Thursday, November 15, 2012

హాన్స్ జెన్నీ కనిపెట్టిన యంత్రము టోనోస్కోప్ చిత్రించిన ఓంకారము యొక్క చిత్రము


జైశ్రీరామ్.

సోదరీ సోదరులారా!

మనం పలికే ఏ శబ్దమైనా ఒక ఆకారాన్ని సంతరించుకుంటుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్ఫారు.("రామ" అనే నామాన్ని నిరంతరం జపిస్తే కళ్ళెదుట రాముని రూపం సాక్షాత్కరిస్తుందని ఎన్నో కధల్లో చదివాము కదా!)

ఈ విషయాన్ని చాలాకాలం పాటు "సైన్సు" చదువుకున్న మేధావులు ఒప్పుకోలేదు.చివరకి శాస్రజ్ఞుల పరిశోధనలలో ఈ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు.   
Father of cymatics science "హాన్స్ జెన్నీ (Hans Jenny)" అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త  "టోనొ స్కోప్" అనే ఓ అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టారు.
ఏదైనా శబ్ద తరంగానికి విజువల్ రిప్రెసెంటేషన్ ని గీయడమే ఆ పరికరం చేసే పని! వివిధ ధ్వనులని చేసి, "టోనొ స్కోప్" సహాయంతో వాటి రూపాలని స్టడీ చేయడం మొదలు పెట్టాడు.ఆ ప్రయోగాల్లో భాగంగా, 'ఓంకారాన్ని ' సుస్ఫష్టంగా చదివించి, ఆ శబ్ద తరంగాల ద్వారా వచ్చే బొమ్మని గీశాడట. 
ఆశ్చర్యం! ఓంకారం చదివినప్పుడు వచ్చిన ఆకారం ఇదే!
ఇదేమిటో తెల్సుగా? శ్రీచక్రం.
శ్రీచక్రమంటే అమ్మవారి శరీరమని మన వేదాలు చెప్తాయి (శ్రీచక్రం శివయోర్వపుః)
అలాగే మన వేదాలూ, ఋషులూ అమ్మవారిని "ఓంకార పంజర శుకీ" అనీ, "ఓంకార రూపిణీ మాతా" అనీ కీర్తించడం మనం విన్నాముకదా!
ఇదే ఓంకారానికీ, 
శ్రీచక్ర సంచారిణియైన అమ్మవారికీ  మధ్యనున్న సంబంధం!ఈ విషయం మన పురాణాలు ఎప్పుడో చెప్పినా, సైన్సుకి మాత్రం తెల్సుకోవడానికి ఇంతకాలం పట్టిందంతే!
జైహింద్.

No comments: