధారమై!తిరుగాడు వసనాల!
మేన భూదిని దాల్చి!మేలు నిడుచు
సిరి లేని శివు డయ్యు!సిరులిచ్చు నొక వైపు!
పరిమార్చు పాపుల భవ హరుండు!
పంచాక్షరీ మంత్ర ప్రాభవం బలరార!
పిలువగా రక్షించు!ప్రియ తముండు!
తే,గీ;-శివుని నామంబె!శాంతంబు జీవ రక్ష!
ముక్తి సోఫాన పధకంబు!మోహనంబు!
కర్మ కర్తృత్వ కారక కరణు డతడు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
16.సీ:-తొలి నాటి పాలకుల్!దురిత దూరులు నౌచు
సత్యమే నిత్యమై సరగి రెంతొ!
మథుపాన రాజ్యంబు మాట లే!దానాడు!
జగతి పెంపును గోరి సాగి రపుడు!
కట్టడాలకు మొగ్గు!దిట్ట తనపు నిగ్గు
చరిత నిల్చిరి వారు శాశ్వతముగ!
కళలు పోషించిరి!కావ్యాలు గూర్చిరి!
భువన విజయులైరి భోజు లైరి!
తే,గీ:-మత్తు పానీయములు నేడు మహిమ యేలె!
చిత్త జాహితు దూరులై చెలగి రిపుడు!
పొట్ట నింపుకు జేకొట్టి పుట్టె డాశ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
17.సి:-క్షుద్ర నీతి పెరిగె!భద్ర నీతి తొలిగె!
విపరీత భాష్యంబు వినుతి కెక్కె!
తంత్రాల కాలమై!యంత్రాంగ మలరారె!
భరత జాతి పరువు!కురచ నాయె!
నడిపించు కలి తప్పు!నాయక దోషమా!
కాదు కాదు జనము!కనుడు నిజము!
సంచిత జ్ఞానులు సర్వత్వ తపనచే!
సాగ నీయడు కలి సార మింతె!
తే,గీ:-పూర్వ వైభవ మేనాడు?పుంజు కొనునొ?
కలిని గెలువంగ దైవమే!కదలి రాగ!
సర్వ సామ్యత తంత్రంబు సాగు నిలను!!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
18.సీ:-వర సమాజపు శ్రేయ వర్ధిష్ణు బోధలు
భావి తరపు జీవ భాగ్యము నగు!
దోషాలు వెలి జేసి దోబూచు లాడక!
తేట తెల్లము జేయ దివురు సుఖము!
మంచి మార్పును కోరి!మంచికే తపి యించు!
మాన్య కావ్య పఠన!మార్పు గూర్చు!
మానవత్వము నిల్చు!మాయమౌ మాయయు!
మాయ లేని బ్రతుకు!మనకు మేలు!
తే.గీ:-అబ్బురంబుగ మనుజాతి!హాయి వెలయ!
సేయ వలె!కవు లెల్లరు!శ్రేయ బోధ!
వేద భాష్యాలు విందురే?వీర లిపుడు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
19.సీ:-వాదించి శోధించి!వాదెంచు నెపమెంచి
మించిన భక్తితో!కుంచితముల!
సంచిత భావంబు సాకల్య మొందగా!
సంసార శ్రేయంబె!శర్వ మగును!
లోకాప వాదంబు!శోకాప హారమై!
శ్లోకాను కూల్యమై సురలు మెచ్చ!
మన తల్లి ఘనతది!మారు మ్రోగ జగతి!
మార్చ సాయ పడుము!మంచి మనసు!
తే,గీ:-క్రమత సచ్ఛీల నాదృశ కరుణ లలమ
తేరు నడిపెడు సారధ్య!తీరు నెరిగి!
బలము పాలన చేయగా వలెను సుమ్మ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
20.సీ:-శ్రీలు సత్యపు తత్వ సింధూర తిలకమై
భారతాంబ గరిమ పరిఢ విల్ల!
సాకార భావంబు సద్యశ సంఘంబు!
తీర్చి దిద్దగ గోరి!శివము నెంచి!
భవ బంధ మోచన ప్రాళు బ్ధ కర్మాల
నధిగమించు తెరవు నాత్మ దలచి!
చేసెడి యీకృషి!జీవనోద్ధారియై!
ధాత్రి సుఖత నెంచి!మైత్రి నెంచి!
తే,గీ:-సంకుచిత భావ జాలము సద్దు మణగ!
ప్రగతి సుగతిని గాంచంగ పట్టు విడని!
దీక్ష ద్వేష రహిత బుద్ధి!దీప్తి గనగ!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
21.సి:-సరియైన బీదకు సాయంబు మేల్మేలు!
కుల మన తప్పగు తెలిసి మసలు!
ధనముండి బీదగా తగు సాయ మందిన!
దేశ ద్రోహము గాక దివ్య మగునె?
మనవాడెపో యని ధనమును వెదజల్ల!
పని చేయ నేరడు బద్ధ కుడయి!
అందరు నావారు యను భావ మున్నచో?
కలత లుండవు గదా!కనరదేమొ?
తే,గీ:-డబ్బు పంచి"ఓట్లు"కొనుట నబ్బురంబ!
పరగు వ్యాపార ధోరణి పాలన యగు!
భావి పౌరుల బ్రతుకులు బండలగును!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
22.సీ:-ఇచ్ఛ వచ్చిన రీతి!పెచ్చిమీరి భరతి
నాదిలే!యనుకొన్న బాధ పడెదు!
పది మంది నిన్నెన్ని పాలింప పంపిన!
రాజ భోగము కాదు!రాజు కావు!
ప్రజల సేవను జేయ!పంపించిరే!గాని
వారి భవిత పాడు కోరి కాదు!
సహకార బుద్ధితో!సానుకూల్యత నేల
భరత జాతి పరువు! ప్రగతి గనును!
తే,గీ:-పెంపు సర్వత్ర నిండగ!పేరు తెచ్చు!
భార మంతయు మోపిరి!సార ధీర!
ప్రజలు బిడ్డలుగా నెంచి!పదవి జేయు!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
23.సీ:-ఒక తల్లి బిడ్డలే! యొక రీతి నుండరు!
భావ భేదము నుండు!పనుల యందు!
జన మనోభావాలు చర్విత చర్వాలు!
ఒక్క రీతి గడగ నొక్కొ!కనగ!
తత్వ జ్ఞాన మరసి తగురీతి మంచికై!
పాటు పడిన చాలు పరము డౌదు!
స్వార్ధంబు నెడ మేర్చి!సద్గుణ గణ్యత!
జీవ నాడిగ నెంచి సాగ సుఖము!
తే,గీ:-కలిని నడయాడు దోషాల కనుల గాంచి!
సరిని జేసెడి తపనయే!పరమ తపన!
సూచనంబును జేసెదు శుద్ధ మరయ!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
24.సీ:-స్వార్ధ తత్వము గల జగమేలు వారల!
మొండి మూర్ఖత్వత!దండి నెంచి!
జనులాడు మాటలు!వినుచు వేసరి నాడ!
నామాట గాదిది నరుల మాట!
పరుషంబుగా నెంచి పగబూన తగ దయ్య!
ఆంతరంగిక భావ మరయ వలెను!
తప్పు సరియు జేసి!ధర్మ పాలన జేయ!
విజ్ఞాన ఖనులౌచు వెలయ గలరు!
తే,గీ:-భిన్న సంస్కార భారతి!వెన్న ముద్ద!
బాల గోపాలు రౌచిల!బాగు పెంచి!
కర్మ భూమిది!ధర్మాన!గమియ జేసి!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
25.సీ:-భిన్న ధర్మంబుల మన్నించు నైజంబు!
కుల కర్మ లందున చులక నాయె!
సమ సమాజము కాదు!సమము కానేరదు!
కుల ధర్మములు మార్చ కుటిల మౌను!
సర్వుల మేలెంచి!సాయంబు జేసిన!
సర్వేశ్వరుడు మెచ్చి సద్గతి నిడు!
గతి మాలిన పనులు!కాటకంబులు గూర్చు!
చెడు నంట మానుచో!శివుడు మెచ్చు!
తే,గీ:-భావి సుఖములు మది నెంచు!భాగ్య జీవి!
తెలివి ప్రకటించి ప్రజ్ఞతో వెలుగు నింపు!
పాలనంబున నిను మించు వాడు లేడు!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
26.సీ:-అక్కజంబుగ కీర్తి యవని తానొందంగ!
సమభావ మేపార సరగ వలెను!
నిక్కువంబుగ నీతి నియమాలు పాఠించి!
సత్కర్మ సాచర్య! సమత నెంచి!
మానవ సేవయే!మాథవు సేవంచు!
మది నెంచి కీర్తించి మహితు డౌమ!
నాది నాదనరాదు!నీది యేదియు కాదు!
సత్య వ్రతుడవు కమ్ము సత్వరంబు!
తే.గీ:-కర్మ సత్కృత మేర్చుచో?జయము నీదె!
జయ పతాకము నెత్తు!సద్గుణ ఖని!
గుణిజ గుణకాలు లెక్కించు గురుడు శివుడె!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
27.సీ:-సిగ్గు నెగ్గును లేక!శివ మెంచ నేరక!
బూది జేయ జగతి పూజ్య మౌనె?
తగునంచు నన్నిట!తగ్గుట లేదంచు!
నిగ్గు టద్దము నంచు నిగుడ తగునె!
అద్దంపు బింబంబు!నటులిటు లెరుగని
జ్ఞాన తిద్ధరణినే జయద మవగ!
సాగ రోర్మిలములు సద్దు మడిగి నంత!
స్నానంబు నెంచెడి!చతురు లుండ!
తే,గీ:-అట్టి తత్వజ్ఞు లెందరో!యవని నేల!
తట్టు కొను చున్న దెట్టులో?తల్లి భరతి!
నీతి నింపెస లారెడు!జాతి మనది!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
28.సీ;-:-ఆటు పోటుల కోర్చు!అనుభవజ్ఞుల ప్రజ్ఞ!
రాజకీయాలకు రక్తి గూర్చు!
అవగాహనము లేని వ్యవహార శైలైన!
ప్రగతి కాటంకమై!పట్టు సడలు!
ఊపు తాపుల కోర్చి యున్నంత శక్తితో!
ప్రజల యేపును గూర్చి వరలు వారు!
పెద్దలు శుద్ధులు!బుద్ధిమంతులు వారు!
అట్టి వారల తెల్వి యవసరంబు!
తే,గీ;-ప్రజ్ఞ పరిపూర్ణ వృద్ధుని పాలనమిది!
ప్రగతి దీర్చెడి భద్రుడు!పట్టు విడక!
దీక్ష యందున మేటిగా!దీప్తి నొందె!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
29.సీ:-కార్య వాదీయన!ఖడ్గ వాదియు గాడు!
జగతి పెంపును గోరు చతురుడితడు!
అప్పును దీర్చుచు ధన మొప్ప నూహించి!
మెల్ల మెల్లగ నూహ మేలు గూర్ప!
పట్టు విడని దీక్ష! పరిపక్వ జ్ఞానంబు
ప్రజ్ఞా ప్రకాశంబు భరతి మెచ్చ!
తపన రేయి బవళ్ళు!ధర్మార్ధ కామాల!
మోక్ష మొందెడు తీరు!దీక్ష బూని!
తే,గీ:-ఒప్పు టడుగుల మననల నొప్పి ఛనుట!
భవిత బంగరు బాట!వరలు నిజము!
జనులు దీవింతు రీతని మనుగడకును!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
30.సీ:-పొంగిపో డీతండు!పొగడంగ నేనాడు!
కృంగి పోడు పదవి గీడ్పడంగ!
శ్రమిక జీవీ తడు! శ్రమయె శక్తి యనుచు!
శ్రద్ధ భక్తుల నంటి సాగు చుండు!
గొప్పకు జనబోడు!తప్పడు నీతిని!
జన ప్రగతిని గోరు!సదమ లుండు!
పాప భీతియు గల!భాగ్య జీవీ తండు!
సుఖ శాంతు లాశించు సూరి యితడు!
తే,గీ:-అక్కజంబైన భవితకే!యాశ జూపు!
చాక చక్యత చిక్కుల చక్క బరచు!
తెలుగు వెల్గును నింపెడి!ధీ యశుండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
31.సీ:-జగదభి రామంబు!జగతికే శ్రేయంబు!
శ్రేయంబు సర్వార్ధ జీవ ప్రగతి!
ప్రగతి సుగతి మూల ప్రత్యక్ష దైవంబు
దైవంబు నరజన్మ ధన్య తేర్చు!
ధన్యతేర్చు సురభి!ధర్మార్ధముల నింపు!
నింపు ధర్మం బదే!నిశ్చలంబు!
నిశ్చలం బది రక్ష! నేర్పు నిల్పును ఖ్యాతి!
ఖ్యాతి నాకాక్షించు గౌర వమదె!
తే,గీ:-చావు పుట్టుక లొందెడి జన్మ లందు
ఉత్తమం బైన జన్మొంది!బొత్తి గాను!
పనికి మాలిన వైషమ్య భావ మేల?
జనుల బ్రతుకులు దీర్చుమా!సంగ మేశ!
32సీ:-ఊహాతి రిక్తమై!దేహార్ధ ! మగజాయె!
నుదుటి కంటి మంట!మెదడు చెరచె!
గళము వేడిని గంగ!కాస్తంత చల్లార్చ!
గళనాగ పడగది కలత గూర్చ!
గంగ పరవళుల కానంద మొందుచు!
నాట్య మాడుట గాంచి!నగజ సుతుడు!
ప్రేమ తగ్గె ననెడి ప్రేరణ!నారదు
వలన కల్గె నంచు!తలచు నటుల!
తే.గీ:-కాటి వాసము శివుడెంచె కరము దీక్ష!
బూది దాల్చి విభూతి తా!బొడమె!జగతి!
దేహ భ్రాంతిని తొలగించి దీప్తి నింప!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
33.సీ:-సుష్కాయ తావాచి దుష్కృతా లోక్యమై!
సంసార దోషాల సాగ జేయు!
నిష్కృతి లేదెంచ!నిర్వీర్య ధౌర్భాగ్య!
దుర్మదాంకుర మైన!చర్మ జగతి!
చర్మ ధారుల నీతి చాంచల్యమును బొంద!
తిరుపతి క్షవరమౌ!దేశ ప్రగతి!
భోగ లాలసులకు భాగ్యంబు గావొచ్చు?
సర్వ జనుల కది! చరమ గీతి!
తే,గీ:-పరుల పెంపును కోరని బ్రతుకు బ్రతుకె?
స్వార్ధ మన్నది దహియించు!సత్వ బుద్ధి!
సత్వ మందున సత్యంబు సంతరించె!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
34.సీ:-నడయాడు దేవుళ్ళు!నరులుగా మదినెంచి!
పూజారి వీవైన పూజ్యుడౌదు!
అహమును విడనాడి!యిహము మిధ్య యనుచు!
కొనియాడ నల్వురు మనుట శుభము!
పుట్టున దొక రోజు!పోవున దొక రో!జు!
పోవు టాప గలవె!బుద్ధి నెంచ!
మంచి యొక్కటె నిల్చు!మాయ నిల్వ దెపుడు!
గణన వెంటను రాదు!కనవదేమి?
తే,గీ:-నిశ్పలంబైన కీర్తియే!నిల్చు గాని!
పల్చ నవబోకు జగమున పాడు తలపు!
మలిన రాహిత్య మన సెంతొ!మంచి నింపు!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
35.సీ;-బుద్బుద జీవంబు పోవు నేసమయమో?
కనలేని జన్మంబుకాదె మనది?
నిత్య మేదియొ?నెంచు!సత్యంబు పాటించు!
ధర్మంబు మది నిల్పి!దనరు మయ్య!
భూత దయయు కల్గి!జాతి ఖ్యాతిని పెంచు!
ఖ్యాతి నిండిన జాతి!కలుము లలరు!
ఆటు పోటుల కోర్చు యలల సంద్రము కమ్ము!
రత్న గర్భవు కమ్ము రాజి వౌచు!
తే,గీ;-సురలు నడచిన భూమిది!విరుల పంట!
పాడి పంటల నెలవైన భాగ్య సేమ!
జన్మ జన్మల పుణ్యంబు!జన్మ మిచట!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
36.సీ;-బాధించు మత్కుణ పరివార మడపంగ
శయ్యనే గాల్చుట సరియునౌనె?
మతి భ్రమణమె గాక!మరియేమి గాదయా!
నల్లి మందున చంప!చెల్లి పోవు!
బ్రతుక నేరగ లేక!పైకెగయ తలప
నిపుణపాలనవల్ల విపుల మవదు!
కాసులాశ తగదు!కఠినజీవన తప్ప!
పరుల సోమ్ము దినుట పాప మౌను!
తే,గీ:-బుద్ధి సక్రమ మార్గాన నుద్ధరింప!
సద్దు మణుగును కలతలు కలుగ విలను!
బొత్తి దౌర్భాగ్య చింతన!మొత్తు ప్రగతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
37.సీ:-అటు చూడ నిటు చూడ!నెటు చూడ నేముంది!
సోది వాదనె గాక!శోధ వాదన లేదు!
లంచంబు లేనిచో?మంచంబు వేయరు!
కలి తత్వ మిది యంచు!కాన రేల?
చెంచాల రాయుళ్ళు!సింహాసనము లెక్క!
కంసారి రావలె!గావ జగము!
చెవిటివాని యెదుట!శంఖ మూదిన తీరు!
మనగోడు నాలించు మాన్యు లేరి?
.తే,గీ:- అన్ని రంగాల కలుషంబు!నావ హించె!
మంచి పుష్టత కలిగించు!మహిమ లేదు!
దీన రక్షక!దివి జేశ! దిక్కు నీవె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
38.సీ:-కలకల ధ్వానాల కదలాడు పక్షులు
సఖ్యతా భావంబు జనుల కెద్ది?
మితి మీరు భావాలు గతిమీరు కధనాలు
ప్రజ్ఞ చూపగ నెంచి!వలతు రెపుడు!
పెంపెంప నోపని ప్రియ వాదనముల!
చెలగి పోదురు భువి!వెలు గటంచు!
పరతంత్ర భావనం!పాలింప జూతురు!
ఇహ సుఖంబును తప్ప యెంచ రేది?
తే.గీ:-దంచి కొట్టంగ జూతురు తంత్ర మిథ్య!
ధన ప్రభావపు తీరది!తనది కాదు!
మదన సంస్కార తేజమే!మహిని నిండె!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
39.సీ:-ప్రజల ధనపు జీవ భావనా సరళియు!
సేవ భావము నంటి వరలు చుండ!
పరభుక్త మయ్యును పాపంబు నయ్యును!
సేవ పేర ముసుగు!చింత గూర్చు!
తిన్నింటి వాసాలు!తీరెంచి లెక్కింప!
జీవముక్తి యగునె?జీవ తతికి!
నిత్యాన్న దాతల సత్య సంధుల నెల్ల!
మోస పుచ్చ దగదు దోష బుద్ధి!
తే,గీ:-సస్య శ్యామల జగతికి!సత్తు విచ్చి!
నీరు నారౌచు పెంపౌచు!నింపు గనుమ!
ప్రగతి సోఫాన పధకమై!సుగతి గనుమ!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
40.సీ;-విద్య లేని పశువు విశ్వాసమును జూపు!
పసరంబు మేయుచు పాలు నిడును!
విద్య యున్నను గాని!విశ్వాస శూన్యుడై!
లంచాలు తంత్రాలు!లక్ష్య మేల?
ముక్కోటె దేవతా!మూర్తిత్వ దక్ష యౌ!
గోమాత ధన్యత గొన రదేల?
కక్కుర్తి వేషాల కాలంబు గడుపుచో?
చిక్కు లందును ప్రగతి శీఘ్ర గతిని!
తే,గీ:-తేలు కుట్టిన దొంగలై దివుర తగదు!
భవిత మార్గంబు యోచించు!భద్ర మనసు!
కల్గి జగతికి మేల్జేయ కదలి రండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
41.సీ:-మనసు విప్పి పలుకు!మాటలు కొదువాయె!
వినియు ఛాందస మంచు విడువ దగదు!
కనులార పరికించి!కనుగొన్న!సత్యాలు
ప్రజ లార్తి నాదాలు!వాదు లరసి!
లోలోన కుమిలెడి!లోకుల వెత లార్ప!
సామ్య వాదముగోరి సాహ సించి!
ప్రజల వాదన దెల్పు!సృజల స్రవంతి
పారింతు ప్రజ మేలు!వర్ధిలంగ!
తే,గీ:-మంచి మనసున మాన్యులు!మనన లలర!
కంచి కేగెడు కధ కాదు!కనుడి నిజము!
భావి జీవాలు సుఖమయ!బాట నడుప!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
42.సీ:-దుర్మార్గ వర్తన దురిత చింతన గల్గి!
పరహాని మది నెంచి పరగు వారు!
కర్మ దుష్కృతమది!కాలుని దరి జేర్చు!
కలి ప్రభావమిదియ!కనుచు మనుడి!
ధర్మ మన్ని యుగాల!దనరారు నొకరీతి!
మార్ప శక్యము గాదు!మనుజ తతికి!
పాలక హస్తాల బంధింప బడె నీతి!
అవినీతి న్యాయాన్ని యణగ ద్రొక్కె!
తే,గీ:-నీతి దోవతి గాలిలో నెగిరి పోయె!
జాతి కల్మష చిత్తాన జంగు పట్టె!
మాయ మర్మాన బంధియై మడ్డు పట్టె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
43.సీ;-అవసాన కాలమం దాలు బిడ్డలు రారు
సాగెద వొంటరై!జగతి వీడి!
నిర్జీవ శవమునై!నెండు కట్టెల మధ్య!
దహియింప మంటల!తనువు మాయు!
బూదియౌ కాయంబు పొందె దేది? తుదకు !
మిథ్య జీవన మిది మేలు కొమ్ము!
జీవాత్మ పరమాత్ము!జేరెడు మార్గంబు!
బ్రతుకు రోజుల యందు వెతుక వలయు!
తే,గీ:-భూమి యందున జనియించు!పుణ్య మూర్తి!
పాప కూపాన పడబోకు పాడు తలపు!
మంచి మించెంచి సర్వదా!మసల వలెను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
44.సీ:-చావు కేకల మధ్య సంగీత నినదాలు!
చేతనా శూన్యుల చేతనములు!
గంగ భంగుల తీరు కదలాడు!జగ మిది!
మాయ సుడుల జిక్కి మాయు జూవె!
స్వ పరార్ధతను సాగు సంసార మిద్దిరా!
కర్మ కల్మష చిత్త మర్మ మమరె!
ధర్మ పశ్యత లేని!ధర్మ దేవత తీర్పు!
వినుకలి మాయచే!వెతలు నొందె!
తే,గీ:-మాయ సర్వత్ర వ్యాపించి మహిమ చెరచె!
సచ్చి దానంద మందించు సమయ మిదియె!
మార్పు రావలె!నన్నిట!మనుజు లందు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
45.సీ:-భూ బకాసురు లౌచు!భూములు తెగ మ్రింగి
ఖండాంతరంబుల కలిమి పెంచ!
నిస్వార్ధ సేవంచు విశ్వాసమును పెంచి!
నిశ్వన ద్వానాల నీతి నింపి!
విరి పించి కరిపించి వెస భోగముల దేలి!
ఘాతుక చర్యల ఘనత నింప!
మంచిని తెగటార్చి!మాయ మాటలు జెప్పి!
ధర్మ దేవత గొంతు!తగను నొక్కి!
తే,గీ:-ఇచ్ఛ వచ్చిన తీరున యేలు నట్టి!
దురిత నాయకు లెడ మేర్చి!దొర కొనెండు!
నీతి నేతల నంపిన నేలు కొరకు!
జనులుబ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
46.,సీ:-రాజరికము గాదు!ప్రజల రాజ్యం బిది !
ప్రజలె దేవుళ్ళను భావ మమర!
సేవకా భావాన శివ మెత్తుటను మాని!
నాయకు లలరార !నాగరికము!
పైశాచి కత్వంబు పాలక!దోషమౌ!
ప్రజ పెంపు నింపెంచి పరగ!శుభము!
కలి మాయ పడరాదు!ఘన కీర్తి గడియించు!
తపనయే!కావలె!ధాత్రి నేల!
తే,గీ:-సర్వ సంపత్క రంబగు!సత్య నిష్ట!
నిరుప మంబగు!స్వచ్ఛత!నిండు మనసు!
ప్రగతి మేలుకు నూహించు!ప్రజ్ఞ నలరు!
జనుల బ్రతుకుల తీర్చుమా!సంగ మేశ!
47.సీ:-రాజ్యమే భోజ్యమా!రసరమ్య ద్వీపమా!
ప్రజ మేలు కోరని!ప్రభుడు ప్రభుడె!
భోగాల రాగమా!రాగాల రమ్యమా!
జన రక్ష లేనట్టి !జగతి జగతె!
సత్యంబు లేనట్టి! నిత్యంబు నిత్యమా!
పరబాగు కోరని!బ్రతుకు!బ్రతుకె!
పరహింస తలపోయ!పాపము పాపమె!
భ్రమితార్ధ భావాలు!పాడు పాడు!
తే,గీ:-నీతి నెడ మేర్చి సాగెడు!జాతి జాతె?
మంచి నూహింప నేరని మనిషి మనిషె!
సమత భావన లేని !స్వామి స్వామె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
48.సీ:-మానవతా విల్వ మది నెంచ నోపక!
దూరుట దోషము దురిత మబ్బు!
వాగ్దోష భూషలు వ్యవహార శైలైన!
చావజంపుదు రిల సమయ మెంచి!
నీ గొప్ప నీదౌచు నిండు గూర్పగ వచ్చు!
పర గొప్ప దిగు వేర్చ పండ్లు రాలు!
ధన గర్వ ముందని దర్పంబు పాటింప!
దంచి కొట్టుదు రిల! మంచ మెక్క!
తే,గీ:-చీడ పురుగుగ జీవింప !సిగ్గు గాదె!
నోటి సుచి యది లేకున్న చీటి చిరుగు!
కోట పేటలు దుష్టత!కొంప ముంచు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
49.సీ:-మాటాడు మాటల మంచితన మలర!
సాటి వారల యందు చతురు డౌదు!
నడవడి సరియైన నల్వురు మెత్తురు!
ద్వేషాన చరియింప దరియ రెవరు!
పరిపరి మోసంబు ప్రజ మెచ్చ రెన్నడు!
ప్రాభవం బది తగ్గు!ప్రభలు మాయు!
మాయ మాటలు బల్క మహి యైన మెచ్చదు!
చులకనై!సంఘాన సోల గలవు!
తే,గీ:-జ్ఞాని వీవయ్య నజ్ఞాన జాత రేల?
మాట నిలకడ గలయట్టి మనిషి వగుమ!
నీచ భావన జనులందు!పీచ మడచు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
50.సీ:-గుడిని లింగంబును!కుడువ జూచుట తప్పు!
మోసాలు మితిమీర!మోద బడెదు!
ముష్కర తత్వంబు!సుష్క ప్రయాసంబు!
రాబందు మరణంబు రా గలంగు!
మొండి మూర్ఖత్వంబు!మోజును దిగ జార్చు!
జారిన మోజది!జయము నీదు!
ఏదేశ మేగిన!సాధించు నది సున్న!
భవిత మేలును గోర!బాగు కనెదు!
తే.గీ:-తత్వ జ్ఞానత గావలె!తరియుటకును!
జీవ శైలిని మార్చిన శ్రీ వరించు!
పరుల హింసించి పొందకు పాప మవని!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
51.సీ;-సహ జన్ములతొ పొత్తు!సహకార భావంబు
జన్మ నిచ్చిన తల్లి!జాలి కరుణ!
సాటి వారల ప్రేమ సౌజన్య శీలంబు!
జాతి జాగృతి నెంచ!జయము మనదె!
ధనమిచ్చి పొందెడు!ధర పాల నంబది!
నిలువదు చాన్నాళ్ళు!నిశ్చయ మిది!
చపల చిత్తము లవి!విఫలమౌ!పాలనన్!
ఏపుగోర!ప్రజల ప్రాపు గనెదు!
తే,గీ:-చలన భావాన్విత!జగతి!చంచ లంబు!
పరుల నాడిని గమనించి!వరల వలెను!
చెడుగు మనముల!బడరాదు!విడును ఖ్యాతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
52.సీ:-సృష్టి మూలము గన్న నిష్ణాతుడవు గావు!
జనన మరణము లెంచు జ్ఞాని గావు!
భవిత నూహించెడి!ప్రతి భేది?నీయందు!
కాల జ్ఞానివి గావు శూలి గావు!
ధర్మాన్ని కొనలేవు!కర్మను విడ లేవు!
మాయకే మాయవై మసల లేవు!
నిత్య సత్యుల చెంత నిమిష ముండగ లేవు!
చేయు దోషాలకు!శిక్ష బడును!
తే,గీ;-వేష భూషలు నిత్యమా!విశ్వ మందు!
సత్య.నిష్టను పాటించు జయము నీదె!
పంచ భూతాలు పాపాలు పార ద్రోలు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
3.సీ:-కల్ల లేల జగతి యెల్లలు మారును!
దౌర్జన్యముల భీతి ధరను యలము!
ప్రాణ ఘాతుకు లిల పరుగెత్తి వధియింప
జనరక్ష గనరాదు!మనుట కల్ల!
నీతి వీడి జగము నివ్వెర పడు నెంతొ?
కాల యములు స్వేచ్ఛ!కదలుదు రిల!
యంత్రాంగ మంతయు మంత్ర బద్ధ మగును!
రక్షణ కరువౌచు రాలు జనము!
తే.గీ:-మాట నిలకడ కనదెందు!మాయ గప్పి!
చేటు కాలాన చెడు చేష్ట!చెప్ప వశమె!
మనసు మంచిని శివుడీయ!మహి సుఖించు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
54.సీ:-కన్గవ మూసియు!కనలేదు నన్నంచు!
పాలు గ్రోలెడు పిల్లి!వాళక మయె!
చేయు తప్పుల నెల్ల!చేయు చుందురు లెక్క!
లెక్క పూర్తియు కాగ!చిక్కు లలము!
ఐదేండ్ల పాలనే!ఐశ్వర్యమును నింప!
బీద వా డెట్టుల?పెంపు నొందు!
అవినీతి నీతిగా!నవతరించు కలిని!
ఎండమావి జలము!యిలను నిజము!
తే,గీ;-నేతి బీరలొ!నేయట్టు!నీతి యెసగె!
పదవి కాంక్షయెమూలంబు!ప్రభుల కిలను!
మనదు సొమ్మును మనకిచ్చి మాయ మహిమ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
55.సీ:-పట్టు పుట్టంబుల ప్రాభవోపేతమై
నిధులు నిక్షేపాల నిండు తల్లి!
వేద భూమియు నౌచు విద్వద్వరేణ్యమై!
విశ్వ ఖ్యాతిని గన్న విమల మాత!
కర్మ భూమియు నౌచు!గౌరవప్రదమౌచు!
కాల జ్ఞానుల గన్న కన్న తల్లి!
మాతల మాతయై!మనపాలి దైవమై!
దనరు భరత మాత!మనది కాగ!
తే,గీ:-కన్న తల్లిని వేదించి!కలిమి దోచి!
వెతల కుమలంగ జేయుట!నుతము గాదు!
మాతృ ద్రోహుల నేమార్చి!మనగ శుభము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
56.సీ:-దురితాల నెలవైన!దొర లేలికను జిక్కి!
దిక్కు తోచని తల్లికి!దిగులు బాపి!
పోరి తరిమి పంపి!పూజ్యత నిల్పిన
మన జాతి ఖ్యాతిని మరువ తగదు!
తొలి స్వేచ్ఛ రోజుల!విలువైన పాలన!
ప్రగతి సుగతి గాంచె!ప్రాభవమున!
సోద రాదర భావ!సద్గుణ సంపత్తి!
మానవత్వమపుడు!మహి వెలింగె!
తే,గీ:-స్వార్ధ పాలకు లేలంగ జట్టు కట్టి!
పోటి పడు చుండి రీనాడు!పాడు గోరి!
తల్లి భవితంబు నూహించు!తరుణ మొచ్చె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
57.సీ:-విభజించి పాలించు!విశ్వాస మది యబ్బె!
పరుల సంస్కృతి!వంట బట్టె నేడు!
పట్టి దండించెడు ప్రాభవం బలరారె!
పీడించు ధోరణి వీడ దాయె!
విపరీత తెల్వి తా!నపహాస్య!స్వేచ్ఛాయె!
గెలుపు టాశయె!తప్ప!వలపు గాదు!
దోచి దాచెడు నీతి!శూచిగా నెలకొనె!
అవినీతి నీతిగా!శివత గాంచె!
తే,గీ;-పంచి పన్నుల సొమ్మును పాలకు లయి!
వంచనంబున!తమ సొత్తు!పంచునటుల!
నమ్మికను గల్గ జేయుచు!నటకు లైరి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
58.సీ:-పంచి పాలించెడు!పద్ధతి సరి గాదు!
వ్యాపార నిక్షి ప్త!భావ మగును!
సేవ జేసెడు వారు!జీవన సరళికి!
పెంపెంచు భావంబు!పెన గొనంగ!
నిస్వార్ధ బుద్ధితో!నిండు మనసు గల్గి!
నావారు జనులంచు!నడవ వలెమ!
మానవ సేవయే!మాధవు! సేవగా!
మది నెంచి పాలింప!మాన్య తలరు!
తే,గీ:-భావ సౌరభ్య. భావంబు!ప్రగతి మెట్టు!
పట్టి పీడింప సరివారి!పాప మగును!
వెంట రానట్టి సిరి నెట్టి!వినుతి గనుమ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
59.సీ:-మెదడుకు పని లేదు!సుదతి నూహింపంగ!
మొద్దు బారిన మోడు శుద్ధ మౌనె?
కద్దు లేదను చింత!కాస్తంత నూహింప!
బీదంచు పధకాలు మోదమిడగ!
బ్రతుకు తెరవు'ఓటు' ప్రజలపాలింపుకే!
మాయ లోన బడకు!మానవుండ!
నిస్వార్ధ సేవది !నెండమావియె సుమ్మ!
జాతి మాపెడు తీరన!జాలు నయ్య!
తే,గీ:-పైకి పాలు లోన విషము!పాటు సున్న!
నేటి లోకపు తీరది!వేటు గోరు!
ఆంత రంగిక మెరుగంగ!అమ్మ తరమె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
60.సీ:-మోసవూరితమైన!నీతితా!నిండగు!
నేలిక పేరాశ !నేర్పు గాదె?
పైకి మేలు నటన!భావంబు వేరొండు!
వాని మర్మ మెరుగ హరుని తరమె?
మోస భూషలిలను!దోషభూ యిష్టాలు!
మాయ మోహాన్విత! మంత్రి తాలు!
వెను ముందు నూహించి!కనుమయ్య నిజమును!
పప్పులో నడుగిడ!భవిత పాడు!
తే,గీ:-కాల నాగుల కాటేయ!కాచు కొనియె!
చూచి తప్పించు కొనుమయ్య!శుద్ధ బుద్ధి!
విషము గ్రక్కు నరుల విస్మరించు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
61.సీ:-మాయయే!యుక్తంబు!మాయయే!భుక్తంబు!
మాయయే!ధర్మంబు!మాయ జగము!
మాయయే!ధీరంబు!మాయయే!బీరంబు!
మాయయే!నిత్యంబు!మాయ యింతె!
మాయయే!క్రోధంబు!మాయయే!లోభంబు!
మాయయే!మోహంబు!మాయ జీవ!
మాయయే!మాత్సర్య మంత్రాన్వితంబునై! .
మాయ జేయు జగము!మాయ మయము!
తే,గీ:-మాయ కావల దైవంబు మసలు చుండు!
అట్టి మాయను ఛేదించి పట్టి నీతి!
నీతి ధర్మాల వెలయుమా!నిరత మీవు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
62.సీ:-కమికె డన్నము లేని!కడు బీద కేదయా?
ఆహార పధకంబు యవని యందు!
ఇల్లు లేదనువాడు!యిహమున వెరగొంద!
ధనమున్న బీదకు! దక్కు గాదె!
కుల మతము లిలను!కుంపట్ల కుమలంగ!
పధకాలు చేరునే!ప్రక్క కులము!
సౌజన్య శూన్యతం!స్వార్ధంబు మిన్నంటె!
ధన తృష్ణ! తీరదే?ధరణి యందు!
తే.గీ:-సుంత శాంతత జేకూర్చు సూరి వీవు!
పాప కర్ముల పరిమార్చి!భరత మాత!
ప్రాభవంబును పెంచంగ!వడిగ కదిలి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
63.సి:-దేశాభి వృద్ధికై!దివ మహంబులు నెంచు!
మంచి పాలకులకు!మచ్చ దెచ్చు!
దేశ ద్రోహులు గల! దేశ మియ్యది సుమ్మ!
అప్ర మత్తము నొందు!నహ రహములు!
మెత్తదనము జూప!మొత్తంగ జూతురు!
విజ్ఞత దురితుల వెడల గొట్టు!
ప్రగతి సుగతి గను!ప్రభవం బలరార!
చెడువీడి!మంచితా!చివరి కలము!
తే,గీ;-దోష భావాలు పోనాడి!దురిత తతిని!
రూపు మాపిన జగమెల్ల రూఢి నిల్చు!
మరల దాస్యంపు టూహలు!మట్టి గరుపు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
64.సీ:-రక రక వికటిత మూక లేలిక లందు!
జీవనా సౌచ్యము!చెడును కొంత!
తల్లి భారతి హృది!తత్తర బిత్తరై
చేతు లెత్తెను బాగు చేయ లేక!
చిత్తజాహితుడెపో!శిక్షించి ద్రోహుల!
జగతి రక్షను సేయ!ప్రగతి!మెరుగు!
స్వార్ధ చింతన తగ్గి!సత్యంబు నెలకొను!
సస్య శ్యామలమౌచు!జగము వెలుగు!
తే,గీ:-భూత తతిమెచ్చి!సర్వదా!భూతినింపి!
పరుల మేలెంచు!భావంబు!పరగ జేయు!
తత్వ జ్ఞానంబు గల్పించి!దయను బ్రోవ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
65.సీ:-ఎంత జీర్ణ క్రియయొ?యెకి మీడుల కిలను!
ధన జీర్ణ కోశంబు!గనదు నిండు!
పండంటి లోకాన్ని!యెండ మావని పింప!
ద్రవ నామ ద్రవ్యము!తాము నొంది!
భవి శూన్య మును జేసి!ప్ర జ్ఞగా ముద్రించి!
చెల్లి చెల్లని రీతి!చెలగాట!మేలనొ?
కరి మ్రింగిన వెలగ కాయ తీరాయెనె
విచ్ఛిత్తి ప్రజ సొత్తు!వెతుక బడక!
తే,గీ:-రాజ ;కీయపు పంచాంగ శ్రవణ మింతె!
గురు బలంబది చాలు!గుణము కాదు!
రామ,రావణు లేలిక!రసను వెలిగె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
66.,సీ;-పని జేయు నొక్కండు!పాడు గోఠు నొకడు!
పాడునే బాగంచు పలుకు నొకడు!
జనుల వెఱ్ఱిగ నెంచి చరియించు!నొక్కండు!
తప్పు నొడ్లకు నెట్టి!ధన్య డౌచు!
చర్వి తానృతముల!చతురత వెలి బుచ్చి!
ప్రజల మంచి గనెడు!ప్రభులు గలరు!
భగవంతు నైనను!భగ్నంబు గావించి!
విచ్ఛిత్తి భావాల!తుచ్ఛ మేర్చ!
తే,గీ:- పుచ్చు పగలగొట్టంగను!పొరలు మాయు!
తప్పు జేసిన పేదకే!దండ నంబు!
డబ్బు మైకము ధర్మాన్ని!పట్టి నులుము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
67.సీ:-గెలుపుకు దళితులు గావలె ఱేలకు!
అణగ ద్రొక్కు టదె!ఆత్మ హాని!
చీదరింతురు ప్రజ!చేరనీరు దరికి!
తరిమి కొట్టుదురని దలప రేల?
ప్రజల దయను గెల్చి!ప్రజలనే!హింసింప!
రక్కస తత్వమౌ!రాలు తుదకు!
రాలుగాయి తనము!రాణింప దేనాడు!
పోయకాల బుద్ధి!పొంక మణచు!
తే.గీ;-ఇంట గెల్వగ నేరని!కుంటి బుద్ధి!
రచ్చ గెల్చుట!సాధ్యమా!రామ రామ!
కామ దహనుని కని గూడ!కనని నటన!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
68.సీ;-కుల ప్రాతి పదికయే!కొలమాన మాయెగా!
సర్వ సామ్య తెట్లు?సాధ్య పడును!
అక్షర కుక్షులే!ఆశ్చర్యమున దేల!
కుల పెంపు టాశలే!కొంప ముంచె!
కుల భ్రమితపు స్వేచ్ఛ!గురు తరంబౌ నొకో?
ఇతర కులముల స్వేచ్ఛ!చితికి పోవ!
విభజించి పాలించు!విభవంబు సరిగాదు!
సమతని మాట్లాడ సబబు గాదు!
తే,గీ;-ఇట్టి వేర్పాటు గుణములు!నెట్ట కున్న!
పట్టు సడలిన!భరతమ్మ!బాయు ప్రగతి!
డెబ్బదేడేండ్ల స్వేచ్ఛ!యే యబ్బ సొత్తు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
69.సీ:-వినవేమి?కనవేమి?వినుతి తా గనవేమి?
కనవేమి?తిలకంబు గొన వదేమి?
నయనాల వినయాలు!నాట్య కలాపాలు!
చోరుల ఘోరాలు!చూడ వేమి?
మానినీ హరణాలు!మానభంగా లెన్నొ?
భంజింప రావేమి?భయమ!నీకు!
నేరాలు ఘోరాలు!నిర్ణిద్ర కరణాలు!
వారింప రావేమి?భరత మాత!
తే,గీ:-ఏది యేమైన నాకేమి?బాద యంచు!
మిన్న కుండుట తగదమ్మ!మేలు కొమ్మ!
పాప జన్ముల పగబట్టి పాతి పెట్టి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
70.సీ:-నాటి కాటను దొర!పటుతర నిర్మిత!
కట్టడంబులు!నేటికి!పట్టు నిలిచె!
నేటి వారల తెల్వి!నేల వీడినసాము!
పాటుకీడు ఘనత!పాతె!జగతి!
నిస్వార్ధ సేవయే!నిరుపమం బానాడు!
స్వార్ధమే!గరళమై! !జట్టు గట్టె!
తీరు తెన్ను గనని!తీరాయె నీనాడు!
తేరుకొనుగ వశమె!తిరుమ లేశ!
తే,గీ:-పనులమాయను పరికింప!వలను పడదు!
భిన్న తత్వాల మనుజుల వెన్ను దన్ను!తఫ
ప్రగతి విచ్ఛిన్న భావాలు ప్రబలు చుండ!
జనుల బ్రతుకులు!తీర్చుమా!సంగ మేశ!
71.సీ:-కలుషిత వచనాలు!!గాయమేర్చ!మనసు!
భావ తర్కణ జేసి!పరు లెరుంగ!
చర్చించి తర్కించి!చక్కనౌ నోషధిన్!
నయము జేసిన సరి న్యాయమగును!
లోలోన కుమిలిన నీలోని వెతలవి!
తెలియ జేయక యున్న! దిగులె!మిగులు!!
చెడు నూహ లయ్యవి!చేటు లోకము కౌను!
ప్రగతి దుర్గతినెంచ!బడయ దపుడు!
తే,గీ:-నిజము నిలకడ నమరుచో?నీతి నిండు!
నీతి లేనట్టి జాతిగా!నిలుప దగదు!
జ్ఞాన సంపత్కర ధీ నిథి!మానవుండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
72.సీ:-గడి మీరి చరియింప!గండాలు వెన్నంటు!
ముండ్ల తుప్పల బడుట మూర్ఖ మౌను!
బ్రతికుండ తిండికై పలుపాట్లు పెట్టెడి!
జన మబ్బె నే నెటు?జనెద నంచు!
విలపించె తల్లిరా!తలపోయ రేమిరా?
యప్పుల యార్భాటమొప్పు తప్పు!
రేపటి గతియేమొ?మాపటి కిది చాలు
యని తృప్తి జేవింప!ఘనత గాదె!
తే,గీ;-తల్లి విలపింప లోలోన!తగునె? మనకు!
అమ్మ లేనట్టి జన్మంబు!యవని సున్న!
శూన్య ధృగ్జాల జ్వాలల క్షోభ లేల?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
73.సీ:-అర్క సంపర్కమౌ!తర్కంపు చింతన!
మండించి మసి జేయు మానవాళి!
దశ్చింతనము తప్పు!దురహంబు పెన్ముప్పు!
ముప్పు తిప్ప లవేల?చెప్పు మనకు!
మానవత్వము మాని ధనుజత్వ మేలరా?
కులము ఘోషలు రేపి కులక నేల?
మమ్మీలు ప్రజలంచు డిమ్మీలుగా నెంచి!
తమ్మిల్ల మొత్తగ తగదు మనకు!
తే,గీ:-తెలిసి తప్పులు జేయుచు తెలివరులన!
తుప్పు రేపుదు రేనాడొ?గొప్ప వీడ!
గొబ్బు కంపైన యూహల!గోల్పడి రిట!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
74.సీ:-కుల గజ్జి మొల గజ్జి!చిరు గజ్జి కాదురా!
జర్జరా నిర్ఝరీ ఘర్జితంబు!
ఆర్జనే తర్జన భర్జ నేర్చు తుదికి!
గర్గు డైనను రాడు!స్వర్గ మిడడు!
నిర్గమ మార్గంబు!నిస్తులం బేర్చును!
నెగ్గు సిగ్గు లవియె!సిగ్గు పడును!
తగ్గు డెగ్గుట సిగ్గు!బుగ్గియే!తుదకబ్బు!
అబ్బురంబును కాదు! యవని బ్రతుకు!
తే,గీ:-ఇట్టి విశ్చిత్తి నిశ్చిత్తి!యిహపు సొబగు!
మూడు నాళ్ళకు సరిపడు ముచ్చటేను!
తగ్గి జీవింప జీవంబు!ధన్య మౌను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
75.సీ:-పుట్టు సారమె గాని పెట్టు సారము గాదు!
తట్టి కొట్టిన గాని! తగదు పట్టు!
ఉట్టి కెగుర లేని మట్టి బ్రతుకు కిల!
నడి మంత్ర సిరి గల్గ! మిడిసి పడును!
నేర దండన లేని నీతి నీతియు గాదు!
జాతి ఖ్యాతి గనని జన్మ జన్మే?
అందాలు చందాలు యపు రూప నందాలు
చివరికి నిల్చునే?జీవ తతికి!
తే,గీ:-జీవ కర్మను మానిన జీవి జీవె?
పొంక మూనగ తగునొకో?బుద్ధి మంత!
బద్ధి నిద్ధాత్రి శుద్ధమౌ!సిద్ధి కాదె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
76.సీ:-కులగజ్జి పెను గజ్జి కుంక టేర్లను బట్టి!
చెట్టు చచ్చు వరకు!చీడ విడదు!
చెద పురుగుల మందు!చిమ్మగా వలె
లేకున్న. చెట్లెల్ల!లేచి పోవు!
అంకిన దెల్లను అల్లనల్లను మ్రింగ!
మిగులుట శూన్యము!వగపె మిగులు!
సంసారి పక్షాన!!సంసారము. నేల!
సద్గమనము గూర్చు! సమత నింపి!
తే,గీ:-సర్వ సామ్యత సమకూడు!జయద మగును!
పరుల మెప్పుకు పాటెంచ!పాడు కాదె!
మదము ముదమును పోజేయ!మోదమలరు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
77.సీ:-ఒకరి పనినొకరు నురికి చేయుట తప్పు!
పరప్రాప్త మంటగ!ప్రభుత గనరు!
ఆత్మ ధర్మంబును!యసలె పాటింపక!
పర ధర్మ మాశింప పాడు పడును!
ఆత్మ చరణ వీడి !పర చరణమ దేల?
స్వ చరణ దోషంబు! పట్టు చిక్కు!
చెడు నూహ భ్రమకంబు!చేటుకాటక మగు!
అండ లేని బ్రతుకు !తిండి లేని వెరపు!
తే,గీ:-తిరిగి పుంజు కొనదనుచు తెలియ వేల?
గురు గుణంబుల గురులకే!గురువు వౌచొ?
చెప్ప తరమేది? లేదింక!నొప్పు గనదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
78.సీ:-దిగువయెగిసె పైకి!యెగువ దిగువను జీరె!
కలి మిథ్య నెరుగంగ!కన తరంబె?
శుద్ధి లేనితలఫు!బుద్ధి లేని నడత!
మధ్య తరపు కీర్తి మంట గలిపె!
సాధ్యంబు గానిది శోధ్యమై విలసిల్లె!
విశ్వాస మది కాస్త!విస్తు చెందె!
ఓటు రాజ్ఞి ప్రభలు!కాటు వేసె జగము!
విషము దింప వశమె!భిషగు కైన!
తే,గీ:-రాటు దేరిన వీరిదౌ పాటు సున్న!
కాట కములంట!మానునా!కలియె!నిదియ!
నూటినాటి కొకండిల! పాటు సబబె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
79.సీ:-చెడుగు వడిగ నంటి!జీడి మరక వోలె!
లోన మంచిని కాస్త!కాన నీదు!
అజ్ఞాన ప్రాజ్ఞులు విజ్ఞాన మొలకింప!
విజ్ఞాన సురభులు!విస్తు నొందె!
కుతల సంస్కారంబు కువలయం బలరార!
సుతల సంస్కారంబు చూడ తరమె!
పగ బూని చెరచెడు బాని సత్వపు తీరు
భవ బంధ మేర్చునే?భ్రమయె గాక!
తే,గీ;-శుద్ధ శూన్యుల గోలయు సద్దు మణిగె!
బుద్ధి పట్టున దిట్టవు!భూమి నేల!
చాక చక్యము చతురత!సవ్య సాచి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
80,సీ:-భూతి కగ్గల మేర్చె భూత నాధుడు భువి!
నీతి నిల్కడ నిండు జాతి కనగ!
పోయ కాలపు బుద్ధి పుట్టరా దటంచు!
ధర్మ నిరతి పెంచె ధార్మి కుండు!
ప్రజ్ఞ పాటవఘుల నజ్ఞాన తిమిరంబు
హంతమేర్చగ నెంచె!హరుడు శివుడు!
భవ బంధములు బాపి పరమాత్ము చేరెడి
మార్గంబు జూపె! నుమా ధవుండు!
తే,గీ;-వరలి పంచాక్షరీ మంత్ర ప్రాభ వమున!
జగము సుగమన! మేర్చెను!జంగ ముండు!
భంగముల నెట్టు ప్రజ్ఞను వరల నిచ్చె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
81.సీ:-కాలావసానాన కనరా ధరుందతి!
హిత వచనములవి!మతికి జనవు!
కొండెక్కు దీపపు మెండు సు వాసనల్!
నాశికా పుటముల నంట బోవు!
గత జన్మ పాపాలు వెత లేర్చి పోజేయ!
ఇహ భోగ భాగ్యాలు!యిచటె నుండు!
కదలిక గనలేవు!కాటికి పయనింతు
నిర్జీవ ప్రేతమై!నేగె దింతె!
తే,గీ:-చలన తత్వాను గుణ్యమౌ!జగతి మిథ్య!
మిధ్య కావల నిలుచుండు!మేథ సుమ్మ!
మేథ సంసేవ్య మానమౌ!వేద థాత్రి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
82.సీ;-వన మన జలమని!వనచర కపిమూక!
సాయాన!దుష్టంబు!బాయ జేసి!
ధ ర సుభిక్షము నేర్చి!సత్పాల నందించి!
రక్క సత్వము లేని రాజ్య మేలె!
ధర్మ సం రక్షణే!ధన్యతత్వ మనగ!
శిష్ట వైశిష్ట్యము!చెప్పె!నిలకు!
మాట దాటని వాడు!మహనీయ తేజుండు!
కౌసల్య తనయుండు!కర్మ యోగి!
తే,గీ:-చెడును వీడించి!జన సేవ!చేసె!వరత!
సత్య ధర్మ సంస్కృతులకు!సాక్షి యౌచు!
నెలకు మూడువానలు!నెలకొనంగ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
83.సీ;-రాజ కీయ బడుల రాటు దేరిన వీరి
తనువు మనము లొక్క!టవక యున్నె?
వర్గాల ద్వేషాలు !వైరుధ్య భావాలు
పైకి నటనె తప్ప!పలువు రొకటె!
మభ్య పెట్టుట!నెపం!మాయ జూదంబిది!
వెఱ్ఱి జనుల జేసి!జుఱ్ఱు టాశె!
బీద రక్షణ మంచు!పేద కాశలు జూప!
పదవి కాంక్షయె గాని!పరము కాదు!
తే,గీ:-.నూటి కొక్క డు సుగుణుండు!పోటి నిల్చు!
అట్టి వానిని గెలిపించ!యవని మెచ్చు!
వాడె!జగతిని ప్రగతిని!వరద మేర్చు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
84.సీ:- హక్కు విక్రయ మది!హాని జగతి కౌను!
పర భిక్ష !దక్షయై!భవిత వెల్గు!
నీతినేతల నెన్న!నియతి నిల్చు తుదకు!
మోస కారుల నెన్న!దోస మలరు!
గర్వాంధు లిల గెల్వ!గడ్డు రోజులు కల్గు!
పంచు కొందురు సిరి!ప్రజల కిడక!
వారి పెంపె యగును!పరపెంపు శూన్యము!
నీచ బుద్ధుల నెంచ!నీల్గు భవిత!
తే.గీ:-జనుల మేలును గోరెడి!చతురు నెన్న!
పాల నంబది భేషగు!ప్రజలు మెచ్చ!
భవిత చే జేతుల చెరచ!బాధ పడెదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
85.సీ:-తమ్ముడు తనవాడు!తగువు చెప్ప ననగ!
ధర్మము నిల్చునే?ధరణి యందు!
జనము నా వారని!తన యిచ్ఛ ధర నమ్మ!
భిక్ష భవితయె గాక!పేర్మి గనునె?
ధనమిచ్చి ధర్మంబు!కొనుగోలు!మార్గంపు
దారి సాగుట!భవి దోష!వారి బడుటె!
ప్రజ సొమ్ము ప్రజ కీయ!ప్రభు గొప్ప యేముంది?
తన ధనమది కాదు!తలప రేల?
తే,గీ:-దాన కర్ణుల మేమంచు!తగను జెప్ప!
మనది మనకిచ్చు!వార లమాయకులయ?
తెలిసి మసలుమ తెలివరీ!తెలివి జూపి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
86.సీ:-బుద్బుధం బీజన్మ!పోయిన పోగాక!
తప్ప నేరదు కర్మ ధర్మ మింతె!
భోగాలు యాగాలు!భువనైక మోహాలు!
గత జన్మ ఛైదాలు!గడగు నిపుడు!
మనుజుడ వీవయ్య!మహిమెంత నీచెంత!
తోలు బొమ్మవు నీవు తెలిసి కొమ్మ!
నీదైన దేహంబు!నీఱౌ దివస మందు
వెను వెంట రాదేది!కనవె!నిజము!
తే,గీ:-సాటి వారల మంచిని!సతత మరయు!
అర్ధు లార్ధ్రత తీర్చుమా!యరసి మేలు!
తృప్తి లేనట్టి జీవంబు!దీప్తి నిడదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
87.సీ.:-ప్రజలు గొఱ్ఱెలు గారు!పరికించగా వలె!
భవిత ప్రగతి గోరు!భాగ్య యశులు!
శోధింతు రన్నియి!ఛేదింతురవి నీతి!
దాసి జనులు గారు!శాసనికులు!
జనమాట!ప్రతి నోట!చక్కగా పరికించి!
మనుజాతి ఖ్యాతి తా మంచి నెంచి!
నిర్మొహ మాటాన!ధర్మోక్తి చర్వాణ!
భావంబు దీపింప బల్కు చుంటి!
తే,గీ:-నిజము నిష్ఠురమైన!నీతి కొరకు
పాటుపడ గోరి సద్బుద్ధి!భావ మమర!
ప్రగతి సహకార భావన!ప్రభలు నింప
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
88.సీ;-బరి తెగించిన కలి భద్రంబు గీడేర్చు!
మంచి వారిని కూడ! మాయ ముంచు!
తప్పులు చేయించి తప్పించు చుండ!
చూచి యోర్వగ లేక!శూలి యంత!
తన బిడ్డలను గాచి!ధర్మంబు నిల్పగా!
చఠ్విత చర్వణ సరళి గాంచి!
దోషాలు పోనాడి!దురహంబులు గాంచి!
తీర్చి దిద్దగ వచ్చె!దేవు డిలకు!
తే,గీ:-చేయు చైదాలు వెలి జేసి!జీవ తతికి!
మంచి మార్గాన కదలాడు!మనసు నిచ్చి!
సత్య ధర్మ మహింసలు! సత్వర గతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
89.సీ:-మాటలాడెడి వాని పాటు శూన్యము సుమ్మ!
అరిచెడు శునకంబు కరవ నటుల!
గొప్ప లొప్పులు జెప్పు!తప్పుల నటకుండు!
ఒప్పు చేయు ననుట!తప్పు గాదె!
దూర దృష్టియు లేని !దుర దృష్ట వంతుండు!
పాడు పడుటె గాక!పాడు చేయు!
పబ్బంబు గడుపంగ!పదవి కోరెడు వాడు!
తన ప్రాపు నేపుకే!తగ నెసంగు!
తే,గీ:-ఆంతరంగిక భావంబు నరయ తరమె!
చెడు తలంపులు నాపంగ శివుని వశమె!
గుణ విహీనుడు మనసున కూర్మి గనునె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
90.సీ:-మంచాన పఢబోకు!మాయావి కాబోకు!
మంచిగా జీవించి మనన మొందు!
రాలుగాయి తనము!రక్ష గా దేనాడు?
కుక్క చావును గూర్చు నిక్క మిదియె!
మితి మీరు కోర్కెలు గతి భంగ మేర్చును!
ప్రగతి శూన్య మగును!బాగు కనదు!
కండ కావర మెల్ల!కరిగించు జగ మిది!
భంగ పాటొందుట భావ్య మగునె?
తే,గీ:-పరుల చెరిపెడి బుద్ధియే!బాగు చెరచు!
జనుల రక్షింప నెంచిన జయము కల్గు!
తెలివి పరుల కుపక రింప తేజు డౌదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
91.సీ:-మథ్యమే!విత్తంబు!మథ్యమే!చిత్తంబు!
మథ్యంబు లేకున్న?మహియు లేదు!
మథ్య మేలిక భుక్తి!మథ్యమే!యనురక్తి!
సూక్తి ముక్తావళి!సుర వరాళి!
కలి నడయాడంగ!కావలె నియ్యది!
లేకున్న నిద్రించు లోక మెల్ల!
పాలనా వ్యవహార!పద్ధతే!మథ్యాన!
సాగుగా!నది నీతి!సాగ నీదు!
తే,గీ:-పిచ్చి లోకంబు గావించి పెచ్చు రేగి!
హింస ధోరణి చేపట్టి!యేల నౌనె?
అన్న పూర్ణయు కోపింప నాయు వుడుగు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
92.సీ:-అట్టి జీవనదాయి! అన్నపూర్ణ వరామ!
తాకట్టు మథ్యాన్ని!తలచి మదిని
భవిత చీకటి నెంచి!ప్రజలపాట్లూహించి!
నెకిమీల దుశ్చర్య!వెకిలి చేష్ట
మాయ మంత్రణ తీరు!మనుజ హానిగ నెంచి!
చేయ లేనని తల్లి చేతు లెత్తె!
జన క్షయ తీరది జాతి లేకను జేయ!
చెట్టు పుట్టల నేలు జీవ మలరు!
తే,గీ:-ఈర్ష్య ద్వేషా లవి!తగ వేరి కైనను!
సాటి మనుజుల సమతను జార విడువ!
ఒకడు కట్టడ మేరొండు!పెకలు జేయు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
93.సీ:-అడియాశ పొడి దుఃఖ మవధులే కనరావు!
గడి మీరి చరియింప పడెదు నేల!
నేల పడిన నిన్ను నెత్త జూడ రెవరు!
బొత్తిగా చెడు గొప్ప!భువిని నిలదు!
కాల పాశపు టుచ్ఛు కంఠంబు బిగువడ!
గగ్గోలు పెట్టిన!కనరు వినరు!
రాగత మెంచని!పోగాల మేలయా?
ఉన్న రోజుల నీతి నెన్న వేమి?
తే,గీ:-చారు శీలత స్వ చ్ఛంద!సత్య నిష్ట!
భ్రష్ట సంపాతముల నెట్టి!భ్రమలు తొలగ!
నరుల నారాయణుని జూచి!జ్ఞాన ధృష్టి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
94,సీ:-రాబందు జడి వాన!రాలు తీరును గాక!
కలహంస తీరున గడగ వేల?
నీతి నాతిని చెర నెట్టి !పదవి నొంద!
జాతి జీవన చెడు!ఖ్యాతి గనదు!
మనసు స్వార్ధము నిండ!మమతాను రాగాలు!
యెండ మావులతీరు!నుండు గాదె?
కండ కావర ప్రభ కను మిన్ను గానదు!
కైవల్య దామునే!కంట్ర గించు!
తే,గీ:- కనులు నెత్తి కెక్కిన వాడు కనడు వినడు!
మంచి చేరదు మనసుకు!మాయ కమ్మి!
దండ నంబది యొక్కటే!తగిన శిక్ష!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
95,సీ:-ఒకరి మెదడు టూహ!యుర్విని పచరింప!
మేలు గాదది! యెల్ల మేధిని కిని!
తన జీవ సరళిని జన జీవ సరళిగా!
భావించు టది తప్పు!పగకు నెలవు!
పదిమంది భావాలు పరికించి తర్కించి!
మంచి పద్ధతి నెంచి!మనుట మేలు!
మాయలు కల్పించి మాయలో జీవింప!
మనుజాళి తీర్చుట!మంచి కాదు!
తే,గీ:-కావలె నటంచు యవినీతి కలిమిగొనుట!
జీవ దౌర్భాగ్య మౌ నదే?చీడ పీడ!
చంచ లత్వపు భావన!వంచన మగు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
96.సీ:-సమత మమత లన!కమతాల సమతేది?
సిరి సరి సుఖ మేది?సరస మేది?
గుణ గణ సమతేది?గురు తేది?సమ తేది?
తరతమ గమమేది?తరణ మేది?
గురు హిత మతమేది?పరమేలు నడతేది?
మనుగడ తీరేది?మాన్య మేది?
మిత భాషణ మదేది?హితమతి గను టేది?
కుతల రక్షణ యేది?మిత మదేది?
తే,గీ:-ఏది?యేదయ్య యిహమందు!నీది నాది!
శోది మాట లవేటికి?చూడు నిజము!
ఇహపు కలుము లశాస్విత యీప్సి తాలు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
97.సీ:-భవిత శూన్యము జేయు పట్టు పట్టి రదేమొ?
జగదభి రామంబు!వగచు నట్లు?
కొన్ని భూతంబులు!గురిబెట్టి!కొట్టంగ!
తల్లి నీవెట్టుల తట్టు కొనెదొ?
కీడుకే!మోదంబు!కించత్తు సుఖ మేది?
కరువు కాటకముల!కాట యాయె!
ఎటు జూడ జఠిలంబు!పటు జూడ శూన్యంబు!
కట కటా!రామయ్య!కన వదేమి?
తే,గీ:-కుటిల నటనల కుల గజ్జి!కువల యాన!
పట్టి విడ దాయె!పరమేశ!పాప మేమొ?
గెలుపు మూలము కులమాయె!కిల్భిషాన!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
98.సీ:-పటుతర నటనల ఫాలాక్షు నెదిరించు!
శక్తి సామర్ధ్యంబు జనుల కలమె!
నాట్య భంగిమ లెల్ల!నటరాజు కెరిగించు!
విద్వ ద్వరేణ్యులు!వెలసి రిచట!
నాకమే యేకమై సాక నెంచిన భువి!
సాకనీరు జనము!దద్ద రిలగ!
నెదిరించు కుల శక్తి!బెదిరించు!నాకమున్!
పొగలు సెగలు రేపు బుధులు గలరు!
తే,గీ:-పూర్ణ జ్ఞానుల తెలివికే!పుట్టి నిల్లు!
భరతి పరస్వేచ్ఛ మేలెంచు ప్రభులు కలరు!
బాని సత్వము రానీకు!భద్ర రుద్ర!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
99.సీ:-నటరాజు నటనలే!వెటకారమును జేయు!
కుటిల విటపటులు!కొల్ల లిచట!
కుల మేది?మత మేది?గుణభావ షరళేది?
మంచికి కులమేల?మనసు చాలు!
జనన మరణ సృష్టి!సమ మన్ని జీవుల!
సమము కానిది బుద్ధి!చంచ లంబు!
బుద్ధి సన్మార్గ భావమే!భువనైక భావంబు!
భావంబె!మిత్రంబు!భద్ర మదియె!
తే.గీ:-జీవ ముక్తికి భక్తియే!శిష్ట మతము!
అట్టి మతమునువిడరాదు!యవని యందు!
తర తరంబులు కీర్తిల!దనరు టొప్పు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
100.సీ:-విష జన్య జనకులు!విషమునే?విరజిమ్ము!
స్వార్ధ సంసేవ్యమై!సరగు చుండు!
పరుల తా విష చర్య ప్రాణాలు తీతురు!
నైజంబు నర్మాన నడుగు లిడును!
ధర్మ మధర్మమై!ధరణి గతిని మార్చు!
భీభత్సములు గల్గి!భీతిలు ప్రజ!
యుగములు మారును!జగములు మాయును!
ప్రళ యాంత విష కన్య!పరుగు లెత్తు!
తే,గీ:-నీతి నెలకొను నానాడు!జాతి యందు!
ధర్మ రక్షణ మానాడు!తగ నెసంగు !
జీవ రక్షకు డాహరి!శిష్ట మేర్చు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
101.సీ:-స్త్రీ జనోద్ధర ణంచు!శివమెత్తి సంఘంబు!
మాన భంగాలకు!మాన్య మాయె!
రక్షణ కొదువాయె!భక్షణ మితి మీరె!
సంఘ సంస్కారంబు!చచ్చి పోయె!
మారణ హోమాలు! మత మెంచు ద్వేషాలు!
జాతి వైషమ్యాలు జగతి నిండె!
రాజ్యాంగ మెరుగని!రాణువ పాలింప!
నీతికి తావేది?నిశ్చయ మిది!
తే,గీ:-ఇట్టి మొలబంటి బురద!తా!యెట్లు?తొలగు!
యడుగు దీసి యడుగు నేయ!హరుని వశమె?
దేవ దత్తంపు చిత్తంబు దివురు నెపుడు?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
102.సి:-మితి మీరు నేరాలు!క్షితి జేరు కధనాలు!
గతి మించి చరియించు కలుష జనులు!
నేరమునకు శిక్ష జీర నీయని రక్ష!
భక్షించె నీతిని పాడు జగతి!
భయము చూడగ లేదు!పాపాల కంతేది?
ప్రశ్నించు వాడేడి?ప్రశ్న యేది?
నిర్జీవ ధర్మంబు!నిర్జించు శిక్షేది?
శిక్షకు దక్షేది??సేవ్య మేది?
తే,గీ:-మలిన సంఘ టితం బైన!మాయ కలిని!
మర్మ మెరు గంగ వశమౌనె?మనుజ తతికి!
పుట్ట దాగిన నాగుల గట్టి తనము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
103.సీ;-పెద్దల నెడమేర్చి!శుద్ధ జన్ముడ టంచు!
భూరక్షణము జేయు బుద్ధి గనునె?
స్వార్ధ భూయిష్టుడై!వ్యర్ధ సం ఘము జేరి!
తల్లి పరువు దీసి!దగ నెసంగు!
నెత్తి కెక్కిన కలి!చిత్తాలు! మొత్తును!
నీఱు చేయ వలెను!నీచ తతిని!
మలిన సంస్కారంబు!మాయతో నిండారు!
జలధి ముంచిన పోదు!జాణ తనము!
తే,గీ:-కలి'-విశేషత ధన మగ్న మలము కొనెను!
తెలివి మాలిన చేష్టలు !తెలియ బడవు!
నీచ సంఘంపు పాచిని!త్రోచ కున్న?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
104.సీ:-కలియుగాంత మనెడు!కాల జ్ఞానమరసి!
ధర్మ సంకట మొందె!ధరణి మాత!
కర్మ కాష్టము జేరె!కలిమియే!జగమాయె!
జగమంత యవినీతి రగులు చుండె!
తల్లి పిల్లను నమ్ము తరుణంబు చే జారె!
వమ్ము మాటల భూమి దుమ్ము పట్టె!
ధమ్ము ధైర్యము లేని!దండ నాయకు లుండ!
ప్రకృతి ప్రకోపంబు!ప్రజ్వ రిలదె?
తే,గీ:-నేల వీడిన సామాయె!నేటి జగము!
భగ్న లంపట జీవంబు!బాధ నింపె!
మొత్తి తల్లిని మోదించు చిత్తు లలరె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
105.సీ:-చిల్లు ముంత జలము!మెల్ల మెల్లగ జారు!
జారిన జలమెల్ల!పారు నేల!
బోలె గట్టిది యైన సోలని!మనుజుండు!
శివ తుల్యు డవ్వాడు!జీవి తాన!
జగ భాండ భారమ్ము!చక్కటి నైజుడే?
మోయ గలడు సుమ్మ!మోద మలర!
సంక్లిష్ట కాలాన!చతురత పాటించు
మేథావి వీవయ్య శోధి లంగ!
తే,గీ:-చేట పెయ్యలు జేరిరి!తాట దీసి!
దేశ ప్రగతికి పనిజేయు!దీప్తు లలర!
స్వేచ్ఛ!స్వచ్ఛత!సహకార జీవ మవగ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
106.సీ:-గతము చేసిన మేలు!గణనీయమై యొప్ప!
కీడు సేసెడి వారి పీడ తొలగి!
చెడు చేటు పడు పాటు!విడరాదు వారల!
దడ గల్గ జేయుమా!దండ మూని!
ఈర్ష్యాళురనునెట్టి!హేయ జీవుల నెల్ల!
దరి జేర నీకయ్య!దురిత జనుల!
రాజకీయపు చదరంగ రంగమునను!
మేలి పావువు గమ్ము శీలి వౌచు!
తే,గీ:-శీల చిత్రణ జేయుమా!జీనితాన!
ప్రగతి సుగతిని కాంక్షించు ప్రభువు కమ్ము!
జాతి విశ్వాన మేల్గను!ఖ్యాతి నింపు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
107.సీ:-బుద్ధి శుద్ధియు నైన బుధు లీర్ష్య ద్వేషాలు
తరియ నీవు!జగతి తంత్ర మింతె?
యాంత్రిక జీవాలు మాంత్రిక తత్వాలు!
శుష్క ప్రయాసాలు!క్షుద్రకములు!
భద్రాలు నిద్రాలు!నిద్రాలు పరహాని!
జ్యోతక భీభత్స పోషకాలు!
పోషిత నయనాలు!దూషిత ప్రభ లీన!
వేష భాషలె!మిన్న విశ్వ మింతె!
తే,గీ:-విశ్వ రక్షకు డైనను విసుగు నొందు!
ఇట్టి కల్మష కలి ధర్మ మిట్టు లుండె!
నీతి పాతాళ మంటెనే? జాత వేద!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
108.సీ:-శ్రమ కోర్వ జాలని శ్రమికులుగా దీర్చి!
రూకలు వెదజల్లి సోకు మప్పి!
భోగాలు చేకూర్చి రోగాలు కల్గించి!
వైద్య శాలల పెంపు శోద్య మలర!
ఒళ్ళు గుల్లను జేయు ఒబ్బిడి పధకాలు!
ఓట్లాశ యేదప్ప!వేరు గాదు!
పన్నుల రూపాన పట్టి లాగిన సొమ్ము!
పంచి ప్రగ తనుట!పాత కంబు!
తే,గీ:-తమదు గొప్పగ తలపోయ!ధర్మ మొక్కొ?
సేవ భావన మృగ్యత!జెప్ప గొప్ప!
ఒప్పు లని డప్ప రంబులు!తప్పు గావె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
109.సీ:-చేతనా శూన్యుల చేతనాలకు భీతి
పడుట తగదు తృంచి పార వేయు!
నిస్వార్ధ సలహాలు నిస్తుల సోమాలు!
సోమాలు పరమేశు!శోభ లలరు!
దైవ కృపను గోరు!ధర్మంబు కాపాడు!
ధర్మమే!ధన్యంబు ధాత్రి నిల్చు!
నిలువెత్తు సత్యాన విలువెంచి వర్తించు!
సాటి వారల యందు!మేటి వౌచు!
తే,గీ:-భవిత కాదర్శ మూర్తివై!వరలు మయ్య!
భరత మాత ప్రభల వెల్ల భాసి లంగ!
తీర్చి దిద్దుమి మేదుర దీప్తు లలర!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
110.సీ:-ఒద్దుగా శుద్దులు బుద్ధి యోచన జేసి!
శ్రద్ధ మీరిన పెంపు!జగతి కెంచు!
జన్మ సార్ధక మౌను!జాతి ఖ్యాతియు నిల్చు!
వర దైవ మీ వౌచు!వాసి గనెదు!
కల్పాంత రంబుల ఘన కీర్తి వాటిల్లు!
చెరుప శక్యము గాదు!శివుని కైన!
యే జన్మ పుణ్యమో?యీజన్మ సుఖదమై!
పదవి నిచ్చె!జగతి!భద్ర మేర్చు!
తే,గీ:-కార్య దీక్షను వీడక గడగు మంచి!
కలదు విష్ణ్వంశ నీయందు!కన వదేల?
తెలివి పాలించు రాష్ట్రాన్ని!దీప్తు లలర!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
111.సీ:-తన పెంపు యింపంచు!ధర్మంబు తెగ నెట్టి!
యిచ్చ వచ్చిన యట్లు యేల దగదు!
జాగీరు కాదిది జన చేతి వాటమ్ము!
గెలుపు ఓటము లవి!మలుపు తిరుగు!
సేవ భావన లేని చిత్ర నటకులకు
పదవు లొందుట కల్ల!భవిత మిథ్య!
దుష్ట పాలన తప్పు!తుప్పు రేగు తుదకు!
మంచి పెంచి మసల!యెంచ బడెదు!
తే,గీ:-తెలిసి యవినీతి పాలన!వెలగ బెట్ట!
జన్మ యందున గెల్చుట సాధ్య పడదు!
దురము దరి జేర రానీకు!తరిమి కొట్టు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
112.సీ:-గూడులో జీవుడు!గుడి లోని దేవుడు!
దేహ మాలయ మంచు తెలిసి మసలు!
అట్టి జీవము నిత్య మాహ్లాద జనితంబు!
దేహ కర్మ సుచిని!తేజ మేర్చు!
విపరీత చర్యలే!విస్వస్త తుల్య ముల్!
పాప సంకలితాలు ప్రభలు మాపు!
ప్రభ లేని జీవాలు !పాడు జల సమాలు!
సేవింప రెవ్వరు జీవ ధాత్రి!
తే,గీ:-నర్మ కర్మలు విడ నాడి నాణ్యమైన!
నవ్య నవనీత స్వచ్ఛత!నలర వలయు!
స్వచ్ఛ జీవార్ధ భావన సంతరింప!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
113.సీ:-డెబ్బ దెనిమి దేండ్ల!నిబ్బరం బేమాయె?
బోడి తలకు జుట్టు బొడము నట్లు!
వయసు మీరిన స్వేచ్ఛ!పాయసాన్నము తిను!
భాగ్యంబు కొదువాయె!భాను ప్రభల!
చింతా మణీ వైద్య మెంత జేసిన గాని!
నిండు యవ్వన స్వేచ్ఛ!పండు నొక్కొ?
దండుల స్వార్ధంబు ధాష్టీకముల ప్రభ!
తొలగు నాడు గదయ్య!వెలుగు జగతి!
తే,గీ:-వయసుతో!పని లేదయ్య!వలను పడిన!
నీతి మార్గాన నడిపించు నేత లలర!
సమత మమతలు సరి క్రొత్త!సరళి నడువ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
114.సీ:-ఉన్న తెంత యున్న మిన్నగా దలపోసి!
వెన్ను దన్ను విడువ వేడు కగునె?
కలుపు కొని జనుల కష్ట సుఖము లందు!
పాల్పంచు కొనమేలు!ప్రగతి యదియె?
కలి ధర్మ మియ్యది!ఖలు ధర్మమును గాక!
వెల ధర్మమును పెంచి!వెలుగు నింప!
సొంపు యింపెసలార!సోయగ నయనాల!
అమ్మ కీర్తులు పెంప రమ్ము వేగ!
తే,గీ:-వేగ భారతి జగదైక భోగ మలర!
సాంద్ర సౌశీల్య గరిమాన!జగము మెచ్చ!
వేంకటేశుడు నుప్పొంగ!విశ్వ రక్ష!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
115.సీ;-అందంబు తిన లేము!మందంబు గన లేము!
బంధంబు విడ లేము!బాధ యొకటె?
అందాల చందాల యపురూప భావాలు!
మందస్మితా నంద!మంది రాలు!
గంథాలు సుర గంథి గారాబు నాట్యాలు!
నాట్యాలు నవనీత!నర్మ దాలు!
తపన సాదృశ్యాలు!తపతీ ప్రవాహాలు!
సుర గంగ పర గంగ! సార సాలు!
తే,గీ:-తత్వ సంపన్నా లవధార్య!ధర్మ ములవి!
జగతి బ్రోచుచు సర్వత్ర!సరగు చుండు!
అట్టి వైవిద్య నిష్ణాత మెట్టు లేని!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
116.సీ:-తీరంబు చేరెడి తెర వెంచి మసలుమా!
చేరెదు గమ్యాన్ని!జీవి తాన.!
చిరమైన కీర్తియే!జీవితాశయ మంచు!
పావన చర్యల పరగు మెపుడు!
జీవ జాగృతి సేవ!చిన్మయా నందంబు!
ఆనంద మందంబు యవని యందు!
శాశ్వత మయ్యది!సంసారమున నిల్చు!
ఆచంద్ర తారార్క మవని వెల్గు!
. తే,గీ;-చరము జీవిత భోగాలు!తరుగు చుండు!
కీర్తి తరగదు పెంపౌను!యార్తి గనదు!
నిలుచు శాశ్వత మయ్యది!జగతి యందు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
117.సీ:-భుక్తి యాశయె గాని!ముక్తి యాశయు లేదు!
సూక్తులు విన లేరు సుచిని గనరు!
అడియాశ పొడి దుఃఖ మనెడు తీరుందురు!
ఆశ పాశము కంతు యసలె గనక!
యెంత సొమ్మును గొన్న!యిసుమంత గొనిపోరు!
యేలనోయి? దురాశ యిహము నందు!
ప్రాణాలు పోయిన!బహు వేగ క్షితి జేర్చి!
బూది చేతురు!పోదు!ఒంట రౌచు!
తే,గీ:-నాది నాదన్నది నీది కాదు జీవ!
చేరు పరమాత్ము మార్గమే!చివరి కలరు!
బోధ లాలించి సద్ధర్మ బుద్ధి! పరగి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
118.సీ:-నేడు నాదను కొని!నిక్కి నీల్గుట తప్పు!
రేపు నీదియు కాదు!రెచ్చి పోకు!
భవ బంధ మోచన భగవంతుడే!కూర్చు!
భగవంతు నెదిరింప ప్రాణ హాని!
పుట్టు గిట్టుక లవి!పురుషోత్తముని లీల!
లీలలం చెలగాట మేల?నీకు!
గెలుతువే!పరమాత్ము!గిలి గింత లేలయా?
కొండను ఢీకొట్ట మొండె మూడు!
, తే,గీ:-గర్వ భంగము కల్గును!కన వదేమి?
తృప్తి లేనట్టి జీవంబు తెప్ప రిలదు!
నోటి మంచది!లోకాన మేటి జేయు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
119.సీ:-మేటి వీరుడ నంచు!పోట్లాట నెంచగ!
తుదికి ప్రాణము పోవు!తూల తగదు!
తూలుటే!గర్వంబు దురితాల పుట్టయై!
నాగు పాము పగల నాట్య మాడు!
విషము గ్రక్కు నెపుడు?విషయ లోలుని జేసి!
కాటేసి చంపును!వేట లాడి!
సునిసిత భావాలు!బొడనీక!మనముల!
చెలరేగి వర్తింప!చెడెద వీవు!
,తే,గీ:-జన్మ సంస్కార సంస్తుత్య!సాధనముల!
మంచి నెంచుచు మహిమను!మసలు మయ్య!
విలువ గల జన్మ!నీదంచు!పలుకు నటుల!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
120,సీ:-తప్పు టూహల జన్మ తప్పులే!చేయించు!
తప్పు నొప్పును జేయ నొప్పు కొనదు!
దర్మార్గ జన్మంబు!దురహంబు కల్గించు!
సన్మార్గ సరళిని సాగ నీదు!
పిండ సౌజన్యంబు!బండరాయి సమము!
మారు టదియు కల్ల మనుజు లందు!
పాషండ హృదయుల దోషాలు సరి జేయ!
ఫాలాక్షు వశమౌనె?భద్ర జగతి!
తే,గీ:-జాతి మత సంక టాలకు చరమ గీతి!
పాడి సామ్యత భావాన్ని!వరల జేసి!
తల్లి భూమాత!దీప్తులు!ధరను నింపి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
121. సీ:-ధన దరిద్రులు వీరు!ధనముండి లేదని
పధకాల ధనముకై!ప్రాకు లాడి!
చెమట చింద నీరు!చిమ్మటి పురుగులై!
చేతి వాటము జూపి చెలగెద రిట!
స్వార్ధంబు వారిది! అర్ధంబు వీరిది!
వ్యర్ధంబు ప్రగతంచు!వరల రేమొ?
కుంచితాగ్రపు బుద్ధి!సంచిత పాపంబు!
యమ పాశ బద్ధత!భము లవేల?
తే,గీ:-నిజము నిష్టుర మేర్చును!నేల యందు!
ఆత్మ శోధన గావించి నరయు నిజము!
బూది జీవంబు తుదికంచు!బుద్ధి నెంచి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
122.సీ:-గంగి గోవుల యట్లు!గన్పట్టు చుందురు!
పాలు పిదుక నేగ పండ్లు రాలు!
మెత్తగా గొంతుక లుత్తరింతురు గాని!
మంచి చెడుల నెంచు!మనసు లేదు!
తమ చెప్పు చేతల!ధర్మంబు బంధించి!
నిజము మాయను ముంచి నెగడుదు రిల!
భగవంతు నైనను!బంధించి తెత్తురు!
కలి మాయ!ప్రభయని!కధలు చెప్పి!
తే,గీ:-ఇట్టి మాయల దిట్టల నెట్టు లేని?
పట్ట శక్యము కాదయ్య!పరము కైన!
భూత విజృంభణమె మేలు పుడమి కనగ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
123.సీ;-చెద పుట్ట లివి యని!వదలుట తగదయ్య!
నాగుల వాసమై!నాశ మేర్చు!
కట్టడి గావించి!కాల్రాసి దురితుల!
చెడు మట్టి పెట్టిన! విడును పీడ!
ప్రగతికి బాటయై!ప్రభవంబు జూపింప!
రామ రాజ్య మగును రహిని మించి!
నేల సుభిక్షమై!నీతి నిండారగ!
భుక్తి కొదువ లేక!భూమి యలరు!
తే,గీ:-నీతి నింపెడు పాలన నిరుపమంబు!
జాతి సౌభాగ్య గరిమంబు సంతరించు!
బ్రతుకు సుఖమయ మొందెడి భాగ్య మబ్బు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
124.సీ:-పధకాల యప్పులు!ప్రాళుబ్ధ కర్మయై!
భావి జీవితములు!భగ్న మేర్చె!
నిజమైన బీదకు భజనయే!సరిపోయె!
పధకాల నందెడి! పట్టు లేక!
భరత జాతియె! బీద వాదంబు ముందుండు!
అందరు బీదలే!అవని భరతి!
మాయ మోసాలకు!మారుపేరు మనది!
వీరి నైజము మార్ప!లేరు!సురలు!
,తే,గీ:-కులము సాకుతొ!గెలుపును!కోరు కొంచు!
నీతి దరిజేర నోపరు!నీచ తతులు!
దోచి దాచెడు మతమదె!దొరకొనంగ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
125.సీ:- నత్త గుల్లల మధ్య ముత్తెము లుండునా!
చిత్త భ్రమయె గాక!నుత్తి మాటె!
అత్తరు పన్నీరు యలమునె?బూదిలో?
క్షిప్ర సన్మాతృక!జీవ మింతె!
మెండైన కూతల!నిండైన స్వార్ధంబు!
దండుగే!ధాత్రికి!ధర్మ మింతె?
తుక్కు రేగ ను కొట్టు!తూలిపోవగ జాతి!
భవిత శూన్యత తప్ప!భద్ర మేది?
తే,గీ;-పాప పంకిలముకడిగి!భవిత తీర్చ!
దుష్ట చర్యల దూరత!పుష్టి గూర్చు!
పాల నంబది!మంచిగా!బరగు నపుడు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
126.సీ:-అందరి ధనమును కొందరే!గొనుటది!
సరి మార్గ మౌనొకో?జగము నందు!
పుట్టు సారము లేక!పెట్టు సారము పెంచ!
సరిగాదు!భవితకు!సంకట మగు!
దేశ భాగ్యము చెడు!దీనావస్తకు జను!
భావి తర సిరులు!భంగ పడును!
చేయూత మప్పిన!నీయూత దిగ జారు!
దొర్లి దొర్లియు నేడ్వ!!దూష ణౌను!
తే,గీ:-దూర ధృష్టియు లేనట్టి!దొర తనంబు!
స్వార్ధ రాహిత్య సిద్ధాంత సౌరు లుడుగు!
పంచు కొని పోవు!పాలన!పాల నంబె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
127..సీ:-వంట బట్టిన దాస్య!మంటి వీడక నిల్చె!
పూర్వ సువాసనల్!బొడము చుండ!
నైజంబు మారునే?నర్మంబు వీడునే?
మర్మార్తి బోధలు!మరుగు పడునె?
నాటి నైపుణ్యంబు!నేటికీ!గనరాదు!
నోటు గోటుల పోటు!చోటు గొనగ!
పాటు స్వార్ధము నంటె!పరమంబు!చే జారె!
చేటుకే!ఓటాయె!చేదు నిజము!
,తే,గీ:-బీటు వారిన భారతి!మేటి నిలుప!
మనుజ తత్వాలు మారక!మవ సరంబు!
మంచి పాలన మందించు!మహితు లకును!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
128.సీ:-దేశ సౌరులు పెంచు!తేజోమయులు నేల!
ప్రగతి కడ్డము నిల్చు!వారు గలరు!
వేన వేండ్రు గలరు!పేరును మాపంగ!
కలుపు మొక్కల నేరి!కదల వలయు!
నిస్వార్ధ సేవయే!విశ్వాస మును పెంచు!
ప్రగతి శొబగు లెల్ల!సు గమ మగు!
పట్టు సడల రాదు!పాలించు వారలు!
సమత మమత బాట!సాగ వలయు!
తే,గీ:-సుజన సలహాలు నాలించి!శుద్ధ మతిని!
నీతి జనులను మన్నించి!జాతి మెచ్చ!
తృంచి వైషమ్య తత్వుల!తీరు నొదవ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
129.సీ:-అలసి సొలసి తమ్మ!అలివేలు మంగమ్మ!
మేలెల్ల నిహమందు!మెరియ దాయె!
మురిపాల ముత్యాలు మోహనా కారాలు!
వెలి భూది ఛాయల!వెలుగు లలరె!
భూది తుదికి నిల్చె!భూతి కానగ దాయె!
మిథ్య నాధం బది!మేథి నంటె!
సద్యశో భాగ్యాలు!చచ్చు దద్దమ లంటె!
అంట దాయె!ప్రజ్ఞ!అర్హుల కిల!
,తే,గీ:-మాయ మేళవ జగ మాయె!మంచి గనక!
కంటి గంతల ధర్మంబు కుంటి దాయె!
కొంటి కలి వెంట!కులమది కదులు చుండె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
130.,సీ:-తోలు బొమ్మల యాట!తొక్కుడు బిళ్ళాట!
పాలు పోనటి యూహ!పతన బాట!
బాట పతన మది!బంగార మందింప!
మూతి మురికి పిందె!మోద మంద!
ఏమి?భోగంబిది!యే రాగ మియ్యది?
సారంగధర వైన సార మిద్ది!
ప్రే రేపణము జేసి!పీడించు తీరిది!
విష కన్య ప్రభ లీను విశ్వ మిద్ది!
,తే.గీ;-తప్పు లొప్పులు నౌనిల!గొప్ప నొప్ప!
అప్పు లొప్పారు!తిప్పలే!తప్ప వింక!
నీతి గనరాని పాటుల!నీల్గ జేసి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
131.సీ:-ముర్ఛ నొందిన తల్లి! చర్చల పాల్జేసి!
చేతి నినుప ఊస!చేర్చ మాని!
పసరు వైద్యము జేసి ప్రాణాలు తీయగా!
నుద్యుక్తు లై రేమొ?సద్యశ మన!
ప్రత్యేక వైద్యంబు!పట్టు నెంచగ రైరి!
నాటు వైద్యము సేయ!నయము నౌనె?
సరియైన వైద్యంబు!మెరుగుగా నందింప!
ముందుండి నడిపించు !బంధు వౌచు!
తే,గీ;-తల్లి రక్షణ ముఖ్యంబు!తలచి మదిని!
పీడ రోగంపు తల్లిని ప్రీతి గావు!
అమ్మ రక్షణ కర్తవ్య! మందు కొమ్మ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
132.సీ:-రాకాసి తత్వంబు రహి మించి చరియింప!
రాబందు రాజ్యమై!రంజిలు గదె!
కోతి చేష్టలు చేయ!కొంపలు కూలును!
భావి దేశ ప్రభలు భ్రష్టు పట్టు!
సంకుల సమరము!సంసార భంగమ్ము!
ప్రీతి పాత్రత చెడు!భీతి మిగులు!
భీతావ హంబునౌ!చేతనా శూన్యమౌ!
పాత రోతయె దక్కు ప్రభలు మాయు!
తే,గీ:-మాతృ భక్తి విహీనులై!మనుజు లలర!
దేశ ద్రోహము గాదొకో?తెలిసి మసలు!
విశ్వ విఖ్యాత కీర్తుల వెలయ నిమ్ము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
133.సీ;-వంటి నిండా పని!కంటి నిండా నిద్ర!
మింటి కెగయు కీర్తి మేకొనంగ!
సాటి వారల మేలు!మేటి వారల భక్తి!
వాక్సుద్ధి సుర భక్తి !వరల వలెను!
దీన రక్షణ రక్తి!!మాన రక్షణ దీక్ష!
బహుళార్ధ సాధక!ప్రభుత గనుము!
ఇహ జన్మ సౌఖ్యంబు!నహ రహంబులు పొంద!
భక్తి మార్గము నెంచి ముక్తి నొందు!
తే,గీ:-జన్మ సార్ధక మౌనట్లు సరగు మయ్య!
కాయ కష్టాల కోర్చిన కలుగు సుఖము!
న్యాయ విత్తంబు నిత్యంబు!నరుల కెల్ల!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
134.సీ;-కష్ట సుఖము లవి కావడి కుండలు!
ఒకదాని వెంట వేరొకటి వచ్చు!
కష్ట కాలమునందు కన్నీరు బెట్టకు!
చెప్పుకొన సుఖము గొప్ప తగదు!
కాలాను గుణ్యమై!కదలాడు నయ్వవి!
సమ మెంచి జీవించు!!సాహసాన!
ఎదురేల? బెదు రేల?సొదలందు ధీరమే!
మనసు కుదురు పర్చు!మరువ బోకు!
తే,గీ:-మమత సమతాను రాగాల మసలు జనుడు!
శాంత చిత్తుడు!శుభగుడు!సత్వ మూర్తి!
మూడు కాలాల ముచ్చట్ల!మునిగి తేలు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
135.సీ:-పట్టె డన్నంబుకై!పాపాలు చేయంగ!
పాపానుభవమది!భవిత మాపు!
మాసిన భవితలో!మారాడ నేరక!
దోషివై నిల్చెదు!ఘోష పడెదు!
ఘోషిల జగమెల్ల కూడు గుడ్డయు లేక!
నీరసించి జనెదు!నీడ లేక!
నీడ లేని బ్రతుకు నీరు లేని చెఱువు!
దాహంబు తీర్చునే?ధాత్రి యందు!
తే,గీ:-రాదు సంపద నీవెంట రాలు నాడు!
పోదు పాపంబు!శిక్షిత వేద గూర్చు!
వేదలం జూడ బోకుమా!వినుము మంచి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
136.సీ:-సాహసంబు తగదు సర్వ వేళల యందు!
ఒక పరి ప్రాణాల నూడ్చి పెట్టు!
జీవింప జేయుచు!జీవించు నీతిగా!
నీతియే!నరజాతి ఖ్యాతి గాదె?
జాతి నీతియె ఖ్యాతి!జగదైక మోహంబు!
మోహనాకారివై!మోద మొందు!
బోధనంబుల మంచి! పూజ్యమై!సుర కీర్తి!
సదనంబు చేరుమా!బుధ వరామ!
,తే,గీ;-పొట్ట నిండగు పుణ్యాల!దిట్ట వౌచు!
బొజ్జ గణపయ్య సర్వత్ర!పూజ్య తిడగ!
జీవనాధార భాగ్యాలు!శివత మేర్చ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
137.సీ:-"కోతి కొమ్మచ్చాట!కూడునే?ధర నేల!
నీతి స్వచ్ఛత!ధర్మ! నిరతి వలయు!
మర్మంపు నటకులు!మహిధర్మ భక్ష కుల్!
చెడుని మంచిగ మాటాడు!చేవ గలదు!
మహినేల సరి గాదు!మాయమౌ సిరు లెల్ల!
బిచ్చ మెత్తు జగమగు!ప్రేమ బాసి!
హక్కు ధనము నకు!చిక్కి!బిక్క వోవు!
స్వా తంత్ర్య మానాడు!చచ్చు వడును!
,తే,గీ:-ఓటు నోటుమహిమ జిక్కి!పోటి నిల్చె!
ధనము విదజల్లి గెల్చిన!మనుజు లలర!
రాజకీయము వ్యాపార!రాజ్య మాయె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
138.సీ:-అర చేత!వైకుంఠ శరదిందు చంద్రికై!
పట్టు కంకని యట్లు ప్రభల వెల్గె!
చంద్ర బిందము నీట! సాదృశ్య మానమై!
చేత చిక్కని యట్లు!చేర దవని!
యంత్రాంగ తంత్రాలు మంత్రాంగ భరితాలు!
చేర నీయదు సిరి!జీవి తాన!
జన సొత్తు మొత్తంబు!చాక చక్యము జూపి!
లాగి నీతి జ్ఞత!సాగి సాగి!
తే,గీ:-తెలివి తేటలు జూపి!తెలియ నటుల!
దోచి దాచెడు భావంబు!శుచియు నగునె?
మభ్య మాధురి భావంబు!మచ్చ గాదె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
139.సీ;-తన్ని లాగు కొనెడు!ధర్మంబు స్వేచ్ఛాయె!
ఇంద్ర జాల మిదియని!యేల?గనరు!
మాయ పూరిత స్వేచ్ఛ మాయలో!మృగ్యమై!
మాయ మోహిత మేర్చె!మనుజ తతికి!
మిథ్య జగంబిది!మేథ కంద దాయె!
క్షుద్ర శక్తది యేదొ?చుట్టి ముట్టె!
మాధవుడే దిక్కు!మాయావులను మార్చ!
కాట కాటంకాలు!కాల రాయ!
తే,గీ:-రమ్ము దివి వీడి భువి కీవు!రక్ష నొసగ!
కుక్షి తాఖిల భువనాల!కొలువు!వీవు!
కలిని సత్యంబు ధర్మంబు కావ కున్న!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
140.సి:-జనన మరణాల సందు నందల్లాడు!
జీవుండు కర్మంబు చిక్కు కొనుచు!
భుక్తికై! రక్తికై! యుక్తికై! ముక్తికై!
శక్తి మించి నడచు!జగము నందు!
కర్మ సిద్ధాంతంబు నిర్మలం బేపార!
పరమాత్ము నైక్యంబు బడయ గలడు!
దుష్కర్మ దురితుండు! దురహాన వర్తింప!
పాడు కూప జలాల!పరితపించు!
తే,గీ:- మంచి చెడ్డలు యోచించు! మనసు కల్గి!
చెడును చేపట్ట నెంచిన!చెడెద వీవు!
జన్మ సార్ధక మెంచుచో?జయము నీదె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
141.సీ;-రాజ్య లక్ష్మి వరించె రక్త పిశాచుల!
జ్ఞానాగ్ని బడబాగ్ని!సరగ నీక!
అజ్ఞాన తిమిరంబు ప్రజ్ఞాను కూలమై!
విజ్ఞాన వీధుల విస్త రించె!
క్షుద్రంబె?రుద్రమై !పాలనా పక్షమై!
నిష్ణాతులను జేసి!నేలె జగతి!
వైషమ్య భావాల విషతత్వ!ప్రభ లొప్పె!
తత్వ జ్ఞానంబును తరిమి కొట్టి!
తే,గీ;-చిత్ర వైచిత్రి భావాల జీవ సరళి!
సుష్క స్మృతి దూర!నతు లెల్ల!నిష్క్ర మించె!
ఆర్ష జన బోధ వికటమై! యవని నిల్చె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
142.సీ:-పుట్టు సార మిటుల పట్టు పట్టి విడక !
జన్మసార్ధక మెంచు!జగము బ్రోవ!
ఘృత హుతం బింద్రుడు!స్మృతి ధర్ము లకు నీయ!
సంతుష్టులై వారు!జగము గావ!
ఖలులు సు జనులౌచు!ఘన పాల నం బలరార!
భవ్యులై. !ప్రజ లెల్ల. !వరల గలరు!
మాట వినని వారి!మార్ప శక్యము గాదు!
భూతేశుడే!తగు! బుద్ధి చెప్ప!
తే,గీ:-చేయి జారిన ధర్మంబు చేర బోదు!
నేర కర్ముల నీతిని కోర దగదు!
పావ కంబుల శీలంబు భంగ పడదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
143.సీ:-పరమత ముల జేరి!ప్రావీణ్య మొందగా!
తన మత మేమౌనొ?తలప రేల?
కుల ధర్మ ముల యందు!కుల కంటకులు నౌచు!
పర కులంబుల జేరి!పాడు పరచ!
తాము జెడుటె గాక!!తమవారి చెరుపంగ!
పుట్ట గతులు మాయు!భూతి గనక!
సామ్య వాదమటంచు!సర్వమేకము జేయు!
కుల జాతి మతహీన!కొర్కె తగదు!
తే,గీ:-భూది జేయంగ పుడమిని బూని రేల?
విషపు టూహల విశ్వంబు!విచ్ఛి పోవు!
తత్వ జ్ఞానము లేనట్టి!తనువు లేల?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
144.సీ:-కర్మ సిద్ధాంతంబు గమియించి చరియింప!
ప్రకృతి ప్ర కోపాన !వికృ తలరు!
కుల ధర్మముల నెత్త!మలిన సంస్కృతి గాదె?
పర ధర్మ మంటిన!భ్రష్టు పట్టు!
ఆత్మ ధర్మము మెచ్చి!అన్యాయ మంటక!
మంచిగా సత్కర్మ!మనుట సుఖము!
కొట్టు మిట్టాడి చే పట్టి! పరత కోర!
ఘోర క్లిష్ట స్థితిని!కొందు వేల?
,తే,గీ:-గాన గార్ధభ సంగీత జ్ఞాన మేల?
శృతులు స్మృతి ఫధాన నమర!గతియు జూపు!
పాడు చింతన పాపంబు!ప్రాణ హాని!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
145.సీ:-కుల ధర్మమున నొప్పి!మలిన బుద్ధిని వీడి!
కర్మాను సారివై! కదల ముక్తి!
పర కులముల జొచ్చి!ప్రాళు బ్ధ కర్మాన!
కుల హీను డౌ టేల?కుత్సి తాన!
వింత పశువు లట్ల విజ్ఞాన హీనులై!
చెడు నంట బోకుమా!పడెదు నేల!
కండ కావర మేల?బండ చేతన మేల?
చిత్ర గుప్తుని లెక్క చిక్క కయ్య!
,తే,గీ:-గడిచినయుగాల!కులములు!కలవు గాదె!
నాటి సఖ్యత నెంచుమా!గోట దేల?
ఘర్షణలు గూర్చి పాలించ!హర్ష మౌనె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
146.సీ:-బాని సత్వపు బుద్ధి!బాయదాయె నదేమొ?
పర వేష భాషలు!వదల వాయె!
కుల మతములు లేని కుత్సిత సంస్కృతి!
నర నరంబుల బట్టి!నడిపె జగతి!
దుర్మార్గ గ్రాహియై!దురితాల పుట్టాయె!
మాడె!ధర్మ మధర్మ మారణాన!
మంచి చేకూర్ప రాదంచిత పుణ్యాన!
సంచి తార్ధము లెల్ల!సాగి పోయె!
,తే,గీ:-ఘోష వినరాయె!లాంపట్య ! కోట రాశ!
ధనమె జగమేలె!ధర్మంబు దాగె మూల!
పట్టి వంచించు వారికి!భయ పడుచును!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
147.సీ:-పధకాలు లేకున్న పాలనే!లేనిదౌ!
నిండు నీతిజ్ఞత!దండు గౌను!
జన్మ స్వార్ధము తప్ప!జాతి క్షేమం బేది?
పర పెంపు పధకాలు!పదవు లీయ!
గోపుర సోఫాన మేపునే!వరియింప!
దిగువ చూడ నీదు!తెంప రంబు!
భూపాల నార్ధంబు!భూభుక్త మై యొప్ప!
ద్వీపాలు సాధింప!దివ్య మగునె?
తే,గీ;-ఎవరి లక్ష్యము వారిదె!యిహ మదింతె?
స్వేచ్ఛ విడుచుట నొప్పరు!సేవ గనరు!
జనుల చిన చూపు చూతురు!ఖనుల యట్లు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
.148.సీ:-తల్లి వనరు లెల్ల తాకట్లు వాకట్లు!
అప్పుల పథకాలు గొప్ప లొప్ప!
గర్భ రత్నాలెల్ల!కాల నేములు మ్రింగ!
తల్లి జూదము నొడ్డు తరుణ మాయె!
గెలుపు ముఖ్యము గాని!తలపరే!భవితను!
బీదరికము! పోదు!చేదు నిజము!
అప్పుల జన పెంపు!చిప్ప చేతికి వచ్చు!
చొప్పడ కున్నట్టి చొరవ తగదు!
తే,గీ:-అప్పు విషనాగ తుల్యంబు!తిప్ప లలము!
పెంపు శ్రమదాన ఫలమున!ప్రీతి దనరు!
సోమరత్వము మప్పిన!భాము లలరు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
149.సీ:- జాతేది?కుల మేది?జాగ్ర దావస్థల!
మతమేది?కష్టాల మనుజుల కిల!
పగలేది?రాత్రేది?పగతుర భంజింప!
పొదు గేది?బిగు వేది?పోవు నాడు!
తిర మేది?పర మేది?తీరు కాలము నాడు!
నేడేమొ?రేపేమొ?నీవు గనెదె?
తారాడు నాధంబు!పోరాడు జీవంబు!
కాలార్తి కాలాన!కన వదేల?
,తే,గీ:-అడుగు యడుగున గండాల యలరు నరుడు!
తానె?సృష్టికి!నేతగా!దలప దగునె?
నీవు యన నెంత?నీలోని!చేవ దెంత?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
150.సీ;-ధనము ధరణి నేలు! దర్పంబు చేకూర్చు!
దర్పం బసూయకు దారి తీయు!
సత్యంబు నెడమేగు!సాగు దుష్కృతములు!
మాయయే!గెలుపొందు!మంచి మాయు!
పాప పుణ్యా లవి పట్టవు! మదము చే!
యింకిత జ్ఞానంబు!యీస డిల్లు!
దైవ ధిక్కారంబు! దండి పొంకము నబ్బు!
ధర్మాన్ని తలదన్ని!దనర జేయు!
తే,గీ:-పంచ భూతాత్మ దేహంబు భగ్గు రనెడు!
దివస మాసన్న మౌ నాడు!తెలియ నగును!
మార్పు చేకూర్ప శక్యమే?మాయ కలిని!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
151.సీ:-జగదభి రామాన పాలింప వచ్చిన!
పాలింప రానీరు!పడుదు రడ్డు!
కుటిల సంఘమునందు కుటిలురే!ఘటికు లై
పాలనంబును పట్టి!వదల రవని!
దండిగా భోంచేసి!దర్పంబు చాటుచు!
మేటి గుణుబ మంచు!!మెదలు చవని!
చాక చక్యముగల!చక్కని పాలనన్
కించ పరచి భవి!నెంచ నీరు!
తే,గీ;-చెడ్డ వానిగ ముద్రేసి!సిగ్గు పడక!
ఓడు వరకను విడువరు!చీడ జనులు!
అట్టి వారిని పసిగట్టి!నెట్ట వలెను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
152.సీ:-రాజ్యాంగ మెరుగని!రాజ్య పాలన మింతె?
గందర గోళాని కాట పట్టు!
మంత్ర బద్ధము జేసి!యంత్రాంగ సర్వంబు!
తంత్ర పాలన మంచి!ధన్యతందె!
నాయక నేరాలు!నౌకర్ల శిక్షయై!
నారాయణుని లీల! నాట్య మాయె!
స్వేచ్ఛేదె?బ్రతు కేది?జీవ సౌఖ్యం బేది?
స్వార్ధంబు నిండిన!వ్యర్ధ జగతి!
,తే,గీ:-ముందు యూహయు లేని యీ మూర్ఖ చర్య!
పరమ సంసార శోభలు!భ్రష్ట మేర్చు!
ప్రకృతి పాపాల భరియింప వలను పడక!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
153.సీ:-ధృష్టి లోపంబుచే!సృష్టి విను కలిని!
న్యాయ దేవత మాయ!నలప బడెను!
విని జెప్పు న్యాయంబు!విశ్వస నీయమై!
నిజమంచు భువియందు!విజయ మాయె!
అలుసుగా తగ గొని!అన్యాయ వాదన!
మాయ గెలుపు కెంతొ?సాయ పడగ!
నీతిజ్ఞు దండన నేలిక !గెలుపవ!
విఱ్ఱ వీగను జేసె!వెఱ్ఱి మాయ!
తే,గీ:-న్యాయ శాస్త్రాన్ని!మభ్యత నడుపు శక్తి!
కుటిల సంస్కారులకు నబ్బె!కువలయాన!
మాయ కలిని గెల్చెడి శక్తి!మందగించె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
154.సీ:-పంచ వర్షపు శోభ!భాగ్యంబు నీయగా!
ముప్ప దేండ్లగు! సేవ!ముంచి రకట!
శాసించు వారలే!సర్వోన్నతులు నైరి!
స్వార్ధ పూరిత చింత!సంతరింప!
యంత్రాంగ మదియెల్ల!హస్త గతము కాగ!
భస్మాసురుల భంగి!వరలు చుండ!
నీతి పెంపది జాతి!నేల మట్టము జేసె!
కాల ధర్మము కాస్త!కల్ల లలరె!
తే,గీ:-వేద విజ్ఞాన భాసుర విశ్వ మందు
తల్లి భారతి జేసిన తప్ప దేమొ?
పరుల పీడకు మించిన!బాధ నేడు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
155.సీ:-ఐదేండ్ల పాలన ఐశ్వర్యమును నింప!
ముప్ప దేండ్లగు సేవ మురికి బారె!
కలి ధర్మ మిద్దిరా!కపట నాటక మయ్య!
నీతి జాతికి నంటె!నిగలు చెరిగె!
కర్మ కాటక మెంచె!కట్టు దప్పె ప్రగతి!
తన పెంపు నింపంచు!బ్రతుకు నెగడె!
భూ భోక్త లౌచును!భోగాల తుల తూగ!
సర్వ సామ్యము గాదు!స్వార్ధ చింత!
తే,గీ:-ఇట్టి స్వాతంత్ర్య మెన్నాళ్ళొ?యెరుగ నౌనె?
పంచ భూతాత్మ!భూమాత పరువు నిలుప!
నీతి యే కోశ మందైన నిల్ప వలయు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
156.సీ;-ప్రతి నిది నాయకప్రీతి పాత్రంబైన!
పాఠశాలలు దయ!భాసుర మయి!
పేద వీధి బడులు!చీదరణ గురి యాయె!
ఎకిమీని చిరు కంటి వెకిలి చేష్ట!
మాటల గారిడీ!మాయ మైక మలరె!
పప్పు!ఉప్పుల ధర!పైకి నెగసె!
పన్నుల భారంబు!మిన్నంటె!యలరారె!
హస్త లాఘవ విద్య యలమె పుడమి!
తే,గీ:-తనదు పెంపది పెంపంచు తనియుదు రిల!
పరుల పెంపెంచ నూహింప!భవిత మెరుగ
బాగు పడు జగ మెల్లయు!బహు విధాల
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
157.సీ;-కుల ప్రాతి పదిక కొలమాన మీనాడు!
ప్రజ్ఞ పాటవములు!భ్రష్టు పట్టె!
పటు లేని కట్టడ ప్రాభవం బేపారి!
ప్రజలధనము లెల్ల!వ్యర్ధ మాయె!
అర్ధ జ్ఞానము లేని!అర్థ సంపద ముప్పు!
సర్వ శ్రేయము మాయు!జగము చెడును!
మమతాను రాగాలు!మట్టిలో గలియును!
నిజము నిష్టుర మేర్చి!నింద గూర్చు!
తే,గీ:-పరము మదినెంచి పాలించు ప్రభులు వలయు!
ప్రీతి సర్వద పాటించు నీతివలయు!
సర్వ సమతాను రాగాల!సాగ వలయు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
158.సీ:-గొప్ప డప్పరములు కుప్ప కూల్చు ప్రగతి!
తృప్తి నొందని జీవి దిగుల నొందు!
చేయూత పేరున జీవ భ్రమల ముంచి!
సోమరులను జేయ!శుద్ధ మౌనె?
ప్రజల ధనము పంచి!పరమదాతల మన!
యెంత న్యాయమొ?మది నెంచ రేల?
నేను తెలి వరంచు!నిగుడుట సరిగాదు!
తెలివి కంతము లేదు!తెలిసి మసలు!
తే,గీ:-మాయ మర్మము లేనట్టి!మనసు కలిగి!
మంచి పాలన మందించు మనిషి వయ్యు!
అన్న దమ్ముల సఖ్యత!యవని నింపు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
159.సీ:-పురుషార్ధముల కాది ప్రోక్తంబు!ధర్మంబు!
ధర్మ యుతము గాని ధనము ధనమె?
ధర్మ సంపాదన! ధాతృత్వమును పెంచు!
కామ్యార్ధ ఫలదమై!కైవల మిడు!
ధర్మ మంటని కామ!మర్మ మరిష డాల!
కట్టు బానిస జేసి!కదల జేయు!
అరిషడు లంటిన!హరి జేర తరమౌనె?
పాప జన్మల నెత్తు బాధ లేల?
తే,గీ:-పరము నైక్యము చెందెడి భావ మరసి!
మంచి నంటిన మనసునే!మసలు మెపుడు!
చరిత మంచిగ నిలుతువు!స్థిరత కీర్తి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
160.సీ:-మానవ సేవయే!మాథవు సేవగా!
జగతి ప్రగతి నెంచి సాగ వలయు!
ఆకొన్న వారికి యాకలి దీర్పగా!
జన్మ సార్ధక మగు!జయము కల్గు!
మాయ కమ్మిన మంచి మాయనే!కాంక్షించు!
మంచి చూడ గనదు మాయ ప్రభల!
పరుల పొట్టలు గొట్టి పరమాన్నమును తిన్న!
నరక ప్రాప్తియె గాక!పరము గనునె?
తే,గీ;-తెలివి గల జన్మ!నరజన్మ!తెలిసి కొమ్మ!
మేలు చేసిన మేలౌను!మేలు కొమ్మ!
చేత నంబున కీడెంచ!చెడెద వీవు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
161.సీ;:-దీర్ఘ పధకములు దివురునే?చివరకున్!
మాయ పూరిత యూహ!మదిని తలప!
అప్పుల్లొ పధకాలు!ముప్పు నుప్ప తిలును!
బిచ్చ మెత్తు జగము!భీతి తోడ!
పొట్ట కూటికి పాట్లు!పుట్టె డాశల ముప్పు!
భవితశూన్యమగును!బ్రతుకు చెడును!
తాను బ్రతకలేడు!తనవారి గనలేడు?
నిండు శూన్యుడగును!నిలువ లేక!
తే,గీ:-ముందు చూపుయు గావలె!మోద మలర!
మంచి మార్పును గోరుమా!మనుజు వయ్యు!
చెడును దరిజేర నీయకు!సేవ యందు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
162.సీ:-మంచి యూహల నొప్పి!మహిమంబు జాపించి!
మంద భాగ్యుల గావు!మాన్య జీవ!
రాజ్యాంగ మెరిగిన!రాజన్యు డీవన
రాము పాలన మను!రక్తి నిడుమ!
ధన దాహ మెంచిన!దర్పంబు వెన్నంటు!
జాతి మనుగడకు!చావు దెబ్బ!
నీతి సాక్షుడు కమ్ము!నీతిని నిలుపంగ!
నీతియే కాపాడు నిండు జగము!
,తే,గీ:-మలిన సంస్కార జనులను!కలవ మాను!
ఆర్ష బోధల నాలించు!హర్ష మొదవు!
వాచ దోషము రానీకు!వన్నె నొందు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
163.సీ:-కుంచి తాగ్రపు బుద్ధి!కువల యానందమై!
ఘనత మట్టి గలుపు ఘనులు గలరు!
స్థిత ప్రజ్ఞ జీవింప!చింతలం ముంతురు!
మాయమోహిత మోహ మాయ వలన!
చచ్చినా విడనట్టి స్వార్ధ చింతన మంతె!
పార ద్రోలెను నీతి!మేర దాటి!
విష తుల్య భావాలు!విను వీధి విహరించె!
చేరునే?సత్యంబు!చిత్తములకు!
,తే,గీ:-ఉత్తి దుత్తల ఘృత భ్రమ లొత్తి జూప!
నిజము నిజమంచు ప్రజలెల్ల?భజన సేయ!
మంచి గనలేని మాయయే!మహిని నిండె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
164.సీ:-చిన నాటి నుండియు చిగు రొత్తు నీతుల!
జాతి ప్రభవ మెల్ల చక్క నేర్చి!
ధర్మ మార్గము నంటి!ధాతృత్వ గుణముల!
సఖ్యతా భావంబు చక్క నిల్పి!
సంస్కార వంతమౌ!చక్కటి హిత బోధ!
మత సామ రస్యాన!మనసు నిలిపి!
సోదరాదర భావ!శుద్ధ తత్వంబున
జగదైక ప్రా జ్ఞుగా! చదువు నేర్పి!
తే,గీ:-భావి పౌరుల తీర్చిన!భద్ర మగును!
క్షుద్ర తత్వము లేనట్టి?సుగుణు లవరె?
స్వేచ్ఛ స్వచ్ఛత గనకున్న!సిగ్గు గాదె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
165.ఎన్నెన్నొ?త్యాగాలు!మిన్నంటు నినదాలు!
స్వేచ్ఛకై ప్రాణాల నిచ్చి రపుడు!
దొరల ధాష్టీకాలు!తొలగించి దేశాన్ని!
చక్కగా నడుపంగ!సాగి రిపుడు!
నలుబదేండ్ల వరకు!నాణ్యత కొనసాగె!
రాను రానది!స్వార్ధ!రాజి యాయె!
కుల మత ద్వేషాలు!చెలరేగి నర్తించె!
మాటకే సామ్యత!మనగ డాయె!
తే,గీ:-తరిమి ప్రజ్ఞను తమవారి మెరుగు చూపె!
తక్కు డెక్కు డాయెను జాతి!తంత్ర మహిమ!
ఈర్ష్య ద్వేషాలు జగతిని!యీడ్చి తన్నె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
166.సీ:- మాతృ గర్భోద్భవ!మనుజ సంతతి యంత!
జాతు లన్నిట వేధ!సమము గాదె?
వృత్తు లనుసరించి నుదయించె కులములు!
ఒకరి కులము తీరు!నొకరు జొరరు!
కులము లేకము జేయు!కంత్సిత చింతన!
శంకరం బేర్చుటే?జగతి కలరు!
తామసా హారులై!దండులై ఛండులై
దండించి ధనమును!దండు కొనరె!
తే,గీ:-కులము లన్నియు కలి సున్న!వెలయు జగము!
స్వార్ధ కర్మిష్టి నారదుల్!వ్యర్ధ జనులు!
ద్వేష భూయిష్ట యోచన!దూరి చెరచ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
167.సీ:-స్వార్ధంబు మిన్నంటె!సౌజన్య మడుగంటె!
కలిసి కట్టు తనము!కాన దాయె!
తమ పెంపు యింపంచు!తలపోదురే గాని!
పరపెంపు నోపరు!పాడు బుద్ధి!
సమ తెట్లు?సమకూడు!మమకార భ్రమతను!
సహకార భావంబు!జారి పోవు!
మంచి భావంబది మనసులో!లేకున్న!
మంచి కుదురు టెట్లు?మనజు లందు!
తే,గీ:-జనన మరణంబు లాపగ!శక్య మగునె?
సాటి వారల మేలును!చక్క గనుమ!
ధర్మ పరిపూర్ణ కర్మయే!ధరను నిల్చు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
168.సీ:-నీతి నిల్కడ నిల్చు!నిన్నంటి కదలాడు!
పాడు బుద్ధి తగదు!పాప మిడును!
పాప కూపంబున పడి !నీల్గె దేలను?
పరమాత్ము నొందెడి!భాగ్య మెంచు!
తిన తిండి లేకున్న?దేశాన్ని తినజూడ!
తగనొకో?ధర్మమా!తలచ వేమి?
సాటి వారల మేలు సర్వేశు డీక్షించు!
సద్గతి ప్రాప్తికి! సాగ వలయు!
తే,గీ:-భోగ భాగ్యాలు వచ్చునే!సాగు నాడు!
న్యాయ విత్తంబు!ధర్మంబు!నడచు నీతి!
పుట్టి గిట్టెడు జీవికి!పొగరు తగదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
169.సీ:-అరటి పండు తినియు!హర్ష మొందుట మాని!
స్వేచ్ఛ తీయ దనము!మెచ్చ రేల?
చేతలు చెడు నైన!జీవితాలు చెడు నెంచ!
తప్పు నాగము నౌచు!తప్పించు జీవాలు!
కనరాని దోషాలు!కట్టికుడుపు సుమ్మ!
దోష మంటక నడు!భూష యదియె!
మనమంత నొకటను!మంచి భావము గల్గి!
సమ సమాజము గూర్చి సాగు నీతి!
తే,గీ:-సత్య మును బల్కు! మెన్నడు!సత్వ బుద్ధి!
తల్లి దండ్రులు!భువి యందు!దైవములయ!
మరచి బ్రతుకు బ్రతుకుకాదు!మనుజు కిలను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
170.సీ:-వర విరించి సృజించిన ప్రాణి సర్వ స్వంబు!
సమత మమతలకు సాక్షి నిలుమ!
సఖ్యతా భావాన!సమ సమాజము గూర్చు!
మంచి పెంపకాన! మనసు నిలుపు!
పుష్టి తుష్టి యు గల్గి!పూజ్య భావమునొప్పు
పరమేలు కోరెడి!ప్రజ్ఞ దనరు!
నీతిని నెలకొల్పి!నిండుగా నూరేండ్లు!
పండంటి జీవంబు బడయు మయ్య!
తే,గీ:-దర్ప మాత్సర్య ముల వెల్ల!తగవు జగతి!
ప్రగతి సామ్యత!గననట్టి!బ్రతుకు బ్రతుకె?
జాతి భవితకు!మేలెంచు!జన్మ నెత్తు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
171.సీ:-నీతి పాలన నాడు!జాతి పాలన నేడు!
నిల్చె నీతియె నాడు!నిర్మ లాన!
జాతి పాలన!దుష్ట!సంస్కార జాత్యమై!
సామ్యత మభ్యమై!సాగె నేడు!
గంథంబు!కలుషమై!బంధాలచేజిక్కి!
నీచ సంస్కారంపు నీతి నెగడె!
కలి భిన్న దంష్ట్రల!కాటుకు లోనౌచు!
ధర్మంబు!మ్రగ్గెను!తలప రేల?
తే,గీ: -ధర్మ దేవత యునికికే!తావు లేక!
నీర సించెను సత్యంబు నీడ లేక!
మలిన దోషంబు పోనాడ!వలను పడునె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
(గంథము=భూమి)
172.సీ;-పుట్ట కురుపు వ్యాధి!పొట్టంత వ్యాపించె!
కుల మత జాఢ్యాను కూల మౌచు!
భిన్న తత్వ భరిత!భారతత్వపు తీరు!
సమత మమత లేర్ప సాధ్య పడునె?
విభజించి పాలించు!విజ్ఞాన ధోరణే!
దొరల పాలన కెంతొ?దోహద పడె!
సఖ్యతా నెపమున!సంఘర్షణలు లేపి!
కొల్ల గొట్టి తినుట!చెల్లె నిపుడు!
తే,గీ:-ఓట్ల యెన్నిక గెలుపది నోట్ల నంటె!
మాయ మత్స్సేంద్ర జాలమై!మహి వెలింగె!
అంకినది భుక్కు నీతదె?యలమె!జగతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
173,సీ:-పథకాలు లేకున్న!పాలనమేలేదు!
పరపెంపె తమపెంపు!పాలనమున!
గోపుర సోఫాన మేపునే!!వరియించు!
దిగువ జూడ నీదు!బిగువ సడలి!
భూ పాల నంబన!భూభుక్త మంచెంచి!
ద్వీపాలు కొను శక్తి!దివిరె గాదె?
ఆత్మ స్వార్ధము నొప్ప!యవని క్షేమం బేది?
కోరు మందరి మేలు!గుణ వరామ!
తే,గీ:-ఎవరి లక్ష్యము లేనట్టి!యేలి కేల?
పరుల మాటల మంచిని!పట్టి విడక!
మార్గ సుగమమే ర్చుమా!మాననీయ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
174,సీ;-యంత్రాల పెంపెంచి !తంత్రంబు సాగింప!
కాలుష్య భరమౌచు!కలి చెలంగు!
జన జీవన చేటు!సర్వ శూన్యము నేర్చు!
రోగాల నిలయమై! రోద మిగులు!
ప్రతి మంచి వెనుకను!గతి పాడు!దాగుండు!
యోచించి వర్తింప!యున్న తలరు!
అతి సర్వత్ర హాని!!యవధులు మితిమీర!
లోక సంకట మేర్చి! శోక మిడును!
తే,గీ:-వెనుక ముందులు తర్కించి!పనిని జేయ!
భవిత సుఖముల జగమెల్ల!భద్ర మెంచు!
క్షుద్ర రాజకీయాలను!నిద్ర పుచ్చు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
175.సీ;-కష్టార్జితము నిల్చు !కడకాల మిద్ధర!
పుష్టి తుష్టియు! తేజంబు!నిష్ట దనరు!
మాయార్జి తంబది!మందుల పాలౌను!
రోగాల రొచ్చుల రోద మిగులు!
న్యాయంబు ధర్మంబు!!శ్రేయమై!విలసిల్లు!
జీవ సౌఖ్యము నిచ్చు!సిరులు పెంచు!
ముక్తి మార్గము నెంచు!మోదంబు!నలరార!
జన్మ సౌఖ్యంబదే! జాతి కిలను!
తే,గీ:-కోతి చేష్టలు విడనాడి!నీతి మెలుగ!
నీదు జన్మంబు ధన్యమౌ!వరద మంబు!
పరమ పురుషార్ధముల వెల్ల!భాగ్య దములు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
176.సీ:-సర్వావ యవములు!చక్కగా పని జేయు!
సమయంబు నందున సాగు నీతి!
వార్ధక్య మందున!వాల్లభ్య మేర్పంగ!!
వలను పడదు శక్తి!చాల దపుడు!
బుద్ధి స్థిరత! నిల్వ దద్దిర! ముదిమిని!
చేతనంబుల స్థితి భీతి నలము!
అట్టి విచ్ఛిత్తి రోజు లవధార్యములు కావు!
గట్టి సంకల్పాన!కదులు మిపుడు!
తే,గీ:-తప్పు గమనించి సరి జేసి!ధన్య తందు!
ఒప్పు లొప్పగు సర్వదా!నుర్వి యందు!
రక్షణం బను బాధ్యత!రాజిలు మిల!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
177.సీ:-వేద శాస్త్ర పురాణ!విద్వ ద్వరేణ్యులు!
మీమాంశ తర్కాల మేటి ఘనులు!
చాగంటి సాత్విక సత్వ ప్ర బోధాలు!
పరమార్ధ వాగ్ఝరి గరికి పాటి!
సంస్కార సాహిత్య సద్యశో విభవాన!
సామ వేదము వారు!సోమ ప్రియులు!
వర్ధి పర్తి! ఘనులు!పరమ పౌరాణికులు!
భావార్ధముల బోధ బహు పసందు!
తే,గీ;-వర చతుర్వేద భాష్యాల వాసి గనుచు
జగతి ధర్మము రక్షించు!సుగుణ ఖనులు!
సౌమ్య సద్భావ గరిమంబు జగతి నింప!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
178.సీ:-గడ్డి మేయు పశువు దొడ్డరా!మన కన్న!
సాధువై!పాలిచ్చు జనమునకును!
నోరు లేకున్నను!చేరి తోకను యూపు!
సునక విశ్వాసంబు!మనకు గలదె?
కదలాడ నేరని కమనీయ వృక్షంబు!
ఫల మిచ్చి యాకలి!తొలగ జేయు!
సస్య శ్యామల మేర్చి!జలముగా ప్రవహించి!
జీవ నాడిగ నీరు జగము బ్రోచు!
తే,గీ:-కోర కున్నను రక్షించు తీరు గనియు!
దుష్ట చింతన నరుడె పో?తూలు చుండు!
సిగ్గు నెగ్గును గావలె!జీవ తతికి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
179.సీ:-నలుబదేండ్ల క్రితము న్యాయమే!న్యాయంబు!
ధర్మ పాలన మానాడు!ధరణి నెసగె!
ఈనాటి కులములే!యానాడును గలవు!
అన్న దమ్ములు వోలె!యలరి రపుడు!
చేదోడు వాదోడు !బీదోడు నాకను
కుల భావ మనకను!గడకి రపుడు!
మంచికే మంచియై!మహనీయ భావాన!
భరతమ్మ ప్రభలు భాసుర మయె!
తే,గీ:-నీతి మీరక సత్కర్మ!నిష్ట దనరి!
సంచితార్ధపు పుణ్యంబు సంతరించె!
జగతి కుపకర్త లౌచును! జయము గనిరి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
180.సీ:-నాటికి నేటికి నూటికి మించిన!
యవి నీతి మేఘాలు యావరించె!
కలుషిత మన్నింట!విలసిత ప్రజ్ఞాయె!
కనరాని ఘోరాల కాల మాయె!
స్వార్ధంబు నిండారె!సహకార మభ్యత!
క్షుద్ర సంస్స్కృతి నబ్బె!శూర మూని!
భద్రంబు నిద్రించి ప్రాణాంతకము నేర్చె!
కలికాల వైషమ్య కడలి దనరె!
తే,గీ:-యోగ నిష్టా గరిష్టులు!నుద్య మింప!
కలిని కట్టడి గావించి! కలిమి నింపి!
భోగ భాగ్యాల తుల తూగ బుద్ధి పెంచు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
181.సీ:- నాథ ఘోషది మీది!వేదాలు మావని!
మిడి మిడి జ్ఞానాన మిట్టి పడుచు!
భవిత నూహించెడి!ప్రాజ్ఞుల మేమంచు?
క్షుద్ర శక్తుల గొల్చి శూరు లవగ!
నిద్రించు ధర్మంబు! నీచ ముత్కృష్ట మౌ!
కలి జీవనపు శక్తి కలుగ జేయు!
మాయయే!మోహాన మ్రగ్గి పోవుచు నుండ!
మార్చగా వేమిల? మాన వాళి!
తే,గీ:-భరత దేశాన నిరుపేద!భాగ్యు డౌనె?
పుట్టు భాగ్యుడు!నిరు పేద!పొట్ట కొట్టు!
భాగ్యుడే?భాగ్యుడౌ!నొండు!భాగ్యు డౌనె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
182.సీ:-త్రిగుణోత్సుక జన్మ!తిను తిండి సారంబె!
జాతు లేర్పడె!ధర్మ!సరళి వరలి!
తీరు తెన్నులు మార్చి!దివ్యత చెడదీయ!
నేర్పరు లను కొన!నీతి యౌనె?
తామస రాజస!తత్వ ముత్తమ మయ?
సాత్వి కంబును మాప!సమత యౌనె?
సత్వంబు లేకున్న?సత్యంబు నిల్చునా?
నిల్చుపో?నీతెల్ల నీరు గారు!
తే,గీ:-భగవ దనుగ్రహమును పొంద!భక్తి వలయు!
భక్తి సమ ధృష్టి!గుణకరి! భాగ్య మదియె!
చెడును తలపోయ పాపంబు!జీవ చీడ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
183.సీ:-సాత్వి కాహారంబు!జగతి కేల?యటంచు!
తామసా హారుల!తగను మాప!
కుపిత భావము తప్పు!కొంపలు కూలవే?
సత్య ధర్మ నిష్ట!చతికిల పడు!
తప్పు ప్రోత్సాహంబు!దండన బలి గోరు!
విపరీత చర్యలు!విష సమంబు!
ధాష్టీకము ల వెల్ల!దండన యోగ్యాలు!
కాల మాసన్నాన!కాన నగును!
తే,గీ:-క్లిష్ట స్థితి కల్ప నంబేల!దుష్ట చింత!
పుట్గతు లుండ వంచేల!?బుద్ధి గనవు!
చెడును వర్తింప!సరిగాదు!విడుము పగను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
184.సీ:-భిన్నత్వ ధృగ్జాల!భీషణ ఘోషణే!
పరదాస్య శృంఖల బద్ధ మేర్చె!
పుట్టిన రోగంబు!పోవ దేనాటికి!
ఎన్ని మందులు వాడ!నేమి ఫలము?
ఈర్ష్య ద్వేషంబులు!యిహమందు నిండార!
పూర్వ సువాసన!పట్ట దొక్కొ?
పరపెంపు తలవంపు!భావనంబది యేల?
బాగు పడెడి యూహ!వరల వేల?
తే,గీ:-తల్లి కీర్తి ప్రకీర్తులు! కుళ్ళ బొడిచి!
రామ రాజ్యంబు!మాదంచు!రచ్చ జేయ!
తుచ్ఛమే గాక!?నుచ్ఛమా!నిచ్చ గింప!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
185.సీ:-ఖగ స్వేచ్ఛ జగదేచ్ఛ!కలిగింప తరమొకో?
విష తుల్య జీవుల విషయ మందు!
సాటి జనుల స్వేచ్ఛ!స్వంతంబు తమదంచు!
నిచ్ఛ వచ్చిన తీరు!తుచ్ఛ మేర్చ!
గోచి కట్టగ లేని!కుటిల సంస్కారులు!
ఏలికై జనులను!యేరి చంప!
కౌముదు లీనునే?కలి ప్రభావ గరిమ!
భగవదంశ జనిత!ప్రభువు వలయు!
తే,గీ:-అట్టి విచ్ఛిత్తి నైజంబు!యవని నిండె!
వికట సంకట చైదుల వేట లాడి!
తరిమి కొట్టిన ధర్మంబు!తగను నిల్చు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
186.సీ:-దేశ సౌరులు దోచి!దేదీప్య మానులై!
అప్పుల పధకాలు!నంద జేసి!
తప్పు సంకేతాలు!ధరణి కందించి!
ప్రగతిని దిగు వేర్చి!బెట్టును!వీడక!
అనవసర భారంబు!యవని మోపి!
పెంజీకటిని ప్రజ!భీతి నింపి!
గాలి మేడలు కట్ట!కనరేమి?భవితను!
రేపటేపును గోర!రేల?నోయి!
తే,గీ:-గాలి దీపము తీరాయె!భవిత కలలు!
చేటు మాటలు నమ్మిన!చెడును భవిత!
భవిత బాగును మది నెంచి!బరగ శుభము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
187.సీ:-నీతియౌ!నిరుపేద!నేతౌనె?యోచింప!
ధనమిచ్చి కొను శక్తి!తగను గనక!
కుల బల మున్నట్టి!కుత్సి తుండైనను!
పంచి దనము జన పాలకు డగు!
కోటీశ్వరుండౌచు!కులుకు నిద్ధాత్రిని!
వికట సంకట చేష్ట వినుతి గనును!
జగముతో పనిలేదు!బిగువు సడల నీడు!
పొంకంబు సడలింప!జాల డతడు!
తే,గీ:-కల్మ షంబైన దుష్కీర్తి!కరణ మెంచు!
జాతి సర్వోన్నతిని గన! జాల డతడు!
భవిత మనుగడ మదినెంచు భావ మున్న!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
188.సీ:-వేదాల నెలవౌచు!విధ్యుక్త కర్మల!
కర్మ భూమి భరత ఘనత నెంచి!
కట్టు బొట్టుల తీరు!కమనీయ సంస్కృతి!
పార శీకులు మెచ్చి!వరలు చుండ!
నర నరా లంటెను పర వేష భాషలు!
అమ్మ మమ్మీ యాయె!హరి ముకుంద!
ఆంధ్రమే మరుగాయె!నాంగ్లంపు!ధాటికి!
తట్టుకో?జాలక!! తల్ల డిల్లె!
తే,గీ:- మట్టి గరిపించి తెలుగును!మసలె దేల?
అమ్మ కీర్తిని మాపుట!కమ్మ నౌనె?
ఛాత్ర సంఘంబు ముందుండి!చతుర మతిని!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
189,సీ:-నిరు పేద జనులను నిమ్నంబు గావించి!
మధ్య తరగతి మాటల మభ్య పెట్టి!
ధనమున్న వారలె!ధరణిని పాలింప!
బీదనాయకు డౌనె?శోధిలంగ!
వాణిజ్య మియ్యది!వసుదాహ భరితంబు!
సాటివారి ప్రగతి జగతి మిథ్య!
సర్వత్ర తంత్రమై! స్వాతంత్ర్య మలరెను!
సరిజేయ వలెనమ్మ!సత్వ బుద్ధి!
తే.గీ:-జగతి ప్రాచుర్య మంతయు!విగత మాయె!
గతికి మతిపోయె!పాలక ఘనత!వలన!
స్వార్ధ మెన్నడు! వీడునో?వారి భీమ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
190.సీ;-కుల మత ద్వేషాలు కూకటి వ్రేళ్ళతో!
పెకిలించి పాలించు వేత్త లేరి?
దాస్యంబు తొలగినా!తద్వాస నంబది!
స్వార్ధ పెంపున నిండె!వ్యర్ధ గతిని!
దొరికిన రూకలు దొంతర్లు పెట్టుచు!
సాటివారి నణచు చరితు లైరి!
ప్రత్యేక తెన్నాళ్ళు?భరతాంబ గనవేమి?
మిగులు జనము జీవ మేమి యౌను?
తే,గీ:-ప్రజ్ఞ విలువకు తావేది?ప్రగతి యేది?
జ్ఞాన హీనులు రంగాల సరగు చుండ!
తగ్గి వాణ్యత!దుర్వ్యయ!దారి సాగు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
191.సీ:-కట్టు దిట్టము లేక! కదలాడు జీవులన్!
వదలిన పోట్లాడి!పడును నేల!
నీచు లందల చైద!నేవంబు నట్లౌను!
తంత్ర గొట్టుల ప్రభ!తారక మిదె?
స్వేచ్ఛ నిల్చుననుట!జీమూతమే గదే?
తెలిసి తెల్వి మసల తేరు కొనెదు!
పర దాస్యపు చింత!బ్రతుకదే?మనకేల?
మంచి గా జీవింప!మనసు రాదె?
తే,గీ:-భావి పదిల మెంచి!మసలు!భాగ్య మదెయె!
కులము లందున వేల్దూర్చి!కదల తగదు!
ప్రళయ మెంచక!నూరేండ్లు బ్రతుకు నీతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
192.సీ:-అలనాటి సత్యంబు!అలనాటి ధర్మంబు!
అలనాటి శక్తియు యసలె లేదు!
అలనాటి మేథయు అలనాటి శాంతంబు!
అలనాటి రక్షణ యిపుడు లేదు!
అలనాటి సఖ్యత!అలనాటి పూజ్యత!
అలనాటి మమకార మలమ లేదు!
కుల మత ద్వేషాలు కుంచిత భావాలు!
అలనాడు లేవాయె?అమ్మ సాక్షి!
తే,గీ:-జాతి మతము లేమైనను!ఖ్యాతి గోరి!
అన్నదమ్ముల వోలెను?హాయి బ్రతికి!
నాటి మమకార మానాడు!మేటి నిల్చె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
193.సీ:-కుల సాంప్రదాయాలు !కొలమాన మానాడు!
నీతి తప్పక ధర్ననిరతి మనిరి!
జాతి ద్వేషము లేక!సాటి వారికి సేవ
జేసి పేరును పొంది!చెలగి రపుడు!
అన్నదమ్ములనుచు! మిన్ననౌ సఖ్యత!
ద్వేష రహితు లౌచు దివిరి రపుడు!
కలనైన స్వార్ధంబు కనరాని జనము!
కనుల కానందమై!గడగి రెంతొ?
తే,గీ:-నటన లేనట్టి చర్యలు నాడు దనరె!
మాట దాటని వారలై!మసలి రపుడు!
కాల మార్పిడి!కలిదోష!కాల ప్రభను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
194.సీ:-రాజకీయ ముసుగు రాబంధు తత్వంబు!
జగతి ప్రగతి మాపు!విగత ఖ్యాతి!
ముందు తరము లెల్ల మూర్ఖులై చరియింప!
భవిత శూన్యంబగు!పస నశించు!
పస విహీనపు జన్మ! పాడియే?భవితకు!
సార హీనపు తెల్వి!చక్క నౌనె?
వికల సంకట భావ విచ్ఛిత్తి!చెడదీయు!
యెంత జ్ఞానియు నైన యేమి ఫలము!
తే,గీ:-బుద్ధి సంస్కార సౌజన్య!భూష లలర!
నాటి సంస్కృతి గమనించి మేటి గమ్ము!భప
కలి కబంధ హస్త విముక్తి!కాంక్షి వౌచు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
195.సీ:-పైకి నిష్టుర భావ భాసురం బయ్యును!
పలుకు లోగల మంచి!పట్టకున్న!
ద్వేషాల కాకర దీప్తిదం బేర్చును!
సమ ధృష్టి తలపోసి సత్య మరయు!
భవిత బాగు తపన పలికించె!నా నోట!
కించ పరచుట గాదు!కించ దైన?
సోదరాదర బుద్ధి !శుద్ధమౌ!మనసుతో!
శోభించి నిజమును!చూర గొనుడు!
తే,గీ:-పుట్టినది దేశ!మేలుకే!పుణ్య ధరణి!
నీచ స్వార్ధం బనర్ధంబు!నీతి చెరచు!
నీతి లేకున్న!సర్వత్ర!భీతు లలము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
196.సీ:-రాజ్య మేలెడి ప్రజ్ఞ!రాజుల సొత్తది!
రాజ నీతిజ్ఞత!రామ మయము!
అట్టి రాజ్య వరామ యందరి నంటిన!
కలి చేరి దుర్బుద్ధి!కల్గ జేయు!
బుద్ధి స్వార్ధము నంటు!పూజ్యత గననీదు!
కనని సంస్కారంబది!కాల్చు నీతి!
అవినీతి ధర్మంబు!అంతంబునకు మెట్టు!
అట్టి మెట్టది!సత్య!మంట నీదు!
తే,గీ;- పరుల కర్తవ్య జోక్యంబు!పాడు జేయు!
సర్వ సామర్ధ్య!నైపుణ్య!చరణ తగునె?
తగునెపో?కుల!జిడ్డు!తాక బోకు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
197.సీ;-గతపు టనుభవాలు!కనులార కాంక్షించి!
నాటి పాలన తత్వ!లోటు పాట్లు!
నేటి పాలకులవి తర్కించి!నిశ్చింత!
ప్రజల బ్రోవగ నెంచు!పద్ధతరసి!
మంచిగా నడిపింప!మానవతా ధృష్టి!
ప్రగతి సుగతి నెంచి!పలికి తేను!
జన మేలు తనమేలు!జగతికే!మేలంచు!
సాగ నెంచి!ప్రభుల!సత్వ మేర్ప!
తే,గీ:-నిత్య సత్యనిరతి!నిండు!జగము!వెలుగ!
కర్మ సత్కర్మ నడయాడ!కలిని తరిమి!
ధర్మ రక్షణ పాత్రులై!దనర దలచి
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
198.సీ:-పుట్టిన దాదిగా!పుణ్య కర్మలు మాని!
పర హింస ధోరణి పరగ దగునె?
తప్పు నొప్పుగ నెంచి!ధన్యుడ నే నంచు!
దప్పరంబులు బల్క!నొప్పు నౌనె?
చేసిన తప్పుకు తగు శిక్ష వేసిన!
తప్పు చేయ వెరచు!ధర్మ మింతె!
ధర్మాన్నె కొంటిని!దర్పంబు నొందెదు!
నన్ను గెల్వ గలరె?నరు లనంగ!
తే,గీ:-పంచ భూతము లవి చూచి!వంచకున్నె?
మంచి నెంచక చెడు నెంచ!మనుట కల్ల!
మంచియే!రామునిమహిమ!మించి గూర్చె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
199.సీ:-చావు పుట్టుక లవి!సర్వ సామాన్యంబు!
బ్రతికిన కాలాన బడయు ఖ్యాతి!
ఖ్యాతియే!మోక్షంబు!కలకాల ముండును!
బ్రతు కశాశ్వత మంచు!బ్రతుకు నీతి!
మంచిగా!కీర్తింప!సంచిత పుణ్యమౌ!
పుణ్యమే?పురుషార్ధ బోధ కంబు!
బోధనే?తేజంబు!పుణ్య ప్రదాయకం!
దానమే?త్యాగంబు!ధర్మ మదియె!
తే,గీ:-త్యాగ బుద్ధిని దనరారి!తత్వ మరసి!
పరుల కుపక రించి మనుటె?ప్రగతి బాట!
అదియె?పరమాత్ము జేరెడి!పథము సుమ్మ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
200.సీ;-గతిని తప్పక !గ్రహ గమకంబు! నేపారు!
నేపారు గమకంబు నాప బడదు!
సమయ పాలన లేని జన్మంబు జన్మమా?
జన్మమే?సమ నీతి సాగ వలయు!
నాది నాదను భ్రమ!నీది కాదయ?భువి!
యేది?నీదియొ?తెల్యు!వేది కావు!
బూదియౌ!దేహంబు!ప్రోదియౌ!కర్మంబు!
కర్మంబు మర్మాన!కాలి పోవు!
తే,గీ:-ఆత్మ పరమాత్ము చేరును!యాశ లేల?
బ్రతికి యున్నంత కాలంబు బరగు మంచి!
మంచి సంచిత పుణ్యంబు!మరువ కీవు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
201.సీ:-నూటి కొక్కడు నీతి నొప్పుట కష్టమై!
కలి, యధర్మ మమరు!కరము తిరము!
ధర్మాత్ము నైనను!దారి తప్పించెడి!
దుర్మార్గు లుండిరి!ధాత్రి నిండ!
ఈర్ష్య ద్వేషంబులు యిహమందు పచరింప!
సామ్య వాదం బెట్లు?చక్క బడును!
అక్కజంబగు!స్వార్ధ మార్భటి నిండంగ!
ప్రక్క వారల బాగు!వలను పడునె?
తే,గీ:- దుష్ట సంహార నరసింహ దురిత దూర!
చీల్చి చెండాడు!నీచుల!చేవ మీర!
కలిని రక్షించు సమయంబు!కలిసి వచ్చె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
202.సీ:-గతి లేని మతి తోడ!గరళ సాదృశ్యమై!
మత్తు పానీయాలు మప్పి మప్పి!
తమ దండు తమ వెంట దనరారగా తీర్చి!
మిడతల దండునై మేయ జగము!
తమ పెంపు కింపౌచు!ధాష్టీకముల నొప్ప.
జగతి మనుగడకు!విగత మేర్చి!
దుష్ట సంస్కారపు దుర్యశ పాత్రులై!
దోచి దాచెడి ప్రజ్ఞ తమకు దక్క!
తే,గీ:-రిక్కలకు లెక్క చిక్కేర్చి!తిక్క లౌచు!
బకుల చైదాల పట్టుచు భూమి నెల్ల!
టక్కు టమరంబు చాటుచు!నిక్కు లరయ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
203.సీ:-చిన్న మెదడు పని!చేతనం బేపార!
ధనమిచ్చి త్రాగించి!ఘనత చాట!
మూక వెంటను రాగ!మొండిగా!చెలరేగి!
దహన కాండను రేపి!ధర్మ భ్రాంతి
బెదిరించి జనులను యెదు రొడ్డి నిల్వగా!
తాము గెల్చుట కల్ల!పాము పగతొ!
బోలె యందలి ఓట్లు!కొల్లలు కల్లయౌ!
. విష భ్రాంతి జీవన వెతికి తరుము!
తే,గీ;-కేడు చేయుట మేలంచు చేడు లాడు!
బోడి తత్వుల ధీ శక్తి!బుగ్గి పాలు!
పాల నార్హత!రానీక!పాతి పెట్టు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
204.సీ:-ధనము జీతము నొంది!ధరనేలు టది యెంచ!
కూలి తీసుకు చేయు!కొలువు గాదె?
సేవక భావంబు జీవనమై యొప్ప!
ప్రజల గౌరవ మిచ్చివరల వలెను!
వెలికి సేవను పేరు!వెతికి చూడ గనదు!
పదవి పొందిన కండ్లు!పాడు నెంచు!
ఎంచిన పాడది!పొంచి చూచుచు నుండు!
తన గొప్ప జగమెల్ల!కనగ నొప్పు!
తే,గీ:-అజ గర స్థన మట్లు!యవని భుజము తట్టు!
కనగ శూన్య ప్రగతి భావ గమక మట్లు!
యమక చమకాల తమకాలు!యాస నెగడు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
205.సీ:-తమసొమ్ము ప్రజకిచ్చు!ధర్మాత్ములా!కారు!
నీతిమంతుల దరి!నిలువ లేరు!
చేతగాని పనుల!సిద్ధ హస్తుల మంచు!
మిడి మిడి జ్ఞానాన మిట్టి పడుచు!
జ్ఞానుల సలహాలు!జగతికి!మేలంచు!
దరి జేర నీయరు దాహ తృష్ణ!
పదవియే!యుక్తంబు!పదవియే!ముక్తంచు!
జగము భవిత నెంచ!జాల రేల?
తే,గీ:-అర్ధ రాజ్యాంగ మెరుగని!వ్యర్ధు లిలను!
పాల నంబుకు పంపుట!ప్రజల తప్పు!
తప్పు జేసియు పాలన తప్పనెండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
206.సీ:-దేశ మిచ్చెను!దీన తత్వము తప్ప!
మేన నీతి యదేది?ధీన బంధు!
తలవంపు పెంపంచు!తత్తరిల్లుట తప్పు!
పెంపు లేకున్నచో?సొంపు లేదు!
సక్ర మంబగు పెంపు విక్ర మార్కంబగు!
వక్ర పెంపు!జగము పాడు గోరు!
పబ్బంబు గడపంగ ప్రజపాల నంబేల?
తుచ్ఛ తత్వంబదే?వ్రచ్చు!భవిత!
తే,గీ:-ఆశ కంతంబు గావలె!యవని యందు!
హక్కు నమ్ముచు బ్రతికిన!చిక్కు లలము!
నీతి బోధన వినకున్న!భూతి చెడును!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
207.సీ;-గోత బడిన జీవి!కొట్టి మిట్టాడును!
పైకి తీయగ రాని ప్రజల తీరు!
పరికింప స్వార్ధంబు!పట్టి నరములంట!
సరి జేయు వైద్యంబు!జగతి లేదు!
పుట్టితి కొట్టితి!తిట్టితి నెట్టితి!
కట్టడి నాకేల?కలిమి లేదె?
ఇట్టి నైజంబది!పట్టించె!కీర్తంచు
కొట్టి మెట్టాడుట!కూలు కొరకె?
తే,గీ:-అట్టి నైజాన్ని మార్చంగ నంబ తరమె?
కాలమే!తగు బుద్ధిని!కలుగ జేయు!
సమయ మాసన్న మౌనాడు!జ్ఞాన మబ్బు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
208.సీ:-తనగొప్ప!తను జెప్ప దగునొకో?భువి యందు!
పరులు చెప్పగ నది!బాగు సుమ్మ!
మనజాతి గౌరవం!మనకన్న పైవారె!
బాగు బాగని బల్క!పరువు నిల్చు!
అప్పులే?ఐశ్వర్య ముప్ప తిల్లగ జేయ!
నీగొప్ప యేముంది?నీచ తత్వ!
తనకున్న దానిలో!తగనొప్ప జీవింప!
తక్కు వేమియు గాదు!తలప రేల?
తే,గీ:-లేని గొప్పల పోవుట!మాన వలయు!
ఆత్మ సంతృప్తి జీవంబు!ఆత్మ రక్ష!
కాల గమనము గమనించి!గడగ సుఖము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
209.సీ:-తుత్తురు బెండకు!తుల యైన బలమేది?
ఆత్మ జ్ఞానికి మించు!నాజ్ఞ యేది?
స్వార్ధ భూయిష్టుని!సంసార సుఖ మేది?
భెక్షాటనము మించు శిక్ష యేది?
ఆత్మ క్షోభకు లోను హట్టంబు దిట్టేది?
పట్టు వీడిన జీవ భ్రాంతి యేది?
నటన సామర్ధ్యాన!పటు బింకమును జూపు!
నాయకాగ్రణి కున్న!నర్మ మేది?
తే,గీ:-ఏది యేమైన యిక్కలి మేథ నెంచ!
బోధి సత్వుడు దిగి వచ్చి బుద్ధి చెప్ప!
నిచ్చ గింపడు!పాపుల మెప్పు గోరి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
210.సీ:-పక్షాలు తెగి నట్టి పక్షి యెగరని యట్లు?
ధర్మపు దండముల్!ధరణి రాలె!
మొండైన యవినీతి మెండుగా పని జేయ!
నీతి నాతి వెడలె!జాతి వీడి!
సుగుణ గణ్యత లేని!సుకుమారి కులనారి!
సంకుల సమరాన!చచ్చు వడియె!
ప్రక్కలో బల్లెమై!పాలనా దక్షత!
నిక్షిప్త సంక్లిష్ట నియతి!నందె!
తే,గీ:-పట్టి భానుతొ!ముచ్చట్ల బరగ నెంచి!
క్లిష్ట సంక్లిష్ట! మేథంబు!క్లేశ మేర్చి!
జీవ సృష్టికి ప్రతి సృష్టి!జేయ నెంచి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
211.సీ:-కృత కృత్య!క్రతువులు!కృతికము లెన్నైన?
భృతి భీతి మాన్పంగ!వినుతి గనునె?
ప్రకృతి ప్రకోపాన!వికృతిని గావింప!
సత్కర్మ చరణంబు సరగ దాయె!
నిర్వీర్య దుష్కృత నీచాళి!పగ్గాల
సిగ్గు నెగ్గులు! బుగ్గి!నీల్గ జేసె!
విచ్ఛిత్తి లోకాన సచ్ఛిత్తు గల్పింప!
సచ్చి దానందుడె!వచ్చి తీరు!
తే,గీ:-ఫాల నేత్రంబు పని జెప్పు కాల మొచ్చె!
నీలి కంథర నీవేల?నిలకు దిగవు!
నీదు బిడ్డల సరిజేయ!నేగు దెంచు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
212.సీ:-యంత్ర వాడుక నీతి!మంత్రి తంబాయెను!
స్వంత మేథ యిసుము వలను పడక!
జీవమే!యంత్రమై!చింతనా దూరమై!
మీట నొక్కు టొకటె!వాటి కెక్కె!
స్వంత యోచన లేని!సాచర్య జీవంబు!
యంత్రాల పని పైనె!యలరె నిలను!
పనిజేయు నూహకు!ప్రాచుర్యమును తగ్గె!
యాంత్రిక యుగ మౌచు!యమరె నిలను!
తే,గీ:-యంత్ర మాధార మెంతైన!యాంత్రి కంబె!
మెదడు నూహకు కొదువాయె!విధుల యందు!
హస్త లాఘవ విద్యయే?యవని నిండె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
213.సీ:-ఓంకార విశ్వంబు!శ్రీం కర సర్వంబు!
హ్రీం కార ఐంకార!క్లీం కరాలు!
లక్ష్మీ ప్రసన్నాలు!లాలిత లలనాలు!
ఇందిరా సుమ గంథి!మంది రాలు!
శిఖి పించి!వరదాలు శ్రేయోభి దాయాలు!
భవబంధ మోచన భాగ్య దాలు!
లక్షణ లాక్షణ్య లక్ష్మీ మనోజ్ఞాలు!
పాలనా లాలిత ప్రాభవాలు!
తే,గీ:-అట్టి ప్రాభవ మూర్తివై!యవతరించి!
రక్ష దక్షైక నాథుడై!రహిని మించి!
మంచి పాలన మందించి!మముల బ్రోవ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
214.సీ:-జీవితాంత పదవి జేకూర దేరికి?
చేకురు దినములం!ప్రాకు నీతి!
సర్వ సామ్యత సత్య సంస్కర్త వీవన?
పేరు నిల్పి వరలు ప్రీతి గాను!
నిన్నంటు బ్రతుకుల!నిందల పడ ద్రోసి!
నీతి వంతుడ నన!నీచ మౌను!
రాజ్యంబు!భోజ్యంబు!రమణీయ భోగంబు!
ప్రజల నేలుము!రాముని వరదములను!
తే,గీ:-పేరు నొందుము!చెడు నెల్ల జేర నీక!
నీతి ధర్మంబు చేకూర్చు!నేత లకును!
ధర్మ గ్లానిని రానీకు!తత్వ మరసి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
215.సీ:-కలిమి లేము లవియు!కావడి కుండలు!
నొకదాని వెనుక!వేరొకటి కదులు!
లేమి సర్వా నర్ధ భీమకం బైనను!
ధైర్యమూని బ్రతుకు!ధర్మ నిరతి!
కలిమి కలిగి నంత!కండ కావర మూని!
పరుల కించ పరచ!పాడు పడెదు!
మాయ లెన్నియొ జేయ!మాయునా?న్యాయంబు!
న్యాయంబు న్యాయ మేనాటి కైన!
తే,గీ:-న్యాయ ముతొ చెల గాటము!నాశ మేర్చు!
చీడ పురువట్లు?బ్రతుకుట సిగ్గు గాదె?
సిగ్గు యెగ్గును లేకున్న!ఎగ్గు సుమ్మ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
216.సీ:-ముష్కర జీవంబు!ముష్టి ఘాతము లంటి!
పోజేయు ప్రాణాలు!భోగ మిడక!
భగవంతు జేరక!భవబంధ మరయక!
ప్రేతమై భూతలి!వెతల వేల?
చేసిన పాపంబు! చిత్ర హింసలు పెట్టు!
తెలివరి వీవయ్య!తెలియ వేల?
మాయయే!మహిమంచు!మంద భాగ్యు డగుట!
శూన్య భవితకది!మాన్య మౌను!
తే,గీ:-తెలివిగల మూర్ఖ తత్వంబు తిక్క దీర్చు!
కాలమును గెల్వ లేవయ్య?కఠిన చిత్త!
మొత్తుకొని చచ్చెదేలను?బొత్తిగాను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
217.సీ:-మథ్యలో వచ్చియు మథ్యలో పోయెడి!
సిరు లశాశ్వతములు!చేరు పరుల!
కట్టుకున్న నతివ కడదకు నీతోడ!
కదలి కాష్టము రాదు!కడ దినాన!
రేపోపని బ్రతుకు!రెచ్చుట!తగునొకో?
తిన లేవు మనలేవు!తిరుగ లేవు!
కష్టార్జితము కోరి!కైవల్య ముందుమా!
కని విని యెరుగని!కల్ల లేల?
తే,గీ:-అదుపు మీరిన యాశయే!యంత మేర్చు!
పొదుపు లేనట్టి!బ్రతుకది!సొదల దేర్చు!
గతియు గనరాని పాపంబు!కల్మ షంబు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
218.సీ:-పొగరు రాదుర వెంట!పోవు కాలము నాడు!
ధన కనకాదులు!ధరనె నిల్చు!
ఒంటరి జననంబు!ఒంటరి మరణంబు
ఒంటరి జీవమే!నంటి జనును!
కంటి వేమి?సుఖము!కలకాల జీవాన!
కర్మ జీవి వీవు!కదులు నీతి!
సత్కర్మ మే ముక్తి!సర్వంబు మిథ్యరా!
మోహ జీవన మేల?మూర్ఖ నీకు!
తే,గీ;-తప్త కాంచన సౌరభ్య!ధర్మ నిరతి!
తాకి వర్తించు వాడెపో?ధన్యు డిలను!
అట్టి వారిని సేవించి!హాయి!గనుమ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
219.సీ:-కర్ణ భేరియు లేని కర్ణంబు కర్ణమా!
బుద్ధి లేనిమనిషి!బుర్ర బుర్రె
మర్మ జ్ఞానము లేని?మంత్రంబు మంత్రమా!
మహిత ధర్మము లేని మంత్రి యట్లు?
కండ్లుండి కనరాని కన్నులు కన్నులా?
మనసుండి మనలేని మనిషి యట్లు?
పరమెంచ నేరని!భగ్న హృదయ మట్లు!
తిక్క సంకట మొప్పు!చిక్కు యట్లు?
తే,గీ:-వెలుగు రానట్టి!దీపంబు వెల్గు లట్లు?
తెలివి లేనట్టి?మూర్ఖుని తెల్వి యట్లు?
నోరు యుండియు మాట్లాడ నేర నట్టి?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
220.సీ:-మంచి నైజము గల మహిమోపేతుడై!
చెడు గృహమున నున్న!చేష్ట మేలె?
వానిని గని పెట్టు!వాడు మంచైనచో?
కించిత్తు దోషంబు!నెంచ డెపుడు?
చెడు వాని ప్రేరణ!చిత్ర భ్రమ మేర్చిన!
చాల తక్కువ చెడు!జరుగు కొద్ది?
తత్వ వైశిష్ట్య!ధర్మ జ్ఞు డీవయ్య!
నిలువెత్తు మంచికి!నిలయు డీవు!
తే,గీ:-ఈతి బాధల నెడ మేర్చు!యిచ్ఛ నీది!
ఇచ్చు పుచ్చుకొ?మేలును!యేలు బడిని!
జన బలంబది నీ చెంత జాగృతి డెను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
(ఖగోళ శాస్త్రము ననుసరించి,శుభగ్రహములు,యేగృహము లందున్నను వారి నైజగుణములు విడరని,చెడుప్రభావ గ్రహముల చూపు వలన కొంత తగ్గుదురే. గానివారి ప్రభావము చూపక మానరను భావ మిందు నిమడ్చడ మైనది!).
221.సీ:-కుమ్మ రామంబున!కుండలే యుండును !
యిత్తడి ముంతలు యిందు గనునె?
కుండ కూడుకు గల!మెండు నౌ శక్త్యెంచ
యిత్తడి కూటికి యేది?చెపుమ!
ఉన్నదే మిన్నంచు!తిన్నదే!చాలంచు!
పరభుక్త మాశించు!బ్రతుకు సరియె?
సంచిత పుణ్యంబు సమతత్వ భావంబు!
జగదైక మోహమే? జాతి వెలుగు!
తే,గీ:-అట్టి మేలైన మార్గాన యవని నడుప!
పూర్వ స్వచ్ఛంద సంస్కృతి!ప్రభలు వెలుగు!
క్రొత్త కొరకొర క్రొంగొత్త!గోర వచ్చు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
222.సీ;-కూలి జీవన జేసి కులగౌరవమును నిల్పి!
శ్రమ జీవ నాధార!సత్వ జనుల!
జీవనంబుల దూరి!చేయూత మభ్యాన
స్వంత బ్రతుకునకు!స్వస్థి పలుక!
కూలి జేయుట మాని!మేలు శక్తిని బాసి!
బద్ధకమునవారు వరల నిచ్చి
నిర్లక్ష్య భావనం!నిర్వీర్యులను జేయ
గతజల సేతువు!కధన మాయె!
తే,గీ:-శక్తి హీనుల జేసి మా! యుక్తి యనెడు
తప్పు ముమ్మాటి కౌ నంచు!తలప రేల?
భవిత నిర్మూల మేర్చగ!భావ్య మౌనె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
223.సీ:-మట్టిలోనను పుట్టి మట్టిలోన పెరిగి!
మట్టి కుండాన్నము ముట్ట రేల?
భోగ బలిమి మారె!రోగాల నెలవాయె!
త్రాగు సంకట మబ్బి తల్ల డిల్లె!
మత్తు పానీయాలు! మహిమ మహి నేలె!
లేకున్న పాలనే!చీకు లొందె!!
చిందర వందర జీవాలుమహి నలర!
పాలనా తంత్రంబు!బాగు పడునె?
తే,గీ:-ఉన్నదానితొ సంతృప్తి!మిన్న గూర్చి!
అప్పు పరుగులు తగ్గించి యవని బ్రోవ!
మెప్పు లొందును భారతి మేథి నందు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
224.సీ:-కుండులు గోళకుల్!మెండుగా కల్పించు!
చింతనం బది తప్పు చేతనముల!
స్వచ్ఛ మౌ జాతిని! స్వచ్ఛంద జీవన!
సర్వ శ్రేయం బంచు చక్క దీర్చ!
కుల ప్రాతి నిధ్యంబు!కోమలత్వ సరళి!
పండుగై ప్రజ లెల్ల బ్రతుక గలరు!
భిన్నత్వ మందున మిన్న నౌ!నేకత్వ
భావంబు వెలుగును!భరత మంత!
తే,గీ:-అన్ని రంగంబు లందెన్ను ప్రజ్ఞ!పుడమి
ప్రజ్ఞ లేకున్న అజ్ఞాన ప్రభలు వెలిగి!
నాణ్యతను మాప! భవిత వినాశ మగును!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
225.సీ:-గజ్జి లేని జనుడు కమనీయ తేజుండు!
బుజ్జ గింతు రతని బుద్ధి మెచ్చి!
సర్వంబు సత్యాన సమకూడు!నిత్యమై!
నిత్యమే?నిర్మల కృత్య మౌచు!
బుద్ధి ముఖ్యము గాని!భూతి ముఖ్యము కాదు!
ఖ్యాతియే?ముఖ్యంబు!నీతి యదియె!
శుద్ధమౌ జన్మంబు!చూడ ముచ్చట గొల్పు!
భగవదానుగ్రహము!బడయు నిజము!
తే,గీ:-అట్టి నిష్కర్మ యోగ్యుండు యవని నేల!
ముచ్చటించును జగమెల్ల!మోద మొప్ప!
తుప్పు చైదంబు!తప్పునౌ!గొప్ప కాదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
226.సీ:-చర్విత చర్వణ జనన మరణములు
సత్వ రజమయ!సాకరాలు!
ఆకార వికార హర్మ్యట్ట భావాలు!
భవబంధ మోచనో ద్భాసితాలు!
వశు పశు దృశవర వర్ధిష్ణు రత్నాలు!
రత్నాలు గుణ గణ రాజితాలు!
రాజిత ద్వీపాలు రమ భద్ధ రమ్యాలు!
రమ్యాలు రాజన్య రత్న ఖనులు!
తే,గీ:-అట్టి భూతల స్వర్గంబు యవని కాగ!
జన్మ నెత్తెడి భాగ్యంబు జనుల కొనర!
వర తపోనిల భద్రత!పరగ జేయ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
227.సీ:-బోధామృతము గ్రోలి బోధి సత్వులు కండు!
బుధ నుత వరదాల!నిధులు కనుడు!
జన్మ సార్ధక్యంబు!సర్వ శ్రేయంబదే!
నుత మతి వీ వన?గతిని కోరు!
కతిపయ దినముల కర్మ పక్వము నౌను!
భగవదాను గ్రహము బడయ నగును!
ఆంతరంగిక దీక్ష కవరోధములు లేవు!
ముక్తి సోఫానమ్ము మోద మలము!
తే,గీ:-జన్మ రాహిత్య సిద్ధాంత సౌరభాలు!
జీవ ముక్తికి మార్గాలు!శ్రీ వరాలు!
వరద మోంకార భద్రాలు!సుర వరాలు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
228.సీ:-వర గతానుగతము!వర్ధమానము గూర్చు!
వేద శాస్త్ర పురాణ!విద్య లలర!
వేద భారతి ధీర!విద్వ. న్మహామణి!
భూతలమ్మున మిన్న పూజ్య మాత!
విధి విధానము లందు!వినుతి నొందిన తల్లి!
రత్నాంబుధీ చంద్ర!రత్న గర్భ!
పోషణా పోషిత!పుణ్యాల రాశి రా!
మనతల్లి భరతాంబ!ఘనత నెంచ!
తే,గీ:-అట్టి తల్లికి సుతలౌచు!దిట్ట లౌచు!
నిత్య కృత్యము సత్యమై!నిరుపమాన!
ప్రతిభ సంపత్తు లందుచు!పరమ నిష్ట!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
229.సీ;-ఆగతం బూహించు!అతులిత!ప్రజ్ఞున్న!
చెడు త్రోవ పట్టింప!చేటు గాదె?
సంస్కార ధిక్కార!సాదృశ్యు లీనాడు!
మెండు గండాలకు లండ లవగ!
చీడ పీడను వీడ!చేత దండము నూని!
పార ద్రోలక యున్న!భవిత సున్న!
చెడు చేటు పసిగట్చి!ఛిద్ర మేర్చగ వలె!
లేకున్న జనవాటి!చీకు నొందు!
తే,గీ:-పాపు లేపును గోరుచో?పాడు గూర్చు!
పాడు పడి నట్టి!జగమది!బాగు పడునె?
బాగు కోరుమి!తల్లి తా!పరవ సించు
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
230.సీ:-అప్పు లోటు తీర్చ!నప్పడు వశమౌనె?
ముప్పు తిప్పలు గాక!ముదము గనునె?
గాజు జాడిని వీడి!గండు దెయ్యము రాగ!
పట్టి పీడింపదే?ప్రజల నెల్ల!
ఱుణము వ్రణము తీరు!రోదనా భరితమ్ము!
దిన దిన గండంబు! దేశ ప్రజకు!
వృత్తి కల్పన జేసి!విత్తంబు నీయగా!
అప్పు తగ్గి!ప్రజల బ్రతుకు మెరుగు!
తే,గీ:-అవసరము గాని!ఖర్చది!యవని ముప్పు!
లేని పోనట్టి!పేర్లతో!కాని ఖర్చు!
పెట్ట మానిన యిటు పైన!పేరు కొఱకు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
231.సీ;-స్వ పర భావాలలో!స్వంతమే!మిన్నైన!
మన్నంటు!పరభావ మవని యందు!
మితి మీరు యాశలే!గతి పెంచి క్షితి జేర్చు!
పరమాత్ము జ్ఞానంబు!పట్ట నీదు!
దురహంబు! మితి మీరు!దుష్ట మార్గము త్రొక్కు!
కండ కావర మొప్పి ఛెండ బడును!
దండ ధరుని యైన!దండింప యత్నించు!
కాల పాశము జీక్కి!గండ మొందు!
తే,గీ;-మంచి గానని వానిగా!మహి వెలింగి!
ఛీదరించెడి బ్రతుకుతో?సిగ్గు మాలి!
తల బిరుసది గడిమీరి!తత్తరించు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
232.సీ;-యవినీతి మృగరాజు!యార్భాటమును జేయ!
నీతి నిలయ గోవు!భీతి చెందు!
భీతి చెందిన గోవు నీతిచెప్పు సుతకు!
ధర్మ సూక్ష్మము లెన్నొ?తగను బ్రతుక!
విని యాచ రించుచో?విశ్వ రక్షణ గను!
లేని పక్షంబున!హాని గల్గు!
జన హిత వాక్కులు!సద్బుద్ధి సరినెంచ!
భవి తరంబులవెల్ల!బాగు పడును!
తే,గీ:-మంచి నాచరించిన!భువి!మహితు డగును!
దైవ రక్షణ కలుగంగ!దనరు సుఖము!
సుఖము లేనట్టి జీవంబు!శూన్య మిలను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
233.సీ;-దండిగా తినియెద!మెండుగా!బ్రతికెద!
గండర గండయై!గడగె దేను!
ననుతాకు ధైర్యంబె?నాచెంత రాదెంచ!
మించి వంచించితి!మేపి సొమ్ము!
వినుకలి ధర్మంబు!కనలేని!గృడ్డిది!
ఒడ్డి నిల్చె దెంత? దొడ్డ నైన!
పిరికి తనము మీది!దొర తనంబది నాది!
యేమి జేతు రటంచు!నెగిరి గెంత!
తే,గీ:-చట్ట పరిధిని మీరిన చావు తెలివి!
తెంపరత్వము పోజేసి!తిక్క దీర్చు!
ఎవరి కన్నను గొప్పీవు?యిహము నందు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
234.సీ:-మెత్తదనము జూచి!మొత్తగా జూతురు!
గట్టిదనము గన!కదలి రారు!
మెల్లగా జెప్పిన!మెతక వాడందురు!
దండ మూని పలుక!దరికి రారు!
తిక్క దద్దమ్మలై మెక్క జూడగ నెంచి!
చిక్కులు గల్పించి!చిక్కు కొనరె!
అక్కజంబగు కీర్తి!యవని నందగ నెంచి!
బుక్కి బుక్కి సిరులు త్రొక్క బడరె?
తే,గీ:-అట్టి బాపత్తు జనులను యంట తగదు!
అంటి పాపాన మిన్నంటి!యలర తగదు!
పరువు లేనట్టి జనులను పట్ట వలదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
235.సీ:-నీతి లేని మనిషి నీరు లేని చెఱువు!
ఖ్యాతి లేని జగము కాడు సమము!
నీడ లేని బ్రతుకు!తోడు లేని తనువు!
చీడ పీడలు గల!జీవ సమము!
గోడు నంటిన జన్మ కోరు కొనని కర్మ!
ధర్మ నిరతి లేని తనువు సమము!
ధనముండి తినలేని! కనులుండి కన లేని?
పదవుండి మనలేని!ప్రభు సమంబు!
తే,గీ:-ఉన్న దానితొ!సంతుష్టి!మన్ననంబు!
తిన్నదే? దక్కుదల యంచు!తెలిసి కొమ్మ!
రేపు నీదని!చెప్పంగ నోపు నొక్కొ?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
236.సీ:-ధనము కశ్శ బడిన ధర్మంబు దౌడేయు!
నర్మాను కూలత నాట్య మాడు!
కర్మంబు భీకర కార కంబౌ!నిల!
అడ్డు పడ్డ జనులు!హంత మేర్చు!
మూక దండు కదలు మున్నూరు రూప్యాల!
జయ జయ ధ్వానాల జగతి నడుచు!
కలకంటి రోదాల కాల్ర్రాయు జీవాలు!
పుస్తెలు తెగి రాలు!పుడమి కదులు!
తే,గీ:-రక్కస విహార రాజ్య మై!రస వెలుంగు!
పసిడి దొంగల దాడులు!పగలె గల్గు!
నేర విజృంభణము పెచ్చు!నీతి చచ్చు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
237.సీ:-దండ నాయకు లండ దండలు!తమచేత
చిక్కి యున్నను!నేమి?చేయ లేక!!
దొంగలే!దొంగలై దోచు కొందురు భువి!
తిరిపె మెత్తగ ప్రజ తీర్చి దిద్ది!
ధనము వారల గొప్ప!దండన ప్రజ గొప్ప!
అప్పులు ప్రజ వంతు!ఆస్తి తమది!
తర తరాలకు లేమి దరిజేర నీయక!
ప్రజ ముంచి! వెలుగొందు!ప్రభుల తీరు!
తే,గీ:-స్వేచ్ఛ లేనట్టి కాలమే!ప్రీతి యనుచు!
జనులు నోరార బల్కుట సత్య మిలను!
మార్పు యేనాడు వచ్చునో?మాత కనగ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
238.సీ:-మాట నిలక డేది?మహి నేలు వారికి!
జనుల ప్రగతి గాంచు!సమయ మేది?
ప్రగతి గాంచిన వారి విగత మేర్చుట యెట్లు?
విగత మందక యున్న?విత్త మెట్లు?
విత్తంబు లేకున్న?చిత్తంబు బిత్తరౌ!
బిత్తర జన్మంబు!భీతి కాదె?
కాని పోని వవేల?కాసులే!ముఖ్యంబు!
కాసు లేక?భవిత!కల్మి యెట్లు?
తే,గీ;-అట్టి యూహలు మనయందు నలము కొనగ!
దేశ మేమైన!మనకేల?దిగులు రన్న!
జగము మ్రింగుటె?మనజన్మ సార్ధ కమ్ము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
239.సీ;-భుక్తికే!తొత్తులై!మత్తుకే చిత్తులై!
ముక్తికే!రక్తులై!మోద మొంద!
కుత్తుకే!విత్తమై!విత్తుకే!జీవమై!
జీవికే!తేజమై!భా విభాన!
భానుకే!ప్రధ లీను!భావాను గుణ్యమై!
గుణ్యాల గుణకమై!గుబులు గొల్ప!
భాజ్యాల భోజ్యమై!భవ బంధ మోదమై!
మోదిత సంసార ముదము బాసి!
తే,గీ:-చిత్త విచ్ఛిత్తి సంకల్ప చిత్ర జనులు!
మంత్ర తంత్రాల లొంగని మడ్డు జనము!
పాలనంబుకు చెలరేగ!పాడు గాక!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
240.సీ:-కుంచె తో కుల జిడ్డు!మంచిగా!నంటింప!
జిడ్డు తొలగు నొక్కొ?జీవ తతికి!
జిడ్డు మడ్డిన మున్గి!చేజార!సౌఖ్యంబు!
ప్రగతి నాణ్యత బాసె !పాడు పడెను!
వెన్ను విరిగె!తల్లి!దన్నుకఱ్ఱయు జారె!
నేలబడ గడంగు! కాల మలమె!
కాపాడు నెవ్వరో?కల్మష రహితులు!
వెర్రి చూపుల!తల్లి తా!వేచి చూచె!
తే,గీ:-మేలు సహకార భావుని!శీల గుణుని!
కోరుకొను చుండె!రక్షింప!కోమ లాంగి!
రండు రారండు!మనతల్లి!కండ నిలువ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
241.సీ:-విశ్వ న్నుతాభిదుల్!విశ్వేశు నర్చించి
మోక్షంబు నొందిరే?మోదమలర!
సద్యశో!హితమున!సంసారమున కెల్ల!
లోకాభి రాములై!శ్లోకు లౌచు!
భవ బంధ మోచనా భాగ్యంబు నొందుచు!
దైవాను గ్రహమది!దకలు పడగ!
జీవ హృద్వాసిత!చిన్మయానందునిన్!
కనులార వీక్షించి!మనిరి గాదె!
తే,గీ:-యశము నందను రక్తియు!వశము!శివము!
పరల కుపకరిం చుటదియె!వరద మంబు!
ఆత్మ శుద్ధియె!సత్యంబు!హరి హరంబు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
242.సీ:-మంచికి మంచివై!మంచినే యెంచుచో?
నిను మెచ్చి కాపాడు!ఘనుడు!శివుడు!
చెడు విడు నడువడి!జీవ తత్వము మెచ్చు!
తత్వ జ్ఞానము గల్గ ! ధర్మ మబ్బు!
ధర్మంబు విడనాడ!ధరణికే?ముప్పగు!
ధరణి లేకున్నచో?తనువె లేదు!
తనువు సామ్యత నెంచ!మనుగడ!సుఖి యించు!
సుఖ శాంతు లను గోరు!సూరి గమ్ము!
తే,గీ:-మాయ చేయుట దోషంబు!మహిని తగదు!
నిజము నిల్చును తుద కెల్ల!నీతి గూడి!
కల్మ షాత్మయు పాపంబు!కలుషి తంబు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
243.సీ:-జననమందు నరుడు!జరుగు బాటు కొఱకు!
తప్పు లెన్నియొ జేసి!గొప్ప యనుచు!
మనసు తప్పు నెరిగి మదను పడును!
పైకి సత్య నటన!ప్రజల కొరకె!
పాపంబు తెలిసియు!పశ్చాత్త మెంచడు!
అహము యడ్డ పడును!యిహము నందు!
పరము నందున శిక్ష పడు నటం చెరిగి!
తప్పు మానక!కలి!ధర్మ మనును!
తే,గీ:-ద్వంద్వ వైఖిరి జీవంబు ధరణి ముప్పు!
తనకు కాదది తప్పని!దనరు టేల?
జీవ భ్రాంతిని విడ లేక?శివత గనక!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
244.సీ:-ముత్యాల పలు వరుస!మోహనా కారంబు!
రత్నాల రసరమ్య!రాజి భరతి!
బంధాను బంధాల!భద్ర తేజస్విని!
నిత్య నిర్మల గుణ నిథి!సిరి!వరాశి!
భద్ర కర్ణుని భాగ్య ప్రభ విభావరి మాత!
శరదిందు చంద్రికా!సౌరు లలరి!
నీమ నిరతి వెల్గు!నిత్య సంతోషిని!
మనయమ్మ భరతమ్మ!మముల బ్రోవ!
తే,గీ;-ముక్తి మార్గము నెంచక!మూఢు లౌచు!
తన్నుకొని చచ్చు నైజంబు తప్పటంచు!
నొప్పు కొన రేల?తుచ్ఛత గొప్ప కోరి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
245.సీ:-వైషమ్య భావాన!వర్తమానంబొప్పె!
మాయగమ్మి జనము!మత్తిలంగ!
జన్మ ప్రభృతి దోష సాచర్య భావాన!
మించి వైషమ్యాన మెలగు చుండ!
జాతి సఖ్యత మాసి!జన క్షయ మౌగదే?
బుద్ధి లేని బ్రతుకు!పుడమి తగునె?
ఏమి జూచి పొగరు!యేనాడు?పోదువో?
యెరుగ నేరని జన్మ!యెంచ వేమి?
తే,గీ:-మాట సత్యము లేనట్టి?మనుజు వయ్యు!
చేత దుష్కర్మ కారివై!చింతి లంగ!
మోక్ష మెట్లబ్బు?తలపవే?దీక్ష లేక?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
246.సీ:-వాచ్యము,శోచ్యము!వర్ణనాతీతమై!
ఆంతరంగిక నీతి యదిమి పట్టి!
అవి నీతి చేష్టల భూమి కపహాస్యమౌ!
నేరాలు ఘోరాలు నీతి మాపు!
నీతి లేని జనులు నేలకు భారమ్ము!
భవిత ప్రగత దెల్ల!భ్రష్టు పట్టు!
తప్పు సరియు జేసి!ధర్మంబు నెల కొల్పు!
ప్రగతి కోరుడి మన భవిత నెంచి!
తే,గీ:-సర్వ సంపత్కర!విభావ జగతి యందు!
మేలు.సంస్కృతి!మన దంచు!శీల మలర!
సాటి చెప్పగ రా రండి!జయము మనదె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
247.సీ:-ఓటేయ చేయూత మేటాయె!గెల్పుకు!
అడప తడప లంచ మిడుట గాదె?
వట్టిగా తిన్నది!ఉట్టినే పోవునా?
పోటి గెలుపు కదియె?భూష గాదె!
మాయ మభ్యత ముంచి!మంత్ర బద్ధుల జేసి!
డబ్బుతో?గెలుపొంద నబ్బురంబె?
యోట్ల లెక్కను బట్టి!నోట్ల ఖర్చును బట్టి!
నుద్ధరింపగ వచ్చు!బుద్ధి గాక!
తే,గీ:-దక్షిణను పొంది!ధర్మంబు!ధరణి నిల్ప!
యెంత నిజమౌనొ?యోచింప రెంత కేని?
సర్వ తంత్రంబు నకు సిగ్గు!జగతి మిథ్య!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
248.సీ:-బ్రహ్మాండ భాండముల్!బ్రద్ధలు గాకున్నె!
దేవ బ్రాహ్మణ సొమ్ము దిగను మ్రింగ!
యేనాటి భోగాలొ?యీనాడు లేకున్న?
దిగ ద్రొక్క తెగ నంత!దిగులు కాదె?
అన్ని జాతుల యందు!అతులిత ప్రాజ్ఞులు!
యెంచి సేవకు నంప!మంచి గనదె?
అజ్ఞానులను ప్రాజ్ఞ!విజ్ఞానతను నిల్పి!
వృత్తి గల్పించుట!వృద్ధి యౌనె?
తే,గీ"-బుద్ధి లేని తెలివదియె!భూమి చెరచు!
సర్వ జనములు మెచ్చగా!సాగు మంచి!
లేని పోనట్టి కలతలు లేప తగదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
249.సీ:-జనన మరణంబులు!సరి సమం బిద్ధాత్రి!
కట్టు బొట్టుల తీరు!ఘన యశంబు!
కలిమి లేములు సమం!కష్టాలు!సరియెంచ!
దాన ధర్మములందు!జ్ఞాన ఖనులు!
అభిమాన పాత్రులు ఆదర్శ మూర్తులు!
సర్వ జనంబులు!సత్వ సములు!
విటప రాజన్యుల!విహ్వ లాటోపంబు!
పీడించి తీరుమా!ప్రితి దనర!
తే,గీ:- లొంగ దీతురు లొంగకు!యొంగి నడకు!
తగని తీరున నడచిన!ధరణి మాయు!
ఆత్మ సాక్షిని నమ్మిన!యలరు జయము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
250.సీ;-త్యాగమే!యోగము!యాగ ఫలము నిచ్చు!
యోగమే!భవబంధ!రాగ మయము!
యోగమే?మోక్షము!శ్రీగంథ పరిమళమ్!
దేవతా మోదము!జీవ తరణ!
సంసార సౌఖ్యము!సరసీ రుహేక్షణమ్!
సామగాన ప్రియం!సద్వరంబు!
అద్వరంబుల కన్న!అమ్మ సేవయె మిన్న!
అమ్మయే!జగదాంబ!ఆత్మ శక్తి!
తే,గీ:-ఆత్మ లేకన్న జీవుడు హత యుతుండు!
జీవ జాగృతి! సద్వర్త! సేవ నంబు!
సేవ కాగ్రణు లిక్కోవ?సరగు చుండ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
251.సీ,-అన్న యనగ మిన్న!కన్న తండ్రికి సాటి!
పోషణా భారమ్ము పుచ్చు కొనును!
ఆత్మ సాక్షియు లేని!అన్నయు!అన్నయా!
పర భుక్త మెంచెడి పాపి గాక!
అన్న యనుట తగదన్ని చోట్ల!జనుల!
దోష కరులు మిన్న!వేష మెన్న!
అన్నలకే? యన్న!మన్నింప రావన్న!
అప్ప డీశ్వరు డెన్న?అన్న జగతి!
తే,గీ;-అన్న లేకున్న?జగమేది?మిన్న యేది?
గొప్ప భావార్ధ మన్నగా!కొలువ బడును!
తుచ్ఛ సంకల్ప ధూర్తులు!తొల్లి యట్ల?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
252,సీ:-కన్న వారిని.కాసు,కడు దూర మేర్చును!
కట్టు కున్న మగువ!కంటగించు!
పుట్టి నింట సుఖము!పొట్ట కూటికి లోటు!
పట్టిన సొమ్మెల్ల?పరుల జేరు!
కాసు,మిథ్య జగతి!కాసు కల్ల నడత!
కల్లలే?కాసుతో?కదలు చుండు!
కాసు కష్టా లవెల్ల?కలకాల ముండును!
కాసు లాశది జన!కంట్రకంబు!
తే,గీ:-కలిని కాసుల బెడదది!కాస్త తగ్గ!
ధర్మ దేవత మెల్లిగా!దరికి జేరు!
చేర కున్నను కొరివియౌ?జీవ ప్రగతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
253.సీ:-కార్యావ సానాన కధలు చెప్పగ వచ్టి!
తేరగా దోచుకు తిందు రవని!
శ్రమ కిచ్చ గింపరు!జగమిచ్చు పథకాలె!
జీవనోపాదియై!జీవ మొప్పె!
వట్టి. దద్దమ్మలు!గట్టి బింకము గూర్ప!
కాల రాయరె?భవి యని!కన రదేల?
భావి బ్రతుకు తృంచ!భద్రంబు కాదది?
రుద్రుడు నేత్రాగ్ని!క్షుద్ర మేర్చు!
తే,గీ,;-మితియు మీరిన సంకట మెంత యున్న?
సమయ మలమక విడుచునే?జగతి నెల్ల?
నదిమి పట్టెడు రోజులు కదియ నీక!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
254.సీ:-అంతస్థములనగ! య,ర,ల,వ,లవనిలో!
"య"బ్బురంబుగ నిచ్చు డబ్బు నంటె!
"రం"జుగా కీర్తింప!రత్నాల సరులంది!
లంపట దౌర్భాగ్య లక్ష్మ్మి నంద!
"లం"పటంబులు లేక!లాలించి ధనలక్ష్మి!
తమ యింటి దాసిగా!దనరె! గాదె!
" వ"ర్ధ మానంబను మాట!బద్ధ శత్రువు నాయె!
బుద్ధి లేని ప్రగతి వద్దటంచు!
తే,గీ;-వారి కనుకూల తీరున వరలె జగము
ఇచ్చు పథకాలు!మాకుండె?నిచ్ఛ మీర!
భవిత యేమైన?మాకేమి!బాధ యనెడు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
255.సీ:-ఊష్మాలు శ,ష,స,హ,లూరు వాడల ప్రాకె!
శ,మ దమాదు లోర్వని?జనము తోడ!
అరిషడాదుల నంటె!యవని,ష,కారంబు!
షష భిష లొప్పని ఛండ తతిచె!
"సా"కార మన్నది!జగతి శూన్యంబాయె!
అపకారమే!భువి కుపక రించె!
"వ"ర హకారమెభోజ్య వారాసి వ్రేలాడె!
సామమే?హుళక్కి! జన్మ మాయె!
తే,గీ;-ఆక్కజంబుగ కీర్తింప నంబ తరమె?
స్వార్ధ చింతన లేనట్టి జనులు కలరె?
మితియు మీరిన దన దాహ మెంచ కున్న!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
256..సీ:-కడు పేద యెవ్వాడు?కలిని పాలకు డాయె?
ఐనెపో?నవ్వాడు!హంత మగును!
మారణ హోమాలు!మితిమీరు కథనాలు.
జాతి వైషమ్యాల సరగు విభుడె?
కలి ప్రగతికి సాక్షి!కర్మేష్టి!ధర్మేష్టి!
యంత్రాంగ మంత్రాంగ!తంత్రు డతడె?
పాలనంబున దివ్య భావోన్నతుం డిల!
అట్టి వారిని యెంచ యవని మాయు!
తే,గీ:-కష్ట జీవనయెరుగని భ్రష్ట జనులు!
దుష్ట వర్గంబు చేరిన దురిత జనులు!
గడ్డి కొఱి కెడి!పశువుల కన్న దిగుడు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
257.సీ:-సర్వ జనుల సొమ్ము చక్కటి యెంగిలి!
యెంగిలి మెతుకులు!యెంత తిన్న!
పాలకు లిచ్చెడు ప్రతి పైస మనదని!
పరుల కష్టముతిన్న!పాప మౌను!
తినెద పో?స్వార్జిత!తిండి కాదు తలప!
ఱుణపడి జీవింప!వ్రణము సుమ్మ!
కష్ట పడని సొమ్ము!ఇష్ట మా!నరునకు!
పట్టైన పాలన!బడయ గోరు!
తే,గీ:-సర్వ భద్రంబు చేకురు!శాంతి నిండు!
సత్య వాక్పాల నంబున!సమత నిల్చు!
సమత లేకున్న సర్వంబు సన్య శించు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
258.సీ;-ఈవి గుణము లేని!జీవియు జీవియా?
పర భుక్త మయ్యది?పాప మయ్య!
శ్రమియించి జీవింప!శక్తి భుక్తియు గల్గు!
అట్టి భుక్తియె?ముక్తి!నాయు విచ్చు!
సంతాన సౌఖ్యంబు!సద్యశ పాత్రంబు!
కుల గౌరవము నిల్పు!కువలయాన!
పుట్టు గిట్టుక లాప పట్లు లేని మనము!
బ్రతుకు కాలము నీతి!వెతుక వలెను!
తే,గీ:-నీతి నిర్మల నిశ్చింత!నిర్మలంబు!
గతికి సహకార భక్తియు!గడగి నడచి!
జీవ ముక్తిని పొందంగ చింత నందు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
259.సీ:-పెద్దల మాటలు పెడ చెవిని పెట్టకు!
అనుభ వజ్ఞులు వారు!అనుభవముల!
ప్రగతి మార్గంబునకు పట్టు కొమ్మలు సుమ్మ!
కొమ్మలు తెగనేయ!కూలు ప్రగతి!
భవిత శూన్యత కోర!పాడౌను లోకంబు!
లోకంబు శోకాన మోకరించు!
గతము నూహించి యా గత మరయుమా!
సర్వ కార్యము లందు చతుర తలరు!
తే,గీ:- జన్మ మెత్తిన ప్రతి జీవి!చరిత నిల్వ!
చేయు మంచియె!నిల్చును జీవ ధాత్రి!
రామ రాజ్యంబు రావణు రాజ్య మట్టు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
260.సీ:-తొలి కోతి జన్మంబు!మరల మానవ జన్మ!
తొలి పోకడలు పోవు!తలప వేల?
సహకారమును పెచ్చె!సౌజన్య మది పెచ్చె!
పచ్చి మాంసము తిను నిచ్ఛ తొలగె!
సంస్కృతి పెంపొందె!జగము నిండెను ప్రజ్ఞ!
అజ్ఞాన విజ్ఞాన మంకురించె!
యోచనా శక్తది!భోంచేయ నెప మూనె!
పాప పుణ్యము లూహ!పట్టు జారె!
తే,గీ;-పట్టు జారిన పుణ్యంబు!గిట్ట నీక!
ఎట్టు లైనను?తెలివితో?మెట్టు నీతి!
దిట్ట తనమును!గూర్చుమా!పట్టు విడక!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
261సీ;-పనికి తగినట్టి ఫలితంబు పొంద వచ్చు!
అట్టి దానికి తప్పు పట్ట దెపుడు!
ధర్మ సంబద్ధమై దనరారు యాసొమ్ము!
హితము జేకూర్చును!యిల సుఖాల!
అన్యాయ విత్తంబు యవరోధముల పుట్ట!
దండనకు గురి యౌ!ధర్మ హాని!
పలు పొట్టలు కొట్టి!పాడు భుక్తంబున!
పాపాత్ము డౌటేల?భయము లేదె?
తే,గీ:-బ్రతుకు చెడు జన్మ యైనచో?పాడు గాదె?
తలల యందున నాలుకై!దనరి దనరి!
మాన్య జీవిగ బ్రతికిన!మనిషి మనిషి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
262,సీ:-ఎందుకో?పుట్టి!యెందెందునో?పెరిగుచు!
ఏమి మోసుకు పోదు వెంచి చూడ!
నీతి లేని బ్రతుకు!జాతి లేని వలపు!
వలపు లేని తలపు!చిలికె దేల?
చిలుకు తేనియ లూరు పలుకులు!జగతినిన్!
భగవ దర్పిత బుద్ధి!వలను పడగ!
సిగ ముడి విడనీక!బిగువును తెగ నీక!
బంగరు జీవంబు!భవిత నింపు!
తే,గీ:-ఇంపు పెంపెస లారగ!యిలను కీర్తి!
భూ నభోంత రాళముల!పూజ్య మిడగ!
మేలి యేలికలై యొప్పు!మేథ తోడ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
263,సీ:-తత్వంబు మది నెంచి!తన్మ యంబొందితి!
మన తల్లి భరతమ్మ మనల యమ్మ!
అమ్మ కీర్తిని మాప అన్యాయ మంచెంచి!
మంచి మార్గ గమన!మనసు నెంచి!
వీనుల విని నట్టి!కన్నుల కని నట్టి!
చర్య లన్నింటిని!చక్క నరసి!
హిత బోధ గావింప!యినకుల తిలకుని!
పరి పాలనము గోరి!పలుకు చుండు!
తే,గీ;-దోష రహితపు బుద్ధితో?దురితము లను!
వెడల జేసెడి మనసున వెలికి జెపితి!
తప్పు లెన్నడు స్వార్ధుల తుప్పు రేపి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
264.సీ:-ఉమ్మ నీటిని బుట్టి!ఉచ్ఛిష్ట జన్మి వై!
ఉచ్ఛిష్ట జీవంపు!తుచ్ఛ తేల?
జీవంబు భవ్యంబు!సిరి పంట వసుధంట!
తేజో విరాజివై!దివ్య మలర!
కీర్తి ప్రకీర్తులం కెంగేలు మోడ్చంగ!
జంగ మార్యులు!దివ్య జ్ఞాన మిడగ
జాత వేదుడు బ్రహ్మ!జన్మ నిచ్చిన వాడు!
పూర్ణాయు వీయంగ!పూజ్య మలర!
తే,గీ:-కీర్తి కాంతయు నిన్నంటి యార్తి బాప!
తామసత్వంబు విడనాడి!ధరణి నేల!
రాజ ఠీవిని ప్రకటించి!రస వెలుంగు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
265.సి:-యుక్త మౌ!భుక్తంబు!యున్న తాశయంబు!
నెరవేర్చు నిద్ధాత్రి నిశ్చయంబు!
మితి మీరి గతి మాలి!మీరిన స్వార్ధంబు!
జీవ ఛ్ఛిథ్రం బేర్చు చిచ్చు చేర్చు!
అచ్చు గుద్దిన తప్పు! యాహ్లాద మేర్చునా!
తప్పు సరియు జేయ ధర మెరుంగు!
మెరుగు లేని వెలుగు!చెడును చీకటి తీరు!
చీకట్ల చిందులు!చింత మయము!
తే,గీ;-జ్ఞాన విజ్ఞాన కాంతుల!జగము నడుప!
ప్రజలు సుఖ జీవనంబుల!ప్రబల గలరు!
మెట్టి నిల్లైన స్వర్గంబు!మింట గనెదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
266.సీ:-జీవ మిచ్చెడి శక్తి!నీవశ మౌనొకో?
జీవ మార్పగ చూడ!చేవ తగునె?
పాపానలంబున పడి చావ కోరకు!
కోపమే!శత్రువై!కొంప కూల్చు!
దుర్మార్గముల దారి!దురహంబు కల్పించు!
తప్పులు జేయించి!తుప్పు రేపు!
చెడు కనక! చెడును!చేరక మన్నుమా!
మహితాత్మ!మహి మెచ్చ!మాన్యు డౌచు!
తే,గీ:-వికట రాజకీయాలవి !విస్తు నిచ్చు!
చిత్తు నౌటేల?చిత్తాన చేర్చు మంచి!
సంచి తంబగు పుణ్యంబు పంచు మిలను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
267.సీ:-గాన గార్ధభ శైలి!కలి కంఠ రావమై!
మేలి సునక స్వన!మేళ వమున!
పాడినదే?పాడు పాసి పాట యట్లు!
అరుపులే!రాద్ధాంత వరవ డాయె!
గంధ సౌరభ్య మెంచ గాడిదాఘ్రాణమై!
కరవ లేని యరపు!కదలె జగము!
విడని దోషాలవి!వెన్నంటి తరుమంగ!
చేతనా శూన్యమై!జగము వెల్గె!
తే,గీ:-నీతి నీమాలు పనిలేక నీరసించె!
కోతి చైదాలు పాలనం!మూతి నాకె!
ధీర ప్రాజ్ఞులు రావలె!దివ్య మేర్చ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
268.సీ;-పదిమంది గాడిదం పలుమార్లు యేన్గన!
యేనుగే!యనవలె!యిహము నందు!
దొంగను పలుమార్లుదొంగ దొంగనగ!
దొరతనంబున నొప్పు దోర్బలాన!
సింగమే!భంగమౌ!చిట్టెల్క బెదిరింప!
అంగ జారికి యైన యంతు గనదు!
మాయను మాయయే!మరిమరి యోడింప!
మంచి గనుట కల్ల!మహిని కనుడి!
తే,గీ:-మాయ నడచి వచ్చి జగతి మాయనంగ!
జగమే!మాయయౌ!శోధిల!సత్య మింతె?
సరళి సంస్కార భావంబు!సత్వ బుద్ధి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
269.సీ;-రాబందు బంధంబు!రాకేందు వదనంబు!
చేజార నీయని చేతనంబు!
పూబంతి సౌరంబు!పుణ్యాల పుర దండి!
దండిత కల్యాణ ధాష్టి కంబు!
ధాష్టికం బది!ముష్టి చేష్టకం బలరార!
యంత్ర దండము నెంచు మంత్ర మాయె!
తంత్రాల దీపాలు తారలం దెగ జార్చ!
ప్రజ్ఞ పాటవములు! ప్రభుత మలర!
తే,గీ:-తట్టుకొని జీవ మననము!ధాష్టి కంబు!
ధాష్టికాలను మంచిచే తరిమి తరిమి!
పంచి మంచిని మంచెంచ!పాడి యౌను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
270.సీ:-మంచి చెడ్డలు నెంచు మహిమంబు కల్గుండి!
మంచి బట్టి మసలు మనిషి గమ్ము!
చెడ్డ చేష్టల నంటి!చెడదీసి చెడి పోకు?
చెత్త బ్రతు కదేల?చింతకొఱకె?
మనసు చింతన చెడు!మాయంటి వర్తించు!
జీవ ప్రమాణంబు చిక్కుగొనును!
మంచి కోరుచు మంచి!యంచి తంబుగ నొంది!
మహనీయ మూర్తియై!మహి వెలుంగు!
తే,గీ:-తెలివి మంచికి మంచియై!దివుర నిమ్ము!
నీతి నియమాల!నిను మించు నేత లేరి?
శాశ్వతంబైన కీర్తికి!సాక్షి నిలుమ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
271.సి;-తేజస్సు,ఓజస్సు,ద్విజ తత్వ!స్థవ్యతా!
గాయిత్రి మంత్రాన కర్తృకంబు!
నిత్య నిష్ణాతుడై!నిష్కర్మ కాముడై!
సుష్క ప్రయాసాలు చూరగొనక!
భవ బంధ మోచనా!భావాను రక్తుడై!
పర కష్టముల పాలు పంచు కొనుచు!
జ్ఞానియై!మానాభి మానియై!రసగుణ
రమ్య ప్రపూర్ణతా!రావ మౌచు!
తే,గీ:-రాజ చర్యలు సరిదిద్ది!రసను దీర్చి!
జీవ నొపాది కల్గెడు!స్వీయ శక్తి!
యుక్తి ముక్తికి మూలమై!భక్తి నిల్పి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
272.సీ:-ధర్మాను గుణ్యమై!ధరకు మేల్గూర్చెడి!
కామ్యంబు కామ్యార్ధ!శ్రీ మఖంబు!
ధర్మ భూయిష్టార్ధ!కర్మంబు!స్థవ్యంబు!
స్మ్రుతి ప్రోక్త యర్ధంబు!శ్రీకరంబు!
ధర్మార్ధ కామ్యముల్!దగ నిచ్చు మోక్షంబు!
మోక్ష మొందెడి జన్మ మోహనంబు!
తే,గీ:-నుతుల నుతమతి!గతిమయ!స్థితిని గనుమ!
శాశ్వ తంబగు కీర్తిని!సాకు మోయి!
స్థిరమ నంబున జీవంబు!సిద్ధి గనును!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
273.సీ;--ప్రాణ ఘాతుక మెంచు ప్రతి యడుగు!చెడుగగు!
చెడును యెరుగు టది!చేత నవదు!
యెరుగని యాచెడు!మెరుగు తీగెల భంగి!
చుట్టు ముట్టి!చెడుచె సృక్క జేయు!
తెలిసి కొనెడు లోపు!దిగ ద్రోయు జీవంబు!
పూర్వ పరము లెంచు!బుద్ధి వలయు!
తొందర పడరాదు!తర్కించి తొలి మలి!
నిర్ణయించి!చెడును నెట్ట వలయు!
తే,గీ;-చెడును మంచిగ!మనసెంచ!చెడిదె!రిలను!
తెలుపు గనినంత!స్వచ్ఛత గలదో?లేదొ
చవిని జూచియు తెలిసికో?సజ్జనుండ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
274.సీ:-ఉప్పు కప్పురంబులు!నొప్పు నొకటి యట్లు!
చూడ చూడ!రుచుల జాడ వేరు!
మనుజు లందరొకటి!యనుటయే!తప్పగు!
వారి భావ సరళి!బట్టి యుండు!
అన్నంబు యన్నమే?సున్నంబు గాదది!
సున్నంబు మ్రింగిన సోలు జనుడు!
అర్హంబు లేనట్టి!యతులిత భోగంబు!
గర్హ నీయము గాదె?కలియుగాన!
తే,గీ:-లేని పట్టును గూర్చుట!కాని తనము!
వృత్తు లెగనెట్టి!ప్రతివాడు!విత్తు గోర!
నేల వీడిన సామునై!నీల్గు భవిత!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
275.సీ:-తగిన విశ్వాసము!ధర నొప్ప నూహించి!
పాడి పంటలు పెంచు!పట్టు గూర్చు!
తిండి నొసగు రైతు!దివ్వె!జగతి కన!
పోషణా బాధ్యత పుణికి పుచ్చి!
యంత్రాలు తంత్రాలు!యల యూక దంపుడై!
బియ్యంబు గన నెంచ!ప్రీతి గనునె?
పబ్బంబు గడిపెడి!పనుల కాలము దీర!
పడి చచ్చు నిద్ధాత్రి!భంగ పడుచు!
తే,గీ;-ఆన కట్టలు కట్టుచు!యన్న మిడుడి!
అప్పు ముప్పును తప్పింప!నొప్పు తెలివి!
చొప్పి!భావి భరత మాత!కొప్పు నొప్పు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!
276.సీ:-లోటేది?భరతమ్మ!కాటేయు వారిచే!
మేటైన ఘనకీర్తి!మీట బడెను!
సిరుల నిలయ వీవు!చెన్నారు గనులచే!
మిన్నంటు భోగాల మేథవీవు!
స్వార్ధంబు మితిమీరి!స్వాహాలు చేజిక్కె!
తప్పించు కొను శక్తి!తగను గనక!
తబ్బిబ్బు నొందుచు తంటాల మారుల!
ధాష్టి కంబుల మ్రగ్గె!పుష్టి వీడి!
తే,గీ:-బీద యరుపుల భారతి!నీద జేసి!
సంద్ర మందున త్రోసిరే?సార సాక్షి!
ఈది యీనాడు మము గావ యేల?రావు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
277.సీ:-వనరులు వేలిదీసి!వనజాలు రక్షించు!
భూగర్భ లోహముల్!పూజ్య మేర్చి!
నీతి యుక్తాన సరి నేతృ భావ మలర!
భూ సంపదల్!నిల్చు!భూమి నిల్చు!
ఒకరి పెంపది కాదు!సకల పెంపను కొన!
అందరు జీవింత్రు హాయి గాను!
అందరిలో?నొకడందు వేనిల యందు!
సర్వేశ్వరు డగుదు!జగతి కెల్ల!
తే,గీ:-కీర్తి శాశ్వత మనియెంచి!యార్తి గనక!
దాన ధర్మాల యానాడు!ధన్యు లైరి!
అట్టి మార్గాన నడువుమా!యవని మెచ్చు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
278.సీ:-జంతు జాలము నొక చెంత!విడిచి పెట్ట!
కరుచుకొని మడియు!వరవ డాయె!
నేటి స్వేచ్ఛ చరిత నించు మించు సమము!
మతి లేని చేతన!మాయ మేర్చు!
వెనుక మందులు నెంచి!వెత దూర భావన!
కుదురైన మతి గల్గి!కొదువ గనని!
సౌభాగ్యమును పెంచ!సాగగా వలె నోయి!
పాలకు లేలికన్!భద్ర మలర!
తే,గీ:-ఆర్ద్రతా భావ మన్నింట!యలము కొనెను!
కోరు కోర్కెల దీర్చంగ!మేరు ధీర!
రమ్ము పాలింప నీతితో?రసయు మెచ్చ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
279.సీ:-అందాల యపరంజి!యాహ్లాదమున!దిట్ట!
పేరుటురము తల్లి పెన్నిధామె!
ఆ తల్లి !మనతల్లి!యమ్మల పెద్దమ్మ!
పెద్దమ్మ దద్దమ్మ!పేరు పెట్టి!
కంకణంబును గట్టి కదలాడిరో?యన!
కాడు సేయ తగదీ!కర్మ భూమి!
మర్మాలు మనకేల?కర్మ సాక్షులు కండు!
తల్లి పెంపును పెంచ!తరలి రండు!
తే,గీ:-దివ మహంబులు గడచును!తెలిసి మసలి!
బ్రతికి సాధించినది యేదొ?మదిని దలచి!
స్వచ్ఛమే?నిత్యమై!గుణ సామ్య తరయు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
280.సీ:-అపకార భావంబు నుపకార మెంచునే?
అవని యంతము నైన హాని యైన!
స్థిరము గానిది స్థిర మౌనె?చింతిలంగ!
మర్మ కర్ముల మార్చ!మహి వశంబె?
దురితాల పుట్టయౌ?దుర్మార్గ చరణంబు!
మార్చ వశఘు కాదు!మారుతైన!
నరకంటకుల చేష్ట!నర్మ భూయిష్టంబు!
ప్రాణాలు తీసెడి పట్టు నొప్పు!
తే,గీ:-దుష్ట సంఘాన్ని ఛేదింప దురిత మాగు!
దురిత దూరము జగతికి మేలుగూర్చు!
మెరుగు లేకున్న! దష్కర్మ మింటి నంటు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
281 సీ;-జ్ఞాన హీనులు జేయు జపమది!తప మాయె!
తపకర్మ మహిమంబు!తల్ల డిల్లె!
ఆగత మెంచని జీవి!స్వాగత మెంచగా!
భోగాలు యోగాల యోగ మలరు!
కాగల కార్యాలు కలిమియే?దీర్చంగ!
కాలంబు పనియేల?కాల మేల?
నలుగడల చెడుగు నాట్యంబు సేయగా!
మేలేల?జగతికి!చేల మేల?
తే,గీ:-చేలమే?లేని స్వార్ధంబు చిందు లేయ!
మేళ వించునె?విజ్ఞత!మేథ నెంచ!
భూది భావన సరిగాదు!భువన క్షయము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
282.సీ;-కనులుండి కనలేనికర్మ సంస్కారంబు.
గత జల సేతువే?కనగ కనగ!
వీను లుండి వినని!విశ్వ సౌరభ్యంబు!
విగత జీవ సమము!వినుమ!వినుమ!
మెదడు లేని!బ్రతుకు!భూది పన్నీరు రా!
శోధిల వేవయా?శోదదేల?
గార్ధభ!రావంబు!గజరాజ సమ మౌనె?
యోచిల వేలనో?తూచి!తూచి!
తే,గీ;-బూచి దెయ్యం బనుకొనుచు!బుద్ధి మాలి!
బెగిలె!దేలను?ధైర్యాన బిగువు జూపి!
యెదురు నిల్చియు పోరాడు!యెదుగు గనెదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
283.సీ:-గాది లోనను దూరి!గాదినే?తినియెడు!
పంది కొక్కుల తీరు!ప్రగతి యెసగ!
ధాన్యంబు పొల్లయౌ!ధర్మంబు కుంటిదౌ!
నడువ లేక పడును న్యాయ మిలను!
మోయ లేని బరువు!మోసిన గాడిదె!
నేల కొరిగి బాధ నీల్గు గాదె?
బోధ లాలించని బుద్ధి హీనుని తీరు!
అద్దిరా!తలపోయ!యవని నింతె?
తే,గీ;-వింత పోకడ లేలయా?సుంత శాంతి!
జగతి మేలుకు జనుపుమా!జయము నీదె!
నీది కాని దేదియు?లేదు నిశ్చ యంబు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
284.సీ:-గోటితో మీటెడి గులక రాయిని నెట్ట!
గునప మవసరంబ!గొన కొనంగ!
నీటి బయటి చేప మేటిదా?వేటాడ!
పూట తినగ లేని?మేటి యాట!
కూడు లేని జనుని కోటికి దరి జేర్చ!
మాటుపడు ప్రగతి చోటు గనక!
సోమరత్వము నేర్పి సోమిదులు జేయిచో?
హోమాలు భీకర భూ మఖాలు
తే,గీ:-కాల నేముల చేబడి!కలత లేర్చు!
లేని పరుగులు పరుగిడ!పోని నింద!
నింద నందక యోచిల పొందు సుఖము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
285.సీ:-పొరపాటు నైనను పర హాని కోరకు!
పరహాని పాపంబు పట్టి కుడుపు!
పొర పొక్కెముల బోవ!పొంకంబు మిన్నంటు!
త్రొక్క తగదు నొడ్ల!తూలి పోదు!
అక్క రకు తగని హక్కది!గొప్పయా!
చిప్ప చేతికి నిచ్చి ఛిద్ర మేర్చు!
తప్పు నొప్పగ చెప్పి!ధర్మంబు మీటిన!
కర్మాను సంకెళ్ళు!కట్ట బడెదు
తే,గీ:-ద్రోహ మందు జిక్కి ద్రోహి వౌచు!
నీచ నికృష్ట జీవిగా!నిలుతు భువిని!
పరువు పరపతి! లేకుండ!పాటు పడెదు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
286.సీ:-ఆత్మాభి మానంబు యడ్డు రానీయక!
పరపెంపు యింపంచు పరగు మోయి!
శీలంబు చెడనీకు!చేలంబు విడనీకు!
మానావ మానాల మ్రగ్గ బోకు!
కాలాను గుణ్య మౌ!కమనీయ భావాల!
కలి మెడ్డి జనులకు!కలిమి నొసగు!
పవసకాయ సదునును మనమున రానీకు!
దూది మెత్తన గల్గి తూగు మిలను!
తే,గీ:-వరద మంబైన జన్మగా!వసుధ నిల్చి!
పరుల కుపకారి కావయ్య!పరమ నిష్ట!
శిష్ట జన బోధ లాలించి!శివము గనుమ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
287. సీ:-మనల నడుపు శక్తి!మహిని గలదు రన్న!
శక్తి సాకారంబు!సర్వ మలము!
అమరిన శక్తితో?యవరోధముల నెట్టి!
వీలైన మంచికి విలువ నిచ్చి!
చేయ గల్గిన సేవ!చేయుమా నిరతంబు!
సేవయే! పరమాత్ము చేర్చు!తుదకు!
మంచి సంకల్పము!మనిషికి కావలె!
సంకల్ప సిద్ధియే!జయము సుమ్మ!
తే,గీ:- పగకు తావీయ కెన్నడు?బరగు మంచి!
నీతి లేనట్టి జన్మంబు నీచ మోయి!
జాతి పవిలేదు నీతికి!జగము నందు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
288.సీ:-పొరపాటు నైనను!పరహాని కోరకు!
పరహాని పాపంబు!పట్టి కుడుపు!
పొర పొక్కెముల బోవ!పొంకంబు మిన్నంటు!
త్రొక్క దగదు నొడ్ల!తూలి పోదు!
అక్కరకు తగని!హక్కది గొప్పయా?
చిప్ప చేతికి నిచ్చి!ఛిద్ర మేర్చు!
తప్పు నొప్పుగ జెప్పి!ధర్మంబు మీరిన!
కర్మాన సంకెళ్ళ కట్ట బడెదు!
తే,గీ:-ద్రోహ మందున చిక్కిన!ద్రోహి వౌదు!
నీచ నికృష్ట జీవిగా!నిలుతు వవని!
పరువు పరపతి లేకున్న!బ్రతు కదేల?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
289.సీ: స్వార్ధ భూయిష్టమౌ!సంసార మియ్యది!
అర్ధమే?పరమార్ధ మలమె జగతి!
అర్ధము లేకున్న!వ్యర్ధ జీవితమౌను!
వ్యర్ధ జీవిత మేల?వసుధ కనుచు!
ఆశ కంతము లేని!పాశార్ధ బద్ధులై!
కొట్టి మిట్టాడుచు!కులుకు చవని!
పట్టు విడని యట్టి!భట్టి విక్రము లౌచు!
దోచి దాచుకొనుట!దోష మనక!
తే,గీ:-నిండు స్వార్ధాన్న!మునిగిన దండు యిద్ది!
దీని మార్పంగ వశమొకో?దేవ తతికి!
మార్చి దౌర్భాగ్య!ధోరణి!మాప వలయు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
అర్ధము=ధనము సొమ్ము.
290.సీ:-ఒక్కని యూహయే!నిక్కువం బూహించి!
లోకంబు నడిపింప!శోక మలము!
అందరి నైజం బన్నన్ని రీతుల
ఎన్నెన్నొ మార్గాల!మిన్ను దన్ను!
మాట లేకము గావు!మనసు లేకము గావు!
భిన్నత్వ మేకత్వ!ప్రియత మింతె?
స్వాతంత్ర్య మన్నది!సార్ధకం బౌనొకో?
భరత జాతి!భవిత!భ్రమయె!గాక?
తే,గీ;-ఎవరి స్వార్ధము వారిది!చివరి వరకు!
మోసుకొని పోవు నదేదయా?మొండి గుణుడ!
సార్వ భౌమత్వ మిద్ధాత్రి!చక్క బడునె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
291.సీ:-పదిమంది మేలుకు పదవు లొందుట కాదు!
వారి కులపు టేపు వాసి కొఱకె?
ఉద్ధరింపను మాట!బుద్ధి మార్చుటె తప్ప!
నిర్ధూమ ధూమంబు!నీశ్వ రేచ్ఛె?
జన్య కులపు పెంపు!జాగృతే?స్వేచ్ఛాయె!
తక్కు సంఖ్యాకుల!దిక్కు మాల్చి!
భోగాల రోగాల త్యాగాలు!కొండెక్కె!
కండ్లు నెత్తికెక్కి!కదలె జగము!
తే,గీ:-నీచ సంస్కార సంస్కృతి!పింఛ మణచ!
భిన్న తత్వాల భారతి!బాగు పరచ!
పారశీకుల పాలనే?భవ్య మవదె?
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
292 సీ:-బాగోగు లెంచని భవిత యిచ్ఛను మెచ్చ!
భద్రంబు రుద్రంబు!క్షుద్ర మౌను!
క్షుద్ర సంకల్పంబు!క్షోభ దాయక మౌను!
బుద్ధి రుద్రము జేయ!భువియు మాయు!
ఉట్టి కెగర లేక? పట్టి స్వర్గము కోర?
దిట్ట యెంతయు నైన!దిగులు గనును!
మాట ,చేతల, మాయ!మట్టి పెట్టిన చాలు!
జగదైక మోహనా జాగృ తలరు!
తే,గీ:-దేశ మనగ ప్రజలనెడు!దీక్ష బూని!
జనుల సాకార సంపత్తి!చక్క గొనుచు!
నీచ సంస్కృతి నెగ నెట్టి! సుచిని! మనసు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
293.సీ:-ముక్తి సోఫాన పథకమ్ము!మోహనంబు!
మోహనాకారంబు!ముదము నిచ్చు!
జన్మ జాగృతి జీవ జాగృతియే!సుమ్మ!
జాగృతి లేనట్టి?జన్మ జన్మె?
జన్మ మెత్తిన జీవి జన్మాంత రంబున!
సంసార తాపత్ర్య సరళి దేలు?
తేలి యాడియు మాయ!కోలు కొనక!
పాపాల మ్రగ్గుట!భవము నౌను!
తే,గీ:-తూచి తూచి యడుగిడు!సూచి యౌచు!
మంచి మదినెంచి!మన్నుమా?మనుజు వయ్యు?
ధర్మమే?రక్ష కలియందు!ధాతృ శీల!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
294.సీ:-జన్మ జాగృతి!జీవ సౌజన్య పాత్రంబు!
పాత్రంబు పరమేష్టి!వ్రాత సుమ్మ!
అమరిన యా వ్రాత!ఆది మధ్యాంతర
స్థిత కర్మ ప్రభవంబు!జీవ ముక్తి!
జీవ ముక్తిని గోరు!జీవనోపా దిది!
సద్ధర్మ నిరతిని!సాగ నిమ్ము!
నిమ్ముల వమ్ముల నిరవద్య!జీవాలు!
నిరుప మంబుల వీడి!తిరిగె దేల?
తే,గీ:-నిమ్ములను మించు దైవంబు!నెమ్మనాన!
కమ్మ నైనట్టి!కల్మిల!కామిదాల
చిమ్ము దేదీప్య ప్రభ లిల!శ్రీలు వెలయ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
295.సీ:-కడుపార భుజియించి కల్లల జీవించి
కలి నిట్టు వల పట్టి కదల నేల?
పరభుక్త!చర యుక్త!పంచత్వ ధృగ్జాల!
పంచాస్యమేనంచు!నెంచ నేల?
సంచిత పుణ్యంబు!సంసార భాగ్యంబు!
కలిమి లేముల నెంచ కదల వేల?
సాదృశ్య జీవంబు!సమ ధృష్టి భావంబు!
సంసార తరణంబు!సరగ వేల?
తే,గీ:-చెడును చేగొని!పడుపాటు!చీడ గాదె?
చీడ గాంచిన జీవంబు!చెడును గాదె!
కాని పనిజేయ!కర్మంబు కట్టి కుడుపు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
296.సీ:-బలహీనులకు తోడు! పరమాత్ముడే గదా!
పరమాత్ము నెంచని బ్రతుకు బ్రతుకె!
అరకొర జీవంబు!అన్యాయముల పుట్ట!
అవరోధముల నెట్టి యలర వేల?
కొరగాని జీవంబు!కొరవి గోకుడు సుమ్మ!
గోకుడు సుఖ మేది?గుణము లేక?
గుణ గణపతి మది!కొనియాడి!జీవించు!
సుగుణ ఖనివి యౌదు!జూడ వేల?
తే,గీ:-బాల భోగంబిది!భవిత బంగ రమ్ము!
నిండు పూర్ణతగని సాగు!నిర్మలాన!
భక్త జన పోషణలరును!భగవ దాజ్ఞ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
297.సీ:-త్యాగాల నిలయమ్ము!భోగాల వరదాయి!
జీవ మిత్ర విచిత్ర!శ్రీ వరాళి!
శాస్త్ర జ్ఞానుల పంట!సద్యశ కర్మేష్టి!
భుక్తేష్ట భువనైక మోహ నాంగి!
కర్మమే?ధర్మమై!కమనీయ జీవమై!
జీవమే?పరమార్ధ భావ మరయ!
నిత్యాగ్ని హోత్రాల!నీమ నిష్టల నొప్పి!
పుడమికే?తేజమై!పూజ లందు!
తే,గీ:-చరిత మనదంచు తెలిసియు!చవట తెల్వి!
తలపు విభవాల!విడి నడ!ధరకు మేలె?
మేలు చేకుర జీవించి మేటి గమ్ము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
298.సీ:-దూర దృష్టియు గల!తొలినాటి!జ్ఞానులు!
కలరు యీనాడంచు!కన వదేల?
ఊహల నూహలై!ఉద్యమించియు శాస్త్ర!
విజ్ఞాన మాశాంత!వినుతి గనుట!
చూచి దద్దమ్మలై!చూరగొనక?శక్తి!
నిస్తబ్ద జీవులై!నిలతు రేల?
ఉన్న గొప్పను గని!మిన్న గొప్ప దలచి!
శాశ్వతంబగు కీర్తి సాక రేల?
తే,గీ;-మంద మాధ్యంబు మనశక్తి!మంట గల్పు!
జీవ శక్తికి ముక్తికి!జీవ మిదియె?
రత్న గర్భయె!మనయమ్మ!రమ్య చరిత!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
299.సీ;-లేని పోని తెలివి!లేనివి కల్పించి!
కానిపోని పనుల!కంటకు లయి!
వైషమ్యములు లేపి!విష ప్రచారము జేసి!
కలతలు కలిగించి!ములుకు లౌచు!
విభజించి పాలించు!విజ్ఞాన ధోరణి!
దేశ సఖ్యత మాపు!వేష మాయె!
సమత సమతటంచు!సాను కూల్యత మాపి!
కుల రొచ్చు మది గుచ్చి!కూల్చి ప్రగతి!
తే,గీ:-దివ్యుల మటంచు పెట్రేగి దివురు టబ్బ!
గొబ్బు కంపున మిట్టాడు!కోలు కొనక!
అట్టి పట్టున పర ధృష్టి పడను మనకు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
300.సీ:-రూకలు వెదజల్లి!నూక లాశయు పెంచి!
జన పక్షులను పట్టు చర్య యాయె!
మనుజుల పరిమార్చి!పక్షుల హతమార్చి!
నాయక నిషధుల న్యాయ మలరె!
జనుల ప్రగతి సున్న!కనదు జీవము పక్షి!
కాటు వేయు నెటులొ?కన తరంబె?
ఇట్టి సంక్లిష్ట భూయిష్ట!స్వేచ్ఛ మనది!
తుప్పు తూల్చగ దైవ!మొప్పు!వలయు!
తే,గీ:-అప్పు గొప్పలు చిప్పకై నొప్పుచుండ!
చిప్పలను దోమ నప్పడే?చేర వలెను!
పప్పు బెల్లాల పంపక పాప మిదెయె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
301.సీ:-దుఃఖ జీవులు!జనదోష భూషణికులు!
కల్మషాత్ములు కలికాల యములు!
దండ ధారుఢ్యులై!ధర నేల?ముందుండ!
మోద మందుచు నెన్న!ముచ్చటౌనె?
సర్వ విధ్వంశమౌ!సాహస యత్నమే!
భవ బంధ దుఃఖము ల్బడయ జేయు!
జ్ఞాన హీనుడు జేయు!జప తప తుల్యమౌ!
జ్ఞాను లెన్న బడిన!జగము మెరుగు!
తే,గీ:-మెరుగు తీగెవు!నీవయ్య!మేథి నేల!
దాన కర్ణుడ వీవౌదు!ధర్మ మూని
మాన ధనుడవు!నీమాన!మసలు మిలను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
302.సీ:-అరిషడులను గెల్చి!పరిపూర్ణ జ్ఞానివై!
ప్రజలె!దేవుళ్ళను భావ మలర!
పాలింప వచ్చిన ప్రభుడ వీవను చుండ!
ఛండుల దండింప కుండు టేల?
జ్వాలానలపు వ్యాప్తి!జగతినే?మసిజేయ!
అనిల మాపి జనుము!జనుల బ్రోవ!
తప్పుకు తగు శిక్ష నొప్పకున్నచొ?ముప్పు!
జగతి ప్రగతి గూర్ప!సాగ నీదు!
తే,గీ:-క్షమకు తావిచ్చు!మనసది!చక్క నౌనె?
శాత్ర నివహంపు టంతమే!జగతి ప్రగతి!
మెత్త దనమది!మేటుల చిత్తు జేయు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
303.సీ;-కాట్లాడు జీవుల కలిసి కట్టుతనము!
కెనయౌను పాలనా!తనము జగతి!
కోప తాపావేశ!కూర్మి పోట్లాటలు!
జనమభ్యతను ముంచు!సాధనంబు!
జనుల వెఱ్ఱిగ జేసి!సాగించు నటనలే!
అందరందరు నొక్క టందు నరయ!
కంఠ శోషయె గాని!కన నౌనె?శ్రేయంబు!
సంకుల సమర మిజ్జగతి!సొబగు!
తే,గీ:-అట్టి సమరంబు నెట్టెడి దిట్ట వలయు!
రాజ కీయపు చదరంగ రంగ మందు!
పగ లశాశ్వత మను మాట!పక్క నిజము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
304.సీ:-సర్వార్ధ సాధన స్వార్ధమే?తమదంచు!
తమిదీర భోగాల గమిని జేర!
నుఱ్ఱూత లూగేటి!చిఱ్ఱు తాత్వికు లిల!
కొఱ్ఱు జీవ మదత!జుఱ్ఱి సిరుల!
బీద బీదయె గాక!పెంపు గనునె?
మధ్య తరగతెల్ల?మట్టి బట్టె!
విను వీధి విహరించు!విఖ్యాతి!ప్రభు లందె!
సామాన్య బ్రతుకులు!జారె నీట!
తే,గీ:-ఇట్టి స్వాతంత్ర్య జీవంబు!జగతి కబ్బె!
పట్టి యోచించు జ్ఞానంబు!ప్రజకు లేక?
నిజము తలదించి సిగ్గిలె!నీతి మాలి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
305.సీ:-ఐదేండ్ల పాలనే?ఐశ్వర్యమును పెంచి
తరత రంబులు సిరి!దాసి కాగ!
డబ్బు చేదెవరికి?ఉబ్బి తబ్బిబ్బవగ!
యవినీతి కలిమాయ!భవిత యింతె!
నీతి నిల్కడ యున్న!నేతల రానీరు!
పాపిష్టి యవినీతి!పాడు జనులు!
దైవాంశ సంభూత!దాక్షిణ్య మూర్తీవు
నీతిమాతకు!ఖ్యాతి నింప రమ్ము!
తే,గీ:-జాతి ప్రగతికి సర్వదా సాయ పడుచు
దివ్యు లానను పాలించు!దీప్తు లలర!
నిండు నూరేండ్లుజీవించి!నీతి వెలుగు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
306.సీ:-లోకంబు మనదయ్య!లోకులు మనవారు!
ఆకులంబున జిక్కి యలమటింప!
చూచి తాళగ లేని?సున్నిత తత్వంబు!
చెడు చర్య!సరిజేయు!చింతనమున!
నిజము నిష్టుర మంచు!నిర్మొహ మాటాన!
వెలిజేసితి!జగ విభవ మెంచి!
పోరాడు నెపమంచు పొక్క రా దెవ్వారు?
కోరు కొందునుమంచి!గుణత నమర!
తే,గీ:-తప్పు గ్రహియించి!సరిజేయు తపన తోడ!
వ్రాయి పద్యాల సత్యంబు!పట్ట దలతు!
రాగ రంజిత సౌభాగ్య!రాజి భరతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
307.సీ:-పంక జలోద్భవ!భామిని సిరిమాత!
బంకమేని ఛాన! తా!పరవి జగతి!
లోకాని కాపంక!మేకంగ గల్పించి
పంకిల తత్వంబు!పరగ నిలిపె!
కట్టుకున్న మగడు!కలి స్థిత మతి కాగ!
శేషసాయి పరిచర్య!చేయ కలిగి!
నరుల ధనబంక!నంటింప భువిని జేరె!
పట్టి విడని బంక పట్టు పట్టి!
తే,గీ:-పరమ దుర్మార్గ భావాల!ప్రజల గాంచి!
ధనచింత ముంచెత్తి!దనరె పిచ్చి!
నీతి లేని ఖ్యాతిని!నింపి!నీల్గ జగము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
308.సీ:-వంటి కంటిన బంక!వలపోపు ధనపంట!
ధనపంట తగ్గింప!ధరకు వశమె?
బంక జనుల బట్టి!సంకటముల పెంచి!
ఇన్ను మిన్ను గనని!యీర్ష్య పెంచి!
పంచ మాతృకలను!పట్టి పట్టి తరిమి!
తమదైన పొగరుకు తాళ మిడక!
భూష భాషలు భుక్తి!భూమిక పోషింప!
పూలు గట్టి తిరుగు!పూజ్య మలర!
తే,గీ:-లోక కంటకు లివ్వారి!త్రొక్క కున్న!
చిక్కు ముడిపడు భర తాంబ!దిక్కు మాలి!
దిక్కు మాలిన జన్మంబు!దివురు నిలను!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
309.సీ:-కుల పిచ్చి!కలి మెచ్చ!కలిమిచ్చి!కాపాడ!
మత పిచ్చి!మద పిచ్చి!మారు మ్రోగ!
పిచ్చి పిచ్చుల మంచి!విచ్ఛిత్తి కాబడి!
చచ్చు ప్రగతి కెంతొ?సాయ పడగ!
కడగంటి చూపాయె!కనదాయె?ధర్మంబు!
చచ్చు బడిన నీతి!పుచ్చె పగిలె!
దీర్ఘ సంకట మాయె!మార్గంబు గనదాయె!
మంచి దుర్మార్గాన!దంచ బడియె!
తే,గీ:-జగతి జాఢ్యంబు సరిజేయ!ప్రగతి గనును!
నిజము నిష్టుర మొప్పును!నీతి గనక!
చిత్త చాంచల్య!స్వార్ధంబు!చీల్చె!ప్రగతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
310.సీ:-తల్లి యెడల ప్రేమ!తగనొప్పు ధన్యుండు!
అమ్మ కీర్తి కసలె!యడ్డు పడడు!
అడ్డు పడెడు వాడు!యవని భారము సుమ్మ!
విశ్వాస హీనుడు!విగత సముడు!
విగత భావంబుల!విహరించు!స్వార్ధుండు!
ఉచ్ఛ్వాస నిశ్వాస!నిశ్శ్వ నుండు!
దురహాన దుశ్చింత!దుర్మార్గ చరణుండు!
భవిత భగ్నము జేయు!పాపి యతడె?
తే,గీ:-అట్టి పాపుల జన్మిచ్చి!యలరు నట్టి!
తల్లి మేలుకు సత్తత్వ మమర మార్చి!
తల్లి దీవన మేల్బంతి!దనర నిండు!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
311.సీ;-చరమాంకమున జిక్కి!చేజాల నేరక!
చిరు దివ్వె కాంతుల!చెలగు చుంటి!
అన్న మల్లేశుని యానతి నర్ధించి
భవ బంధ మోచన బడయ దలచి!
వలచి నిరుప మాన!వాగ్ఝరి శ్రవియింప!
చూచి ముచ్చటిలెడు!వాచి గనక!
సంకట సంక్లిష్ట పంకంబు వడ లంటె!
తొలగింప రావయ్య!దురిత దూర!
తే,గీ:-పనికి శక్తియు!లేదాయె?పరమ పురుష!
శక్తి యుక్తియు!నిరుపమ జయదములను!
శేష జీవ మశేషత!శ్రీ వర మవ!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
312.సీ;-ధనమే!దశ దిశల!మనుగడ!వరమాయె!
మంచికి కడు దవ్వు!మసలి వెసను!
తర తమ భేదమ్ము!తబల వాయిద్యమై!
జనుల మనములనే!పెనగొనె!నయ!
నయనాల వినయాలు!నట విట కుటిలాలు!
కుటిలాలు జన జీవ తటి వటాలు!
కాలుష్య రమ్యాలు!కర్మ సిద్ధాంతాలు!
పేరు మాత్రమె గాని!వెడలె నెడము!
తే,గీ:-పాల సంద్రాన పవళించు!పరమ పురుష!
పట్టి దట్టియు కడలినే? చెట్ట పట్టి!
నిగుడ నెంచిరి కలియందు!నీచ జనము!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
313.సీ;-కల్లలే?యెల్లలై!యెల్లలే?మొల్లలై!
మొలకెత్తి జీవాల మూర్ఖ మేర్చి!
మెండైన దండన!గొండియై!దండియై!
ఛండ శాసనమున!సాగె!జగము!
భంగమే?రంగమై!రంగమే!సంగమై!
రహి మించి చరియించె!రాక్షసాంశ!
అక్ర మార్కులు భువి!విక్ర మార్కులు నౌచు!
దేశాన్ని దిగ మ్రింగు!దీప్తు లలమె!
తే,గీ:-దీన జన రక్షణే ర్చిన !ధీర!శూర!
పట్టు వీడక!పాపుల పార ద్రోలి!
దేశ సౌభాగ్య ధర్మంబు!దిశలు ప్రాక!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
314.సీ:-సత్యమేవ జయతి!సత్యంబె?నిత్యము!
నిత్యమే?నిర్మల నీతి నమరు!
నీతియే?యోగంబు!నీతియే?భోగంబు!
భోగార్ధ ఫలదాయి!భూమి పంట!
పంటయే?జనశక్తి!భంగావ రోధినె!
జంగ మాదుల రక్ష!జప తపాన!
తపనయే?మోక్షంబు!తపనయే?యుక్తంబు!
తపన లేని బ్రతుకు!దర్వి సమము!
తే,గీ:-ప్రణవ మోంకార విశ్వంబు!ప్రణుతి శ్రీయె!
శ్రీయు లేకున్న ? జీవాలు!ఛిద్ర మౌను!
చంచలంబైన శ్రీమాత!సర్వ మామె!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
315.సీ;-నెత్తి మొత్తుకు చెప్పు!నిద్ధాత్రి తీరును!
తిలకించి మంచెంచి!తీర్చి దిద్ది!
భవ బంధ మోచనోద్భావంబు గల్పించి!
భువి దుష్ట సంఘంపు!బుద్ధి మార్చి!
సచ్ఛీల!భరతాంబ!సద్ధర్మ యుక్తయై
జగదైక కీర్తితా!జయము నంది!
సురభిళ మందార!సోయగం బలరార!
జన రక్ష దక్షయై!జయము నిడుత!
తే,గీ;-తప్పు జేయుచు తమగొప్ప!నొప్ప జెప్పు!
మాయ మాటల నలరెడి!మనుజ తతికి!
తగిన సద్బుద్ధి!కల్పించి!ధర్మ నిరతి!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
316.సీ;-మూడు నొక్క టి!యారు!ముచ్చ టేకము సేయ!
ఏక దివాకర!శ్రీకర మగు!
శ్రీకరంబును గోరి!శివ తత్వ మార్భటి!
మిథ్య తత్వము నేర్పి!సద్యశ మవ!
లోక సంకట ధన భీకరార్తిని!మాప!
వర భి భీషిక లెల్ల!వమ్ము జేయ!
జన్మ జాగృతి సుఖ శాంతు లలర భువిని!
బొధకా వాచియై!బుద్ధి పెంచి!
తే,గీ:-తద్ది వాధి నాథుండు స!ధర్మ మేర్చి!
లోక సక్రమ విక్రమ మాక ళింప!
జనుల జే జేల!సుఖ శాంతి!సాకరమున!
జనుల బ్రతుకులు తీర్చుమా!సంగ మేశ!!
ఓమ్ తత్సత్
శ్రీ పరబ్రహ్మార్పణ మస్తు!
ఫల శ్రుతి
============
సీ:--సింహాద్రి నరసింహ!శ్రీ వరామంబిది!
జే జేలు!చేకూర్చు!జీవి తాన!
సత్యాను వర్తివై!నిత్యాను కూలమౌ!
సజ్జన సాచర్య!జయము లలరు!
నీమాను వర్తులై!నిత్యాభి షిక్తు లై!
వర లక్ష్మి మీ వెంట!వరలు నెపుడు!
జగదైక విఖ్యాతి!సర్వేశు డీయంగ!
జీవ సార్ధక మైన!జీవ మలరు!
తే,గీ:--మనసు నిలకడ మదినిండు!మనుజు లౌచు!
ఈవి గుణముల కొనియాడ!యెదిగె దీవు!
తత్వ జ్ఞాన మరసి ధర్మ తత్వము కుదురు!
జీవిగా సుఖియింతు వీ!జీవ ధాత్రి!
మంగళమ్ ....... మహాత్..........శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ