"ధర్మో రక్షతి రక్షిత:
ధర్మ ఏవో హతో హంతి - "ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో - మానో ధర్మో హ్రతోవ్రధీత్ II
ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే, అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే నా2నృతం - సత్యేన పంథా వితతో దేవయాన
యేనా క్రమం తృషయో హాయప్త కామా - యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్
సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.
అహింసా పరమో ధర్మః
అహింసా పరమో ధర్మ: తథా2 హింసా పరం
తప: అహింసా పరమం ఙ్ఞానం అహింసా పరమార్జనమ్
భావము.
అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి జ్ఞానం. గొప్ప సాధన.
II ధనం మూల మిదం జగత్ ||
ధనమార్జాయ కాకుత్థ - ధనం మూల మిదం జగత్
అంతరం నాభి జానామి - నిర్ధనస్య మృతస్య చ ॥
భావము.
ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా
ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.
II జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||
అపి స్వర్ణ మయీ లంకా న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||
భావము.
స్వర్ణ మయమైన లంకను చూసి శ్రీరాముడు తన సోదరునితో ఈ విధంగా సోదరా,
లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు.
ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !
|| కృషితో నాస్తి దుర్భిక్షమ్ ||
కృషితో నాస్తి దుర్భిక్షమ్ జపతో నాస్తి పాతకమ్ |
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం ||
చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం
పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే
దేనికీ భయపడే పని లేదు.
|| యథా రాజా తథా ప్రజా ||
రాజ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, - పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, - యథా రాజా తథా ప్రజా !
రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే
రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి
నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.
No comments:
Post a Comment