ప్రియ భారతీయ యువకులారా! మీలో నున్న అనంత శక్తికి జోహార్!
మన దేశానికి అంతర్జాతీయంగా గుర్తింపును; ఖ్యాతిని తెచ్చినది యువకుడైన వివేకానందుడే కదా!
అశక్తి తనకెట్లొచ్చిందంటారు?
సహజంగా అతడు చిన్నతనంలో చేసిన అల్లరిలో మనం చేసేది ఏ మాత్రమూ కాదంటే మీకతిశయోక్తి అనిపించ వచ్చు. కాని అది చాలా యదార్థం.
ఎవరిలోనైతే నిశితమైన జ్ఞానాధిక్యత ఉంటుందో వారి ప్రవృత్తి సరైన మార్గంలో పడే దాకా కూడా లోకానికి వింతగాను; ఒక్కొక్క సారి కంటగింపుగాను ఉంటుంది.
అతనిలోని అదే శక్తిని ఋజుమార్గంలో పెట్ట గలిగిన వాడే గురువు. అది సామాన్యమైన విషయము కాదు. భవితకు అనంతమైన దివ్య జ్యోతి ప్రజ్వలనమన్న మాట.
ఐతే అదృష్టవంతులైన కొందరు మేధావులకే అలాంటి బోధ గురువు లభించే భాగ్యం కలుగుతుంది. ఉదాహరణకు వివేకానందునికి లభించిన గురువు రామ కృష్ణ పరమ హంస.
అలాంటి గురువు దొరకక పోతే ఇంకంతేనా?
ఆ అసాధారణమైన అంతర్గత అనంత శక్తి నిర్వీర్యమైపోవడమో;
పెర్వర్ట్ ఐపోవడమో జరగవలసిందేనా?
మనమూ ఆలోచిద్దాం.
మనలో గల శక్తిని మనమే ఎందుకు వెలికి తీయ కూడదు?
సాధన ఉంటే అన్నీ సాధ్యమే.
ఏ వ్యక్తయినా అనుకొన్నది సాధించాలంటే ముందుగా ఆత్మ విశ్వాసం అత్యవసరం.
అలాంటి ఆత్మ విశ్వాసం మనకు కలగాలంటే మనం ఏం చెయ్యాలి?
ఆత్మను స్వాధీన పరచుకోవాలి.
అలా స్వాధీన పరచుచుకోవడం ఎలా?
అసలే మన మనసు కోతి.
అందున యుక్త వయస్సు.
దానికి తోడు మనం సంచరిస్తున్న సమాజం మనకన్ని విధాలా అపమార్గ ప్రేరకంగానే ప్రస్తుతం ఉంది. మరెలా???
ఎవరో వస్తారని; ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా; నిజం తెలిసి నిదురపోకుమా. అని మన మధుర గాయకుడు ఎప్పుడో ఆలపించాడు.
మనం ఆవిషయాన్ని మరువరాదు. ప్రయత్నం చేయడం మొదలెట్టితే మార్గం అదే దొరుకు తుంది కదా.
ముందుగా మనం సెల్ఫ్ కంట్రోల్ లో ఉండ గలగాలి. అప్పుడే ఏపనైనా చేయగలం.
ఐతే అదెలా?
మనం మన కంటోల్లో ఉండాలి అంటే ముందుగా నిశ్శబ్ద వాతావరణంలో మనం స్థిరంగా కొంతసేపైనా కూర్చో గలగాలి.
ఆ తరువాత ఏం చెయ్యాలో - - - -?
మరొకపర్యాయం మనం కలుసుకొన్నప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ ఆలోచనను ముందుగా మీ మనస్సులో స్థిరపరచుకోండి. అప్పుడు సాధన చేసే మార్గం తెలుసుకొని చేద్దురుగాని. అంతవరకూ మీకు ఈ సదాలోచనతో పాటు శుభాలు తోడుగా ఉండి; మీ సదాలోచనకు సహకరించాలని కోరుకొంటున్నాను.
జైహింద్.
No comments:
Post a Comment