Wednesday, October 22, 2008

యువత వర్ధిల్లాలి

ఆంధ్ర యువజనులారా! భారతాంబ ముద్దు బిడ్డలారా! విజ్ఞాన సంపన్నులారా! మీరు కిం కర్తవ్యతా మూఢులు కారని నాకు తెలుసు. ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని మానవ వనరులు ఎక్కువగానున్న దేశంగా భావిస్తుంటాయి. ఏ దేశ భవిత అయినా ఆ దేశయువతమీదే ఆధార పడి వుందన్నమాట నగ్న సత్యం.యువత నిర్లిప్తంగా వుంటే ఆ దేశం అభివృద్ధి కుంటుబడుతుంది. గడచే ప్రతీ క్షణం విజ్ఞాన సముపార్జనకో వివేక విస్తరణకో ధర్మ మార్గాన ధన సంపాదనకో, సామాజిక పురోభివృద్ధి కొరకై చేపట్టిన సేవలకో మనం వినియోగించుకోవాలి. మనం నిర్లిప్తంగా వుంటే, నిర్లక్ష్యంగా వుంటే దాని పర్యవసానం చాలా ఘోరంగా వుంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.నిర్లిప్తంగా వుండకండి. నిర్లక్ష్యాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. ఆదర్శ జీవనానికై అర్రులు చాచండి.మీ జీవన గమ్యాన్ని సరిగా నిర్దేశించుకోవడంలొ పెద్దల సహాయాన్ని అర్ధించండి.మహాత్ములు నడచిన బాటను గమనించండి. విశాల దృక్పథాలు ఏర్పరచుకోండి. మీ సమస్యలను మీలోనే అణచుకొంటూ బాధకు లోను కాకండి. మిత్రుల, పెద్దల, మేధావుల దృష్టిలో పెట్టి పరిష్కార మార్గాన్ని తెలుసుకొండి. హాయిగా బ్రతకండి మీ తోటి వారికి మీ ఆనందాన్ని పంచండి.భావి భారతికి మంచి పునాదులు వేయండి. జైహింద్.

1 comment:

తేనెపట్టు said...

మా యువతకు ప్రేరణ ఇద్దామనుకుంటున్న మీ ఆలోచనకు ధన్యవాదములు

రాజన్

http://naagola.wordpress.com/