Thursday, April 2, 2026

నా బయోడేటా............... చింతా రామకృష్ణారావు.

 

జైశ్రీరామ్.

పేరు. చింతా రామకృష్ణారావు. పుట్టిన తేదీ. 01.7. 1950

తల్లిదండ్రులు... వేంకటరత్నం, సన్యాసిరామారావు.

స్వగ్రామం...సర్వసిద్ధి, విశాఖపట్టణం జిల్లా,

విద్యాభ్యాసం.

ప్రాథమిక విద్య ..సమితి ప్రాథమిక పాఠశాల.. సర్వసిద్ధి.

ఉన్నత పాఠశాల విద్య యస్.రాయవరం. విశాఖపట్టణం జిల్లా.

భాషాప్రవీణ.... సంస్కృత కళాశాల విజయనగరం,

పండిత శిక్షణ. రాజమహేంద్రవరం.

గురువు...కీ.శే, కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులు,

ఉద్యోగము.

01 . 3 . 1974 నుండి

తెలుగు పండితునిగా... 

ప్రభుత్వ పట్టభద్ర కళాశాల ఉపన్యాసకునిగా పదవీ విరమణ...30. 6. 2008.


ఔత్సాహికాంశాలు.

హార్మోనియం వాయించుట, 

సాంఘిక నాటకములు వేయించుట,

సామాజిక సేవ చేయుచూ చేయించుట.

కవిత్వము వ్రాయుట, 

వ్రాయుటలో శిక్షణ యిచ్చుట. 

అవధానములు చేయుట,

సంచాలకునిగా ఉండి అవధానములు చేయించుట.

సాంస్కృతిక కార్యక్రమములలో పాల్గొనుట.


తెలుఁగు భాషా బోధకుఁడుగా నా జీవితము.

విద్యార్థులలో చైతన్యము కొలిపి, స్వయముగా వారు ఆలోచించి గేయాదులు

వ్రాయించుట, పద్యములు, శ్లోకములు, భగవద్గీత సూక్తి శ్లోకములు మున్నగున్వి 

కంఠస్థము చేయించుట,

సమావేశములు నిర్వహించి అనుభవజ్ఞులచే సందేశము లనిప్పించుట, 

వివిధ అంశముల పై వక్త్రుత్వమునందు, వ్యాసరచనయందు 

పాటలు, చిత్రలేఖనము మున్నగువానియందు పోటీలు పెట్టి బహుమతులిప్పించుట, 

యన్నె స్సెస్ అధికారిగా సామాజిక కార్యక్రమములలో విద్యార్థిలను

భాగస్వాములను చేయుట,

స్వదేశీవస్తువులవాడకాన్ని ప్రోత్సహించుట, 

కళాశాలకు మోటారు వాహనములపై వచువారిని సైకిలుపై వచ్చునట్లు 

స్వయముగా చేసి చూపి చేయించుట, 

శీతలపానీయము త్రాగుటను అరికట్టి కొబ్బరి నీరు త్రాగుట మున్నగువిషయములలో 

ప్రేరణ కల్పించుట.

డిగ్రీ కళాశాలలో పనిచేయుచున్నప్పుడు 

యువతరంగము అను ద్వైమాస వ్రాత పత్రిక నెలకొల్పి, 

విద్యార్థిలస్వీయ సామర్థ్యముతో నిర్వహింపజేసి, 

తద్వారా ఆత్మవిశ్వాసము పెంపొందింప చేయుట. 

ఆ పత్రికలో ఉత్తమ రచనలను పెద్దలద్వారా నిర్ణయింప జేసి 

వారిద్వారానే బహుమతిగా పెద్దబాలశిక్షలను ఇప్పించుట. 

పాల్గొన్నవారందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇప్పించుట.

ఆశువుగా సమయానుకూలమగు పద్యములు చెప్పుచు 

వారిచే ఆశువుగా పద్యములు చెప్పే ప్రయత్నము చేయించుట,

సాంస్కృతిక కార్యక్రమములలో సమయానుకూలముగా స్వయముగా బుర్రకథ,

పాటలు, నాటికలు ఏకపాత్రాభినయములు వ్రాసి పిల్లలచే ప్రదర్శింపఁజేయుట. మున్నగునవి.


బిరుదు. 

చిత్రకవితాసమ్రాట్....

కవికల్పభూజ....

పద్యకవితాభిరామ....

చిత్రకవితా సహస్రఫణీ....

పుంభావ భారతి.


పురస్కారములు.

ప్రజాపత్రిక సాహితీపురస్కారము.

భక్తిసాధనమ్ సాహితీపురస్కారము. 

జోళదరాశి సాహితీ పురస్కారము.

యశశ్వినీ పురస్కారం.


రచనలు.

 1) అగ్నిసూక్తము  ..  పద్యానువాదము.

 2) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 3) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమున మూడు ప్రాసయతులతో ఒక్క    

     రోజులో వ్రాసినది.)

 4) ఆంధ్ర సౌందర్యలహరి. సంస్కృతశ్లోక, పదచ్ఛేద, అన్వయక్రమ, పద్య, ప్రతిపదార్థ, భావసహితము.

 5) ఆంధ్రామృతమ్పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.

 6) ఈశావాస్యోపనిషత్ పద్యానువాదము. తే. 04 - 11 - 2025.

 7) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 8) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.(ఒక్క రోజులో వ్రాసినది.)

 9) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) 

     తే. 31 - 8 - 2025.

 10) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 11) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 12) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

 13) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

 14) బాలభావన శతకము.(ఒక్క రోజులో వ్రాసినది.)

 15) మూకపంచశతి పద్యానువాదము.

 16) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

 17) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 18) రాఘవా! శతకము.

 19) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 20) రుద్రమునకు తెలుగు భావము.

 21) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 22) వసంతతిలక సూర్య శతకము.

 23) విజయభావన శతకము.

 24) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 25) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.

 26) శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)

 27) శ్రీఅవధానశతపత్రశతకము.

 28) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

 29) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

 30) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

 31) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

 32) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

 33) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత

      118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)

 34) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

 35) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

 36) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 37) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ.10-3-2025మరియు 11-3- 2025.తేదీల మధ్యవిరచితము.

 38) శ్రీలక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

 39) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

 40) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున

       మూడు మకుటములతో మూడు శతకములు.)

 41) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

 42) శ్రీ శివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)

 43) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.

 44) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు,

      సీతాన్వయముగా తేటగీతి పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో 

      సుందరోత్పల నక్షత్రమాల.)

 45) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

 46) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము

 47) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాదఉత్పలమాలిక.

 48) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)(ఏకదిన విరచితము)తే.20 – 4 – 2025.

 49) సంక్షిప్త రామాయణము. పద్యానువాదము. 

50) శివ సహస్రనామాంచిత పద్యపుష్పార్ఛన.  తే.31 - 3 - 2026.

జైహింద్.


Saturday, February 28, 2026

గాయత్రీ రామాయణం

జైశ్రీరామ్.

గాయత్రీ రామాయణం

తపః స్వాధ్యాయనిరతం తపస్వా వాగ్వాదం వరమ్ |

నారదం పరిపప్రచ్ఛవాల్మీకిర్మీనిపంగవమ్ || ౧


స హత్వా రాక్షస్వన్ సరాాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః |

ఋషిభః పూజితః సమ్ాగాథంద్రో విజ్యీ పరా || ౨


విశ్వామిత్రస్తు ధరాీత్వీ శ్రుత్వా జ్నకభాషితమ్ |

వతస రామ్ ధనః పశ్ా ఇతి రాఘవమ్బ్రవీత్ || ౩


తుష్టావాసా తద వంశ్ం ప్రవిష్ా చ్ విశ్వంపతః |

శ్యనీయమ్ నరంద్రసా తదస్వదా వాతిష్ఠత || ౪


వనవాసం హి సంఖ్యాయ వాస్వంస్వాభరణాని చ్ |

భరాురమ్నగచ్ఛంత్యా స్వత్వయై శ్ాశురో దధౌ || ౫


రాజా సతాం చ్ ధరీం చ్ రాజా కులవత్వం కులమ్ |

రాజా మాత్వ పిత్వ చైవ రాజా హితకరో నృణామ్ || ౬


నిరీక్షయ స ముహూరుం తు దదరశ భరతో గుర్మమ్ |

ఉటజే రామ్మాస్వనం జ్టామ్ండలధ్యరిణమ్ || ౭


యది బుదిధః కృత్వ ద్రష్ాం అగసుయం తం మ్హామునిమ్ |

అద్యావ గమ్నే బుదిధం రోచ్యసా మ్హాయశ్వః || ౮


భరతస్వారాపత్రసా శ్ాశ్రూణాం మ్మ్ చ్ ప్రభో |

మ్ృగరూపమిదం వాకుం విసీయం జ్నయిష్ాతి || ౯


గచ్ఛశీఘ్రమితో రామ్ స్తగ్రీవం తం మ్హాబలమ్ |

వయసాం తం కుర్మ క్షిప్రమితో గత్వాఽదా రాఘవ || ౧౦


దేశ్కాలౌ ప్రతీక్షసా క్షమ్మాణః ప్రియాప్రియే |

స్తఖదఃఖసహః కాలే స్తగ్రీవ వశ్గో భవ || ౧౧


వందాస్తు తు తపస్ససదధః త్వపస్వ వీతకలీష్టః |

ప్రష్ావాాశ్వాపి స్వత్వయాః ప్రవృతిుం వినయానిాతః || ౧౨


స నిరిితా పరీం శ్రేష్టఠం లంకాం త్వం కామ్రూపిణీమ్ |

విక్రమేణ మ్హతజాః హనమానాీర్మత్వతీజ్ః || ౧౩


ధనాా దేవాః స గంధరాాః స్సదధశ్ాపరమ్రషయః |

మ్మ్ పశ్ానిు యే నాథం రామ్ం రాజీవలోచ్నమ్ || ౧౪


మ్ంగళాభముఖీ తసా స్వ తదస్వనీహాకపః |

ఉపతస్తేవిశ్వలాక్షీ ప్రయత్వ హవావాహనమ్ || ౧౫


హితం మ్హారేం మ్ృద హేతు సంహితం

వాతీతకాలాయతి సంప్రతిక్షమ్మ్ |

నిశ్మ్ా తదాకాముపస్సేతజ్ారః

ప్రసంగవానతురమేతదబ్రవీత్ || ౧౬


ధరాీత్వీ రక్షస్వం శ్రేష్ఠః సంప్రాప్తుఽయం విభీష్ణః |

లంకైశ్ారామ్ ధ్రువం శ్రీమానయం ప్రాప్తాతాకంటకమ్ || ౧౭


యో వజ్రపాత్వశ్ని సనిాపాత్వన్

న చ్క్షుభే నాపి చ్చాల రాజా |

స రామ్బాణాభహతో భృశ్వరుః

చ్చాల చాపం చ్ ముమోచ్ వీరః || ౧౮


యసా విక్రమ్మాస్వదా రాక్షస్వ నిధనం గత్వః |

తం మ్నేా రాఘవం వీరం నారాయణమ్నామ్యమ్ || ౧౯


న త దదరిశర రామ్ం దహంతమ్రివాహినీమ్ |

మోహిత్వః పరమాస్తేణ గాంధరాణ మాహాతీనా || ౨౦


ప్రణమ్ా దేవత్వభాశ్ాబ్రాహీణేభాశ్ామైథిల్మ |

బదధంజ్లిపటా చేదమువాచాగ్వా సమీపతః || ౨౧


చ్లనాతపరాతంద్రసా గణా దేవాశ్ాకంపిత్వః |

చ్చాల పారాతీ చాపి తదశ్లిష్టామ్హేశ్ారమ్ || ౨౨


దరాః పత్రః పరం రాష్ట్రం భోగాచాఛదనభోజ్నమ్ |

సరామేవావిభకుం నో భవిష్ాతి హరీశ్ార || ౨౩


యామేవ రాత్రం శ్త్రుఘాః పరణశ్వలాం సమావిశ్త్ |

త్వమేవ రాత్రం స్వత్వఽపి ప్రసూత్వ దరకదాయమ్ || ౨౪


ఇదం రామాయణం కృతసనం గాయత్రీబీజ్సంయుతమ్ |

త్రసంధాం యః పఠేనిాతాం సరాపాపః ప్రముచ్ాత ||

జైహింద్.

గాయత్రీ మంత్రార్థము.

జైశ్రీరామ్. 

"ఓం భూర్భువస్వః" అనేది గాయత్రీ మంత్రంలోని మొదటి భాగం.

ఇది మూడు లోకాలను మరియు దైవిక శక్తిని సూచిస్తుంది. 

భూర్ (భూలోకం/శరీరం)భువః (అంతరిక్షం/ప్రాణం)స్వః (స్వర్గలోకం/ఆత్మ) - ఈ మూడు లోకాలను సృష్టించిపాలించే సత్యస్వరూపుడైన తేజోమయుడైన పరమాత్ముని (సవితృ) ధ్యానిస్తున్నామని దీని అర్థం.

ఓం: ప్రణవ నాదంపరబ్రహ్మ స్వరూపం.

భూః: భూలోకంభౌతిక శరీరంఉనికిని సూచించేది.

భువః: భువర్లోకంఅంతరిక్షంప్రాణశక్తి (Life force).

స్వః: స్వర్గలోకంఆత్మ (Soul)ఆధ్యాత్మిక ప్రదేశం. 

సమగ్ర అర్థం:

భూభువర్సువర్ లోకాలలో (భూమిఅంతరిక్షంస్వర్గం) నిండి ఉన్నసకల ప్రాణాలనుసృష్టిని సృష్టించినఅత్యంత పూజనీయుడైనప్రకాశవంతమైన ఆ పరమాత్ముని (సవితృ దేవుని) మనం ధ్యానిస్తున్నాము. ఆ దైవిక తేజస్సు మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుగాక. 

 

"తత్సవితుః"  అంటే "ఆ సవితృదేవుని" లేదా "ఆ సూర్యదేవుని యొక్క" అని అర్థం. ఇది సృష్టికర్తయైన సూర్యుని (ప్రకాశవంతమైన పరమాత్మ) ప్రకాశాన్నితేజస్సును ప్రార్థించే సందర్భంలో వాడబడుతుంది. 'తత్' (ఆ) + 'సవితుః' (సూర్యుని/ప్రేరకుని) కలిసి తత్సవితుఃగా ఏర్పడింది.

తత్ (तत्): ఆ (పరమాత్మ/దైవం).

సవితుః (सवितुः): సవితృదేవునిసూర్యునిప్రేరకుని (జీవులను ప్రేరేపించేవాడు)

'వరేణ్యం'  అంటే పూజింపదగినవాడు****శ్రేష్ఠుడైనవాడులేదా కోరదగినవాడు అని అర్థం. ఇది దైవికమైన గౌరవంఉన్నతమైన వ్యక్తిత్వంమరియు ఉత్తమమైన శ్రేష్ఠతను సూచించే సంస్కృత పదం. గాయత్రీ మంత్రంలో ఈ పదాన్ని సూర్య భగవానుని శ్రేష్ఠత్వాన్ని కొనియాడటానికి ఉపయోగిస్తారు. 

ముఖ్యమైన అర్థాలు:

పూజింపదగినవాడు: ఆరాధనకు అర్హుడైనవాడు (Worthy of worship).

శ్రేష్ఠుడు: అత్యుత్తమమైనవాడు (Excellent/Best).

కోరదగినవాడు: ఎన్నుకోదగిన లేదా ఆశించదగిన వ్యక్తి (Desirable). 

"భర్గోదేవస్య ధీమహి" అనే భాగంలో భర్గోదేవస్య అంటే "ఆ దివ్యమైన తేజస్సు గల పరమాత్ముని (దేవుని)" అని అర్థం. ఇది సృష్టికర్త అయిన సూర్య భగవానుని లేదా పరబ్రహ్మ యొక్క పాపాలను నశింపజేసే తేజోరూపాన్ని సూచిస్తుందిఆ వెలుగును మేము ధ్యానిస్తున్నాము (ధీమహి) అని దీని అర్థం. 


వివరణ:

భర్గో (Bhargo): పాపాలనుఅజ్ఞానాన్ని నశింపజేసే దివ్య తేజస్సు/కాంతి.

దేవస్య (Devasya): దైవిక స్వరూపుడైన (భగవంతుని యొక్క).

భర్గోదేవస్య ధీమహి: ఆ తేజోమయుడైన పరమాత్ముని మేము ధ్యానిస్తున్నాము.


"ధియోయోనః" (Dhiyo Yo Nah) అనేది ప్రసిద్ధ గాయత్రీ మంత్రంలోని చివరి పాదంలో భాగం. సృష్టికర్తయిన సవితృ దేవత (సూర్యుడు) మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించాలని ప్రార్థించే"ధియోయోనః ప్రచోదయాత్" అనే వాక్యంలో ఇది ఉంది. ఇది భగవంతుడు మన మేధస్సునుఆలోచనలను ఉత్తేజపరచాలని కోరుకునే జ్ఞానప్రదమైన మంత్రార్థాన్ని తెలుపుతుంది. 

వివరణ:

ధియో (Dhiyo): బుద్ధులను / మేధస్సును (Intelligences/Intellect)

యో (Yo): ఎవరైతే (Who)

నః (Nah): మా (Our/Us)

ప్రచోదయాత్ (Prachodayat): ప్రేరేపించుగాక (Inspire/Guide) 

తాత్పర్యం:

మా బుద్ధులను సన్మార్గంలో ప్రకాశింపజేయునట్లుఆ భగవంతుడు మా మేధస్సును ప్రేరేపించుగాక అని దీని అర్థం. 

"ప్రచోదయాత్" (Prachodayat) అంటే "ప్రేరేపించునుగాక" లేదా "ఉత్తేజితం చేయునుగాక" అని అర్థం. ఇది మన బుద్ధిని (ధియో) సన్మార్గంలో నడిపించమనిజ్ఞానాన్ని ప్రకాశింపజేయమని సూర్య భగవానుణ్ణి లేదా పరంధాముణ్ణి వేడుకునే ప్రార్థన.

వివరణాత్మక ప్రతిపదార్థం:

ప్రచోదయాత్ (प्रचोदयात्): ప్రేరేపించునుగాక / చైతన్యపరచునుగాక / ప్రకాశింపజేయునుగాక.

ధ్రియో యో నః ప్రచోదయాత్: మా (నః) బుద్ధిని (ధియః) ఏ సవితృ దేవుడు (యః) సన్మార్గంలో (ప్రచోదయాత్) ప్రేరేపిస్తాడో. 


సందర్భం:

గాయత్రీ మంత్రం చివరలో వచ్చే "తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిధియో యో నః ప్రచోదయాత్" అనే పాదంలోమా బుద్ధిని సన్మార్గం వైపు మళ్లించు అని కోరడం దీని అంతరార్థం. 

జైహింద్.