జైశ్రీరామ్.
శ్రీ వసుంధరా స్తోత్రము
(దేవీభాగవతము)
ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః
జయే జయే జలాధారే జలశీలే జలప్రదే |
యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే ।
మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే |
మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే |
సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే |
సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే |
పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని |
పుణ్యాశ్రయే పుణ్యవతాం, ఆలయే, పుణ్యదే భవే |
సర్వసస్యాలయే సర్వసస్యాధ్యే సర్వసస్యదే |
సర్వసస్య హరే కాలే సర్వసస్యాత్మికే భవే |
భూమే భూమిపసర్వస్వే భూమిపాలపరాయణే |
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే |
ఈ స్తోత్రమును ఉదయము పూట లేచి శుచిగా పఠించే వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. భూదాన ఫలితము లభిస్తుంది. పరుల భూమిని ఆక్రమించుకున్న పాపం నుంచి విముక్తి లభిస్తుంది. (కాని అటువంటి పాపము మరల మరల చేయరాదు. ) భూమి మీద ఉంచకూడని వస్తువులు ఉంచిన పాపం తొలగిపోతుంది. అశ్వమేధ యాగముల వంటి యాగములు చేసిన ఫలితం లభిస్తుంది.
జైహింద్.
No comments:
Post a Comment